కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది

ఒకప్పుడు విదేశాల నుండి వస్తున్నారంటే.. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎనలేని గౌరవం ఉండేది. కరోనా పుణ్యమా అని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదే విధంగా ఒకప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియా లో ఉంది, మా వాళ్లు దుబ్బాయ్ లో ఉన్నారు అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా భావించే వాళ్ళు. కానీ, కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది. మా వాళ్ళు విదేశం నుంచి వస్తున్నారంటే చాలు […]

Written By: Neelambaram, Updated On : May 9, 2020 6:52 pm
Follow us on

ఒకప్పుడు విదేశాల నుండి వస్తున్నారంటే.. వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఎనలేని గౌరవం ఉండేది. కరోనా పుణ్యమా అని ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. అదే విధంగా ఒకప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఆస్ట్రేలియా లో ఉంది, మా వాళ్లు దుబ్బాయ్ లో ఉన్నారు అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా భావించే వాళ్ళు. కానీ, కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది. మా వాళ్ళు విదేశం నుంచి వస్తున్నారంటే చాలు వాళ్ళకి కరోనా ఉందేమో అని అనుమానంగా చూస్తున్నారు. మా వాళ్లు ఇతర దేశం నుంచి వచ్చారంటే.. వాళ్ళని ఊరి నుంచే వేలేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విధంగా ఈ కరోనా మహమ్మారి పుణ్యమా అని ప్రస్తుత సమాజంలో అనేక విషయాలు రివర్స్ లో ట్రెండ్ నడుస్తున్నాయి.

అసలు విషయం ఏమిటంటే లాక్‌ డైన్‌ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ‘వందేభారత్ మిషన్’ను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మిషన్ ద్వారా భారత్ కి వచ్చే ప్రతి వారిని 28 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉంచిన తర్వాతే వారి వారి ప్రాంతాలకు పంపిస్తారు. ఈ మిషన్ లో భాగంగా కువైట్‌ లో చిక్కుకున్న తెలుగువారిని తీసుకువస్తున్న విమానం హైదరాబాద్‌ బయల్దేరింది. 200మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆ విమానం శనివారం రాత్రి 7 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయం చేరుకోనుంది. కువైట్‌ ఎయిర్‌పోర్టులో రెండు వందలమంది ప్రయాణికులు చెక్‌ ఇన్‌ చేసుకున్నారు. ప్రయాణికుల్లో కొందరు తెలంగాణకు చెందినవారు కాగా, మరికొందరు ఆంధ్రప్రదేశ్‌ కు చెందినవారు. వీరంతా హైదరాబాద్‌ రాగానే క్వారంటైన్‌ లోకి వెళ్లనున్నారు.ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.