Home Blog Page 93

౩వ పెళ్లి ప్లానింగ్ పై అమీర్ ఖాన్ హాట్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Aamir Khan Third Marriage
Aamir Khan Third Marriage

Aamir Khan Third Marriage: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడవ పెళ్ళికి అన్ని విధాలుగా సిద్ధమైనట్టు బాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. గత కొంతకాలం గా ఆయన గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఈ పెళ్లి గురించి రీసెంట్ గా అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘మా పెళ్లి చాలా సాధారణంగానే ఉంటుంది. మీరు ఊహించుకుంటున్నట్టు హంగులు ఆర్భాటలు ఏమి లేవు. మేము రిజిస్టర్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఆత్యంత ఆప్త మిత్రులు , సన్నిహితుల సమక్షం లో మేమిద్దరం సింపుల్ గా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నాయి.

కొడుకులకు , కూతుర్లకు పెళ్లిళ్లు చేసి , వాళ్ళ మనవళ్లతో ఆదుకోవాల్సిన వయస్సులో పెళ్లేంటి?, అమీర్ ఖాన్ కి పిచ్చి పరాకాష్ట కి చేరింది అంటూ ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. అభిమానులు కూడా ఈ విషయం లో అమీర్ ఖాన్ ని వెనకేసుకొని రాలేకపోతున్నారు. ఇకపోతే జులై 5 న వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా లో ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత అని మీడియా అమీర్ ఖాన్ ని అడగ్గా, అది నిజమేంనని ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆయన అమెరికా లో ఉన్నాడట, ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ఈ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు అమీర్ ఖాన్.

తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా అమీర్ ఖాన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ వెల్లడించారు. సుమారుగా ఆమెతో ఏడాదిన్నర నుండి డేటింగ్ లో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈమెని మీడియా కి పరిచయం చేస్తూ , తనకు మొదటి నుండి ఈమె ఎంతో మద్దతు ఇస్తూ అన్ని విషయాల్లో తోడుండని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. ఇకపొత్ రీసెంట్ గానే అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి , కారులో ప్రయాణించడం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ కారులో తన కాబోయే భార్య సంధ్య కూడా ఉండడం గమనార్హం.

'కుకూ విత్ జాతిరత్నాలు 2' నుండి అప్పుడే ఇద్దరు వైల్డ్ కంటెస్టెంట్స్ అవుట్..వాళ్ళు ఎవరంటే..

Cooku With Jathiratnalu 2
Cooku With Jathiratnalu 2

Cooku With Jathiratnalu 2: స్టార్ మా ఛానల్ లో ప్రతి శని , ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ ప్రోగ్రాం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది ఇదే. ఇప్పటికే ఈ షో నుండి శ్రీకాంత్ అయ్యంగార్, కళ్యాణ్ పడాల , పల్లవి రామస్వామి , తేజస్విని గౌడ వంటి వారు ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళ ఎలిమినేషన్ తర్వాత నేడు జరగబోయే ఎపిసోడ్ లో నలుగురు కుక్స్ వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. వాళ్ళు ఎవరంటే కృత్తిక ఉమా శంకర్ (పొదరిల్లు హీరోయిన్), శ్రవణ్ కుమార్ (మగువా ఓ మగువా హీరో), పునర్వవి భూపాళం(బిగ్ బాస్ 3 కంటెస్టెంట్), సుమిత్ (సీనియర్ సీరియల్ ఆర్టిస్ట్) ఎంట్రీ ఇచ్చారు.

ఈ వారం ఎన్నడూ లేని విధంగా ఇద్దరు కుక్స్ కలిసి వంట చేసే టాస్క్ ఇచ్చారు జడ్జీలు. ఈ వారం మినీ లాంచ్ ఈవెంట్ లెక్కలోకి వస్తుంది కాబట్టి, ఈ వారం స్కోర్స్ లెక్కల్లోకి రాదు. వచ్చే రెండు వారాల్లో వచ్చే స్కోర్స్ ఆధారంగానే ఎలిమినేషన్స్ ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ కి సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి అయ్యాయి. ముందుగా సుమిత్ అనే కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యాడట. ఇక ఆ తర్వాత వారాలకు సంబంధించిన ఎపిసోడ్స్ లో అతి తక్కువ మార్కులు డిమోన్ పవన్ మరియు శ్రవణ్ కుమార్ లకు వచ్చిందట. వీళ్లిద్దరి మధ్య జరిగిన ‘కుక్ ఆఫ్’ రౌండ్ లో డిమాం పవన్ గెలవగా, శ్రవణ్ కుమార్ ఓటమి పాలై ఎలిమినేట్ అయ్యారు. అలా నేడు ఎంట్రీ ఇచ్చిన నలుగురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇక చివర్లో మిగిలేది ఎవరో చూడాలి.

ఇకపోతే ఈరోజు , రేపు ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్స్ లో తనూజ కనిపించకపోయేసరికి , ఆమె ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. తనూజ ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో బిజీ గా ఉంది. ఆ కారణం చేత ఆమె ఈ ఎపిసోడ్స్ లో పాల్గొనలేకపోయిందని , తదుపరి వారం లో జరగబోయే ఎపిసోడ్స్ లో ఆమె కచ్చితంగా కనిపిస్తుందని , అందుకు సంబంధించిన షూటింగ్స్ కూడా పూర్తి అయ్యాయని సమాచారం. అదే విధంగా వచ్చే వారం జాతి రత్నాలు క్యాటగిరీ lo నూకరాజు ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చూడాలి మరి , ఈయన ఏ రేంజ్ సందడి చేయబోతున్నాడు అనేది.

సీఎం విజయ్ పుట్టినరోజు.. తమిళనాడు ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్..

CM Vijay
CM Vijay

CM Vijay Birthday: ఈ నెల 21 న తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు. ప్రతీ ఏడాది లాగానే , ఈ ఏడాది కూడా ఆయన పుట్టినరోజు వేడుకలను అభిమానులు ఒక పండుగ లాగా జరపబోతున్నారు. ఈ పుట్టిన రోజు విజయ్ ఫ్యాన్స్ కి ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళు తమ ఆరాధ్య దైవాన్ని వెండితెర పై హీరోగానే చూసుకొని , పుట్టినరోజు వేడుకలను జరిపించారు , కానీ మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి గా చూస్తూ తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను జరపబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సేవ కార్యక్రమాలు , కేక్ కట్టింగ్స్ , సంబరాలకు సిద్ధమయ్యారు ఫ్యాన్స్. మరోపక్క ఆయన కెరీర్ లో మైలు రాళ్లుగా నిల్చిన సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తున్నారు. జూన్ 21 న విజయ్ ఫ్యాన్స్ జరుపుకునే పుట్టినరోజు వేడుకలు హిస్టరీ లో ఎప్పటికీ మాట్లాడుకునేలా ఉండబోతున్నాయి.

ఇది కాసేపు పక్కన పెడితే తమిళనాడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి విజయ్ పుట్టిన రోజు సందర్భంగా బంపర్ ఆఫర్ ని ప్రకటించాడు. వందలూరు లోని అర్జిగ్నర్ అన్నా జంతుప్రదర్శనశాల, సేలం జిల్లాలోని కురంబపట్టి జంతుప్రదర్శనశాలలో ఈ సౌకర్యం అనుబాటులో ఉంటుందని రంజిత్ కుమార్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అయితే ఉచిత ప్రవేశం ఉండాలంటే మాత్రం , ముందుగా ఆన్లైన్ లో తమ పేరుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్ ద్వారానే టిక్కెట్స్ ని తీసుకోవాలని , ఆ టిక్కెట్స్ డబ్బు మొత్తాన్ని నా కుటుంబ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వానికి తిరిగి చెల్లిసానని రంజిత్ కుమార్ ప్రకటించారు. దీనిని బట్టీ ఆయనకు తన నాయకుడు , సీఎం విజయ్ పై ఏ రేంజ్ ప్రేమాభిమానాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇలా ఉచిత ప్రవేశం కారణంగా రద్దీ భారీ గా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

వందలూరు జంతు ప్రదర్శనశాలకు సాధారణంగానే జనాలు భారీ సంఖ్యలో వస్తుంటారు. రోజుకి 15 వేలమంది వస్తారని అంచనా. అలాంటిది ఇప్పుడు ఉచితంగా ఎంట్రీ కల్పిస్తామని అంటున్నారు, అలా జరిగితే 50 వేల నుండి లక్ష వరకు సందర్శకులు ఈ జంతు ప్రదర్శన శాలకు వచ్చే అవకాశం ఉంటుందని , అలా జరిగితే అక్కడ ఉండే జంతువుల సంక్షేమం, ప్రజల భద్రతా పై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ , కేవలం 50 వేల టిక్కెట్స్ మాత్రమే ఆన్లైన్ ద్వారా ఉచితంగా అందిస్తామని , కౌంటర్ల వద్ద టిక్కెట్ల పంపిణి నియంత్రిస్తామని చెప్పుకొచ్చారు.

పిఠాపురంలో డైరెక్టర్ బుచ్చి బాబు ని చుట్టుముట్టిన పవన్ ఫ్యాన్స్.. వీడియో వైరల్..

Buchi Babu
Buchi Babu

Buchi Babu: రీసెంట్ గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘పెద్ది’ మూవీ సృష్టించిన వసూళ్ల సునామీ ఎలాంటిదో మనమంతా కళ్లారా చూశాము. మిగతా సినిమాలకు కలిసొచ్చినట్టు , ఈ చిత్రానికి ఒక్క పండుగ , పబ్బం కూడా కలిసి రాలేదు , అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం రాబట్టిన వసూళ్లను చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. రామ్ చరణ్ సినిమాకు పబ్లిక్ లో టాక్ ఉంటే, లాంగ్ రన్ ఎప్పుడు మొదలై , ఎప్పుడు ఆగుతుందో ఎవ్వరూ చెప్పలేరని, అందుకు లేటెస్ట్ ఉదాహరణ ‘పెద్ది’ నే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్స్. ఇప్పటికీ ఈ చిత్రం అనేక ప్రాంతాల్లో హౌస్ ఫుల్స్ ని నమోదు చేసుకుంటూ ముందుకెళ్తోంది. ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ సునామీ ని చూసి ఎన్ని రోజులైందో. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బుచ్చి బాబు నేడు ఇండస్ట్రీ లో వేరే లెవెల్ కి వెళ్లిపోయాడని చెప్పొచ్చు.

అయితే ఎంత ఎత్తుకి ఎదిగిన ఒదిగి ఉండాలంటే మనస్తత్వం బుచ్చి బాబు సొంతం. ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టినప్పటికీ కూడా ఆయన ముఖం ఇసుమంత గర్వం , అహంకారం కూడా లేదు. ఎప్పటి లాగానే ఒక సాధారణ మనిషిగా పిఠాపురం కి నేడు చేరుకున్నాడు. పిఠాపురం లోకి బుచ్చి బాబు అడుగుపెట్టిన వెంటనే పవన్ కళ్యాణ్ మరియు మెగా అభిమానులు ఆయన్ని ఎంతో గ్రాండ్ గా ఆహ్వానించారు. మా ఊరికి చెందిన కుర్రాడు , మా అభిమాన హీరోతో దేశం గర్వించదగ్గ సినిమా తీసాడు అనే గర్వం , బుచ్చి బాబు తో పిఠాపురం వాసులు ఫోటోలు దిగుతున్నప్పుడు వారి ముఖాల్లో స్పష్టంగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. సినీ ఇండస్ట్రీ లో స్థిరపడినప్పటికీ , బుచ్చి బాబు కుటుంబం పిఠాపురం లోనే నివసిస్తున్నారు.

ఆయన భార్య పిల్లలు కూడా పిఠాపురం లోనే ఉంటున్నారు. ‘ఉప్పెన’ సినిమా పూర్తి అయిన వెంటనే పిఠాపురం కి వెళ్లిన బుచ్చి బాబు , పాదగయ గుడిలో ‘పెద్ది’ సినిమా స్క్రిప్ట్ రాయడం మొదలు పెట్టానని రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఇప్పుడు తన మూడవ సినిమా స్క్రిప్ట్ ని కూడా అదే పాదగయ గుడిలో రాయబోతున్నాడా ?, ఆయన తదుపరి చిత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఉంటుందని అంటున్నారు , అందులో ఎంతవరకు నిజముంది ? , ఇలాంటి విషయాలకు సమాదానాలు దొరకాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.

చంచల్ గూడ జైలుకు ప్రభాస్..నాంపల్లి హై కోర్టుకు అల్లు అర్జున్.. అసలు ఏమి జరుగుతోంది..

Prabhas And Allu Arjun
Prabhas And Allu Arjun

Prabhas And Allu Arjun: ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ గా పిలవబడే ప్రభాస్, అల్లు అర్జున్ లకు పాపం ఎంత కష్టమొచ్చింది, ఒకరేమో చంచల్ గూడ జైలుకి వెళ్తున్నారు , మరొకరు నాంపల్లి హైకోర్టు కి వెళ్తున్నారు. ఇలాంటి అరుదైన పరిస్థితి ఎప్పుడూ రాలేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ అంటే , సోమవారం రోజున సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన విచారణ కోసం నాంపల్లి హై కోర్టు కి వెళ్తున్నాడు. మరి ప్రభాస్ కి ఏమైంది?, ఆయన ఎందుకు చంచల్ గూడ జైలుకు వెళ్తున్నాడు?, అసలు ఏమి జరుగుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రభాస్ చంచల్ గూడ జైలుకు వెళ్తున్నది నిజ జీవితం లో నేరం చేసి కాదు, ‘స్పిరిట్’ మూవీ షూటింగ్ కోసం.

సందీప్ వంగ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమాలో హైలైట్ గా నిలిచే జైలు సన్నివేశాలను రేపటి నుండి తెరకెక్కించబోతున్నారు. సుమారుగా వారం రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ , ప్రకాష్ రాజ్ మరియు ఇతర తారాగణం పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారు. గత ఏడాది ప్రభాస్ పుట్టినరోజు నాడు, సందీప్ వంగ ఒక ఆడియో టీజర్ ని విడుదల చేశారు గుర్తుందా?, అందులో జైలు సీక్వెన్స్ కి సంబంధించిన సంభాషణలే ఉంటాయి. చివర్లో ప్రభాస్ నాకు ఒక ‘బ్యాడ్ హ్యాబిట్’ ఉంటూ అంటూ చెప్పే డైలాగ్ సెన్సేషన్ అయ్యింది. ఆడియో వింటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి, ఇక సినిమాలో సందీప్ వంగ టేకింగ్ ఈ సన్నివేశాల్లో ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. మార్చి 7, 2027 న యాక్షన్ మూవీ లవర్స్ కి థియేటర్స్ లో మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతుంది ‘స్పిరిట్’ చిత్రం.

ఇక అల్లు అర్జున్ నాంపల్లి హైకోర్టు విచారణ విషయానికి వస్తే , సోమవారం రోజున కచ్చితంగా కోర్టుకి రావాల్సిందిగా హై కోర్టు ఆయనకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్న అల్లు అర్జున్ , తాను రావడం కుదరదని , దానికి బదులుగా ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ రూపం లో కోర్టుకి హాజరయ్యే వెసులుబాటు కల్పించాలని అల్లు అర్జున్ కోరారు. అయితే ఆయన రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసిన హై కోర్టు , కచ్చితంగా రావాల్సిందేనని చెప్పడంతో , అల్లు అర్జున్ ఈ సోమవారం రోజున హై కోర్టుకి రాబోతున్నాడు.

ఆ విషయంలో బాలయ్యను పొగుడుతున్న కొరటాల... మెగా అభిమానులకు కోపం వస్తుందా..?

Balakrishna
Balakrishna

Balakrishna: కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య బాబు హీరోగా ఒక సినిమా రూపొందుతుంది. ఈ సినిమా విషయంలో కొరటాల శివ స్క్రిప్ట్ ను చాలా పకడ్బందీగా రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే బాలయ్య బాబుకు కూడా వినిపించాడట. తను రాసుకున్న కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయమని బాలయ్య కొరటాలకు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక స్క్రిప్ట్ విషయంలో బాలయ్య కొరటాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఆయన స్క్రీన్ ప్లే మీద కూడా చాలా కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాన్ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నారట. కొరటాల ఇంతకు ముందు చిరంజీవి ని సైతం డైరెక్ట్ చేశాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో కొరటాల శివ డీలా పడిపోయాడు. ఇక ఇప్పుడు బాలయ్య బాబు ఇస్తున్న ఫ్రీడమ్ ను చూసిన కొరటాల తన సన్నిహితులు దగ్గర చిరంజీవి కంటే బాలయ్య బాబు కొన్ని విషయాల్లో బెటర్ అని చెబుతున్నారట. కారణమేంటంటే చిరంజీవి ప్రతి సీన్ ను వింటూ ఉంటాడు.

అలాగే డైలాగ్ వెర్షన్ పూర్తి అయిన తర్వాత కూడా ఆయన ప్రతి డైలాగులు వింటూ ఉంటాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో తనకు నచ్చినట్టుగా సన్నివేశాలను మార్పులు చేర్పులు చేయమని కూడా చెబుతూ ఉంటారట.

దీనివల్ల దర్శకులకు కొంతవరకు వాళ్ల క్రియేటివ్ లెవెల్స్ పడిపోయే ప్రమాదం ఉందని దానివల్ల హీరోలు చెప్పినట్టుగా కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని కూడా చాలామంది దర్శకులు గతంలో వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేశారు. కానీ బాలయ్య బాబు మాత్రం అలా కాదట దర్శకుడు ఏది రాసుకుంటే దానిని బ్లైండ్ గా నమ్మేసి ఆ పాత్రలోకి పరకాల ప్రవేశం చేసి మరి నటిస్తూ ఉంటాడు.

అతను డైలాగుల గురించి గానీ సీన్ల గురించి గానీ అసలు పట్టించుకోడని దర్శకుడికి పూర్తి స్వేచ్ఛను ఇస్తాడని మరి కొంతమంది చెబుతుండటం విశేషం…ఇక కొరటప నుంచి ఈ మాటలు వస్తున్నాయని తెలుసుకున్న మెగా అభిమానులకు మాత్రం ఆయన మీద విపరీతమైన కోపంతో ఉన్నారట. ఎందుకంటే అతను చిరంజీవిని ఉద్దేశించే గతంలో కూడా కొన్ని కామెంట్లు చేశాడు…

వాళ్ళు నాపై చేసిన బాధాకరమైన సంఘటనలు మర్చిపోవాలని అనుకుంటున్నాను - శోభిత ధూళిపాళ్ల

Shobhita Dhulipala
Shobhita Dhulipala

Shobhita Dhulipala: కెరీర్ లో హీరోయిన్ గా పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయం లోనే అక్కినేని నాగ చైతన్య ని పెళ్ళాడి శోభిత ధూళిపాళ్ల నేషనల్ వైడ్ గా ఎంతటి హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాగ చైతన్య కి అప్పటికే సమంత తో విడాకులు జరిగింది. ఈమెని పెళ్లి చేసుకోవడం తో , కేవలం ఈమె కారణం వల్లే, నాగ చైతన్య సమంత విడిపోయారంటూ శోభిత పై సోషల్ మీడియా లో టార్గెట్ చేస్తూ పెద్ద ఎత్తున నెగెటివ్ కామెంట్స్ చేశారు ఒక సెక్షన్ కి సంబంధించిన నెటిజెన్స్. ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఏ చిన్న పోస్ట్ పెట్టినా ఆ సెక్షన్ నెటిజెన్స్ నెగెటివ్ కామెంట్స్ తో నింపేసేవారు. ఇది నిజంగా చాలా శోచనీయమైన సంఘటన అని చెప్పొచ్చు. తనపై ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న నెటిజెన్స్ పై అనేక సార్లు శోభిత స్పందిస్తూ విచారం వ్యక్తం చేసింది.

రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఆమె దీన్ని ఉద్దేశిస్తూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముందుగా యాంకర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు మీ జీవితం లో ఏ విషయాన్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు’ అని అడగ్గా, అందుకు శోభిత సమాధానం చెప్తూ ‘నిన్నటి వరకు నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మర్చిపోవాలని అనుకుంటున్నాను. సాధారణంగా మతిమరుపుని జనాలు ఒక జబ్బు గా భావిస్తుంటారు. కానీ నా దృష్టిలో మతిమరుపు కొన్ని సందర్భాల్లో చాలా మంచిది. ఎందుకంటే ఇతరులు మనకు చేసిన బాధాకరమైన సంఘటనలు , చేదు జ్ఞాపకాలు మనల్ని మానసికంగా కృంగదీస్తాయి. వాటిని మనసులో పెట్టుకొని ముందుకు వెళ్తే జీవితం లో ఏది సాధించలేం. అందుకే మతిమరుపు కొన్ని సందర్భాల్లో వరం లాంటిది, నిన్నటి గురించి ఆలోచించకుండా, కేవలం భవిష్యత్తు గురించి మాత్రమే నేను ఆలోచిస్తాను’ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది శోభిత ధూళిపాళ్ల.

ఇకపోతే నాగ చైతన్య తో పెళ్లి తర్వాత కొన్ని రోజులు సినిమాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చిన శోభిత , ఇప్పుడు వరుస సినిమాలు , వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీ గా మారిపోయింది. రీసెంట్ గానే చీకట్లో అనే అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించిన శోభిత , ఇప్పుడు ప్రముఖ దర్శకుడు పీఏ రంజిత్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘వేట్టువం’ లో హీరోయిన్ గా నటిస్తోంది. శరవేగంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు జరుగుతుండగా , మరికొన్ని కథలు , వెబ్ సిరీస్ లకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

'బాహుబలి : ది ఎపిక్' వసూళ్లను దాటేసిన 'హ్యాపీ' రీ రిలీజ్.. ఇప్పటి వరకు ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Happy Re Release Collections
Happy Re Release Collections

Happy Re Release Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్రాండ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లో రాజమౌళి ని మించిన బ్రాండ్ ఇమేజ్ అనుకోవచ్చా?, ఆయనకు దరిదాపుల్లో మరో పాన్ ఇండియన్ స్టార్ హీరో లేరు అనుకోవడం లో ఎలాంటి సందేహం లేదా?, అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఆయన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో చూస్తారు , హిందీ లో చూస్తారు , ముఖ్యంగా కేరళలో అయితే ఎగబడి మరీ చూస్తారు. ఇప్పుడు తమిళ మార్కెట్ మీద ఫోకస్ చేస్తూ , అక్కడి స్టార్ డైరెక్టర్స్ అట్లీ , లోకేష్ కనకరాజ్ లతో సినిమాలు చేస్తున్నాడు, కాబట్టి భవిష్యత్తులో తమిళనాడు లో కూడా అల్లు అర్జున్ మేనియా కనిపించబోతుంది , ఇక కర్ణాటక లో మొదటి నుండి ఆయనకు ఎలాగో విపరీతమైన క్రేజ్ ఉంది , ఓవరాల్ గా ఇండియా లోనే పర్ఫెక్ట్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

అందుకు ఉదాహరణ గా రీసెంట్ గా మలయాళం లో విడుదలైన ‘హ్యాపీ ‘ రీ రిలీజ్ ని చూపిస్తున్నారు. ఈ చిత్రం ద్వారానే 14 ఏళ్ళ క్రితం అల్లు అర్జున్ కి కేరళ లో మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమా అప్పట్లో కేరళలో ఒక సెన్సేషన్. అదే చిత్రాన్ని ఇప్పుడు మరోసారి రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇది కేరళలో ‘బాహుబలి : ది ఎపిక్’ వసూళ్లను దాటి, ఆల్ టైం హైయెస్ట్ నాన్ మలయాళం ఇండియన్ రీ రిలీజ్ మూవీ గా సరికొత్త చరిత్ర సృష్టించింది. అదే విధంగా మలయాళం రీ రిలీజ్ లలో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన టాప్ 10 సినిమాలలో , టాప్ 8 చిత్రం గా నిల్చింది. ఇప్పటికీ థియేట్రికల్ రన్ ఆగలేదు , కొనసాగుతూనే ఉంది.

ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి ఇప్పటి వరకు 93 వేల టిక్కెట్లు అమ్ముడుపోయాయి అట. రోజు వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి చూస్తే , ప్రీమియర్స్ + మొదటి రోజు నుండి 29 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, 2వ రోజు 25 లక్షలు , 3వ రోజు 31 లక్షలు , 4వ రోజున 15 లక్షలు , 5వ రోజున 17 లక్షలు , 6వ రోజున 14 లక్షలు , 7వ రోజున 10 లక్షలు , 8 వ రోజున 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా 8 రోజుల్లో ఈ చిత్రానికి 1 కోటి 45 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు , రేపు వీకెండ్ కావడంతో చెరో 10 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు అదనంగా వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

27 ఏళ్ళ నుండి ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదంటూ హీరోయిన్ జ్యోతిక ఎమోషనల్ కామెంట్స్..

Jyotika Emotional Comments
Jyotika Emotional Comments

Jyotika Emotional Comments: సౌత్ ఇండియా లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ , ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కి సతీమణి , అయినప్పటికీ జ్యోతిక రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో గత 27 ఏళ్లుగా తనకు ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదంటూ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. జ్యోతిక కి సినిమా అవకాశాలు రాకాపోవడం ఏంటి?, సౌత్ లో పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదిగింది, పెళ్లి తర్వాత రీసెంట్ గానే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది కదా, మరి నాకు అవకాశాలు రావడం లేదని ఆమె ఎలా చెప్తుందని మీరు అనుకోవచ్చు. ఆమె చెప్తుంది మన సౌత్ ఇండియా గురించి కాదు , బాలీవుడ్ గురించి. అక్కడ ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదట.

ఆమె మాట్లాడుతూ ‘నా 27 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రస్థానం లో బాలీవుడ్ నుండి ఒక్క సినిమా ఆఫర్ కూడా రాలేదు. సౌత్ లో పెద్ద స్టార్ స్టేటస్ ని సంపాదించుకొని , పీక్ రేంజ్ చూస్తున్నప్పుడు కూడా బాలీవుడ్ నన్ను సంప్రదించలేదు. కానీ రీసెంట్ గా నేను ముంబై కి మకాం మార్చినప్పటి నుండి నాకు బాలీవుడ్ లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. నాకు హిందీ సినిమాల్లో కానీ , వెబ్ సిరీస్ లో కానీ నటించాలనే ఉద్దేశ్యం లేదు, అందుకోసం నేను ముంబై లోకి అడుగుపెట్టలేదు. కేవలం నా పిల్లల చదువు , భవిష్యత్తు కోసం , అదే విధంగా ముంబై లో ఉంటున్న నా అమ్మానాన్న కోసమే నేను ముంబై కి షిఫ్ట్ అయ్యాను. కానీ అనుకోకుండా బాలీవుడ్ నుండి ఇప్పుడు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఒకప్పుడు రానటువంటి అవకాశాలు ఇప్పుడు రావడానికి ముఖ్య కారణం, కోలీవుడ్ , బాలీవుడ్ , టాలీవుడ్ అనే సరిహద్దులు చిరిగిపోవడం వల్లే’ అంటూ జ్యోతిక చెప్పుకొచ్చింది.

ఇలా సినీ ఇండస్ట్రీలు మొత్తం కలిసి , ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా మారడం వల్లే ఇప్పుడు నాకు వరుసగా అవకాశాలు వస్తున్నాయని జ్యోతిక ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. రీసెంట్ గానే ఆమె ‘సిస్టం’ అనే అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ మూవీ లో కీలక పాత్ర పోషించింది . మే 22 న విడుదలైన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. జ్యోతిక తో పాటు సోనాక్షి సిన్హా కూడా ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదు. తన భర్త సూర్య లేటెస్ట్ చిత్రం ‘కరుప్పు’ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది.

టీవీకే విజయ్ మాస్టర్ స్ట్రోక్.. స్టాలిన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడింది..

TVK Vijay Master Stroke
TVK Vijay Master Stroke

TVK Vijay Master Stroke: “అతడికి అనుభవం లేదు. సినిమా కథానాయకుడు. రంగులు పూసుకొని మొన్నటిదాకా తెరమీద కనిపించాడు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలను అర్థం చేసుకోగలుగుతాడా.. తమిళనాడు ప్రజలకు అర్థవంతమైన పరిపాలన అందించగలుగుతాడా.. అతడికి ఆ స్థాయి ఉందా.. ఓటు వేసే ముందు తమిళ ప్రజలు ఆలోచించుకోవాలి” ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ప్రచారంలో డీఎంకే అధినేత స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఇవి.

వాస్తవానికి తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ని అటు డీఎంకే గాని.. ఇటు అన్న డీఎంకే గాని ఏ మాత్రం పట్టించుకోలేదు. తామే ప్రత్యర్ధులం అన్నట్టుగా రెండు పార్టీలు వ్యవహరించాయి. ఒక పార్టీ మీద మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకున్నాయి. తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నాయి. కానీ విజయ్ ని ఒక పోటీ దారుగా కూడా చూడలేదు. కానీ విజయ్ చేయాల్సింది మొత్తం చేసేసాడు. చాప కింద నీరు లాగా విస్తరించి తమిళనాడు రాజకీయాలలో సరికొత్త ధ్రువతారగా ఆవిర్భవించాడు.

విజయ్ కి రాజకీయ అనుభవం లేదని స్టాలిన్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలు నిజం కాదని.. తాను అంతకుమించిన అనుభవశాలి అని నిరూపించాడు విజయ్. ఇప్పటికే తాను అధికారంలోకి రావడానికి.. ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడానికి విజయ్ అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. భావ సారూప్యత ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఏకంగా ముఖ్యమంత్రి పీఠం మీద దర్జాగా కూర్చున్నాడు. సంచలన నిర్ణయాలతో తమిళనాడు రాజకీయాలలో కలకలం సృష్టిస్తున్నాడు. ఇక్కడితోనే విజయ్ ఆగిపోవడం లేదు. విజయ్ మాస్టర్ స్ట్రోక్ తమిళ్ రాజకీయాల్లోనే కాదు.. అక్కడి మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కు దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలా చేస్తోంది.

తమిళనాడు రాజకీయాలలో స్టాలిన్ కు మొదటి నుంచి కూడా ఐయూఎంఎల్ సపోర్ట్ ఇస్తోంది. డీఎంకే పార్టీకి 64 సంవత్సరాలుగా ఐయూఎంఎల్ బలమైన భాగస్వామిగా ఉంది. ఈ బంధానికి విజయ్ బ్రేక్ వేశాడు. 1962 లో డిఎంకెతో ఐయూఎంఎల్ చేతులు కలిపింది. ప్రతి ఎన్నికలోనూ డిఎంకెతో కలిసి చేతులు కలిపింది. అయితే ఇటీవరి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓటమిపాలైంది. టీవీకే అధికారంలోకి వచ్చింది. అదే కాదు టీవీ కేకు ఐయూఎంఎల్ సపోర్ట్ చేసింది. ఐయూఎంఎల్ నేత షాజహాన్ కు మంత్రి పదవి దక్కింది. ఇలా తన వ్యూహ చతురతతో విజయ్ ఏకంగా 64 ఏళ్ల బంధానికి బ్రేక్ వేశాడు. రాజకీయాలలో తాను చైల్డ్ ఆర్టిస్ట్ ను కాదని.. మాన్ స్టార్ ను అని నిరూపించాడు.

పోలీసులు అందుకే వచ్చారు.. పై అంతస్థు నుంచి సాయి కృష్ణ కేకలు..

Sai Krishna Case
Sai Krishna Case

Sai Krishna Case: రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ కేసులో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. సాయి కృష్ణ విచ్చలవిడిగా ప్రవర్తించేవాడు. కృష్ణలంక.. రాణి తోట ప్రాంతంలో రౌడీయిజం చేసేవాడు. మాదక ద్రవ్యాలు విపరీతంగా స్వీకరించేవాడు. మద్యం పీకల దాకా తాగేవాడు. రోడ్డుమీద స్వైర విహారం చేసేవాడు. కొన్ని సందర్భాలలో ఉన్మాద చర్యలకు పాల్పడేవాడు. బీరు సీసాలను పగలగొట్టి అర్థరాత్రి పూట ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేవాడు.

నవీన్ రెడ్డి కేసులో

నవీన్ రెడ్డి అనే యువకుడి హత్య కేసులో సాయి కృష్ణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్ మీద విడుదలయ్యాడు. అనంతరం మరికొన్ని కేసుల్లో కూడా అతడిని అరెస్టు చేయడానికి పోలీసులు ఇంటికి వెళ్లారు. అయితే అతడు అప్పటికే పరారీలో ఉన్నాడు. మార్కాపురం ప్రాంతంలో తల దాచుకుంటున్నాడు. నాన్ బెయిలబుల్ వారెంట్ కేసులను పరిష్కరించడానికి పోలీసులు అనేకమంది పాత ఖైదీల గృహాలకు వెళ్లడం మొదలుపెట్టారు. ఇందులో సాయి కృష్ణ కూడా ఉన్నాడు. సాయి క్రిష్ణ ఇంటికి వెళ్తే అక్కడ అతడి తల్లి ఉంది. అతడి తల్లిని అడిగితే.. మొదట్లో వివరాలు చెప్పలేదు. ఆ తర్వాత సాయి కృష్ణ గురించి సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు మార్కాపురం వెళ్లారు. సాయి కృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.

అరుపులు వినబడ్డాయి

మార్కాపురం నుంచి సాయి కృష్ణ తీసుకొచ్చిన తర్వాత అతని కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. అప్పుడు సిఐ నాగరాజు ఆమె మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆమె అక్కడ ఉండగానే పై అంతస్తు నుంచి సాయి కృష్ణ కేకలు వేసినట్టు సమాచారం. ఇదే విషయాన్ని సాయి కృష్ణ మాతృమూర్తి సి పి దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు తన కొడుకుని చూడాలని ప్రాధేయపడినప్పటికీ సీఐ వినిపించుకోలేదని.. పోలీసులు కొట్టిన దెబ్బలకు తన కొడుకు తీవ్రంగా విలపించాడని ఆమె సిపి దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం.

నాడు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును సాయి తల్లి తన చెల్లెలు, న్యాయవాది కనకదుర్గతో చెప్పింది. దీంతో ఆమె లాయర్లతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆమె అడిగినప్పటికీ పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఫలితంగా హై కోర్టులో హెబియస్ కార్పస్ వేయాల్సి వచ్చింది. కాగా, సీఐ నాగరాజు తన కుమారుడిని చిత్ర హింసలకు గురి చేశారని, అందువల్లే అతడు చనిపోయాడని అతడి తల్లి ఆరోపిస్తోంది. ఇదే విషయాన్ని సీపీ తో చెప్పింది. తన కుమారుడి శవాన్ని తగలబెట్టారని, బూడిద కూడా కనిపించకుండా చేశారని ఆమె కన్నీటిపర్యంతమవుతోంది. అయితే ఆమె చెప్పిన వివరాలను విన్న సీపీ.. దర్యాప్తు అధికారులతో ఈ విషయాలను చెప్పినట్టు సమాచారం. వారు ఈకోణంలోనే శనివారం విచారణ సాగించినట్టు తెలుస్తోంది.

ఆపరేషన్ కృష్ణలంక.. సాయి కృష్ణ జాడ ఎక్కడ.. పోలీసులు ఆ పని చేశారా..

Sai Krishna Lockup Death
Sai Krishna Lockup Death

Sai Krishna Missing Case: సరిగ్గా వారం పాటు ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపిన సాయి కృష్ణ వ్యవహారం.. కీలక మలుపు తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి.. సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆ బృందాలు సాయి కృష్ణ అదృశ్యానికి సంబంధించి కీలక విషయాలను రాబట్టే పనిలో పడ్డాయి. మొత్తానికి ఆపరేషన్ కృష్ణలంకను వేగవంతంగా చేస్తున్నాయి.

ముమ్మరంగా దర్యాప్తు

సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు రెండవ రోజు కూడా విస్తృతంగా దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ సి పి రాజశేఖర్ బాబును కలిశారు. ఆయన దగ్గర నుంచి కొన్ని వివరాలు సేకరించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. సిబ్బందిని ప్రశ్నించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లోపల.. బయట ఉన్న నిఘా కెమెరాలను పరిశీలించారు.. ఫోరెన్సిక్ సైబర్ బృందం ఎన్విఆర్ పరికరాలను.. డివిఆర్.. హార్డ్ డిస్క్ ను పరిశీలించింది. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించింది.

