Home Blog Page 92

హార్మూజ్ లో టోల్.. ట్రంప్ హెచ్చరిక.. మళ్లీ లొల్లి షురూ

Trump Warning Iran Deal
Trump Warning Iran Deal

Trump Warning Iran Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో జరుగుతున్న డీల్‌ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. హార్ముజ్‌ జలసంధి ద్వారా నౌకలు రాకపోకలు చేయడంలో టోల్‌ ఫీజులు విధించకూడదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్‌ ముందుగా ఈ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ట్రంప్‌ ప్రకారం అమెరికా–ఇరాన్‌ మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా ఈ జలసంధి తిరిగి తెరవబడుతుంది. కానీ దీనికి షరతులు ఉన్నాయి. ఆయన సోషల్‌ మీడియాలో ఇచ్చిన ప్రకటనలో ఈ అంశాలను వివరించారు.

60 రోజుల సీజ్‌ ఫైర్‌ తర్వాత టోల్‌ రహితం..
ట్రంప్‌ ప్రకటన ప్రకారం, ఇరాన్‌తో జరిగిన డీల్‌లో 60 రోజుల సీజ్‌ ఫైర్‌ కాలం ఉంటుంది. ఈ కాలంలో హార్ముజ్‌ జలసంధిలో ఎలాంటి టోల్‌ ఫీజులు ఉండవు. ఈ 60 రోజులు ముగిసిన తర్వాత కూడా, అమెరికా విధించకపోతే టోల్‌ చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్, అమెరికా మధ్య జరిగిన మెమోరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ ప్రకారం, జలసంధి తిరిగి తెరవబడుతుంది. కానీ ఈ తాత్కాలిక ఏర్పాటు 60 రోజులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ కాలంలో గ్లోబల్‌ ఆయిల్‌ సప్లైకి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని లక్ష్యం.

హార్ముజ్‌ కీలకం..
ప్రపంచ ఆయిల్‌ సరఫరాలో సుమారు 20 శాతం వాటా కలిగి ఉంది. ఇక్కడి రాకపోకలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అమెరికా గార్డియన్‌ ఏంజెల్‌ వార్నింగ్, ఫీజు వసూలుట్రంప్‌ డీల్‌ పూర్తి కాకపోతే అమెరికా హార్ముజ్‌ జలసంధిలో టోల్‌ ఫీజు విధించవచ్చని పరోక్షంగా హెచ్చరించారు. ఇది మిడిల్‌ ఈస్ట్‌ దేశాలకు ‘గార్డియన్‌ ఏంజెల్‌‘ లా సేవలందించినందుకు ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌ కోసం అని ఆయన వివరించారు. అమెరికా గత, ప్రస్తుత, భవిష్యత్తు ఖర్చుల కోసం ఈ ఫీజు వసూలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇది అమెరికా సైనిక ఉనికి, రక్షణ సేవలకు పరిహారంగా చూడవచ్చు. ఇరాన్‌ జలసంధిని మూసివేసిన సందర్భంలో అమెరికా ఈ ప్రాంతంలో భద్రతను నిర్వహించడానికి కృషి చేసింది. డీల్‌ పూర్తి కాకపోతే ఈ ఖర్చులు మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి వసూలు చేయాలని ట్రంప్‌ సూచించారు.

భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక ప్రభావాలు..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మకమైన మార్గాల్లో ఒకటి. ఇక్కడి నియంత్రణ ఆయిల్‌ ధరలు, గ్లోబల్‌ ఎనర్జీ సెక్యూరిటీ, అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ట్రంప్‌ ప్రకటన అమెరికా తన ఆర్థిక, సైనిక ప్రయోజనాలను కాపాడుకోవాలనుకుంటోందని సూచిస్తోంది. 60 రోజుల సీజ్‌ ఫైర్‌ కాలం తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది. కానీ డీల్‌ పూర్తి కాకపోతే టోల్‌ ఫీజులు విధించడం ద్వారా అమెరికా మరింత ఒత్తిడి తెస్తుంది. ఇది ఇరాన్‌ను డీల్‌ను ముందుకు తీసుకెళ్లేలా ప్రోత్సహిస్తుంది. మరోవైపు, ఇరాన్‌ జలసంధి ద్వారా ‘సర్వీసెస్‌‘కు ఫీజులు విధించాలనుకుంటే అది అంతర్జాతీయ చట్టాలతో విభేదించవచ్చు. ఈ పరిణామాలు మిడిల్‌ ఈస్ట్‌లోని ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతాయి. డీల్‌ విజయవంతమైతే ఆయిల్‌ ధరలు స్థిరంగా ఉండవచ్చు. లేకపోతే మరింత ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉంది.

ట్రంప్‌ హెచ్చరిక అమెరికా –ఇరాన్‌ చర్చల్లో కీలక మలుపు. హార్ముజ్‌ జలసంధి ద్వారా టోల్‌ ఫీజులు విధించకపోవడం తాత్కాలికంగా ఉపశమనం ఇస్తుంది. కానీ డీల్‌ పూర్తి కాకపోతే అమెరికా తన సేవలకు ఫీజు వసూలు చేయడం ద్వారా ఆర్థిక ఒత్తిడి తెస్తుంది. ఈ పరిణామాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ఎనర్జీ సెక్యూరిటీ మరియు మిడిల్‌ ఈస్ట్‌ భద్రతపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి.

'ప్యారడైజ్' మూవీ లో జడల్ గాని జమానా ఎలా ఉండబోతుంది..?

Nani Paradise Film
Nani Paradise Film

Nani Paradise Film: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు తమదైన రీతిలో ముందుకు దూసుకెళుతున్నారు. డిఫరెంట్ సినిమాల వైపు అడుగులు వేస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటిని సంపాదించుకుంటున్నారు. ఇక నాని లాంటి స్టార్ హీరో సైతం ప్రస్తుతం మాస్ హీరోగా అవతరించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. గతంలో దసరా సినిమాతో ప్రేక్షకులందరిని మెప్పించిన ఆయన ఇప్పుడు పారడైజ్ సినిమాతో మరోసారి తనలోని పూర్తి మాస్ హీరోని బయటకు తీయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఆయన సూపర్ సక్సెస్ ను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది… ఇక ప్యారడైజ్ సినిమా మీద హైప్ అయితే తారాస్థాయిలో ఉంది. ఆ సినిమా నుంచి ఏ ఒక్క వీడియో వచ్చినా కూడా దానికి ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ పెరిగిపోతుంది.

కాబట్టి జడల్ జమానా నడవబోతుంది అంటూ సోషల్ మీడియాలో నాని అభిమానులు సైతం పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ మూవీలో నాని నెక్స్ట్ లెవల్లో కనిపిస్తాడనే ఆశాభావాన్ని సైతం వ్యక్తం చేస్తుండటం విశేషం… డైరెక్టర్ శ్రీకాంత్ సైతం మొదటి నుంచి కూడా ఈ సినిమా మీద ఆయన తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు.

తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ ను సంపాదించుకోవాలని చూస్తున్నాడు. దాంతో పాటుగా చిరంజీవితో చేయబోయే సినిమా విషయంలో కూడా ఆయన చాలా క్లారిటిగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ సినిమాని ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు? నాని ని టాప్ లెవెల్ హీరోగా మారుస్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

ఇక ప్రస్తుతం జడల్ జమానా ఫీవర్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా నడుస్తుంది. ఇక ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో చర్చనీయాంశంగా మారింది…ఇక ఏది ఏమైనా కూడా ఈ మూవీ మీద పెరుగుతున్న అంచనాలను అందుకోవాలంటే మాత్రం మూవీని చాలా ఎఫెక్టివ్ గా తెరకెక్కించాల్సిన అవసరమైతే ఉంది…

