Ravi Prakash- Arnab Goswami: రవి ప్రకాష్ పేరు చెప్తే తెలుగు జర్నలిజం సర్కిల్లో ఎలాంటి మాటలు వినిపిస్తాయో.. హిందీ సర్కిల్లోనూ అర్ణబ్ గోస్వామి పేరు చెబితే అలాంటి మాటలే వినిపిస్తాయి. స్థూలంగా చెప్పాలంటే ఇవి రెండు కూడా తిక్క క్యారెక్టర్లే. టీవీ9 నుంచి బయటికి వచ్చిన తర్వాత తొలి వెలుగు అని, మోజో అని రవి ప్రకాష్ ఏవేవో ప్రయోగాలు చేశాడు. టీవీ9 లో ఉన్నప్పుడు భారత్ వర్ష అని కూడా ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఛానల్ ప్రారంభించాడు. టీవీ9ను మై హోమ్ జూపల్లి రామేశ్వరరావు, మేఘా కృష్ణారెడ్డి స్వాధీనం చేసుకోవడంతో రవిప్రకాష్ ఆటలు ఆగిపోయాయి.. ఏ టీవీ 9లో అయితే ఒక వెలుగు వెలిగాడో.. అక్కడినుంచి అర్ధాంతరంగా బయటికి వచ్చాడు.. ఇప్పుడు ఆర్ టి వి అని ఒకటి ప్రారంభించాడు.. అంతకుముందు ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభిస్తున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ అవి గాలిలో పేలపిండి సామెత లాగానే మారిపోయాయి. ఇక ముందుగానే మనం చెప్పుకున్నట్టు అర్ణబ్ కూడా రవి ప్రకాష్ లాగానే మీడియాలో రకరకాల ప్రయోగాలు చేశాడు. చివరికి తానే రిపబ్లిక్ టీవీ అని ఒక ఛానల్ ప్రారంభించాడు.. ట్యాంపరింగ్ అనే ఆరోపణలకు ముందు రిపబ్లిక్ టీవీ టాప్ వన్ లో ఉండేది. ఎన్డీ టీవీ, ఆజ్ తక్, జీ న్యూస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, న్యూస్ 18 వంటి వాటిని ఈ ఛానెల్ దాటుకుని రావడంతో అప్పట్లో చాలామంది అసూయపడ్డారు. తర్వాత అనుమానపడ్డారు. వారి అనుమానం నిజమైంది..బార్క్ మీటర్లను రిపబ్లిక్ టీవీ మేనేజ్ చేసిందని తేలింది.. ఈ వ్యవహారంలో అర్నబ్ గోస్వామి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.. అయితే ఈ రెండు తిక్క క్యారెక్టర్లు ఇప్పుడు కొట్టుకుంటున్నాయి.
ముందుగానే ప్రస్తావించినట్టు రవి ప్రకాష్ తన పేరు మీదుగా ఆర్ టి వి అనే ఒక ఛానల్ ప్రారంభించాడు. ఇది ఆల్రెడీ యూట్యూబ్లో ప్రసారమవుతోంది. రవి ప్రకాష్ టీవీ9 ఛానల్ ను ఏలుతున్నప్పుడు రోహిత్ అనే ఒక ప్రజెంటర్ ఈయనకు తలలో నాలుకలాగా ఉండేవాడు. రవి ప్రకాష్ వెళ్ళిపోయిన తర్వాత అతడు కూడా 10 టీవీకి వెళ్లిపోయాడు. అక్కడ చాలా రోజులు ఉండలేక బయటికి వచ్చేసాడు.. ఇప్పుడు మళ్లీ రవి ప్రకాష్ క్యాంపులో చేరిపోయాడు.. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆర్ టి వి లోగో తన ఛానల్ లోగోను పోలి ఉందని అర్ణబ్ స్వామి ప్రధాన ఆరోపణ. ఇందులో భాగంగానే రవి ప్రకాష్ మీదకు అగ్గి మీద గుగ్గిలమవుతున్నాడు. ఈ పంచాయతీ ఇంకా సమసి పోలేదు. పంచాయతీ పరిష్కారం కాకుండానే లోగో విషయంలో ఇద్దరి మధ్య కోట్లాటలు జరుగుతున్నాయి. తదుపరి అడుగు ఏమిటో కానీ గోస్వామి రిపబ్లిక్ టీవీ ని చూస్తే ప్రస్తుత టీవీ9 ను మించిపోయింది.. వాటిని చూస్తే రవి ప్రకాష్ మీద కోపంతో అర్ణబ్ గోస్వామి చానల్ ను ఏమాత్రం పట్టించుకోవడంలేదని అర్థమవుతుంది.
బీఫర్జోయ్ తుఫాన్ ప్రస్తుతం గుజరాత్ రాష్ట్రాన్ని వణికిస్తోంది. దీని ప్రభావం వల్ల అరేబియా సముద్రం అల్లకల్లోలంగా మారింది. అయితే ఈ వార్తలను ప్రజెంట్ చేసే సమయంలో రిపబ్లిక్ టీవీ అని నెత్తి మాసిన విధానాన్ని తలకు ఎత్తుకుంది. టీవీ స్టూడియోలో వార్తలు చదువుతున్న యాంకర్ ఒక గొడుగును పట్టుకుని గాలులకు వణికిపోతున్నట్టు కవరింగ్ ఇచ్చింది. ఆమె వెనుక భారీ స్క్రీన్ లో గుజరాత్లో నెలకొన్న తుఫాన్ తాలూకు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యాల కంటే ఈ యాంకర్ చేసే అతి ఎ బెట్టుగా ఉంది. ఆ మధ్య శ్రీదేవి చనిపోయినప్పుడు బాత్రూం టబ్బు లో పడుకొని, హైదరాబాదులో వర్షం కురుస్తున్నప్పుడు రుధిరం అని చదివిన దేవి కంటే ఆ యాంకర్ రెండు ఆకులు ఎక్కువే చదివినట్టు కనిపిస్తోంది.. టీవీ9లో క్రియేటివ్ టీం బయటకు వెళ్లిపోయింది. ఆ ఛానల్ పెద్ద పెద్ద తలకాయల్లో ఎలాంటి వార్తలు ఇస్తున్నామని సోయి లేకుండా పోయింది. మరి రిపబ్లిక్ టీవీ కి ఏం పుట్టింది? అర్ణబ్ గో స్వామి అంత గొంతేసుకుని అరుస్తూ ఉంటాడు కదా? ఆ మాత్రం చానల్ వ్యవహారాలను చూసుకోలేడా? ఎలాంటి వార్తలు ప్రసారం చేస్తున్నారు? ఏ విధంగా ప్రసారం చేస్తున్నారు? అని తెలుసుకోలేని విధంగా మారిపోయాడా? కనీసం ఛానల్ ఔట్ పుట్ ఎడిటర్ ఏం చేస్తున్నట్టు? ఒక ప్రకృతి విపత్తుకు సంబంధించి వార్తను వార్తలాగా ప్రజెంట్ చేయలేరా? దానికి ఈ స్థాయిలో హంగామా అవసరమా? ఏంటో తెలుగు నాట పాత్రికేయులలో క్రియేటివిటీ చనిపోతోంది అనుకుంటే.. అది ఇక్కడ మాత్రమే కాదు హిందీలో కూడా ఉంది అని రిపబ్లిక్ టీవీ నిరూపిస్తోంది. పాపం అర్ణబ్ గోస్వామి!!
Bhaskar is a senior Journalist covers articles on Politics, General and entertainemnt news.
Read More