Arunachal Pradesh : ఈరోజుల్లో పురుషుల కంటే మహిళలలే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారు. అప్పట్లో కూడా మహిళలు మద్యం తాగేవారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే. అందులోనూ కొన్ని ఫిల్డ్‌లో ఉండే అమ్మాయిలే ఎక్కువగా సేవిస్తారనే భావనలు ఉండేవి. కానీ ఈరోజుల్లో అయితే అధికశాతం అమ్మాయిలే మద్యం సేవిస్తున్నారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమే. ఈ విషయం తెలిసిన కూడా చాలామంది అమ్మాయిలు తాగుతున్నారు. వర్క్ బిజీ, టెన్షన్‌తో పాటు కుటుంబ సమస్యలను తట్టుకోలేక చాలామంది మద్యం తాగుతున్నారు. ఈ మధ్య అయితే మద్యం తాగడం ఒక కల్చర్ అయిపోయింది. పురుషుల కంటే మహిళలే రోజూ ఎక్కువగా ఆల్కహాల్ సేవిస్తున్నారని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మద్యం ఎక్కువగా తాగితే గుండె ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు కాలేయం కూడా పాడవుతుంది. మహిళలు అయితే సంతాన సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. ఈ విషయాలు అన్ని తెలిసిన కూడా అమ్మాయిలు ఎక్కువగానే మద్యం సేవిస్తున్నారు. అయితే మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తారట. మరి మద్యం సేవించే మహిళలు ఏ రాష్ట్రంలో ఉన్నాయో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.
దేశంలో అరుణాచల్ ప్రదేశ్‌లో ఉండే మహిళలు ఎక్కువగా మద్యం సేవిస్తారట. ఈ రాష్ట్రంలో పురుషులు 53 శాతం మంది మద్యం సేవిస్తే మహిళలు 24 శాతం తాగుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. దేశంలో ఇక్కడ మహిళలకే ఎక్కువ మద్యం సేవించే అలవాటు ఉంది. దీని తర్వాత రెండో స్థానంలో సిక్కిం ఉంది. ఈ రాష్ట్రంలో 16.2 శాతం మంది మహిళలకు మద్యం తాగే అలవాటు ఉందట. ఇక మూడో స్థానంలో అస్సాం ఉంది. 7.3 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. ఇక నాలుగో స్థానంలో తెలంగాణ ఉంది. ఈ రాష్ట్రంలో 6.7 మహిళలు మద్యం తాగుతున్నారు. ఇక ఐదవ స్థానంలో జార్ఖండ్ ఉంది. ఈ రాష్ట్రంలోని 6 శాతం మంది మహిళలు మద్యం తాగుతున్నారు. అండమాన్, నికోబార్ దీవులు ఆరో స్థానంలో ఉన్నాయి. ఇక్కడ మహిళలు 5 శాతం మంది మద్యం తాగుతున్నారు. ఏడవ స్థానంలో ఛత్తీస్‌గఢ్ ఉంది. ఈ రాష్ట్రంలో 4.9 శాతం మంది మహిళలు మద్యం సేవిస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఒత్తిడి, వ్యక్తిగత కారణాల వల్ల మహిళలు మద్యానికి బానిస అవుతున్నారు. వీటిన్నిటి నుంచి విముక్తి కోసం మద్యం సేవిస్తున్నారు. కానీ చివరకు అది ఒక వ్యసనంగా మారుతుంది. మద్యం సేవించిన తర్వాత కొందరు మహిళలు మూడ్‌ను కంట్రోల్‌లో ఉంచుకోలేరు. దీనివల్ల వారు సమస్యలను ఎదుర్కొవలసి వస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళల శారీరక నిర్మాణం వేరేగా ఉంటుంది. మహిళల శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటుంది. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఆల్కహాల్‌ను తొందరగా గ్రహించలేవు. దీంతో మహిళల శరీరంలో మెటబాలిజమ్ తగ్గిపోయి అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.