Ranveer Singh Naked Photo shoot : దేశంలోనే ప్రముఖ స్టార్ హీరో అయ్యిండి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నం కనిపించి షాకిచ్చాడు. తెరపై విభిన్న పాత్రలు పోషిస్తూ అలరించే అగ్రహీరో రణ్ వీర్ సింగ్.. తెరబయట కూడా అంతే వినూత్నంగా వ్యవహరిస్తుంటాడు. సాధారణంగా హీరోయిన్ బట్టలు విప్పి నగ్నంగా కనిపిస్తే చూడడానికి అందరూ సొల్లు కారుస్తారు. కానీ ఈ హీరో ఏంట్రా బాబూ కండలు తిరిగిన శరీరాన్ని చూపించడానికి మొత్తం బట్టలు విప్పేశాడని అందరూ ముక్కున వేలేసుకుంటున్నాడు.

తాజాగా టాలీవుడ్ కు చెందిన స్టార్ హీరో విజయ్ దేవరకొండ న్యూడ్ ఫొటోతో తన సినిమా ప్రమోషన్స్ ను షురూ చేశాడు. ఇప్పుడు రూట్ లోకి మరో స్టార్ హీరో చేరాడు. అది కూడా బాలీవుడ్ హీరో కావడం గమనార్హం. ఇంతకీ ఆ బాలీవుడ్ హీరో ఎవరో తెలుసా? రణ్ వీర్ సింగ్.

దక్షిణాది ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే కనెక్ట్ అవుతున్న రణ్ వీర్ సింగ్ ఇప్పుడు వినూత్న ప్రచారంతో అందరి మదిని దోచేస్తున్నారు. దీపికా పడుకొణే భర్త కావడం కూడా ప్లస్ అయ్యింది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం ఏకంగా న్యూడ్ షో చేశాడు. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా రణ్ వీర్ సింగ్ లుక్స్, డ్రెస్సింగ్ చాలా డిఫెరెంట్గా ఉంటుంది. ఆయన వెరైటీ దుస్తులతో ఉన్న ఫొటోలు చాలా సార్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. ఈసారి బాలీవుడ్ హీరో మరో అడుగు ముందుకేసి ఏకంగా నగ్న ఫొటో షూట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవలే కపిల్ దేవ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని తీసిన చిత్రం ‘83’లో హీరోగా నటించాడు. త్వరలోనే ‘సర్కస్’ , రాకీ ఔర్ రాణి ప్రేమ్ కహాని చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. శంకర్ దర్శకత్వంలో అపరిచితుడు హిందీ రిమేక్ లోనూ రణ్ వీర్ నటిస్తున్నాడు.