Hardcore Movies Course: ‘అగ్రరాజ్యం అమెరికా అన్నింట్లోనూ ఎదుగుతోంది.. దూసుకుపోతోంది’ అంటే ఏమో అనుకున్నాం..కానీ బూతులోనే ఇంత ఫాస్ట్ గా ఆలోచిస్తుందని.. మనం మాట్లాడడానికి తటపటాయించే నీలి చిత్రాలను ఏకంగా సబ్జెక్ట్ గా పెట్టి మరీ చూపించేలా ఎదుగుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ అదిప్పుడు చేసి చూపించింది.

సమాజంలో నీలి చిత్రాలు చూడడం అంటే అదొక పెద్ద తప్పుగా భావిస్తారు. మన దేశంలోనే అయితే పోర్నగ్రఫీపై నిషేధం కూడా ఉంది. అది చూస్తుంటే అరెస్ట్ లు కూడా చేస్తారు. కానీ అమెరికాలోని ఓ కాలేజీ మాత్రం ఏకంగా నీలి చిత్రాలపైనే ఓ కోర్సు ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. దారుణం ఏంటంటే.. తరగతి గదిలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పోర్న్ చూడాల్సి ఉంటుంది. ఇంత ఆఫర్ ఇచ్చాక ఇక అత్యాచారాలు, విచ్చలవిడి శృంగారం జరగడం ఖాయం అని సంప్రదాయవాదులు మండిపడుతున్నారు.
పోర్న్ వీక్షించడం వల్లే భారత్ సహా చాలా దేశాల్లో అత్యాచారాలు.. మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆ వెబ్ సైట్లను ప్రభుత్వాలు బ్యాన్ చేస్తుంటాయి. మన దేశంలోనూ చాలా వెబ్ సైట్లపై కేంద్రం నిషేధం విధించింది. కానీ అమెరికాలోని ఈ కాలేజీ యాజమాన్యం మాత్రం మరీ బరితెగించిందనే చెప్పాలి.
అమెరికాలోని ఉటా నగరంలోని వెస్ట్ మినిస్టర్ అనే కాలేజీ ఇంతటి దారుణానికి ఒడిగట్టింది. ఈ కాలేజీ తొలిసారిగా ‘పోర్నోగ్రఫీ’ అనే కోర్సును ఆఫర్ చేయాలని నిర్ణయించింది. ‘ఫిలిమ్ 3000’ అనే ప్రోగ్రామ్ కింద ఈ కోర్సు ఉంటుందని తెలిపింది. ఈ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆ కోర్సులో ఏకంగా మూడు క్రెడిట్ పాయింట్లు కూడా ఇస్తారట..ఈ కోర్సు పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఆ కాలేజీ సెలవివ్వడం విశేషం.

జాతి, క్లాస్, జెండర్ ల సెక్సువలైజేషన్ పై విద్యార్థులు, టీచర్లు చర్చించడానికి వీలుగా ఈ ప్రయోగాత్మక సబ్జెక్ట్ పెట్టామని చెప్పింది. తీవ్రమైన వివాదాస్పద సబ్జెక్ట్ లపై దర్యాప్తు చేయడానికి విద్యార్థులు ఎంచుకోవడానికి ఈ పోర్నోగ్రఫీ ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ పోర్న్ క్లాస్ ను 2022-23 విద్యాసంవత్సరంలోనే కాలేజీ అందిస్తుండడం విశేషం.
ఎంత ఈ పోర్నోగ్రఫీ సబ్జెక్ట్ ను ప్రవేశపెట్టి కాలేజీ యాజమాన్యం వివరణ ఇచ్చినా ఈ విశృంఖలత్వంపై సంప్రదాయవాదులు మండిపడుతున్నారు.ఈ ప్రకటన చేసిన అమెరికా కాలేజీ యాజమాన్యం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒకే తరగతి గదిలో విద్యార్థులు, టీచర్లు కలిసి పోర్నగ్రఫీ చూడడం అనేది అత్యంత దారుణమని.. ఇది విశృంఖల శృంగారాన్ని, అత్యాచారాలకు పురిగొల్పుతుందని తల్లిదండ్రులు, మేధావులు ఆందోళన చెందుతున్నారు.