Kerala: వాతావరణ కాలుష్యంతో పాటు నాణ్యత లేమి ఆహారం కారణంగా నేటి కాలంలో చాలా మంది బరువు పెరుగుతున్నారు. అయితే చాలా మంది ఏ పని చేయకపోవడం వల్ల బరువు పెరుగుతారని అంటుంటారు. కానీ కొంత మంది నిత్యం కష్టపడుతున్నా.. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల లావవుతారు. అయితే సమాజానికి భయపడి.. ఆరోగ్యంపై శ్రద్ధ ఉంచాలనే ఉద్దేశంతో చాలా మంది బరువు తగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో కొందరు వ్యాయామాలు చేస్తే..మరికొందరు ప్రత్యేకంగా చికిత్స చేయించుకుంటూ ఉంటారు. అయితే చికిత్స చేయించుకునే స్థోమత లేని వారు సోషల్ మీడియాలో వచ్చే ఆరోగ్యానికి సంబంధించిన వీడియోలు పాలో అవుతూ ఉంటారు.ఇలా ఓ యువతి యూ ట్యూబ్ లో వచ్చే ఓ వీడియోను ఫాలో అవుతూ స్లిమ్ కావాలని చూసింది. కానీ కొంతకాలానికి ఆమె తీవ్ర అస్వస్థకు గురై.. చివరకు ప్రాణాలు పోయాయి. ఆ యువతి ఎవరు? అసలేం జరిగింది?
కేరళ రాష్ట్రంలోని కన్నూరు కు చెందిన ఓ యువతి న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఈ జిల్లాలోని కుతుపరంబకు చెందిన శ్రీనంద అనే 18 ఏళ్ల ఓ యువతి బరువును తగ్గాలని అనుకుంది. దీంతో ఆమె యూట్యూబ్ లోని కొన్ని వీడియోలను ఫాలో అవుతూ వచ్చింది. అయితే కొన్ని రోజులు గడిచాక అనారోగ్యంగా ఉండడంతో స్థానికంగా ఉన్న కో ఆపరేటివ్ ఆసుపత్రిలో చేరింది. సందర్భంగా ఆమెను పరీక్షించిన వైద్యలు ఆమెకు ‘అనోరెక్సియా నెర్వోసా’ అనేవ్యాధి ఉందని తేల్చారు. ఈ కారణంగా ఆమె మానసికంగా తీవ్రంగా కుంగిపోయి ఆహారాన్ని మానేసిందని, ఆ తరువాత తీవ్రమైన స్థితిలో ప్రాణాలు పోయాయని వైద్యుడు నాగేష్ ప్రభు తెలిపారు.
అయితే ‘అనోరెక్సియా నెర్వోసా’ అనేది వ్యాధి కాదని, ఇది ఒక మానసిక ఆందోళన అని వైద్యులు తెలుపుతున్నారు. శ్రీనందన అనే యువతికి కొన్ని బరువు పెరగొద్దనే భయం ఉండేది. దీంతో తాను ఎటువంటి ఆహారం తీసుకున్నా.. అందులో జాగ్రత్తలు తీసుకునేది. అయితే బరువు విషయంలో శ్రీ నంద ఆసుపత్రికి వెళితె ఎలాంటి సమస్య ఉండేది కాదు. కొన్ని యూట్యూబ్ ఛానెళ్లలో చెప్పిన ప్రకారం ఫాలో కావడంతో ఆమె ఎటువంటి ఆహారాన్ని తీసుకోకుండా ఉన్నారు. ఇది శరీరాన్ని శక్తి లేకుండా చేసింది. దీంతో బరువు పెరగడం అటుంటి.. ఉన్న ఎనర్జీని కోల్పోయారు అని వైద్యులు చెబుతున్నారు.
నేటి కాలంలో చాలా మంది యూట్యూబ్ ద్వారా కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు. కానీ ఆరోగ్యం విషయంలో కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ఎందుకంటే యూట్యూబ్ ఛానెళ్లలో కొంత మందిని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వివరాలు చెబుతారు. కానీ అందరి శరీరాలు ఒకే విధంగా ఉండవు. దీంతో వారి శరీరానికి ఏదీ అవసరమో? ఏదీ అనవసరమో? వైద్యులు చికిత్స తరువాత నిర్ణయిస్తారు. కానీ శ్రీనంద మాత్రం అలా కాకుండా ఓవర్ డైట్ చేయడం వల్ల ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నారు. సాధారణంగా బరువు పెరగకుండా తక్కువ ఆహారాన్ని తీసుకోవాలి. కానీ ఇది ప్రోటీన్లు కలిగినదై ఉండాలి. అలా కాకపోతే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.