ఫైనల్ అంటే చాలు.. సూర్య వంశీ 2.0 చూపిస్తాడు

Vaibhav Suryavanshi 94 Runs
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi 94 Runs: సాధారణంగా ఏ క్రికెటర్ అయినా సరే.. ఫైనల్ మ్యాచ్ అంటే భయపడిపోతుంటాడు. అప్పటిదాకా గొప్ప గొప్ప ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ఫైనల్ అనగానే కంగారు మొదలవుతుంది.. ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాలలో స్వయంకృతాపరాధం వల్ల వికెట్ కోల్పోవాల్సి ఉంటుంది. కానీ వైభవ్.. సూర్య వంశీ రేంజ్ వేరు. ఫైనల్ అనగానే అతడు ఒకసారిగా మారిపోతాడు.

ప్రస్తుతం జరుగుతున్న ట్రై సిరీస్ లో సూర్య వంశీ అంత గొప్పగా ఆడలేదు. తన స్థాయి బ్యాటింగ్ చేయలేదు. దీంతో అతని మీద విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా శ్రీలంక ఆటగాళ్ల మీదికి అతడు దూసుకుపోయిన తీరు ఒకరకంగా విమర్శలకు కారణమైంది. ఇంత చిన్న వయసులో అతడు కోపాన్ని తగ్గించుకోవాలని.. దూకుడు తనాన్ని చూపించకూడదని.. బ్యాటింగ్ చేసే క్రమంలో కాస్త సమయమనాన్ని పాటించాలని సీనియర్ ప్లేయర్లు.. మాజీ ప్లేయర్లు సూచించారు.

సూర్యవంశం అలా దూకుడుగా వెళ్లిపోవడం పట్ల కొంత మంది అభిమానులు మెచ్చుకున్నప్పటికీ.. మిగతావారు మాత్రం అతడి తీరును విమర్శించారు. అతడిది చిన్న వయసు అయినప్పటికీ.. జెంటిల్మెన్ లాంటి క్రికెట్ గేమ్ ఆడుతున్నప్పుడు.. కచ్చితంగా ఆ హుందాతనాన్ని పాటించాలని సూచించారు. సూర్య వంశీ తనను ఆ స్థాయిలో శ్రీలంక ప్లేయర్లు ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో.. తన బ్యాటింగ్ స్టైల్ అంటే ఎలా ఉంటుందో వారికి చూపించాడు. కేవలం 29 బంతుల్లో.. 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ ముందు అవుట్ కావడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు.

సూర్య వంశీ.. మరో ఓపెనర్ ఆర్యతో కలిసి ఏకంగా తొలి వికెట్ కు 132 పరుగులు జోడించాడు. అది కూడా కేవలం 8.5 ఓవర్లలో.. వన్డే క్రికెట్ ను టి20 మాదిరిగా ఆడాడు సూర్య వంశీ. అతడి దెబ్బకు శిరాజ్ 43, సాహన్ 20, దులాజ్ 33, కుగాత 29, ఫెర్నాండో 18 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇందులో ఆర్య చేసిన పరుగులు కూడా ఉన్నాయి.

సూర్య వంశీ ఫైనల్ మ్యాచ్ అనగానే రెచ్చిపోతుంటాడు.. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మీద సూర్య వంశీ కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేశాడు. ఇటీవరి ఐపీఎల్ లో ఎలిమినేటర్ మ్యాచ్లో హైదరాబాద్ జట్టు మీద కేవలం 29 బంతుల్లో 97 పరుగులు చేశాడు. గుజరాత్ జట్టుమీద క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో 47 బంతుల్లోనే 96 పరుగులు చేశాడు. తాజాగా శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. 15 సంవత్సరాల వయసులోనే అతడు ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. పెద్ద పెద్ద ప్లేయర్లు కూడా చేయలేని అద్భుతాన్ని అతడు.. చేతల్లో చేసి చూపిస్తున్నాడు.

