Raviteja Son Story Sandeep Reddy Vanga Reaction: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కానీ ఆ హీరోలను స్టార్లుగా మార్చిన దర్శకులను పెద్దగా పట్టించుకోరు. నిజానికి దర్శకుడు లేకపోతే సినిమా సక్సెస్ సాధించదు అనే విషయం మనలో చాలామందికి తెలియదు. ముఖ్యంగా స్క్రీన్ మీద కనిపించే హీరోలకు ఉన్నంత ఇమేజ్ తెరవెనక పని చేసే దర్శకులకు దక్కదనేది వాస్తవం…ఈ మధ్య కాలంలో దర్శకులు సాధిస్తున్న విజయాలతో వాళ్ళు కూడా బాగానే ఎలివేట్ అవుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన తర్వాతే బోల్డ్ కాంటెంట్లతో కూడా సినిమాలను చేసి సక్సెస్ సాధించవచ్చు అని చాలామంది తెలుసుకున్నారు. అప్పటివరకు అలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు చూస్తారా లేదా అనే ఒక చిన్న డైలామా ఉండేది. కానీ దానికి ఒక సూపర్ లవ్ స్టోరీ ని కలిపి ఆయన తెరకెక్కించిన విధానం ప్రేక్షకుడిని ఆకట్టుకుంది. అందువల్లే ఆ సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి…సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడు ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించబోతున్నాడు.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
స్పిరిట్ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం ఆయన దగ్గర రవితేజ కొడుకు మహధన్ భూపతి రాజు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు…
మహధన్ రీసెంట్ గా సందీప్ రెడ్డి వంగ కి ఒక కథ అయితే వినిపించారట…ఆ కథ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందట. హాలీవుడ్ రేంజ్ లో ఒక కథను డిజైన్ చేసుకున్నందుకు గాను సందీప్ రెడ్డివంగ తనని అప్రిషియేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏదేమైనా కూడా రవితేజ లాంటి స్టార్ హీరో కొడుకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్లడం అనేది ఆయన అభిమానులను కలవరపెడుతుంది.
మొత్తానికైతే దర్శకుడిగా రాణించాలనే ప్రయత్నంలో మహధన్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకే మంచి కథలను రెడీ చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అలాగే సందీప్ రెడ్డి వంగ దగ్గర ఎలాంటి మెలుకువలు నేర్చుకుంటాడు. తద్వారా ఆయన ఎలా టాప్ రేంజ్ లోకి వస్తాడు డైరెక్టర్ గా తన సత్తా చాటుతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…