Sri Krodhi Samvatsara Panchanga: క్రోధి నామ సంవత్సరం.. ఈ రాశి వారికి ఏడాదంతా రాజయోగం!!

పత్రికల్లో ఈ ఆదివారం(ఏప్రిల్‌ 7న) సండే స్పెషల్ బుక్‌లో క్రోధినామ సంవత్సర పంచాంగం రాబోతోంది. అయితే కొత్త పంచాంగం ప్రకారం మేషరాశి వారికి ఈ ఏడాదంతా రాజయోగమే అంటున్నారు పండితులు.

Written By: Raj Shekar, Updated On : April 5, 2024 2:18 pm

Sri krodhi nama samvatsaram taurus yearly horoscope

Follow us on

Sri Krodhi Samvatsara Panchanga: శ్రీక్రోధి నామ సంవత్సర మరో ఐదు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదితో మొదలు కాబోతోంది. దీంతో ఇప్పటికే అన్ని అందు కొత్త ఏడాది తమకు ఎలా ఉంటుంది అని చర్చించుకుంటున్నారు. టీవీల్లో డిబేట్లు జరుగుతున్నాయి. ఇక పత్రికల్లో ఈ ఆదివారం(ఏప్రిల్‌ 7న) సండే స్పెషల్ బుక్‌లో క్రోధినామ సంవత్సర పంచాంగం రాబోతోంది. అయితే కొత్త పంచాంగం ప్రకారం మేషరాశి వారికి ఈ ఏడాదంతా రాజయోగమే అంటున్నారు పండితులు. వివరాలు తెలుసుకుందాం.

మేషరాశి వారికి అనుకూలం..
శ్రీక్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఊహించని ప్రయోజనాలు ఉంటాయట. బృహస్పతి ధన స్థానంలో సంచరించడం, శని లాభ స్థానంలో సంచరించడం, రాహువు వ్యయ స్థానంలో సంచరించడం, కేతువు కూడా ఆరో స్థానంలో అనుకూలంగా సంచరించడం ద్వారా మేష రాశి వారికి ఈ సంవత్సరం ఊహించని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు. గతంతో పోలిస్తే ఈ సంవత్సరం మరింత మెరుగ్గా ఉంటుందని పేర్కొంటున్నారు.

ధన స్థానంలో బృహస్పతి..
ధనస్థానంలో బృహస్పతి ఉండడంతో ఈ సంవత్సరం వర్తక వ్యాపారాల్లో ఉన్నవారికి మంచి లాభంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వాస్తు లాభం, ధన వృద్ధి, కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ సంవత్సరం మేషరాశి జాతకులు ఆర్థికంగా బాగా ఎదుగుతారు.

లాభ స్థానంలో శని..
ఇక మేషరాశివారికి శ్రీక్రోధినామ సంవత్సరంలో శని లాభ స్థానంలో ఉంటుంది. వ్యాపార విషయంలో, నూతన గృహ నిర్మాణ విషయంలో శుభ ఫలితాలు వస్తాయి. శత్రువులపై విజయం దక్కుతుంది. ధైర్యంగా ముందడుగు వేస్తారు. వ్యయ స్థానంలో రాహువు ఉండటం ద్వారా కాస్త వ్యసనాలకు దూరంగా ఉండాలి. ఇక ఈ సంవత్సరం కుటుంబ సౌఖ్యం, మానసిక సంతోషం కూడా కలుగుతుంది. సినీ రంగాల వారికి శుభ ఫలితాలు వస్తాయి.

అన్ని రంగాల వారికీ..
శ్రీక్రోధినామ సవంత్సరంలో మేశరాసి ఉన్న అందరికీ సానుకూల ఫలితాలు ఉంటాయట. రైతాంగం కూడా ఆశించిన మేర ఫలితాలు పొందుతుంది. మేషరాసి వారికి జీవిత భాగస్వామితో సుఖసంతోషాలు ఉంటాయి. అవివాహితులకు వివాహాలు అవుతాయి. సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది.

మొత్తంగా మేషరాశి జాతకులకు ఈ సంవత్సరం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుంది. సానుకూల ఫలితాలు వస్తాయి. దశ మారుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఏడాది వారికి రాజయోగమే..!