Trivikram Son Directorial Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా తన సత్తా చాటుకున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… ఒకప్పుడు ఆయన రాసిన కథలు ప్రేక్షకులందరిని అలరించాయి. అలాగే ఆయన కథ, మాటలు ఇచ్చిన సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి క్రమంలోనే మరోసారి తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తూ తను దర్శకుడిగా మారాడు. అప్పటినుంచి ఇప్పటివరకు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే సినిమాలను చేస్తున్నాడు. అయితే మహేష్ బాబుతో చేసిన ‘గుంటూరు కారం’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.
Also Read: విడాకులు తీసుకున్న హీరోయిన్ హన్సిక.. కారణం చూస్తే ఆశ్చర్యపోతారు!
అయినప్పటికి తను ఎక్కడ నిరాశ పడకుండా ప్రస్తుతం వెంకటేష్ తో ‘ఆదర్శ కుటుంబం’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు…ప్రస్తుతం తన కొడుకు సైతం సందీప్ రెడ్డి వంగ దగ్గర డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో వర్క్ చేస్తున్నాడు. ఇక ఇప్పటికే తను ఒక కథను కూడా రెడీ చేసుకున్నాడట. దానికి ఒక యంగ్ హీరోని కూడా సెలెక్ట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది.
ఇంతకి త్రివిక్రమ్ కొడుకు డైరెక్షన్ లో నటించబోయే ఆ యంగ్ హీరో ఎవరు అంటూ గత రోజు కొన్ని రోజుల సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన నవీన్ పోలిశెట్టితో ఒక యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలని చూస్తున్నాడు. ‘స్పిరిట్’ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడే తను ఆ సినిమాని స్టార్ట్ చేయడానికి సన్నాహాలు కూడా చేసుకుంటున్నాడు.
ఇక త్రివిక్రమ్ కొడుకు తను అనుకున్నట్టుగానే ఈ సినిమాను అనుకున్న టైమ్ కి అనుకున్న రేంజ్ లో తీయగలుగుతాడా? అని ప్రతి ఒక్కరు వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక మరికొందరైతే త్రివిక్రమ్ తన వెంటే ఉంటాడు. కాబట్టి ఆ సినిమాని ఎలాగైనా సరే సక్సెస్ ఫుల్ గా తెరకెక్కిస్తాడని మరి కొంతమంది భావిస్తున్నారు…