Tax Evasion: మీరు ఉద్యోగంతోపాటు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారా? రెండు చేతులా సంపాదిస్తున్నారా.. అయితే చాలా జాగ్రత్త. ఇన్‌కమ్ ట్యాక్స్ తప్పకుండా చెల్లించాలి. ట్యాక్స్ ఎగ్గొట్టాలని చూస్తే దొరికిపోతారు. టెక్నాలజీ పెరిగాక, పాన్, ఆధార్ బ్యాంకు ఖాతాలతో లింక్ అయ్యాక ట్యాక్స్ ఎగవేయడం కుదరదు. అయితే ట్యాక్స్ ఎంత చెల్లించాలి అనేది మాత్రం తెలుసుకుంటే ఉపశమనం లభిస్తుంది. అలా కాదని ఎగ్గొట్టాలని చూస్తే మొదటికే మోసం వస్తుంది.
రెండు ఆదాయాలు ఉంటే..
ఎవరికైనా ఉద్యోగంతోపాటు వ్యాపారం ద్వారా ఇతర ఆదాయం వస్తుంటే దానిని కూడా ఐటీ పరిధిలోకి తీసుకురావాలి. లెక్కలు లేవని, ఎవరూ గుర్తించరని అనుకోవద్దు. మీరు నెలకు రూ.1 లక్ష సంపాదిస్తున్నట్లు అయితే మీరు ఏడాదికి రూ.25 వేల ఐటీ కట్టాల్సి ఉంటుంది. అయితే, ఇతర వ్యాపారాలకు సంబంధించిన ట్యాక్స్ కూడా ఇక్కడ చూపెడుతుంది. ఎక్స్‌ట్రా సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పై ట్యాక్స్ ఎగ్గొట్టడానికి వీలు ఉండదు. లెక్కలు చూపాల్సి ఉంటుంది. ఎందుకంటే అదనపు ఆదాయం కూడా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.
లెక్కలు లేవంటే కుదరదు..
ఇక అవి చిరు వ్యాపారాలని, లెక్కలు లేవని, ఆదాయం కన్నా పెట్టుబడి ఎక్కువగా పెట్టానని తప్పించుకోవాలంటే కుదరదు. లెక్కలు తెలుసుకోవడానికి ప్రిసమ్‌టివ్ టాక్సేషన్ సెక్షన్ – 44 ఏడీ ఉంది. చిరు వ్యాపారలు చేస్తూ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటేన్ చేయని వారు వాళ్ల బ్యాంకు ఖాతాలో పడిన బిజినెస్ ఆదాయం ఆధారంగా దానిలో 6 శాతం ట్యాక్స్ చెల్లించాలి. మీ ఖాతాలో రూ.6 లక్షలు ఏడాదిలో జమ అయితే అందులో 6 శాతం అంటే రూ.36 వేలు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది.
ఐటీ స్లాబ్ ప్రకారమే..
ఇక మీ వేతనంతోపాటు, అదనంగా వచ్చిన రూ.6 లక్షలకు విధించిన ట్యాక్స్ రూ.36 వేలు కలిపితే మీరు ఐటీ పరిధిలో వచ్చే స్లాబ్ ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మీరు 30 శాతం టాక్స్‌స్లాబ్‌లోకి వస్తే రూ.36 వేలలో 30 శాతం అంటే రూ.10,800 చెల్లించాలి. వేతనం ద్వారా రూ.25 వేట ట్యాక్స్‌తోపాటు చిరు వ్యాపారం పై రూ.10,800 చెల్లించాలి. అంటే మొత్తంగా రూ.35,800 ట్యాక్స్ చెల్లించాలి. లేదంటే అదనపు ఆదాయంపై 6 శాతం ట్యాక్స్ వేస్తే రూ.36 వేలు చెల్లించాల్సి వస్తుంది.