Homeఅంతర్జాతీయంUS Consulate attacked in Karachi: పాకిగాళ్లను పాక్ లోనే చంపేశారు.. అమెరికాతో అట్లుంటది మరీ.....

US Consulate attacked in Karachi: పాకిగాళ్లను పాక్ లోనే చంపేశారు.. అమెరికాతో అట్లుంటది మరీ.. తెలుసుకోండ్రా బుర్ర తక్కువగాళ్లారా..

US Consulate attacked in Karachi: ఒక దేశ పౌరులను వారి సొంత గడ్డమీదనే పరాయి దేశం హతమారిస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడున్న పరిస్థితిలో అది సాధ్యమవుతుందా? మిగతా దేశాలలో ఏమో గాని.. పాకిస్తాన్లో మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఎందుకంటే పాకిస్తాన్ లో శాంతిభద్రతలు సక్రమంగా ఉండవు. ప్రభుత్వ పాలకులు ఉగ్రవాదులు చెప్పినట్టు వింటుంటారు. అక్కడి సైన్యం ఉగ్రవాదుల చేతుల్లో ఉంటుంది. అలాంటప్పుడు అక్కడ ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ ఉండదు.

అమెరికా ఇజ్రాయిల్ సహకారంతో ఇరాన్ మీద దాడి చేసింది. ఇరాన్ సుప్రీమ్ లీడర్ ను అంతం చేసింది. ఈ పరిణామం ముస్లింలలో ఓ వర్గానికి ఆగ్రహం కలిగించింది. ఆ వర్గం ముస్లింలు ఉన్న ప్రతి దేశంలో నిరసనలు వ్యక్తమయ్యాయి. చివరికి పాకిస్తాన్ లో కూడా ఆ వర్గానికి చెందిన ముస్లింలు నిరసనలు చేపట్టారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ ను అంతం చేసిన అమెరికా కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్లో ఉన్న అమెరికా ఎంబసీ కార్యాలయంలో దాడులు చేశారు. కార్యాలయంలో ఉన్న సామగ్రిని ధ్వంసం చేశారు.

నిరసనకారులు భారీగా అమెరికా ఎంబసీ కార్యాలయాన్ని చుట్టుముట్టడంతో.. అమెరికా నుంచి పాకిస్తాన్ దేశానికి ఫోన్లు వచ్చాయి. నిరసనకారులను చెదరగొట్టకపోతే పరిణామాలు వేరే విధంగా ఉంటాయని అమెరికా నుంచి హెచ్చరికలు వచ్చాయి. దీంతో పాకిస్తాన్ సైన్యం రంగంలోకి దిగింది. దీనికి అమెరికా హెచ్చరికలు కూడా తోడు కావడంతో కాల్పులు జరిగాయి. దీంతో నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఫలితంగా నిరసనకారులలో కొంతమంది చనిపోయారు.

వాస్తవానికి ఒక దేశం లోని పౌరుల మీద మరొక దేశానికి కాల్పులు జరిపే అధికారం ఉండదు. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు వస్తే తప్ప కాల్పులు జరపడానికి అధికారం ఉండదు. కానీ అమెరికా పాకిస్తాన్ పోలీసులతోనే పాకిస్తాన్ పౌరులపై కాల్పులు జరిపించింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. “మీ దేశంలో మీ పౌరులనే మీ పోలీసులతో చంపించారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా.. పాకిస్తాన్ ప్రజలారా ఇప్పటికైనా తల దించుకోండి అంటూ” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఇటీవల పాకిస్తాన్ మీద అమెరికా పెత్తనం పెరిగిపోయింది. అమెరికా కంపెనీలు పాకిస్తాన్ లో ఖనిజాల వేటను మొదలుపెట్టాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version