Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 Collections : బాహుబలి 2 రికార్డుకి అడుగు దూరంలో పుష్ప 2.. బాక్సాఫీస్...

Pushpa 2 Collections : బాహుబలి 2 రికార్డుకి అడుగు దూరంలో పుష్ప 2.. బాక్సాఫీస్ ని దున్నేస్తున్న అల్లు అర్జున్!

Pushpa 2 Collections :  నాలుగో వారం కూడా పుష్ప 2 వసూళ్ల ప్రభంజనం తగ్గలేదు. హిందీలో ఈ మూవీ వసూళ్లు రూ. 731 కోట్లను దాటాయి. 21వ రోజు పుష్ప 2 హిందీ వెర్షన్ రూ.15.5 కోట్లు రాబట్టింది. వరుణ్ ధావన్-కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ మూవీ ఫస్ట్ డే కేవలం రూ. 4 కోట్లు రాబట్టడం విశేషం. లోకల్ హీరో వరుణ్ ధావన్ మూవీ కంటే అల్లు అర్జున్ మూవీ నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసింది.

వరల్డ్ వైడ్ 21 రోజులకు పుష్ప 2 అన్ని భాషల్లో కలిపి రూ. 1705 కోట్ల వసూళ్లు రాబట్టింది. కాగా బాహుబలి 2 వసూళ్లకు పుష్ప 2 దగ్గరైంది. బాహుబలి 2 వరల్డ్ వైడ్ రూ. 1800 కోట్ల గ్రాస్ రాబట్టిన సంగతి తెలిసిందే. బాహుబలి 2 విడుదలై దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. ఈ రికార్డు పదిలంగా ఉంది. దంగల్ చైనాలో ఆడటం వలన అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఉంది. లేకుంటే వరల్డ్ వైడ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ రికార్డు బాహుబలి 2 చిత్రానిదే.

బాహుబలి 2 రికార్డు మాత్రం పుష్ప 2 బ్రేక్ చేయనుంది. ఇకపై నాన్ పుష్ప 2 రికార్డ్స్ అని ఇండస్ట్రీ చెప్పుకునే పరిస్థితి నెలకొననుంది. 2021లో విడుదలైన పుష్ప చిత్రానికి దర్శకుడు సుకుమార్ సీక్వెల్ గా పుష్ప తెరకెక్కించాడు. అల్లు అర్జున్ కి జంటగా రష్మిక మందాన నటించింది. ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ చేశాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు.

మూడేళ్ళ కష్టానికి భారీ ఫలితం దక్కింది. నార్త్ లో అతిపెద్ద హీరోగా అల్లు అర్జున్ అవతరించాడు. అల్లు అర్జున్ మార్కెట్ విపరీతంగా పెరిగింది. నెక్స్ట్ అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేస్తున్నారు. పుష్ప 2 చిత్రానికి అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ రూ. 300 కోట్లు అని సమాచారం. నెక్స్ట్ మూవీకి అల్లు అర్జున్ అంతకు మించి ఛార్జ్ చేసే అవకాశం కలదు. దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరో అల్లు అర్జున్ అవుతాడు.

RELATED ARTICLES

Most Popular