Kavitha Political Strategy: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే మాట వినిపిస్తోంది.. “గులాబీ బాస్ మారకపోయినా.. కవిత మాత్రం కదనరంగంలోకి దూకేశారు!” ఎప్పుడూ కేసీఆర్ వ్యూహాలు, కేటీఆర్ ట్వీట్ల చుట్టూ తిరిగే గులాబీ రాజకీయంలో ఇప్పుడు ‘జాగృతి’ పతాకం ఎగురుతోంది. ఇది ఒక సాధారణ రాజకీయ పరిణామం కాదు, బీఆర్ఎస్ స్క్రిప్టులో ఊహించని ‘ట్విస్ట్’!
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
అన్నకు ‘ఎక్స్’ రే.. ఇంటి నుంచే మొదలు!
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కేటీఆర్ సోషల్ మీడియాలో మహిళా సాధికారతపై ఒక రేంజ్ ట్వీట్ వేశారు. ఇంకేముంది? వెంటనే చెల్లెమ్మ కవిత గారు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. “ఇతరులకు నీతులు చెప్పే ముందు, ముందు ఇంటి నుంచే గౌరవం మొదలవ్వాలి” అని ఆమె చేసిన ట్వీట్ చూస్తుంటే.. రాజకీయాల్లోనే కాదు.. కుటుంబంలో కూడా ‘పవర్ సెంటర్’ మారబోతోందనిపిస్తోంది. అన్నగారి ‘గ్లామర్’ ట్వీట్లకు, చెల్లెమ్మగారి ‘గ్రౌండ్’ రియాలిటీ కౌంటర్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్.
లిక్కర్ కేసు క్లీన్ చిట్.. ‘రెట్టింపు’ స్పీడ్!
ఢిల్లీ లిక్కర్ కేసు నుంచి బయటకు రాగానే కవిత గారు తీసుకున్న యూ-టర్న్ చూస్తుంటే బీఆర్ఎస్ నేతలకే కళ్లు చెదిరిపోతున్నాయి. పార్టీ ప్రతిపక్ష పాత్రలో ఇంకా తడబడుతుంటే.. కవిత మాత్రం ఖమ్మం వెలుగుమట్ల దాకా వెళ్లి, అరెస్టులను లెక్క చేయకుండా నిరసనలతో అదరగొట్టేశారు. కేసీఆర్ గారు ఇంకా ‘వ్యూహాల’ గదిలో ఉంటే.. కవిత మాత్రం నేరుగా ‘యుద్ధ’ భూమిలోకి దిగిపోయారు. అంటే.. పార్టీ భవిష్యత్తు కోసం కవిత ఇప్పుడు పాత టీఆర్ఎస్ ఉద్యమ పంథాను రివైవ్ చేస్తున్నారన్నమాట!
‘జాగృతి’ వేదికగా కొత్త ప్రయోగం?
బీఆర్ఎస్ కంటే వేగంగా క్షేత్రస్థాయి సమస్యలపై స్పందిస్తూ ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకోవాలని కవిత గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. “పార్టీ నుంచి నన్ను పంపేశారు” అని ఆమె అంటున్నారంటే, ఆమె అస్త్రాలు ఎవరి మీదో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. చట్టసభల కంటే వీధుల్లో చేసే పోరాటమే బలంగా వినిపిస్తుందని ఆమె నమ్ముతున్నారు.
కేటీఆర్ vs కవిత: ఎవరు ‘అసలైన’ వారసుడు?
ఒకవైపు కేటీఆర్.. ప్రెస్ మీట్లు, ట్వీట్లతో గ్లామర్ రాజకీయాలు నడుపుతుంటే, కవిత మాత్రం ఖమ్మం నిరాహార దీక్షలతో ‘ఒరిజినల్’ ఉద్యమకారిణి అనిపించుకుంటున్నారు. కేసీఆర్ గారి మొండితనం, సెంటిమెంట్ పండించే నైపుణ్యం అచ్చం ఆమెలో కనిపిస్తున్నాయని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇప్పుడు కార్యకర్తలకు ఒకటే సందేహం.. కేటీఆర్ గారు గ్లామర్ లీడరా? లేక కవిత గారు నిజమైన ఫైటరా?
మొత్తానికి గులాబీ దళంలో ఇప్పుడు కవితా ప్రతాపం మొదలైంది. ఆమె సెట్ చేస్తున్న ఈ కొత్త రాజకీయ వేడి.. రాబోయే రోజుల్లో గులాబీ పీఠాన్ని ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి!