Homeప్రత్యేకంKarnataka Election Results 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణం అదే

Karnataka Election Results 2023 : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపునకు ప్రధాన కారణం అదే

Karnataka Election Results 2023  : కర్ణాటకలో బిజెపి కావచ్చు, తెలంగాణలో బీఆర్ఎస్ కావచ్చు.. ప్రతిపక్షాలను అణగదొక్కడంలో వాటికి అవే సాటి. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే చేసింది. కాకపోతే కాంగ్రెస్ ప్రతిపక్షంలోకి మారిన తర్వాత ఒకప్పుడు దానివల్ల ఇబ్బంది పడిన పార్టీలు అంతకుమించి అనేలాగా చేశాయి. ఒక దశ వరకు ఇవి బాగున్నప్పటికీ అవి రాను రాను కాస్త శృతిమించడంతో జనాలకు ఏవగింపు కలిగింది. పైగా కర్ణాటకలో అధికార భారతీయ జనతా పార్టీ నాయకులు అతిగా ప్రవర్తించడం, అవినీతి ఆరోపణలు తారాస్థాయికి చేరడంతో జనాల్లో వ్యతిరేకత పెరిగింది.. ఆ వ్యతిరేకతను ఉద్యమాలుగా మలచడంలో కాంగ్రెస్ పార్టీ విజయవంతమైంది. ముఖ్యంగా గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కలిసికట్టుగా పని చేయడమే ఇక్కడ విశేషంగా చెప్పుకోవాలి.

ఇక కర్ణాటకలో బసవరాజు ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలకు ముందు బసవరాజును పదవి నుంచి తొలగిస్తారని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. గుజరాత్ రాష్ట్రం మాదిరే ఇక్కడ కూడా ప్రయోగాలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. టికెట్ విషయంలో కొత్తవారికి అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీ.. ముఖ్యమంత్రి మార్పు విషయంలో అటువంటి కీలక నిర్ణయం తీసుకోలేకపోయింది. దీనికి తోడు ఎన్నికలకు ముందు అక్కడి లోకాయుక్తకు అధికార పార్టీ ఎమ్మెల్యే డబ్బు సంచులతో దొరికిపోవడం భారతీయ జనతా పార్టీని ఇరుకున పెట్టింది. హిజాబ్, అమూల్, కేరళ స్టోరీస్, బజరంగబలి, బజరంగ్ దళ్ వంటి వివాదాలు తెరపైకి వచ్చినప్పటికీ భారతీయ జనతా పార్టీని గెలిపించలేకపోయాయి..

స్థానిక సమస్యలు, అవినీతి ఆరోపణలు బలంగా పనిచేయడం, వాటిని కాంగ్రెస్ నాయకులు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో అక్కడ అధికార మార్పు సాధ్యమైంది. ఇక ఈ తీర్పు ద్వారా కర్ణాటక ఓటర్లు ఈ ప్రభుత్వాన్ని కూడా రెండవసారి ఎన్నుకోరని రుజువు చేశారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాలపై రామ్ గారి సునిశిత విశ్లేషణను పైన వీడియోలో చూడొచ్చు..

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...
Akhil Lenin Movie Release Date

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...
Team India Bowling

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....
TTD Trust Board Meeting

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper