
Bumrah Injury- Chetan Sharma: భారత ఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా గాయం కారణంగా చాలా రోజులుగా భారత జట్టులో ఆడటం లేదు. దీనికి తోడు అతడు వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఫలితంగా సెప్టెంబర్ 2022 నుంచి అతను క్రికెట్ ఆడటం లేదు. ఈ క్రమంలోనే ఆసియా కప్ 2022, టి20 ప్రపంచ కప్ 2022 ఆడలేదు.. గాయం కారణంగా తన ఫిట్నెస్ నిరూపించుకునేందుకు జాతీయ క్రికెట్ అకాడమీలో చేరాడు. గత నెలలో శ్రీలంకతో జరిగిన మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టులోకి బుమ్రా ను తీసుకున్నారు. కానీ అతడి గాయం తగ్గకపోవడం,ఫిట్ నెస్ నిరూపించుకోలేకపోవడంతో జట్టుకు మళ్ళీ దూరమయ్యాడు.
Also Read: Chetan Sharma Sting Operation: ఒక్క స్టింగ్ ఆపరేషన్ టీం ఇండియా పరువును బజారుకి ఈడ్చింది
ఈ గాయం పై ఓ మీడియా న్యూస్ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక స్టింగ్ ఆపరేషన్ లో భారత చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సంచలన విషయం బయటపెట్టాడు. టి20 ప్రపంచ కప్ 2022 కి ముందు స్టార్ బౌలర్ బుమ్రా పూర్తిగా ఫిట్ గా లేడని వ్యాఖ్యానించాడు.. అయినప్పటికీ అతను జట్టుతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లాడని వెల్లడించాడు.. జాతీయ క్రికెట్ అకాడమీలో పూర్తిగా కసరత్తు చేయలేదని వివరించాడు.. టి20 ప్రపంచ కప్ 2022 కు ముందు ఆస్ట్రేలియా తో భారత్ మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడింది. ” అప్పుడు బుమ్రా ఫిట్ గా ఉన్నాడు. అతడిని మూడో మ్యాచ్లో ఆడించాలని ప్లాన్ చేశాం.. అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ రెండవ మ్యాచ్ లోనే ఆడించాలి అనుకున్నారు.. నేను బుమ్రా తో మాట్లాడితే మొదటి మ్యాచ్ ఆడతాను అన్నాడు. రెండవ మ్యాచ్ ఆడు అని చెప్పాను.. సాయంత్రం మమ్మల్ని స్కాన్ కోసం రమ్మని కబురు పంపారు. రెండవ మ్యాచ్ మధ్యలో మళ్లీ స్కాన్ కోసం తీసుకెళ్లబోతున్నామని నాకు సందేశం వచ్చింది” అని చేతన్ వ్యాఖ్యానించాడు.

ఫిట్ నెస్ లేకపోతే క్రికెట్ ఆడటం చాలా కష్టం.. అందులోనూ బుమ్రా లాంటి స్టార్ బౌలర్ ఫిట్ గా లేకున్నా ఆడిస్తే ఇంకా చాలా కష్టం.. అది జట్టు విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అతను కనీసం ఒక సంవత్సరం పాటు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. బుమ్రా కు అయిన గాయం కూడా చాలా పెద్దది. అయితే అప్పుడు టీం మేనేజ్మెంట్ అతడిని 2022 టీ 20 ప్రపంచ కప్ నుంచి తప్పించాలని నిర్ణయించుకుంది. అని చేతన్ కుండ బద్దలు కొట్టారు. ప్రస్తుతం ఫిట్ గా ఉన్న బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టులో జట్టులోకి పునారగమనం చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.. ఇన్నాళ్లు ఫిట్ గా లేని బుమ్రా ఇప్పుడు సడన్ గా ఫిట్ నెస్ సాధించడం పట్ల, ఇంతకుముందు చేతన్ వ్యాఖ్యలు చేయడం పట్ల దుమారం చెలరేగుతున్నది.