Ravi Teja-Chiranjeevi: సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సినిమా వాళ్లకు శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో థియేటర్ల పై ఎలాంటి ఆంక్షలు ఉండవని తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లారిటీ ఇస్తూ.. ప్రస్తుత కరోనా పరిస్థితులు మరింత ఉద్ధృతం గా ఉంటే అప్పుడు ఆంక్షలు విధించాల్సి వస్తోంది. సినిమా పరిశ్రమకు మా తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది. మా ప్రభుత్వం టికెట్ ధరలు పెంచింది. అలాగే ఐదో ఆటకు పర్మిషన్ కూడా ఇచ్చింది. ఇక థియేటర్ల సమస్యలపై ఏపీ మంత్రులతో మాట్లాడతానని తలసాని చేప్పారు.
Also Read: బ్రేకింగ్ : ఏపీలో థియేటర్లకు ఊరట !
మెగాస్టార్ చిరంజీవి 154 వ చిత్రంగా బాబీ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ గెస్ట్ రోల్ చేయనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమాకు ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పెట్టారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రుతి హాసన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట. పైగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారు.
రవితేజ నటిస్తున్న కొత్త సినిమా రావణాసురలో అక్కినేని యంగ్ హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా జనవరి 14న పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం అయింది. రవితేజ ఈ సినిమాలో లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్ లకు విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. పైగా ఈ సినిమాలో మరో హీరో కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తాడట.
Also Read: చిరంజీవిని తొక్కామని సంబరపడి.. తెలుగు ఇండస్ట్రీని ముంచేశారు?
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Ravi teja about ticket pricing with ap ministers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com