https://oktelugu.com/

మరో ఆర్థిక నేరగాడు విదేశాలకు పరారీ

కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బ్యాంకు లు భారీగా రుణాలను ఎగ్గొట్టి అనేకమంది పేరొందిన ఆర్ధిక నేరస్థులు దేశం వదిలి పారిపోతున్నారు. తాజాగా మరో ఆర్థిక నేరగాడు విదేశాలకు పరారయ్యాడు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న రూ. 400 కోట్ల రుణాలను చెల్లించకుండా విదేశాలు పారిపోయాడు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ, మోహుల్‌ చోక్సీ తరహాలోనే ఢిల్లీకి చెందిన రామ్‌దేవ్‌ అంతర్జాతీయ సంస్థ యజమానులు రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 / 07:05 PM IST
    Follow us on


    కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బ్యాంకు లు భారీగా రుణాలను ఎగ్గొట్టి అనేకమంది పేరొందిన ఆర్ధిక నేరస్థులు దేశం వదిలి పారిపోతున్నారు. తాజాగా మరో ఆర్థిక నేరగాడు విదేశాలకు పరారయ్యాడు.

    స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ), ఇతర బ్యాంకుల నుండి తీసుకున్న రూ. 400 కోట్ల రుణాలను చెల్లించకుండా విదేశాలు పారిపోయాడు. విజయ్ మాల్యా, నీరవ్‌మోడీ, మోహుల్‌ చోక్సీ తరహాలోనే ఢిల్లీకి చెందిన రామ్‌దేవ్‌ అంతర్జాతీయ సంస్థ యజమానులు రుణాలు చెల్లించకుండా బ్యాంకులకు ఎగనామం పెట్టారు.

    కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

    ఈ సంస్థ బాస్మతి బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఆ కంపెనీ డైరక్టర్లు నరేశ్‌ కుమార్‌, సురేశ్‌ కుమార్‌, సంగీత, ఇతరులపై సిబిఐ ఫోర్జరీ, చీటింగ్‌ కేసులను నమోదు చేసి విచారణ కొనసాగిస్తోంది. నాలుగేళ్ల అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 25న ఎస్‌బిఐ ఫిర్యాదు మేరకు సిబిఐ దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

    ఎస్‌బిఐతో పాటు ఆరు బ్యాంకుల నుండి మొత్తం రూ.414 కోట్లు రుణం తీసుకున్నారు. అనంతరం వారు కనిపించలేదని, విదేశాలకు పారిపోయారని సమాచారం. కాగా, వారు తీసుకున్న రుణాలు చెల్లించకపోవడంతో 2016లో మొండి బకాయిల జాబితాలో చేర్చారు. అనంతరం సిబిఐకి ఫిర్యాదు చేయడంతో పాటు ఏప్రిల్‌ 28న కేసు నమోదైంది.

    లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

    నిందితులు చట్ట విరుద్ధంగా తప్పుడు ఖాతాలతో మోసం చేయడంతో పాటు లాభాలు పొందేందుకు ప్లాంట్‌, యంత్రాలను తొలగించినట్లు ఎస్‌బిఐ ఫిర్యాదులో పేర్కొంది. నిరర్థక ఆస్తులు (ఎన్‌పిఎ) కింద మార్చిన అనంతరం నిందితుల కోసం హర్యానా పోలీసులతో విచారణ చేపట్టామని, అయితే అప్పటికే వారు దేశం విడిచి పారిపోయారని తెలిపింది.