HomeతెలంగాణKCR Secretariat : 1500 కోట్లు పెట్టి దేశాన్ని షేక్ చేసిన కేసీఆర్ సచివాలయం.. కట్...

KCR Secretariat : 1500 కోట్లు పెట్టి దేశాన్ని షేక్ చేసిన కేసీఆర్ సచివాలయం.. కట్ చేస్తే చుక్కనీరుకు దిక్కు లేదు

KCR Secretariat :  1500 కోట్లు పెట్టి నిర్మించిన భవనం అది. పది పేజీల యాడ్స్‌ ఇచ్చిన ఘనత దాని సొంతం. కేసీఆర్‌ నుంచి గల్లీ స్థాయి నాయకుడి వరకు బొంబాట్‌ ప్రచారమే సాంతం. కానీ ఏం జరిగింది? ప్రారంభించి నెల కూడా పూర్తి కాలేదు. అంతలోనే లోపాలు బయటపడుతున్నాయి. ప్రారంభించిన రెండో రోజే నీరు లీక్‌ అయింది. అంతే కాదు అన్ని అంతస్తులతో నిర్మించిన భవనం సరిపోవడం లేదని ఇప్పుడు ఏకంగా మరో ట్వీన్‌ టవర్లు నిర్మించాలని ఆ మధ్య ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మరిచిపోకముందే సచివాలయంలో నీళ్లు లేవనే వార్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతే కాదు ప్రభుత్వ ఆర్భాటాన్ని కళ్లకు గడుతోంది. విశ్వసనీయవర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌ పైప్‌లైన్‌లో సమస్య తలెత్తింది. ఫలితంగా అన్ని అంతస్తులకు నీటి సరఫరా నిలిచింది. మంత్రులు, ముఖ్య కార్యదర్శుల చాంబర్లకూ.. వాష్‌రూమ్‌ల్లోనూ నీరు రాక ఇబ్బంది ఏర్పడింది. దీంతో అధికారులు, సిబ్బంది బీఆర్‌కే భవన్‌ బాట పట్టారు. ప్యూరిఫయ్యర్లు కూడా పనిచేయడం లేదంటే నిర్మాణ కౌశలాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

నరకం చూశారు

వాస్తవానికి సచివాలయంలో నీటి సరఫరాకు సంబంధించి శుక్రవారం ఉదయం నుంచే సమస్య తలెత్తింది. అయినప్పటికీ సిబ్బంది, అధికారులు పునరుద్ధరించే పనులు చేపట్టలేదు. కొన్ని అంతస్తుల్లో ఉదయం నుంచి, మరికొన్ని అంతస్తుల్లో మధ్యాహ్నం నుంచి సరఫరా పూర్తిగా నిలిచింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. అటు రన్నింగ్‌ వాటర్‌, ఇటు తాగు నీరు లేక సాయంత్రం వరకు అధికారులకు చుక్కలు కన్పించాయి. అసలే ఎండాకాలం కావడంతో దాహార్తికి తట్టుకోలేక సిబ్బంది బయటకు వెళ్లి నీళ్లు కొనుకొచ్చుకున్నారు. వాష్‌ రూమ్‌లకు వెళ్లే వీలూ లేకపోవడంతో బయట ఉన్న శౌచాలయాలకు వెళ్లి అవసరాలు తీర్చుకున్నారు. ఇక నీటి సరఫరా నిలిచిపో వడంతో. తాగునీటి కోసం ఆయా అంతస్తుల్లో ఏర్పాటు చేసిన ప్యూరిఫైడ్‌ పాయింట్లు ఉత్సవ విగ్రహాల్లాగా మారాయి. కొంతమంది దగ్గరలోని బీఆర్కే భవన్‌కు వెళ్లగా మరికొందరు ఇతరచోట్లకు వెళ్లారు.

ఆ వీలు దొరక లేదు

అంతటి సచివాలయానికి వాటర్‌ వర్క్స్‌ బోర్డు నీటిని సరఫరా చేస్తుంది. శుక్రవారం యథావిధిగా అందించామని ఆ సంస్థ సిబ్బంది చెబుతున్నారు. వాస్తవానికి సచివాలయానికి ఒక రోజుకు సరిపడా నీటిని ఉదయమే ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల్లోకి ఎక్కించి నిల్వ చేయాల్సి ఉంటుంది. అయితే, ఉదయం నుంచే సమస్య తలెత్తడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు అవకాశం లేకుండా పోయింది వాటర్‌ వర్క్స్‌ బోర్డు సిబ్బంది చెబుతున్నారు. కాగా, సచివాలయంలో వివిధ విభాగాల్లో పని చేసే అధికారులు, సిబ్బంది, పోలీసులు అంతా కలిపి దా దాపు రెండు వేల మంది ఉంటారు. ఈ భవనం ప్రారంభం నుంచే వీరికి చుక్కలు కన్పిస్తున్నాయి. చాలీచాలని చాంబర్లు, సరైన వసతులు లేక ఇబ్బందులు తలెత్తుతూనే ఉన్నాయి. సచివాలయం ప్రారంభానికి ముందే పిల్లర్ల నుంచి నీరు లీకవడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు రోజంతా నీటి సరఫరా నిలిచిపోవడం పట్ల సిబ్బంది విసుక్కుంటున్నారు. శుక్రవారం వెలుగు చూసిన నీటి సమస్య శనివారం సాయంత్రం నాటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. ఇక, తాగునీటి బాధ్యతను వాటర్‌ వర్క్స్‌ బోర్డుకు అప్పగించినప్పటికీ వివిధ శాఖల్లో సిబ్బంది తలా ఇంత నగదు పోగు చేసుకుని వాటర్‌ బబుల్స్‌(నీటి ట్యాంకులు) తెప్పించుకుంటు న్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Gautam Gambhir Strict Selection Policy

Team India : గంభీర్ లేడు.. టీమిండియా నెంబర్ వన్..

Team India : ఇన్నాళ్లపాటు టీం ఇండియాకు దరిద్రం ఏందో.. శని ఏందో ఇప్పుడు అర్థమైంది. జట్టుకు ఏలినాటి శని లాగా దాపురించిన గంభీర్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి....
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi : బుడ్డోడి కొట్టుడుకి.. బంతి స్టేడియం అవతల.. పెద్ది సినిమా చూపించాడు గా

Vaibhav Suryavanshi :  49 బంతులు.. ఇందులో 8 ఫోర్లు.. నాలుగు సిక్సర్లు.. మొత్తంగా 81 పరుగులు.. అభిషేక్ శర్మతో తొలి వికెట్ కు 20 పరుగులు.. ఇషాన్ కిషన్ తో రెండో వికెట్...
Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Oktelugu Epaper