UP Elections 2022: Caste Politics In Uttar Pradesh : యూపీ ఎన్నికలు కులాల కుంపటిగా మారిపోయాయి. దేశంలోనే అత్యంత పెద్ద రాష్ట్రం.. 80 ఎంపీ సీట్లు.. 403 అసెంబ్లీ సీట్లు ఉన్న అతిపెద్ద రాష్ట్రం. యూపీ ఎన్నికలు కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. అన్ని సిద్ధాంతాలు వాదనలకు కర్మభూమి ఉత్తరప్రదేశ్.. హిందువుల హిందుత్వానికి కర్మభూమి ఉత్తరప్రదేశ్.. రామజన్మభూమి, అయోధ్య రామాలయం, కాశీ విశ్వనాథ ఆలయం, మధుర.. ఇవన్నీ ఉండడంతో హిందువుల ధర్మరాజ్యంగా విలసిల్లింది..

ఓబీసీల్లో చూసుకుంటూ బీహార్ తర్వాత అత్యధికంగా చైతన్యం కలిగి ఉంది ఉత్తరప్రదేశ్ లోనే.. రామ్ మనోహర్ లోహియా, కాన్షీరాం బీసీలు, దళితుల కోసం పోరాడింది యూపీలోనే.. ముస్లింలకు దియోబంధ్ , ఆలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ముస్లింలకు కూడా కార్యభూమి యూపీయే.. జనాభా రీత్యా ముస్లింలు అత్యధికంగా ఉన్నది యూపీలోనే.. అందరికీ కర్మభూమిగా యూపీ నిలుస్తోంది.
ప్రతి రాజకీయ పార్టీ సామాజికసమీకరణాల కోసం కులాల ఆకర్షణ మొదలు పెట్టాయి. బీజేపీకి అగ్రవర్ణాల మద్దతు ఉంది. బ్రాహ్మణులు, వైశ్యులు బీజేపీకి అండగా ఉన్నారు. ఓబీసీల్లోని యాదవులు యూపీలో ఆదిపత్యంగా ఉన్నారు. వారు సమాజ్ వాదీకి సపోర్టుగా ఉన్నారు. ఇక మిగతా ఓబీసీలు పార్టీలుగా విడిపోయారు. కుర్మ సామాజికవర్గం సగం బీజేపీవైపు.. సగం ఆప్నా దళ్ మధ్య విడిపోయారు. నిషాద్ అనే కమ్యూనిటీ యూపీలో 5శాతం వరకూ ఉంటారు. వీరు బీజేపీకి సపోర్టుగా ఉన్నారు.
కమ్యూనిటీల వారీగా విడిపోయిన యూపీలో ఒక్కొక్కరూ ఒక్కో పార్టీకి సపోర్టుగా ఉన్నారు. మెజార్టీ వర్గాలు బీజేపీ వైపు ఉన్నారు. అందుకే ఈ ఎన్నిక సామాజిక కోణంలోనే చూడాలి. యూపీలో బలమైన సామాజికవర్గాలున్న పార్టీలు ఈసారి ఎటువైపు మొగ్గు చూపితే వారిదే అధికారం మరి.. యూపీలో ఈసారి గెలుపు ఎవరిది? అన్న దానిపై ‘రామ్ టాక్’ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
[…] OKtelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించి 3 నెలలైనా ఆయనను మరిచిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. పునీత్ చనిపోయేనాటికి రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అందులో జేమ్స్ ఒకటి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను టెక్నాలజీ సాయంతో పూర్తి చేయగా ఈనెల 11న ఉదయం 11.11 గంటలకు టీజర్ రిలీజ్ చేయనుంది చిత్రయూనిట్. దీంతో పునీత్ అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఆయన చివరి సినిమా ఎలా ఉండబోతోందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]
[…] Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తతం చేస్తోన్న క్రేజీ రీమేక్ ‘గాడ్ ఫాదర్’ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. కరోనా సోకి అలా 10 రోజులు ఐసొలేషన్ లో ఉన్న చిరంజీవి, కరోనా పరీక్షల్లో నెగెటివ్ అని తేలిన తర్వాత బయటకు వచ్చారు. నేరుగా గాడ్ ఫాదర్ షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆన్-లొకేషన్ స్టిల్స్ కూడా షేర్ చేశారు. పైగా ఐయామ్ బ్యాక్ అంటూ మెగాస్టార్ యాక్షన్ లో దిగారు. ప్రస్తుతం ‘గాడ్ ఫాదర్’ టీం షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. […]
[…] Also Read: కులాల కుంపటిలో యూపీ ఎన్నికలు […]