Yuzvendra Chahal : అయితే ఇప్పుడు హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం పాతబడిపోయింది. మరో క్రికెటర్ భార్యకు విడాకులు ఇచ్చాడని ప్రచారం జరుగుతున్నది. టీమిండియాలో స్టార్ బౌలర్గా యజువేంద్ర చాహల్ కొనసాగుతున్నాడు. ఇతడు టీ20 స్పెషలిస్ట్ బౌలర్ గా పేరు పొందాడు. ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా ఇతడు రికార్డు సృష్టించాడు. చాహల్ భార్య ధన శ్రీ వర్మకు విపరీతమైన పాపులారిటీ ఉంది.. ఈమె ప్రొఫెషనల్ గా మంచి డాన్సర్. ఈమెకు ఏకంగా ఒక డ్యాన్స్ కంపెనీ కూడా ఉంది. మంచి అందగత్తె కూడా. ధనశ్రీ తన భర్త ద్వారా కాకుండా, సొంతంగా ఫేమ్ సంపాదించుకుంది. డాన్సర్ గా, కొరియోగ్రాఫర్ గా, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ధన శ్రీ వర్మ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. డ్యాన్స్ పోటీలలో పాల్గొని దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. డ్యాన్స్ షో లకు ఆమె జడ్జిగా వ్యవహరించారు. చిన్నప్పుడే ధనశ్రీ వర్మ కూచిపూడి నేర్చుకున్నారు.
ప్రేమ వివాహం
యజువేంద్ర చాహల్, ధన శ్రీ వర్మ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. 2020లో వీరు వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 22న వీరి పెళ్లి జరిగింది. సోషల్ మీడియాలో వీరిద్దరూ విపరీతమైన యాక్టివ్ గా ఉంటారు. ఒకరిని ఒకరు ఫాలో అవుతూ ఉంటారు. ఇక ధనశ్రీ ఈవెంట్లకు చాహల్.. చాహల్ ఆడిన మ్యాచ్లకు ధనశ్రీ హాజరవుతుంటారు. ధనశ్రీకి సోషల్ మీడియాలో పాపులారిటీ ఎక్కువ. పైగా ఆమె వెస్ట్రన్ వేర్ లో కనిపిస్తుంటారు. ఆమె పార్టీ యానిమల్ కూడా.. అయితే మొన్నటి డిసెంబర్ 22న వివాహ దినోత్సవ సందర్భంగా అటు చాహల్, ఇటు ధనశ్రీ ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకోలేదు. దీంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రముఖ శని విమర్శకుడు కమల్ ఖాన్ ధన శ్రీ వర్మ, చాహల్ ఎప్పుడో విడిపోయారని.. వేరువేరుగా ఉంటున్నారని స్పష్టం చేశాడు. అయితే విడాకుల విషయంపై అటు ధనశ్రీ, ఇటు చాహల్ ఇంతవరకు నోరు విప్పలేదు. దీనిపై స్పోర్ట్స్ విశ్లేషకులు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. నిప్పు లేనిదే పొగరాదనే సామెతను ఉదహరిస్తున్నారు. “ధనశ్రీ పేజ్ -3 జీవితానికి అలవాటు పడింది. ఆమె అల్ట్రా మోడ్రన్ గర్ల్ లాగా ఉంటుంది. అది చాహల్ కు నచ్చడం లేదు. అందువల్లే విడాకులు తీసుకున్నాడు కావచ్చు. ధనశ్రీ ఆహారంపై అనేక సందర్భాల్లో చాహల్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయినప్పటికీ ధనశ్రీ పట్టించుకోలేదు. పైగా ఆమె అదే ధోరణి కొనసాగించింది. అందువల్లే చాహల్ విడాకులు ఇచ్చి ఉంటాడని” స్పోర్ట్స్ విశ్లేషకులు భావిస్తున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Yuzvendra chahal and dhana sri vermas divorce rumours
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com