spot_img
HomeతెలంగాణGroup 4 exam Update : గ్రూప్ 4 పరీక్షలోనూ ‘బలగం’ ప్రశ్న.. గూగుల్ మ్యాప్...

Group 4 exam Update : గ్రూప్ 4 పరీక్షలోనూ ‘బలగం’ ప్రశ్న.. గూగుల్ మ్యాప్ తో పరీక్ష మిస్

Group 4 exam Update : తెలంగాణ కానిస్టేబుల్ పరీక్షలో ప్రశ్న ఇచ్చినట్లే.. ఈరోజు జరిగిన TSPSC గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ఒక ప్రశ్న వేశారు. తెలంగాణ సంస్కృతి నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ‘బలగం’ సినిమాకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారు. TSPSC గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ఓ ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 4 పరీక్షను భారీ భద్రత మధ్య శనివారం నిర్వహించారు. ఈ పరీక్షకు దాదాపు 9.5 లక్షల మంది హాజరైనట్లు తెలుస్తోంది. పేపర్ 1 పరీక్ష అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలు తప్ప సజావుగా సాగినట్లు తెలుస్తోంది. కానీ ఈ పరీక్షలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘బలగం’ సినిమాపై ప్రశ్న వేశారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్నాపత్రానికి సంబంధించిన పేపర్ కట్ అసలు ఏం ప్రశ్న వేశారంటే…

-గ్రూప్ 4లో వచ్చిన ప్రశ్న ఏంటంటే..

ఇకపోతే డైరెక్టర్ వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా ఎఫెక్ట్ టీఎస్​పీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షపై పడింది. పేపర్ -1లో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక ప్రశ్నలు రాగా.. ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభించిన ‘బలగం’ చిత్రం నుంచి ఒక ప్రశ్న అడిగారు. ‘బలగం సినిమాకి సంబంధించి కింది జతలలో ఏవి సరైనవి అంటూ.. మూవీ ప్రొడ్యూసర్, డైరెక్టర్, సంగీత దర్శకుడు, కొమరయ్య పాత్ర పేర్లను ప్రస్తావించారు. ఈ ప్రశ్నలు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో “బలగం” చిత్రానికి లభించిన గుర్తింపు.. ప్రాముఖ్యతను సూచిస్తాయి, ఈ చిత్రం ప్రభావం చూపిందని.. ఈ పరీక్షలు నిర్వహిస్తున్న అధికారుల దృష్టిని ఆకర్షించిందని స్పష్టంగా తెలుస్తుంది.

ఇదే విషయాన్ని చిత్ర దర్శకుడు వేణు యెల్దండి తన ట్విట్టర్ ప్రొఫైల్‌లో పంచుకున్నారు.

 

-గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని పరీక్ష మిస్

హైదరాబాద్ చౌటుప్పల్​లోని కృష్ణవేణి పాఠశాల సెంటర్ కోసం గూగుల్​లో లొకేషన్ సెర్చ్​ చేసుకొని పరీక్ష రాసేందుకు వచ్చిన గ్రూప్ 4 అభ్యర్థికి చివరికి నిరాశే మిగిలింది. మ్యాప్ చూపించిన లొకేషన్​కు చేరుకోగా అది సరైన అడ్రస్ కాదని, తప్పు అడ్రస్​ అని తేలింది. ఆఖరి నిముషంలో ఎట్టకేలకు ఆగమేఘాల మీద సరైన చిరునామాకు వెళ్లగా.. నిమిషం ఆలస్యమై పరీక్షను జస్ట్ మిస్ అయ్యారు.

ఖమ్మం జిల్లా కారేపల్లి రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపంతో సికింద్రాబాద్ మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ఇందులో ఉన్నటువంటి గ్రూప్​-4 పరీక్ష రాసే అభ్యర్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి కొందరు.. అదే ట్రైన్​లో టెన్షన్​ వాతావరణంలో మరికొందరు సమీప పరీక్ష కేంద్రాలకు తరలివెళ్లారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Lenin 2 Weeks Collections

Lenin 2 Weeks Collections: ‘లెనిన్’ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు.. టార్గెట్ కి ఆమడదూరం లో...

Lenin 2 Weeks Collections: అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' చూస్తూ ఉండగానే 2 వారాల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ, మొదటి...
Jabardasth Naresh

Jabardasth Naresh: ఆ ఇద్దరు రహస్యాలు మొత్తం నాకు తెలుసు అంటూ పెద్ద బాంబు పేల్చిన జబర్దస్త్ నరేష్..

Jabardasth Naresh: 'జబర్దస్త్' కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కమెడియన్స్ లో ఒకరు నరేష్. చూసేందుకు చాలా చిన్నపిల్లవాడు లాగా కనిపిస్తాడు కానీ , ఇతని వయస్సు పాతికేళ్ల...
Jana Nayagan

Jana Nayagan: ‘జన నాయగన్’ థియేటర్ లో గుండెలు పగిలేలా ఏడ్చిన మహిళ.. వీడియో వైరల్..

Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్.. మ్యాట్నీ షోస్ వరకు వచ్చిన గ్రాస్...

Chennai Love Story: కిరణ్ అబ్బవరం హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'చెన్నై లవ్ స్టోరీ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ప్రీమియర్ షోస్ నుండి బ్లాక్...
Korean Kanakaraju

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...
Oktelugu Epaper