Maruti Suzuki Wagon R: భారత వాహన తయారీ రంగం దిగ్గజ కంపెనీ మారుతీ సుజుకీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో దశాబ్దాల నుంచి ప్రజలకు సేవలు అందిస్తోంది. దేశంలో ఎన్నో కంపెనీల కార్లు ఉండగా.. ఎక్కువ శాతం మంది మారుతి సుజుకి వ్యాగన్ ఆర్‌నే కొనుగోలు చేస్తుంటారు. మారుతీ సుజుకీ కారు చాలా కుటుంబాల్లో ఒక వ్యక్తిలా మారిపోయింది. 1999 డిసెంబర్ 18న మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కారు మార్కెట్లోకి వచ్చింది. నేటి 25 దశాబ్దాలు పూర్తి చేసుకుంది. అయిన కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు డిమాండ్ తగ్గలేదు. మిగతా కంపెనీల కార్ల డిమాండ్ తగ్గింది.. కానీ వ్యాగన్ ఆర్ కారు డిమాండ్ మాత్రం ఇప్పటికీ తగ్గలేదు. గత 25 ఏళ్ల నుంచి దేశంలో మారుతి సుజుకీ మొత్తం 32 లక్షల వ్యాగన్ ఆర్ కార్లను విక్రయించింది. సుజుకి మోనికర్ అనే బ్రాండ్ పేరుతో భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు కూడా కంపెనీ కార్లను ఎగుమతి చేసింది.
మారుతీ సుజుకీ కార్లకు మొదట్లో నార్మల్ టాక్ వచ్చింది. కానీ ఈ కారు ఫీచర్లు అందరినీ ఆకర్షించాయి. దీంతో ఈ కార్లకు మంచి డిమాండ్ వచ్చింది. మారుతి సుజుకీ వ్యాగన్ కార్లకు క్యాబిన్ ఎక్కువగా ఉండటం, 1.1 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో ఈ కారు టాప్‌లో నిలిచింది. అయితే మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ టాప్ వేరియంట్స్‌తో కొత్త కలర్స్‌లో వస్తున్నాయి. డ్యూయల్-టోన్ కలర్‌తో పాటు అల్లాయ్ వీల్స్‌తో వస్తున్నాయి. ఈ కారుకి దేశంలో చాలా డిమాండ్ ఉంది. మధ్యతరగతి కుటుంబాలకు ఇది చాలా మంచి కారు. అలాగే చిన్న కుటుంబాలు కూడా ఈ కారునే ఎక్కువగా కొనుగోలు చేసేవి. బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి ఫీచర్స్‌తో ఈ కంపెనీ కారు లభ్యం కావడంతో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా తీసుకునేవారు. కొత్త డిజైన్‌లతో ఉండటంతో చాలా తక్కువ కాలంలోనే హ్యాచ్ బ్యాక్ మోడల్‌గా నిలిచింది.
ఈ కారు వచ్చి ఇన్నేళ్లు అయిన డిమాండ్ తగ్గకపోవడానికి ముఖ్య కారణం మధ్య తరగతి కుటుంబాలకు తక్కవ ధరకు లభించడమే. భారత మార్కెట్లో ఈ హ్యాచ్‌బ్యాక్ ధర రూ.5.55 లక్షల నుంచే ప్రారంభం అవుతుంది. ఈ కారు లీటరు పెట్రోల్‌పై దాదాపుగా 23 నుంచి 24 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనికి సీఎన్‌జీ ఆప్షన్ కూడా ఉంది. అలాగే ప్రయాణికుల సేఫ్టీ కోసం ఎయిర్ బ్యాగులు కూడా ఉండటంతో చాలా మంది వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న కూడా ఈ కారు మాత్రం ఇంకా జోరును ప్రదర్శిస్తోంది. సరికొత్త డిజైన్లు, మంచి ఫీచర్లు ఉండటంతో ఇండియాలోని టాప్ కార్లలో ఒకటిగా ఉంటుంది. అందుకే ప్రజలు కూడా ఎక్కువగా ఈ కారు వైపు మక్కువ చూపిస్తున్నారు.