5 state Election Results: 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్ గా భావించే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగానే ఫలితాలు వెలువడుతున్నాయి. ప్రధానంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో బీజేపీ అదికారం నిలబెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా బీజేపీ ఆధిక్యంలో ఉంది. మొత్తం 403 స్థానాల్లో చూస్తే ప్రధాన ప్రత్యర్థి సమాజ్ వాదీ పార్టీ 106 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ ఏకంగా 263 స్థానాల్లో లీడ్ తో దూసుకుపోతోంది. ఇక కాంగ్రెస్ తోపాటు బీఎస్పీ సైతం సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతోంది.

ఇక పంజాబ్ లోని 117 స్థానాల్లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అందరినీ ఊడ్చేస్తోంది. అక్కడ క్లియర్ కట్ మెజార్టీతో అధికారంలోకి రాబోతోంది. మేజిక్ ఫిగర్ దాటి ఆప్ పార్టీ 88 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ 13, బీజేపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సీఎం చన్నీ పోటీచేసిన రెండు స్థానాల్లో వెనుకంజలో ఉంది.
ఇక ఉత్తరాఖండ్ లో మొత్తం 70 సీట్లలో కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ 42, కాంగ్రెస్ 24 , ఇతరులు 4 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
ఇక మణిపూర్ లో 60 స్థానాల్లో సైతం బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. బీజేపీ 23, కాంగ్రెస్ 18, ఎన్పీఎఫ్ 3, ఎన్పీఈపీ 10, ఇతరులు 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ హంగ్ వచ్చే అవకాశాలున్నాయి. చిన్న పార్టీలు కీలకంగా మారాయి.
గోవాలోని మొత్తం 40 సీట్లలో బీజేపీ 16, కాంగ్రెస్19, ఆప్ 1, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కూడా హంగ్ ఖాయంగా కనిపిస్తోంది.





