Viral Video : ప్రస్తుతం ఇంటర్నెట్ వాడకం పెరిగిపోయింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచంలో ఎక్కడో జరిగిన సంఘటనలు కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడు ఎలాంటి వీడియోలు చూస్తున్నామో చెప్పడం కష్టం. ఏది ఏమైనా కలియుగం నడుస్తుందని కొందరు చేస్తున్న ప్రమాదకరమైన చర్యలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఏనుగుపై పులి సవారు చేస్తుండడం దానితో కొంతమంది యువకులు ఉండడం చూసి ఉండవచ్చు.
సోషల్ మీడియాలో ఇప్పుడు రీల్స్, వైరల్ వీడియోల హవా నడుస్తోంది. వాటిని అదే పనిగా చూసేవారు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వీడియోలు చూస్తున్న సమయంలో ఎవరూ ఊహించని వీడియో ఒకటి కనిపించింది. ఈ వీడియో చూసిన వారు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచిస్తారు. ఇది చూసిన తర్వాత ఎవరైనా తప్పుకుండా నవ్వుతారు .. అసలు ఇలాంటి పనులు ఎలా చేస్తారు? అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి రా బాబు అని కూడా అంటారు.
అడవిలో ప్రమాదకర జంతువుల్లో సింహం, పులి, ఎలుగు, చిరుత పులి వంటివి గుర్తుకొస్తాయి. ఇవి తోటి జంతువులతో పాటు, మానవులకు కూడా ప్రమాదకరం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి.. పులిని నియంత్రించి తీసుకెళ్తున్నాడు. ఇందులో వెరైటీ ఏంటి అని ఆలోచిస్తున్నారా. ఈ వీడియో కాస్త భిన్నంగా ఉంటుంది. పులి అతని పెంపుడు జంతువులా అనిపిస్తుంది. ఈ వైరల్ అవుతున్న ఈ వీడియో బీహార్‌కు చెందినదని. ఇద్దరు వ్యక్తులు ఏనుగుపై కూర్చొని పులిని తమతో పాటు కూర్చోబెట్టుకుని సవారీ చేస్తున్నారు. ‘బిహారీలు పెద్ద పులిని పట్టుకొని ఏనుగుల మీద తిరుగుతున్నారు’ అనే అర్థం వచ్చే విధంగా గుజరాతీలో రాసిన క్యాప్షన్‌తో.. మావటితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు పెద్ద పులిని ఏనుగుపై ఉంచి.. జనం, వాహనాల రద్దీతో ట్రాఫిక్ నిలిచిపోయిన రోడ్డు మీద వెళ్తున్న వీడియోను సాగర్ పటోలియా (X/kathiyawadiii) అనే యూజర్ 2024 డిసెంబర్ 23న ఎక్స్‌లో పోస్టు చేశారు.
యువకులు పులిని పట్టుకోవడం, ఏనుగుకు కట్టడం, తిప్పడం, దాని చెవులు ఎలా మెలి తిప్పుతున్నారో మీరు వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఒక క్రూరమైన జంతువుతో అలాంటి పనులను చూసినప్పుడు, కలియుగంలో ఏదైనా జరగవచ్చని ఒక విషయం మాత్రం అర్థం అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. కొందరు ఈ సోదరులు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు అని కామెంట్స్ చేశారు. మరో నెటిజన్ ఈ వీడియో బీహార్‌కి చెందినది కాదని, కార్బెట్ పార్క్ రామ్‌నగర్‌కు చెందినదని కామెంట్ చేశారు.
इ बिहार है बाबू यहां उड़ती चिड़िया को भी हल्दी लगा देते हैं!
ऐसे अदभुद नजारे बिहार में ही देखने को मिल सकते है! pic.twitter.com/Y91mivfpwS
— गुरु (@guru_ji_ayodhya) December 24, 2024
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Tiger paraded on elephant in bihar viral video
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com