CPI Narayana Warnings To Trump: ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. అది అమెరికా కన్ను గీటితేనో, లేక ట్రంప్ ఒక మాట అంటేనో ఆ పరిణామాలు ఖచ్చితంగా నారాయణ గారికి తెలియాల్సిందే! తాజాగా మఖ్దూమ్ భవన్ నుంచి అమెరికా అధ్యక్షుడికి గట్టి వార్నింగ్ ఇచ్చి, అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన ‘రెడ్’ మార్కును చూపించారు సీపీఐ నేత కె. నారాయణ.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
ట్రంప్.. ఇది చూడు!”
సాధారణంగా నారాయణ గారు అంటేనే సెటైర్లకి పెట్టింది పేరు. అలాంటిది ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికా గురించి మాట్లాడేటప్పుడు ఆయన గొంతులో ఉండే ఆ పవర్ మామూలుగా ఉండదు. “ఇరాన్ మీద దాడులు చేస్తావా? ఏమనుకుంటున్నావ్?” అని వైట్ హౌస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన హెచ్చరికలు చూస్తుంటే.. వాషింగ్టన్‌లో ఉన్న ట్రంప్ కు కూడా ఒక్క క్షణం వణుకు పుట్టి ఉంటుందని నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి కళ్లెం వేయడానికి రష్యా, చైనాను ఒకే తాటిపైకి రావాలని నారాయణ పిలుపునిచ్చారు.
నారాయణ గారి ‘గ్లోబల్ వ్యూ’
క్యూబాలో కరెంట్ పోయినా అక్కడ ఆర్థిక సంక్షోభం వచ్చినా దానికి కారణం అమెరికానేనని ఆయన విశ్లేషణ. ఇది వింటుంటే, “రేపు పొద్దున్న మా ఇంట్లో పాలు విరిగిపోయినా, నారాయణ గారు అమెరికానే తిడతారేమో!” అని ఒక అభిమాని కామెంట్ చేసేంతలా ఆయన అమెరికాపై ఫోకస్ పెట్టారు.
శ్రీలంక లో యువత చేసిన తిరుగుబాటును చూసి ఉప్పొంగిపోయిన ఆయన, భారతదేశంలో కూడా వామపక్ష ఉద్యమాలు అలాగే రావాలని కోరుకుంటున్నారు. అయితే ఆ యువత ఎప్పుడూ సోషల్ మీడియాలోనే బిజీగా ఉంటారని ఆయనకి ఇంకా తెలియదేమో! కేరళలో ఎల్‌డీఎఫ్ గెలుపు గురించి చెప్తుంటే, నారాయణ గారి మాటల్లో ఒక రకమైన ‘అధికారిక’ ధీమా కనిపిస్తోంది.
నారాయణ గారు.. మీరు గ్రేట్!
ప్రపంచవ్యాప్త యుద్ధాల గురించి ఆందోళన చెందుతూనే కేరళ ఎన్నికల లెక్కలు చెబుతూ, యువతను, కార్మికులను ఏకం చేయాలని ఆయన చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. కాకపోతే ఇంత బిజీగా అంతర్జాతీయ రాజకీయాలను చక్కదిద్దుతున్న ఆయన, ఒక్కసారి ఆ వైట్ హౌస్‌కి ఫోన్ చేసి “ఒరేయ్ ట్రంపూ.. ఆ యుద్ధాలు ఆపేయండి” అని చెబితే, ప్రపంచంలో యుద్ధాలు ఆగిపోతాయని ఆయన నమ్మకం కాబోలు!
నారాయణ గారు ఉన్నంత కాలం అమెరికా ఏకపక్ష నిర్ణయాలకు నిద్రలేకుండా గడపాల్సిందే. మీరు ఇలాగే విరుచుకుపడుతూ ఉండండి సార్.. మాకు మీ సెటైర్ల వినోదం ఇలాగే అందుతూ ఉండాలి!