KK Survey Tamil Nadu Elections Prediction: 2024 సార్వత్రిక ఎన్నికలలో కూటమి సాధించిన విజయం ఒక చరిత్ర. దాదాపుగా 58 శాతం ఓటింగ్ తో తిరుగులేని మెజారిటీ తో ఈ ఎన్నికల్లో గెలిచింది. జనసేన పార్టీ అయితే నూటికి నూరు శాతం పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి హిస్టరీ క్రియేట్ చేసింది. 164 స్థానాలతో సీఎం గా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. అయితే వీళ్లకు ఈ రేంజ్ విజయం లభిస్తుందని ఎగ్జిట్ పోల్స్ పూర్తి అయిన రోజులకు KK అనే పొలిటికల్ అనలిస్ట్ చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మొదట్లో ఎవ్వరూ ఈ సర్వే ని నమ్మలేదు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పుడు ఆయన చెప్పినది తూచా తప్పకుండ జరగడంతో ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. ‘KK సర్వేస్’ పేరు నేషనల్ లెవెల్ లో మారుమోగిపోయింది.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
అయితే ఈయన త్వరలోనే తమిళనాడు లో జరగబోతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి తన టీం తో సర్వే ని నిర్వహించగా, ఆ ఫలితాలను నేడు తెలిపాడు. ఆయన చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ప్రస్తుతం అధికారం లో ఉన్న DMK మరోసారి 41.5 శాతం ఓటింగ్ తో అధికారం లోకి రాబోతుందని తెలుస్తోంది. అదే విధంగా అన్నా DMK పార్టీ కి 36.2 శాతం ఓటింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు. ఇక తమిళనాడు లో సూపర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి TVK పార్టీ ద్వారా ఎంట్రీ ఇచ్చిన విజయ్ కి 13.6 శాతం ఓటింగ్ వచ్చే అవకాశం ఉందని , అదే విధంగా NTK పార్టీ కి 7.9 ఓటింగ్ వస్తుందని చెప్పుకొచ్చాడు . ఈ సర్వే ని బూత్ స్థాయి అంచనాలతో శాస్త్రీయ పరిశోధన పద్దతులతో చేపట్టినట్టు KK చెప్పుకొచ్చాడు.
అయితే విజయ్ పార్టీ కి మొదటి ఎన్నికల్లోనే డబుల్ డిజిట్ ఓటింగ్ శాతం నమోదు అవ్వడబోతుండడం అనేది చిన్న విషయం కాదు. మెగాస్టార్ చిరంజీవి తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఏ సూపర్ స్టార్ పార్టీ కి కూడా డబుల్ డిజిట్ ఓటింగ్ రాలేదు. అలాంటిది విజయ్ కి ఆ రేంజ్ ఓటింగ్ ఉండడం అనేది ఆ పార్టీ కి శుభ పరిణామమే. అయితే రీసెంట్ గా విజయ్ చుట్టూ జరిగిన కొన్ని సంఘటనలు ఆయన ఓటింగ్ పై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని KK చెప్పుకొచ్చాడు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది.