Ravi Prakash: త్వరలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా రంగానికి ప్రాధాన్యం పెరిగింది. ఈమేరకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతోపాటు యూట్యూబ్ చానెళ్లు కూడా సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక బులిటెన్స్ ప్రసారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త చానెళ్ల ప్రారంభంపై చర్చ జరుగుతోంది. ఎప్పటి నుంచి ఇదిగో.. అదిగో అంటూ ఊరిస్తున్న రవిప్రకాశ్ కొత్త చానెల్‌పై ఇటు మీడియారంగంలో.. అటు రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
టీవీ9లో రవిప్రకాశ్.. ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలుసు. రవిప్రకాశ్ అంటేనే టీవీ9, టీవీ9 అంటే రవిప్రకాశ్ అనేలా చేశాడు. టీవీ9లో పనిచేసే కాలంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. రవిప్రకాశ్ టీవీ9 ఫౌండర్ సీఈఓగా 24గీ7 న్యూస్ ఛానల్ ను స్థాపించి న్యూస్ ఛానల్ రంగాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. టీæఆర్పీలు అనే పదాన్ని పాపులర్ చేశాడు. దానికోసమే మిగతావారు పాకులాడేలా కూడా చేశాడు. అందుకే రవిప్రకాష్ మీడియాలో అత్యంత విజయవంతమైన వ్యక్తిగా ఎదిగాడు. ఇప్పటికీ తెలుగు న్యూస్ రంగం ఇదే టెంప్లేట్ ను అవలంబిస్తోంది అంటే అది ఎంతటి విజయవంతమైన ఫార్ములానో అర్థం చేసుకోవచ్చు.
మెడలు పట్టి గెంటేసినట్లు..
– అయితే టీవీ9 మానేజ్మెంట్ మారిన తర్వాత రవిప్రకాశ్‌ను మెడలు పట్టి గెంటేసినంత పని చేశారు. అవమానక రీతిలో బయటకు పంపించారు. అలాగే అతను కేసులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రవిప్రకాశ్ ఎప్పటినుండో కొత్త ఛానల్ ప్రారంభించాలి అన్న ఉద్దేశంలో ఉన్న విషయం తెల్సిందే. కేంద్ర ప్రభుత్వం న్యూస్ ఛానెల్‌లకు కొత్త లైసెన్సులను ఇవ్వడం ఆపేసిన కారణంగా, అతను ఇప్పటికే ఉన్న అంత పాపులర్ కాని ‘రాయుడు టీవీ’ ఛానెల్‌ని కొనుగోలు చేసి దాన్ని ఆర్ టీవీగా మార్చి మళ్లీ మార్కెట్ లోకి రావాలని ప్రయత్నాలు చేసాడు. ఆర్టీవీ అంటే రవిప్రకాష్ టీవీ అనే అర్ధం కూడా వస్తుంది కాబట్టి పెర్ఫెక్ట్ ప్లాన్‌గా భావించాడు. ఇక ఛానల్ సాఫ్ట్ రన్‌ను యూట్యూబ్‌లో మొదలుపెట్టాడు. మీడియా వ్యక్తులను రిక్రూట్ చేసుకోవడం కూడా స్టార్ట్ చేశాడు. సరిగ్గా అప్పుడే రిపబ్లిక్ టీవీ వల్ల రవిప్రకాశ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. రిపబ్లిక్ టీవీం ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసును దాఖలు చేసింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.
ఆర్ టీవీపై రిపబ్లిక్ టీవీ వ్యాజ్యం..
రిపబ్లిక్ టీవీ.. ఆర్ టీవీ నుంచి రూ.100 కోట్ల నష్టపరిహారం కోరుతూ కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. దీనికి బదులుగా రవిప్రకాష్ ఆర్టీవీ లోగో 2007 నుంచి వాడుకలో ఉందని 2016లో రిపబ్లిక్ టివి వచ్చిందని కౌంటర్ దాఖలు చేసింది. లోగో వినియోగంపై అత్యవసరంగా స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్ చేసిన మధ్యంతర పిటిషన్‌ను ముంబై హైకోర్టు ఈ వారం ప్రారంభంలో కొట్టివేసింది. ఈ కేసు గొడవల కారణంగా ఆర్టీవీ ప్రారంభం అనేది ఆలస్యమవుతూ వస్తోంది. తాజాగా వినిపిస్తోన్న రూమర్ల ప్రకారం టీవీ9 ఢిల్లీలో తన పలుకుబడిని ఉపయోగించి ఆర్టీవీ లైసెన్స్ లేట్ అయ్యేలా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమస్యలు అన్నీ తొలగి, రవిప్రకాశ్ తాను అనుకున్నట్లు కొత్త ఛానల్ ను వచ్చే ఎన్నికల లోపులో మొదలుపెడతాడేమో చూడాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read More