Chiranjeevi : సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ప్రతి సినిమా కోసం వాళ్ళ గెటప్ ని మార్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి తన ఎంటైర్ కెరియర్ లో చేసిన చాలా సినిమాల కోసం డిఫరెంట్ గెటపుల్లో కనిపించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. ఇంతకి ఆ పిక్స్ దేనికోసం దిగాడు అంటూ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండగా ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారమైతే ఇప్పటికే విశ్వంభర సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఈ సినిమా షూట్ ముగిసిన వెంటనే ఆయన నెక్స్ట్ సినిమాకి సంబంధించిన మేకోవర్ పనుల్లో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక రీసెంట్ గా జరిగిన ఫోటోషూట్ లో ఆయనను చూసిన ప్రతి ఒక్కరు వింటేజ్ లక్కులో చిరంజీవి కనిపిస్తున్నాడు అంటూ వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరి ఆయన ఈ లుక్ లోకి ఎందుకు మారాడు. ఇక ఆ లుక్ దేనికోసం అంటే అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసమే అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. నిజానికి అనిల్ రావిపూడి వింటేజ్ చిరంజీవిని చూపించడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడట. గ్యాంగ్ లీడర్ టైమ్ లో చిరంజీవి ఎలా ఉన్నాడో ఇప్పుడు ఫోటో షూట్ ని కనక చూసినట్లయితే అచ్చం అలాగే కనిపిస్తున్నాడు.
మరి అప్పటి చిరంజీవి ని బయటకు తీస్తూ తను ఒక భారీ కమర్షియల్ సినిమా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా చిరంజీవి వింటేజ్ పవర్ ను కనక బయటికి తీసుకురాగలిగినట్టైతే మాత్రం సినిమా ఇండస్ట్రీ హిట్ కొడుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ కూడా కమర్షియల్ గా మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ దర్శకుడిగా గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి.
ఇక ఇప్పటికే ఆయన వెంకటేష్, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలకు మంచి విజయాలను అందించాడు. కాబట్టి చిరంజీవికి కూడా అదిరిపోయే సక్సెస్ ని సంపాదించి పెడతాడు అంటూ మరి కొంతమంది సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండడం విశేషం… మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెతైతే ఇప్పుడు చిరంజీవితో చేయబోయే సినిమాతో ఆయన మరో మెట్టు పైకి ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక దానికి తగ్గట్టుగా చిరంజీవి కూడా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం చాలా జాగ్రత్తలు తీసుకున్న ఆయన ఇక మీదట కూడా ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా కేర్ ఫుల్ గా చూసుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నాడు…
Gang Leader Konidela RajaRam is here
Boss #Chiranjeevi pic.twitter.com/Hc80njDGEq
— Fukkard (@Fukkard) December 25, 2024