Game Changer Movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే నెల 10 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ ఈ నెల 21 వ తారీఖు నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. లండన్ లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది కానీ, నార్త్ అమెరికా లో మాత్రం అభిమానులు ఆశించిన స్థాయి రెస్పాన్స్ ని సొంతం చేసుకోలేకపోయింది. 22 వ తేదీ వరకు బుకింగ్స్ ట్రెండ్ ఇలాగే ఉంటుందని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. అందుకు కారణం సినిమాకి క్రేజ్ లేకపోవడం కాదు. హాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘ముఫాసా : ది లయన్ కింగ్’ చిత్రం రేపు విడుదల కాబోతుండడం వల్లే ‘గేమ్ చేంజర్’ బుకింగ్స్ పై ప్రభావం పడుతుంది.
దానికి దీనికి లింక్ ఏంటి..? రెండు సినిమాలకు 20 రోజులకు పైగా గ్యాప్ ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ XD షోస్ షెడ్యూల్ చెయ్యాలంటే కచ్చితంగా ముఫాసా చిత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమాకి మంచి క్రేజ్ ఉంది, క్రేజ్ ఉన్న హాలీవుడ్ చిత్రాలకు థియేట్రికల్ రన్ కనీసం నెల రోజులు ఉంటుంది. అలా నెల రోజులు ఉంటే XD ఫార్మటు స్క్రీన్స్ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కావాల్సినన్ని దొరకవు. అందుకే అక్కడి బయ్యర్స్ ఈ సినిమా ని ఆధారంగా చేసుకొని షోస్ షెడ్యూల్ చేయనున్నారు. డిసెంబర్ 22 నుండి ‘గేమ్ చేంజర్’ చిత్రానికి అదనపు షోస్ షెడ్యూల్ కానున్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి కేవలం 770 షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేసారు. ఈ సంఖ్య ‘పుష్ప 2’, ‘దేవర’ తో పోలిస్తే చాలా తక్కువ.
ఆ రెండు సినిమాలకు అత్యధిక గ్రాస్ రావడానికి ప్రధాన కారణం XD ఫార్మటు స్క్రీన్స్, ఐమాక్స్ స్క్రీన్స్. ‘గేమ్ చేంజర్’ కి ఇప్పటి వరకు కేవలం 25 XD షోస్ ని మాత్రమే షెడ్యూల్ చేసారు. అందుకే గ్రాస్ అభిమానులు ఆశించిన రేంజ్ లో రాలేదు. ఇప్పటి వరకు కేవలం లక్ష 50 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయి. ‘పుష్ప 2’ చిత్రానికి రోజుకి 800 షోస్ ని షెడ్యూల్ చేస్తూ వెళ్లారు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు. కానీ ‘గేమ్ చేంజర్’ చిత్రానికి రోజుకి 50 నుండి 70 షోస్ మాత్రమే షెడ్యూల్ చేస్తున్నారు. ఇది అభిమానులకు చిరాకు రప్పిస్తున్న విషయం. దీనిపై స్పందించిన డిస్ట్రిబ్యూటర్ రెండు రోజుల సమయం ఇస్తే మీరు కోరినన్ని షోస్ ఇప్పిస్తాం అని హామీ ఇచ్చాడు. చూడాలి మరి ఈ చిత్రం ప్రీమియర్స్ ఎంత దూరం వెళ్లి ఆగుతుంది అనేది.