Harish Rana Euthanasia Case: కారుణ్య మరణాలు ఇటీవల పెరుగుతున్నాయి. కారణం ఏదైనా కారుణ్య మరణం కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. విచారణ తర్వాత చాలా వరకు తిరస్కరణకు గురవుతున్నాయి. అయితే కొన్నింటిని మాత్రం కోర్టు కూడా అంగీకరిస్తోంది తాజాగా 13 ఏళ్లుగా కోమాలో ఉన్న 32 ఏళ్ల హరీశ్ రాణాకు సుప్రీంకోర్టు కారుణ్య మరణం అనుమతించడం భారత న్యాయ చరిత్రలో చారిత్రాత్మక సంఘటనగా నమోదైంది. అతడికి ప్రాణాధార చికిత్స వ్యవస్థలను తొలగించడానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం దేశంలో ఈ విధానానికి మొదటి సారి ఇచ్చిన అనుమతి.
కారుణ్య మరణం పునాది
15 ఏళ్ల ముందు 2011లో అరుణా షాన్‌బాగ్ కేసులో సుప్రీంకోర్టు పాసివ్ యూతనేషియాను మొదటిసారి గుర్తించింది. మహారాష్ట్రలోని కింగ్ ఎడ్వర్డ్ ఆసుపత్రి నర్సుగా 1967లో చేరిన అరుణా (25 ఏళ్లు) 1973 నవంబర్ 27 రాత్రి వార్డుబాయ్ సోహన్లాల్ క్రూరంగా లైంగిక దాడికి గురైంది. శునక గొలుసుతో బంధించి మెదడుకు గాయం చేయడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయింది, మంచానికి పరిమితమై కేఎం ఆసుపత్రిలో ప్రత్యేక వార్డులో ఉంది.
ఆమె నరక యాతనే నాంది..
అరుణాకు కారుణ్య మరణం అనుమతించాలని జర్నలిస్ట్ పింకీ విరాణి సుప్రీంకోర్టులో 2011లో పిటిషన్ దాఖలు చేసింది. కోర్టు చికిత్సను నిలిపివేసి సహజ మరణం (పాసివ్ యూతనేషియా) అనుమతించాలని నిర్ణయించింది, కానీ బాధితుడి తల్లిదండ్రులు, భాగస్వామి లేదా సన్నిహితుల అనుమతి తప్పనిసరిగా నిర్దేశించింది. ‘నెక్సట్ ఫ్రెండ్‘గా పింకీని నిరాకరించి, ఆసుపత్రి సిబ్బందిని సూరిగా నియమించింది, వారు చికిత్స నిలిపివేయడానికి ఒప్పుకోకపోవడంతో పిటిషన్ తిరస్కరించబడింది. నాలుగు దశాబ్దాలుగా జీవచ్ఛవం వల్ల ఉన్న అరుణా 2015లో న్యుమోనియాతో మరణించింది.
హరీశ్ రాణా సందర్భం
అరుణా కేసు ఆధారంగా 2018లో సుప్రీంకోర్టు ‘గౌరవప్రద మరణం‘ను ప్రాథమిక హక్కుగా గుర్తించి పాసివ్ యూతనేషియాను అధికారికంగా చట్టబద్ధం చేసింది. హరీశ్ రాణా (ఇంజినీరింగ్ విద్యార్థి) 2013లో చండీగఢ్ యూనివర్సిటీ హాస్టల్ నాలో అంతస్తు బాల్కనీ నుంచి పడిపోయి తలకు తీవ్ర గాయం కారణంగా 13 ఏళ్లు కోమాలో ఉన్నాడు. తల్లిదండ్రులు సుప్రీంకోర్టుకు అనేక సంవత్సరాలు పిటిషన్ చేసిన తరువాత, వైద్య నివేదికల ఆధారంగా మార్చి 2026లో చికిత్స తొలగించడానికి అనుమతించింది, ఇది అరుణా మార్గదర్శకాల ప్రకారం మొదటి సారిగా ఇచ్చిన తీర్పు.