సాయి కృష్ణ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయం కోసం వాడుకుంది. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ రంగంలోకి దిగి సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. అంతేకాదు అంబటి రాంబాబు సాయికృష్ణ ను పోలీసులు చంపేశారని ఆరోపించారు. సాయి కృష్ణకు బదులుగా నవీన్ రెడ్డి ఫోటో పెట్టి సంచలనం రేపారు. అయితే పోలీసులు ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టడంతో అంబటి రాంబాబు చెప్పింది మొత్తం అబద్ధమని తేలిపోయింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవడంలో సాయికృష్ణ వ్యవహారం సద్దుమణిగింది. ఇక్కడితోనే కూటమి ప్రభుత్వం ఆగిపోలేదు. సాయి కృష్ణ వ్యవహారంలో పూర్తిస్థాయిలో నిజాలను బయట పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఆ పనిచేశారా..

గాదె సాయి కృష్ణ వ్యవహారంలో పోలీసులు దారుణానికి పాల్పడ్డారా.. స్వర్గపురి ప్రాంతంలో అనాధ శవాలను ఖననం చేశారా.. నిబంధనలు కచ్చితంగా పాటించారా.. ఒకవేళ సాయి కృష్ణ వ్యవహారంలో కూడా అందరూ అనుమానిస్తున్నట్టుగానే అదే పని చేశారా.. అనే కోణంలో దర్యాప్తు బృందాలు ఆరాధిస్తున్నాయి. దర్యాప్తు బృందానికి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన శుక్రవారం విజయవాడ చేరుకున్నారు. విచారణలో వేగం పెంచారు. డీజీపీని కలిసి.. అనేక విషయాల గురించి చర్చించారు.. సాయి కృష్ణను మార్కాపురం నుంచి ఎప్పుడు తీసుకొచ్చారు.. అతని తీసుకురావడానికి ఎవరిని పంపించారు.. విజయవాడ తీసుకొచ్చిన తర్వాత ఎవరికి అప్పగించారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టినట్టు తెలుస్తోంది..

నలుగురిని ప్రశ్నించారు

మరోవైపు సాయి కృష్ణ తీసుకొచ్చిన నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారి దగ్గర నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేసుకున్నారు.. మరోవైపు సిబ్బందిని పెండింగ్లో ఉన్న ఎన్ బి డబ్ల్యూ లను అమలు చేయడానికే సాయి కృష్ణ వద్దకు పంపించినట్టు ఏడిసిపి వివరించారని సమాచారం. దర్యాప్తు రెండో రోజు వేగంగా సాగింది. అయితే ఆదివారం కూడా దర్యాప్తును పూర్తి స్థాయిలో చేపట్టి… త్వరలోనే కీలకమైన విషయాలను పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది.

పాకిస్తాన్ కు దెబ్బ మీద దెబ్బ. పాపం దాయాది దేశం బిక్క చచ్చి పోతోంది..

JD Vance Diplomacy
JD Vance Diplomacy

JD Vance Statement Pakistan: మొన్నటికీ మొన్న ఇరాన్ దేశంతో డీల్ కుదిరిన తర్వాత అమెరికా అధ్యక్షుడు కనీసం మాటవరసకైనా సరే పాకిస్తాన్ పేరును ప్రస్తావించలేదు. ఇరాన్ కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ విషయంలో టచ్ మీ నాట్ అన్నట్టుగా వ్యవహరించాయి.

ఈ విషయంలో భారత్ నిశ్శబ్దంగా ఉండడంతో పాకిస్తాన్ ఆందోళన చెందింది. ఆవేదన చెందింది. కనీసం మాట వరసకైనా తమ గురించి చెప్పలేదని బాధపడింది. పాకిస్తాన్ మంత్రి ఒకరు సాక్షాత్తు అక్కడి పార్లమెంట్లో భారత్ ప్రస్తావన తీసుకొచ్చి..”మేము యుద్ధం ఆపడానికి ఎంతో చేశాం. శాంతి చర్చలు నిర్వహించాం. ఇంత చేసినప్పటికీ మా గురించి భారత్ ప్రస్తావించకపోవడం బాధాకరంగా ఉంది అంటూ” ఆ మంత్రి పార్లమెంట్లో వ్యాఖ్యానించారు.

పీస్ డీల్ విషయంలో పాకిస్తాన్ ప్రస్తావన రాకపోవడం పట్ల అమెరికా క్లారిటీ ఇచ్చింది.. ఇన్ని రోజులపాటు అమెరికా, ఇరాన్ మధ్యవర్తిగా వ్యవహరించామని గొప్పలు చెప్పుకుంది పాకిస్తాన్. అయితే ఆ దేశం గాలి తీసేశారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. పాకిస్తాన్ దేశంలో పత్రికా స్వేచ్ఛ లేదని ఆరోపించారు. అందువల్లే తాము పీస్ డీల్ కు సంబంధించి వివరాలను ప్రకటించలేదని పేర్కొన్నారు. “ఈ వివరాలను మేము బయటపెట్టాలని అనుకున్నాం. కానీ పాకిస్తాన్, ఖతార్ దేశంలో పత్రిక స్వేచ్చలేదు. భావప్రకటన స్వేచ్ఛ చట్టం వంటివి అక్కడ లేదు. అందువల్లే ఆలస్యమైందని” వాన్స్ పేర్కొన్నారు.

వాన్స్ వ్యాఖ్యల నేపథ్యంలో పాకిస్తాన్ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఇప్పటివరకు పాకిస్తాన్ తనకు తానుగా డప్పు కొట్టుకుంది.. తాను శాంతి ఒప్పందంలో కీలకపాత్ర పోషించినట్టు పాకిస్తాన్ చేసుకున్న ప్రచారం మొత్తం ఉట్టిదే అని తేలిపోయింది. ఇప్పటివరకు అమెరికా పాకిస్తాన్ దేశాన్ని కేవలం అవసరం కోసమే వాడుకుందని అర్థం అయిపోయింది. అందువల్లే పాకిస్తాన్ దేశం గాలిని అటు ట్రంప్.. ఇటు వాన్స్ విడతల వారీగా తీస్తున్నారు. పాపం పాకిస్తాన్.. ఎంత కష్టం వచ్చింది..

అప్పట్లో శాంతి చర్చలు జరిగినప్పుడు పాకిస్తాన్ భారీగానే ఖర్చు పెట్టుకుంది. ఇస్లామాబాద్ లో పేరుపొందిన హోటల్లో ఖరీదైన వంటకాలను తయారు చేయించింది. రెండు దేశాల ప్రతినిధులకు ప్రత్యేకమైన స్వాగతం పలికింది. అయితే అప్పట్లో శాంతి ఒప్పందం కుదరలేదు. పాకిస్తాన్ దేశానికి పేరు రాకపోగా.. హోటల్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి. చివరికి ఆ హోటల్ నిర్వాహకులు డబ్బు చెల్లించలేదని ఆరోపించడంతో.. పాకిస్తాన్ పరువు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి పోయింది.

'బేబీ బంప్' తో దర్శనమిచ్చిన సమంత.. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో..

Samantha
Samantha

Samantha: గత వారం రోజుల నుండి ప్రముఖ హీరోయిన్ సమంత తల్లి కాబోతుంది అంటూ సోషల్ మీడియా లో పడ్డ ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్ లో ప్రముఖ దర్శక నిర్మాత రాజ్ నిడిమోరు ని పెళ్లాడిన సమంత , ఇప్పుడు గర్భం దాల్చిందని , అందుకే ఆమె తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ ప్రొమోషన్స్ లో నిండు చీరతో కనిపించిందని, త్వరలోనే ఆమె గర్భం దాల్చిన విషయాన్నీ అధికారికంగా ప్రకటిస్తుందని సోషల్ మీడియా లో ప్రచారం సాగింది. దీనిపై సమంత ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు రాజ్ నిడిమోరు కూడా సైలెన్స్ మైంటైన్ చేస్తూ వచ్చాడు. అయితే నిన్న సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై సూపర్ హిట్ గా నిల్చింది. ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో నేడు సమంత పాల్గొంది.

