Waqf Bill : వక్ఫ్ బిల్లు పాస్ అయినా.. దాని మీద వాదోప వాదాలు ఇప్పట్లో సమసిపోలేదు. విమర్శలు, ప్రతి విమర్శలు ఊహించినదే అయినా ఎవ్వరూ ఊహించని కోణం ఒకటి జరుగుతోంది. ముఖ్యంగా కేరళలో ఇది కొత్త పుంతలు తొక్కుతోంది. చర్చ వేరే దాని మీదకు వెళ్లిపోయింది.
రాహుల్ గాంధీ లీడర్ ఆప్ అపోజిషన్ అయ్యి ఎందుకు నోరు మెదపలేదు. కేరళలో జరుగుతున్న చర్చ ఇదీ. పార్లమెంట్ లో మొక్కుబడిగా కనపడి గాయాబ్ అయిపోయాడు. ఎందుకు మాట్లాడలేదు. ప్రియాంక గాంధీ అసలు పార్లమెంట్ కే ఆరోజు హాజరు కాకపోవడం.. చర్చలో ఎందుకు వ్యతిరేకించలేదని కేరళ ముస్లిం సంఘాలు అడుగుతున్నాయి.
జేమియత్ అనే ముస్లిం కేరళ సంస్థ.. ప్రియాంక గాంధీకి వయనాడ్ లో 48 శాతం ముస్లింలు ఓటేస్తే ఎందుకు పార్లమెంట్ లో వ్యతిరేకించలేదని ప్రశ్నిస్తూ పెద్ద వ్యాసాన్ని పత్రికల్లో రాసింది.
కాంగ్రెస్ రాహుల్ ప్రియాంకలకు ఓట్లు కావాలి.. కానీ ముస్లింల సమస్యలు పట్టవా? అంటూ ఇప్పుడు కేరళ ముస్లిం నేతలు, సంఘాలు మండిపడుతున్నాయి. కేరళలో ఇస్లామిక్ సంస్థలన్నీ కూడా రాహుల్, ప్రియాంకలు వ్యతిరేకించకపోవడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
వక్ఫ్ బిల్లుపై పార్లమెంటులో ఓటు వేయని ప్రియాంక మాట్లాడని రాహుల్ తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.