https://oktelugu.com/

కరోనా కేసులు తక్కువగా చూపిస్తున్న జగన్ ప్రభుత్వం

ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా వైరస్ కేసులను తక్కువ చేసి చూపిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్న వాటికన్నా చాల ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయమై కీలకమైన వైద్య నిపుణులే తనకు సమాచారం అందించినట్లు చెప్పుకొచ్చారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలసి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 / 06:34 PM IST
    Follow us on


    ఆంధ్ర ప్రదేశ్ లో వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం కరోనా వైరస్ కేసులను తక్కువ చేసి చూపిస్తున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తున్న వాటికన్నా చాల ఎక్కువగా కరోనా కేసులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ విషయమై కీలకమైన వైద్య నిపుణులే తనకు సమాచారం అందించినట్లు చెప్పుకొచ్చారు.

    పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలసి నెల్లూరు జిల్లా పార్టీ నేతలతో టెలీకాన్ఫెరెన్స్ లో మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 96 కేసుల వరకూ ఉన్నాయని చెబుతున్నా అంతకంటే ఎక్కువగానే ఉన్నాయని స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు గుర్తు చేశారు. పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్న దృష్ట్యా నెల్లూరు, చిత్తూర్ జిల్లాల్లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.

    మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?

    కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్న దృష్ట్యా ఈ విషయమై దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. కరోనా వైరస్ తో దేశ స్వరూపమే మారే అవకాశం ఉన్నదని పేర్కొన్నారు. కేవలం ఒకే వ్యాక్సిన్ తో ఈ సమస్య తీరకపోవచ్చని పేర్కొంటూ వైరస్ రూపానికి తగ్గ విధంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నట్లు గుర్తు చేశారు.

    వ్యాక్సిన్ వచ్చే వరకూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాల్సిందే అని స్పష్టం చేశారు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బ తిని, నష్టపోయాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు. వాటిపట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలని పవన్ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా జనసేన నాయకులు అండగా నిలవాలని సూచించారు.

    సీజ్ చేసిన వాహనాలు తెచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

    రాష్ట్రంలో మొదటి కరోనా కేసు నమోదైంది నెల్లూరు జిల్లాలోనే అని నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. అధికార పక్షం ఈ విపత్కర సమయంలో వ్యవహరిస్తున్న తీరుని ప్రజలు గమనిస్తూ ఉన్నారని హెచ్చరించారు. ప్రజా ప్రతినిధుల వ్యవహారం, ప్రజల ఇబ్బందులు, స్థానిక సమస్యలపై మన పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండాలని సూచించారు.