మూవీ టీం తో కలిసి ఆమె కేక్ కట్టింగ్ చేసి , క్రాకర్స్ కూడా కాల్చి సంబరాలు చేసుకుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె నీలం రంగు టీ షర్ట్ ని ధరించింది. ఈ టీ షర్ట్ ధరించినప్పుడు స్పష్టంగా ఆమె బేబీ బంప్ తో కనిపించడం అభిమానులు గమనించారు. దీంతో సమంత గర్భం దాల్చింది అంటూ వస్తున్న వార్తలు నిజమేనని అభిమానులు బలంగా ఫిక్స్ అయిపోయారు. మరి దీనిపై సమంత అధికారిక ప్రకటన ఎప్పుడు చేసిందో చూడాలి. నిజ జీవితం లో సమంత ఎదురుకున్నని సవాళ్లు బహుశా సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్ గా కూడా ఎదురుకోలేదు అని చెప్పొచ్చు. నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మానసికంగా చాలా కృంగిపోయింది. ఆ సమయం లోనే ఆమెకు మయోసిటిస్ వంటి ప్రాణాంతక వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ఆమె కనీసం ఆహరం కూడా తీసుకోలేని పరిస్థితి.

సరిగ్గా గంటసేపు పనిచేస్తే స్పృహ తప్పి పడిపోయే దుస్థితి. ‘సిటాడెల్ ‘ వెబ్ సిరీస్ ని ఆమె ఆక్సిజెన్ సిలిండర్ ని పెట్టుకొని చేసిందంటేనే అర్థం చేసుకోవచ్చు , ఎంత కష్టపడింది అనేది. అలాంటి సమంత నేడు మయోసిటిస్ వ్యాధి ని విజయవంతంగా జయించి , ఆరోగ్యంతో ఇప్పుడు మళ్లీ సినిమాలు చేస్తూ మన ముందుకొచ్చింది. అంతే కాదు, పండంటి బిడ్డకు ఆమె త్వరలోనే జన్మని కూడా ఇవ్వబోతుంది. అలా సవాళ్లు ఎదురుకుంటున్న ఆడవాళ్లకు సమంత ఒక గొప్ప రోల్ మోడల్ గా నిలిచింది. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో ఆమె కెరీర్ పరంగా కూడా పీక్ రేంజ్ ని చూస్తుంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం’ చిత్రం కమర్షియల్ గా హిట్ అయ్యింది, ఇక నిన్న విడుదలైన ‘మా ఇంటి బంగారం’ చిత్రం మొదటి రోజే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక రాబోయే రోజుల్లో సమంత ఇంకా ఎన్ని శిఖరాలను అధిరోహించబోతుందో చూడాలి.

జ్ఞానేశ్వరీ మిస్సింగ్ కేసులో.. కీలక పరిణామం.. చిన్నారి జాడ దొరికినట్టేనా..

Jnaneshwari Missing Case
Jnaneshwari Missing Case

Jnaneshwari Missing Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్ అగ్రహారం ప్రాంతంలో తప్పిపోయిన రెండు సంవత్సరాల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు విషయంలో ఇప్పటివరకు పురోగతి లభించలేదు.. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగి.. అనేక రకాలుగా దర్యాప్తు చేపట్టారు.. అనేక రకాలుగా సెర్చ్ ఆపరేషన్ లు చేశారు. ఆయనప్పటికీ పాప ఆచూకీ లభించలేదు.

జూన్ 6న జ్ఞానేశ్వరి ఇంటి బయట ఆడుకుంటున్నది.. అదే సమయంలో తమ తల్లిదండ్రులు పెంచుకుంటున్న కుక్కతో పాటు ఆమె వెళ్లిపోయింది.. అప్పటినుంచి జ్ఞానేశ్వరి కోసం తల్లిదండ్రులు .. అధికారులు వెతుకుతూనే ఉన్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. ఈ కేసులో ఇంతవరకు ఎటువంటి పురోగతి లభించకపోవడంతో పోలీసులు అపహరణ (కిడ్నాప్) కోణాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. చిన్నారి తో పాటు కనిపించకుండా పోయిన పెంపుడు కుక్క అదే రోజు గ్రామంలో ఉన్న వినాయకుడి ఆలయం వద్ద తిరుతూ కనిపించినట్టు తెలుస్తోంది. ఆ కుక్క మధ్యాహ్నం సమయంలో ఆందోళనగా తిరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే ఆ కుక్క తర్వాత ఎటువైపు వెళ్ళిందో క్లారిటీ లేకుండా పోయింది.

అలా వెళ్లిపోయిన కుక్క మూడు రోజుల తర్వాత మళ్లీ ఇంటికి వచ్చింది. అప్పటినుంచి ఆ కుక్క కనిపించిన వారి మీద దాడి చేసింది. వింతగా ప్రవర్తించింది. ఆ కుక్కకు వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చారు. జిపిఎస్ ట్రాకర్ ఏర్పాటు చేసినప్పటికీ.. జ్ఞానేశ్వరి ఆచూకీ లభించలేదు. చివరికి ఆ కుక్క చనిపోయింది. ఇప్పటివరకు పోలీసులు జ్ఞానేశ్వరి కేసులో 6 వేలకు పైగా ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. అనుమానంగా కనిపించిన వ్యక్తులను కూడా ప్రశ్నించే వదిలిపెట్టారు. కొండమీద ఉండే వ్యక్తుల గురించి కూడా విచారించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఇప్పటికే దివి పోలవరం, కోటవురట్ల, పిఠాపురం ప్రాంతాలలో గాలింపు చేస్తున్నాయి.. చనిపోయిన ఆ కుక్కకు సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంతవరకు రాలేదు. ఆ రిపోర్టు రాకపోవడం పట్ల స్థానికులలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే ఈ విషయంపై పోలీసులు పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు కోరుతున్నారు.

జ్ఞానేశ్వరి కేసులో మీడియా సంస్థలు ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రసారం చేయడంతో ఆ పాప తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ ఇంట్లో ఇలా జరిగితే ఊరుకుంటారా అంటూ ప్రశ్నిస్తున్నారు. వ్యూస్ కోసం.. లైక్స్ కోసం.. అడ్డగోలు ప్రచారం చేయవద్దని.. తాము పాప కోసం పడుతున్న ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని మానవీయ కోణంలో చూడాలని చెబుతున్నారు. మీడియా ప్రతినిధులు సమయమనంతో ఉండాలని.. తమ బాధను అర్థం చేసుకోవాలని జ్ఞానేశ్వరి తల్లిదండ్రులు సూచిస్తున్నారు. కాగా, చిన్నారి మిస్సింగ్ కేసులో పోలీసులకు సీసీ కెమెరా ఫుటేజ్ క్లూ గా దొరికిందని తెలుస్తోంది.. అందులో ఉన్న దృశ్యాల ప్రకారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో ఉన్న వివరాలను బయట పెట్టకుండా, మీడియాకు తెలియకుండా పోలీసులు జాగ్రత్త వహిస్తున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ క్షమాపణ

Vemuri Radhakrishna Apology
Vemuri Radhakrishna Apology

Vemuri Radhakrishna Apology: ఈరోజు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ జన్మదినం. ఆయన సంస్థలో పనిచేసే ఉద్యోగులు తమ వాట్సాప్ స్టేటస్ లలో రాధాకృష్ణ ఫోటోలు పెట్టుకుని.. యజమాని పట్ల తమ ప్రేమ భావాన్ని చాటుకున్నారు. ఆయనతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. లైకులు.. కామెంట్లు సొంతం చేసుకున్నారు. తన పుట్టినరోజు నాడు ఎంతో గొప్పగా వేడుకలు జరుపుకోవాల్సిన రాధాకృష్ణ.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా క్షమాపణ చెప్పారు.. సహృదయంగా గమనించాలని.. తన పత్రికలో గమనిక కూడా వేశారు.

