ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. అటు సరైన నాయకత్వం లేక.. ఇటు సీనియర్ల కుమ్ములాటలతో పార్టీ పరువు దిగజారిపోతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కేరళ అసెంబ్లీ ఎన్నికలను రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిజానికి కేరళ ఎన్నికలు రాహుల్‌కు ఎంతో ప్రతిష్టాత్మకం. సంప్రదాయం ప్రకారం ఈసారి కూడా యూడీఎఫ్‌కే విజయావకాశాలు ఉండాలి. కేరళ ప్రజలు కూడా మార్చి మార్చి అధికారాన్ని కట్టబెడుతుంటారు. అంతేకాదు..ఈ సారి సర్వేలన్నీ కూడా ఎల్డీఎఫ్ వైపే మొగ్గు చూపుతున్నాయి. దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కేరళపై ప్రత్యేక దృష్టిపెట్టారు.
Also Read: ఇక ఊరుకునేది లేదట.. కేంద్రానికి డిమాండ్లు పెట్టనున్న జగన్
కొద్ది రోజులుగా రాహుల్ గాంధీ కేరళలోనే మకాం వేశారు. కొద్దిగా కష్టపడితే విజయం సాధించవచ్చన్న నమ్మకంతో కేరళపైనే రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అమేధీ ప్రజలు తనను తిరస్కరించినా వయనాడ్ తనను అక్కన చేర్చుకుని పరువు కాపాడింది. అందుకే రాహుల్ గాంధీ యూడీఎఫ్ విజయం కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. మరోసారి యూడీఎఫ్‌ను ప్రజలు అమ్మలా ఆదరిస్తారని ఆయన భావిస్తున్నారు. ప్రధానంగా కేరళలోని క్రైస్తవ ఓటర్లను తమ వైపునకు తిప్పుకునేందుకు రాహుల్ గాంధీ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి రాహుల్ గాంధీ కీలక బాధ్యతలను అప్పగించారు.
కేరళలో అత్యధికులు విద్యావంతులే. దీంతో దేశంలో జరుగుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ధరలు వంటివి తమకు ఉపకరిస్తాయని రాహుల్ గాంధీ బలంగా విశ్వసిస్తున్నారు. ఇక్కడ కమ్యునిస్టులకు గ్రిప్ ఎక్కువగా ఉన్నా ఈసారి సామాజిక సమీకరణాలు పనిచేస్తాయని భావిస్తున్నారు. కేరళలో 27 శాతం మంది ముస్లింలు, 18 శాతం మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ రెండు వర్గాలను తమ వైపునకు తిప్పుకుంటే విజయం ఖాయమని భావిస్తున్నారు.
Also Read: ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ సంచలన పిటీషన్
శబరిమల వివాదంతో బీజేపీ 55 శాతం ఉన్న హిందూ ఓటు బ్యాంకును చీల్చుకోనుంది. ఇది అధికార ఎల్డీఎఫ్కు ఇబ్బందిగా మారుతుందని రాహుల్ గాంధీ అంచనా వేస్తున్నారు. ఈసారి ఎలాగైనా కేరళలో కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని రాహుల్ గాంధీ అక్కడే తిష్టవేశారు. అక్కడ ప్రజలతో మమేకం అవుతూ.. బీజేపీ వైఫల్యాలను వివరిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ చేసిన మేలును చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Rahul gandhi focus on kerala%e2%80%8c
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com