Elon Musk - Trump
Elon Musk : అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తి కావడంతో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ ట్రంప్ అధికారం చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన కేబినెట్‌లో ఉండే మంత్రులను ఎంపిక చేశారు. విధేకులకు పదవులు అప్పటించారు. ఇక సమర్థద ఆధారంగా వైట్‌హౌస్ కార్యవర్గంలో పదవులతోపాటు పలు కీలక పదవులకు అధికారులను ఎంపిక చేశారు. 2025, జనవరి 20 ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఈ తరుణంలో అధికార మార్పిడికి అమెరికా సిద్ధమవుతోంది. అయితే ఈ క్రమంలో ఆర్థిక ప్రతిష్టంభన తలెత్తింది. క్రిస్మస్ సమయంలో షట్‌డౌన్ ముప్పును తప్పించేందుకు ప్రస్తుత అధ్యక్షుడు జోబైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిని ద్వైపాక్షిక ప్లాన్‌ను కాబోయే అధ్యక్షుడు ట్రంప్ హఠాత్తుగా తిరస్కరించారు. దీనిపై కనీసం చర్చ జరిగేలా చూడాలని స్పీకర్ మైక్ జాన్సన్, రిపబ్లికన్ సభ్యులకు సూచించారు. ఫెడరల్ ప్రభుత్వం వద్ద నిధులు తరిగిపోతున్న వేళ ఈ అనూహ్య పరిణామంతో కార్యకలాపాలు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది.
మస్క్ డైరెక్షన్‌లోనే..
అయితే ట్రంప్ తాజా నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్ ప్రూభుత్వం తీసుకువచ్చిన నిధుల ప్లాన్‌తో ఖర్చులు భారీగా పెరిగాయని మస్క్ భావిస్తున్నారు. ఈమేరకు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 1500 పేజీల బిల్లు మంగళవారం రాత్రి బయటకు రాగానే టెస్లా అధినేత దీనిపై స్పందించారు. దీనిని ఆమోదించకూడదని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ బిల్లుకు మద్దతుగా ఓటువేసే సభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటలకే ట్రంప్ రిపబ్లికన్ నేతలకు అల్టిమేటం జారీ చేశారు.
శుక్రవారం వరకు గడువు..
ప్రభుత్వ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే ఈ ద్రవ్య వినిమయ బిల్లుకు శుక్రవారం నాటికి ఆమోదం లభించాలి. కానీ, ట్రంప్ బుధవారమే ప్రకటన విడుదల చేశారు. రిపబ్లికన్లు చాలా తెలివైనవారు అని పేర్కొన్నారు. ఈ బిల్లును ఆమోదించకూడాదని సూచించారు. దీనిపై చర్చ చేపట్టాల్సిందేనని స్పీకర్ మైక్ జాన్సన్, ఇతర రిపబ్లికన్లకు సూచించారు. దీంతోపాటు డిమాండ్లు కూడా తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. కానీ, మోదం తెలుపకపోవడంతో ప్రతిష్టంభన నెలకొంది.
బిల్లులో ఏముంది..
తాజాగా తెచ్చిన ఆర్థి ప్రణాళికలో హరికేన్ బాధత రాస్ట్రాలు, ఇతర ప్రకృతి విపత్తుల బాధితుల కోసం 100.4 బిలియన్ డాలర్ల విపత్తు సహాయ నిధికింద కేటాయించారు. తాజా పరిణామాలపై డెమొక్రటికణ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించి పోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అలా జరిగితే యావత్ అమెరిక్లు నిత్యం ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Trump rejects bipartisan plan brought by joe biden administration at musks behest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com