ఆంధ్రజ్యోతి పత్రికలో శుక్రవారం సంచికలో “ఆఎంపీని టార్చర్ చేస్తారని”తాటికాయ పరిమాణంలో అక్షరాలతో బ్యానర్ వార్త ప్రచురితమైంది. ఇదంతా కూడా సునీల్ నాయక్ అనే అధికారికి ముందే తెలుసు అని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. అయితే ఈ కథనం రాసే క్రమంలో రిపోర్టర్ సక్రమంగానే వ్యవహరించాడు. కానీ సెంట్రల్ డెస్క్ లోనే సీనియర్ సబ్ ఎడిటర్లు దారి తప్పారు.. కనీసం ఫైనల్ కాపీ కూడా చూసుకోకుండా.. హడావిడిగా సునీల్ నాయక్ ఫోటో వేశారు. ఇంతకీ ఆ ఫోటో బీహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ నాయక్ ఫోటో కాదు. ఆస్థానంలో మరో ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ ఫోటో వేశారు. కథనం మాత్రం సునీల్ కుమార్ నాయక్ దే. ఫోటో మాత్రం పీవీ సునీల్ కుమార్ ది.

ఉదయాన్నే తన ఫోటో చూసుకొని కుమార్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయినట్టున్నారు. ఆంధ్రజ్యోతి పత్రిక దివాలా కోరుతనాన్ని చూసి ఆవేదన వ్యక్తం చేసినట్టున్నారు. అందువల్లే ఆంధ్రజ్యోతి పత్రిక శనివారనాటి ఏపీ ఎడిషన్ లో గమనిక పేరుతో చిన్నపాటి డిస్క్లైమేర్ ప్రచురించింది. అది కూడా మూడో పేజీలో.. బ్యానర్ వార్తను తాటికాయ పరిమాణంలో అక్షరాలతో ఫస్ట్ పేజీలో పబ్లిష్ చేశారు. గమనికను మాత్రం మూడో పేజీలో ఏదో వేసి వేయనట్టుగా.. జరిగిన దాంట్లో తన తప్పు ఏమీ లేనట్టుగా ప్రచురించింది.

వాస్తవానికి ఆంధ్రజ్యోతి సెంట్రల్ డెస్క్ ను గాలికి వదిలేసారా.. అందులో ఉపసంపాదకులు పనిచేయడం లేదా.. సీనియర్ ఉద్యోగులకు బాధ్యత లేదా.. రాసిన వాళ్లకు అవగాహన లేదా.. అసలు ఏం చేస్తున్నారు.. బ్యానర్ వార్తలో ఫోటో మారిపోతే దానికి బాధ్యులు ఎవరు.. ఇంతటి వార్తలో పీవీ సునీల్ కుమార్ ఫోటో వేశారంటే ఆ బాధ్యతారాహిత్యాన్ని ఏమనుకోవాలి.. ఇదిగో ఇలానే ఏపీ పాఠకులు ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి రాధాకృష్ణ ఏం సమాధానం చెప్తారో చూడాల్సి ఉంది. అన్నట్టు ఎదురు వ్యక్తుల గురించి ఏదైనా సమాచారం తెలిస్తే ఫస్ట్ పేజీలో వేసే రాధాకృష్ణ.. తన సంస్థలో పనిచేసే ఉద్యోగులు నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఇలా చూసి చూడనట్టు.. కనిపించి కనిపించినట్టు.. వార్తలు ప్రచురించడం నిజంగా గొప్ప విషయం.

ఈ స్కూటర్ ను ఎగబడి మరీ కొంటున్నారు.. ఇంతకీ ఇందులో ఏముంది..

TVS Jupiter scooter features
TVS Jupiter scooter features

TVS Jupiter scooter features: భారత ద్విచక్ర వాహన మార్కెట్లో కుటుంబ వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకున్న స్కూటర్లలో TVS Jupiter ఒకటి. సౌకర్యవంతమైన రైడింగ్, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, ఆధునిక ఫీచర్లతో ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఈ మోడల్ మార్కెట్లో తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇందులో భాగంగా గత నెలలో ఈ స్కూటర్ అమ్మకాల్లో 27.83 శాతం వృద్ధి సాధించింది. వీటిపై పూర్తి వివరాల్లోకి వెళితె..

2026 మే నెలలో టీవీఎస్ జూపిటర్ మొత్తం 1,24,767 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెలలో 97,606 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఈసారి అదనంగా 27,161 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీంతో ఏడాది వ్యవధిలో 27.83 శాతం వృద్ధిని నమోదు చేసి కంపెనీకి మరోసారి బలమైన ఫలితాలను అందించింది. స్కూటర్ కొనుగోలు చేసే వినియోగదారుల్లో చాలా మంది ఇంధన పొదుపు, సౌకర్యవంతమైన ప్రయాణం, విశ్వసనీయతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశాల్లో టీవీఎస్ జూపిటర్ మంచి పనితీరు కనబరుస్తుండటంతో వినియోగదారుల తొలి ఎంపికగా నిలుస్తోంది. నగర ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ స్కూటర్‌కు మంచి డిమాండ్ కనిపిస్తోంది.

జూపిటర్ విజయానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధునిక డిజైన్, మెరుగైన ఇంజిన్ పనితీరు, విశాలమైన సీటింగ్ సౌకర్యం, అధిక స్టోరేజ్ స్పేస్, స్మార్ట్ ఫీచర్లు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఇందులో 113.3cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 7.91 bhp పవర్, 9.8 Nm టార్క్ ను అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్/మెసేజ్ అలర్ట్‌లు, వాయిస్ అసిస్టెన్స్ వంటివి ఇందులో ఉన్నాయి. అలాగే కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించిన డీలర్ నెట్‌వర్క్, సమర్థవంతమైన సర్వీస్ సదుపాయాలు కూడా అమ్మకాల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

స్కూటర్ విభాగంలో తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ టీవీఎస్ జూపిటర్ తన స్థిరమైన పనితీరుతో మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది. కొత్త మోడళ్ల ప్రవేశం, ఎలక్ట్రిక్ వాహనాల పెరుగుతున్న ప్రభావం మధ్య కూడా ఈ స్కూటర్ అమ్మకాలు పెరగడం విశేషంగా భావిస్తున్నారు. ఇది బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ స్కూటర్ ధర సుమారు రూ. 91,738 నుంచి ప్రారంభం అవుతుంది. మే నెలలో నమోదైన ఈ విక్రయాలు TVS Motor Company కు పెద్ద ఊరటనిచ్చాయి. జూపిటర్ అమ్మకాల వృద్ధి కంపెనీ మొత్తం స్కూటర్ విభాగ పనితీరును బలోపేతం చేయడంతో పాటు మార్కెట్ వాటాను మరింత పెంచే అవకాశాలను కల్పిస్తోంది.