Viral Video : డబుల్ కా మీటా అంటే.. ఇదే కాబోలు.. డబుల్ సెంచరీ చేసిన అతడు.. మరో మ్యాచ్లో డబుల్ బాదాడు. అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. మొత్తానికి 407 పరుగుల టార్గెట్ ను ఉఫ్ మని ఊదేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టాడు. తన బ్యాటింగ్ స్టైల్ తో ప్రత్యర్థి బౌలర్లను సైతం సమ్మోహితులను చేశాడు. దీంతో అతడు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్టర్ గా మారిపోయాడు. అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కలగలుపుతూ సమీర్ బ్యాటింగ్ చేశాడు. బౌండరీ మీటర్ చిన్నబోయేలాగా ఫోర్లు కొట్టాడు. స్టాండ్స్ విస్తు పోయేలాగా సిక్స్ లు బాదాడు. అతని బ్యాటింగ్ దూకుడు వల్ల ప్రత్యర్థి జట్టు బౌలర్లు మౌన ప్రేక్షకులుగా మిగిలిపోయారు. అతడు కొడుతుంటే అలా చూస్తూ ఉండిపోయారు.
డబుల్ సెంచరీలు ఇలా..
సమీర్ రిజ్వి అండర్ 23 స్టేట్ – ఏ ట్రోఫీలో ఉత్తర ప్రదేశ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. దూకుడు అయిన ఆటతీరును ప్రదర్శించే రిజ్వీ.. ఈ సిరీస్లో మరింత రెచ్చిపోయాడు. త్రిపుర జట్టుపై జరిగిన మ్యాచ్లో 97 బంతుల్లోనే 201 రన్స్ చేశాడు. డొమెస్టిక్ క్రికెట్లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత విదర్భ జట్టుతో జరిగిన మ్యాచ్లో 105 బంతుల్లోనే 202 రన్స్ చేసి అదరగొట్టాడు. అతని బ్యాటింగ్ దూకుడు వల్ల విదర్భ విధించిన 407 రన్స్ టార్గెట్ ను సులభంగా చేదించింది. డొమెస్టిక్ క్రికెట్లో కొత్త ఘనతను సృష్టించింది. సమీర్ రిజ్వీ డబుల్ సెంచరీ చేయడం వల్లే ఇది సాధ్యమైంది. సమీర్ వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేయడంతో సోషల్ మీడియాలో అతని పేరు మారుమోగిపోతుంది. ” సమీర్ దూకుడు మీద ఉన్నాడు. చెలరేగి ఆడుతున్నాడు. బౌలర్ ఎవరనేది పట్టించుకోవడం లేదు. ఫోర్లు, సిక్సర్లు కొట్టి చెలరేగిపోతున్నాడు. అందువల్లే ఉత్తరప్రదేశ్ జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది . అండర్ 23 స్టేట్ – ఏ ట్రోఫీలో విజేతగా నిలిచింది. ఐపీఎల్ లో సమీర్ చెన్నై జట్టు తరఫున ఆడాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతని బ్యాటింగ్ దూకుడుగా ఉంటుంది కాబట్టి కచ్చితంగా జాతీయ జట్టులో స్థానం లభించే అవకాశం ఉందని” క్రీడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఐపీఎల్ లో చెన్నై జట్టు తరఫున సమీర్ కు ఎక్కువగా అవకాశాలు రాలేదు. అయితే ఇప్పుడు అతని బ్యాటింగ్ చూసి చెన్నై జట్టు మేనేజ్మెంట్ కచ్చితంగా అవకాశం కల్పిస్తుంది. అన్ని కుదిరితే అతనితోనే ఓపెనింగ్ చేయిస్తుందని.. స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.
పురుషుల అండర్ 23 స్టేట్ – ఏ ట్రోఫీలో up కెప్టెన్ సమీర్ చరిత్ర సృష్టించాడు. ఈ ట్రోఫీలో రెండు డబుల్ సెంచరీలు చేసి రికార్డు సృష్టించాడు. త్రిపురపై 97 బంతుల్లో 201 రన్స్, విదర్భ పై 105 బంతుల్లో 202 రన్స్ . 407 రన్స్ టార్గెట్ చేజ్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.#SameerRizvi pic.twitter.com/UoX1Y8IDdh
— Anabothula Bhaskar (@AnabothulaB) December 26, 2024