ఎరక్కపోయి ఏడాది కిందట ఇరుక్కున్నాడు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్. మీడియా చేతిలో ఉంది కదా అని అప్పటిదాకా ప్రభుత్వాలనే శాసించిన రవిప్రకాష్ అనవసరంగా సీఎం కేసీఆర్ తో పెట్టుకొని తన పతనాన్ని తానే రాసుకున్నాడనే చర్చ మీడియా సర్కిల్స్ లో సాగుతుంటుంది. తెలంగాణ ప్రభుత్వం గద్దెనెక్కగానే ఎమ్మెల్యేల ప్రమాణంపై వ్యంగ్యాస్త్రాలు వేసినందుకు ఏబీఎన్ తోపాటు టీవీ9ను నిషేధించారు కేసీఆర్. ఆ పగను మనసులో పెట్టుకొని ఎన్నడూ స్క్రీన్ మీదకు రాని టీవీ9 రవిప్రకాష్ నాడు తెలంగాణలో బయటపడ్డ ఇంటర్ పరీక్షల లీకేజీపై పెద్ద దుమారం రేపాడు. నాడు విద్యార్థుల తల్లిదండ్రులను హైలెట్ చేసి రచ్చచేయడం గులాబీ వర్గాల్లో ఆగ్రహానికి కారణమైందట.. దీంతో సీఎం కేసీఆర్ కు టార్గెట్ గా మారాడని.. ఆయన ఆడిన ఆటలో టీవీ9 రవిప్రకాష్ అరటిపండుగా మారాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో చెబుతుంటారు.
టీడీపీ నేతల దృష్టిలో ఆంబులెన్సులన్నీ గ్రాఫిక్స్ ?
టీవీ9ను స్థాపించి దాని పెట్టుబడిదారులకు చుక్కలు చూపించి.. ఎవరికీ అమ్మకుండా చేసి.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలనే శాసించేలా ఎదిగిన రవిప్రకాష్.. ఆశ్చర్యకరంగా టీవీ9నుంచే గెంటేసేలా రాజకీయం నడిచిందంటే ఎంతటి బలమైన శక్తులు ఆయన వెంటపడ్డాయో అర్థం చేసుకోవచ్చు. సీఎం కేసీఆరే ఆ శక్తి అని కొందరంటారు.
అయితే ఏడాదిగా స్తబ్ధుగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కేసులో మరో ట్విస్ట్. రవిప్రకాష్ ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసులో తాజాగా కదలిక వచ్చింది.టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. రవిప్రకాష్ తోపాటు మరో ఇద్దరు అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ లో 2018 సెప్టెంబర్ నుంచి 2019 మే వరకు రూ.18 కోట్ల నిధులను అనుమతుల్లేకుండా తీశారని ఆ సంస్థ ప్రతినిధి గతంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 2019 అక్టోబర్ లో కేసు నమోదు కాగా.. ఈడీ ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసింది. అలాగే రవిప్రకాష్ కు సమన్లు ఇచ్చి ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?
ఇన్నాళ్లుగా అందరూ మరిచిపోయిన ఈ కేసులో తాజాగా మరోసారి ఈడీ చేతికి చిక్కారు రవిప్రకాష్. బెయిల్ పై బయట ఉన్న రవిప్రకాష్ అప్పట్లో బీజేపీ పెద్దలను కలిసి ఒక న్యూస్ చానెల్ ఏర్పాటుకు ప్రయత్నించారనే గుసగుసలు వినిపించాయి. కానీ రవిప్రకాష్ టీవీ9 సీఈవో చేసిన ఆధిపత్యం.. పెట్టుబడిదారులను హింసించిన తీరు చూసి బీజేపీ పెద్దలు దగ్గరకే రానీయలేదని ప్రచారం జరిగింది. అయితే తన పరపతితో కేసులను హోల్డ్ లో పెట్టించుకున్నారని.. రవిప్రకాష్ పై ఇక ఈ కేసులు పెద్దగా ఇబ్బంది పెట్టవని అందరూ అనుకున్నారు.
కానీ సడన్ గా ఈడీ కొరఢా ఝలిపించడం చూస్తుంటే రవిప్రకాష్ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయని తెలుస్తోంది. రవిప్రకాష్ తోపాటు నాడు టీవీ9 షేర్లను అక్రమంగా బదలాయించుకున్న వ్యవహారంలో ఫేడ్ అవుట్ అయిన నాటి టాలీవుడ్ హీరో కూడా చిక్కుల్లో పడ్డాడనే చర్చ మొదలైంది.ఆ 18 కోట్ల నిధులను ఇదే ఆ హీరో ద్వారా హవాలా చేశాడు అని అనుకుంటున్నారు. మరి ఈడీ విచారణతో రవిప్రకాష్ ఏమవుతాడన్నది వేచిచూడాలి.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Ed books ex ceo of tv9 ravi prakash under pmla
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com