spot_img
Homeజనరల్ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్.. ఎందుకంటే..?

ఆ ఊరిలో ఆకుకూరలు అమ్ముతున్న సర్పంచ్.. ఎందుకంటే..?

సాధారణంగా ప్రజలు సర్పంచ్ అంటే వాళ్లకు ఎక్కువ ఆదాయం ఉంటుందని భావిస్తారు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఖర్చులు పెరుగుతున్నా చాలా మందికి ఆదాయం పెరగడం లేదు. ఫలితంగా వేల రూపాయలు జీతం వస్తున్నా సర్పంచ్ లు ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోవడం, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో తాజాగా ఒక సర్పంచ్ కూరగాయలు అమ్ముతూ వార్తల్లో నిలిచారు.

Also Read: జుట్టు విరబోసుకుని పూజలు చేస్తున్నారా..?

వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా మహబూబాబాద్‌ జిల్లా రేగడి తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ గుగులోతు లక్ష్మీ రామచంద్రు జీవనోపాధి కోసం కూరగాయలు అమ్ముతున్నారు. తమ కుటుంబానికి ఉన్న భూమిలో ఆకుకూరలను పండిస్తున్న మహిళ ఆ ఆకుకూరలను మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్‌ లో అమ్ముతున్నారు. కూరగాయలను అమ్మడం గురించి సర్పంచ్ ను అడిగితే ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Also Read: ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారా.. ఏ తప్పుకు ఎంత జరిమానా అంటే..?

కూరగాయలను ఎందుకు అమ్ముతున్నారని మహిళను అడిగితే తాను ఊరికి పెద్దనని.. ఊరికి పెద్ద అయినంత మాత్రాన ఉపాధికి ఢోకా ఉండకూడదని నిబంధన లేదు కదా..? అంటూ ఆమె రివర్స్ లో ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి వచ్చే వేతనం వాహనం పెట్రోల్ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని.. మన పని మనం చేసుకోవడంలో తప్పు ఏమిటని మహిళ ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

సర్పంచ్ వేసిన ప్రశ్నలో కూడా నిజం లేకపోలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మహిళా సర్పంచ్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మరి కొందరు ప్రజాప్రతినిధులు కూడా సొంతంగా వ్యవసాయ భూములను సాగు చేసుకుంటూ గతంలో వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
Oktelugu Epaper