11 బంతుల్లో 50..బుడ్డోడని గెలికారు.. యువరాజ్ రికార్డ్ ను బద్దలు కొట్టాడు.. సింహతాండవం చేశాడు

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: “ఆరోజు ఆ మిస్టేక్ చేయకుండా ఉండాల్సింది. అతడిని గెలవకుండా ఉండాల్సిందే. అనవసరంగా గెలికాం. అతడి గురించి తెలియకుండా మాట్లాడాం. చివరికి అనుభవిస్తున్నామని” కచ్చితంగా శ్రీలంక ప్లేయర్లు అనుకొని ఉంటారు. ప్రతి బంతిని అతడు కొడుతుంటే చింతించి ఉంటారు. కన్నీరు పెడుతూనే ఉంటారు.

వైభవ్ సూర్య వంశీ 15 సంవత్సరాల బుడ్డోడు మాత్రమే కాదు.. అంతకు మించిన డైనమైట్. బుమ్రా బౌలింగ్ లోనే తొలి బంతిని సిక్సర్ కొట్టిన చరిత్ర అతడిది. అంతేకాదు ఐపీఎల్లో హయ్యెస్ట్ రన్స్ చేసి.. ఆరెంజ్ టోపీ అందుకున్న ఘనత అతడిది. అటువంటి ఆటగాడిని శ్రీలంక ప్లేయర్లు అనవసరంగా గెలికారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో.. బుడ్డోడని గేలీ చేశారు. అతడేమో మైదానంలో విశ్వరూపం చూపిస్తున్నాడు. తన బ్యాటింగ్ చేస్తే ఎలా ఉంటుందో.. తనకు కోపం వస్తే ఎలా ఉంటుందో రుచి చూపిస్తున్నాడు.

ట్రై సిరీస్ ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక ఏ జట్టు మీద సూర్య వంశీ 11 బంతుల్లోనే ఆర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 5 సిక్సర్లు.. ఐదు ఫోర్లు ఉన్నాయి. పరుగులు మొత్తం బౌండరీ రూపంలో వచ్చాయి వన్డే హిస్టరీ లో ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. గతంలో అంతర్జాతీయ క్రికెట్ లో డివిలియర్స్.. మాథ్యూ ఫోర్డ్ (వెస్టిండీస్) తక్కువ బంతుల్లో హాఫ్ సెంచరీ చేశారు.

ఇటీవల శ్రీలంక ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో వైభవ్ అంతగా సత్తా చూపించలేదు. అతడు త్వరగానే అవుట్ అయ్యాడు. ఆ మ్యాచ్లో టీమిండియా సూపర్ ఓవర్ లో ఓడిపోయింది. ఈ నేపథ్యంలో శ్రీలంక ప్లేయర్లు సూర్య వంశీని ఉద్దేశించి గేలి చేశారు. అతడిని ఆటపట్టించారు. దీంతో సూర్య వంశీ కోపంతో వారి మీదికి వెళ్ళాడు. ఆ సంఘటన అంతర్జాతీయ క్రికెట్లో సంచలనం కలిగించింది. శ్రీలంక ప్లేయర్లు తనకు చేసిన అవమానాన్ని గుర్తుంచుకున్న సూర్య వంశీ రెచ్చిపోయాడు.

ఈ కథనం రాసే సమయానికి అతడు 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. సెంచరీ చేస్తాడనుకున్న క్రమంలో షాహన్ బౌలింగ్లో సూర్య అవుట్ అయ్యాడు. సూర్య ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ఆర్య 24 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ గా ఉన్నాయి. టీమిండియా కేవలం 9 ఓవర్లలోనే 132 పరుగులు చేయడం విశేషం.

పెద్ది మూవీ విషయంలో తప్పంత ఆయనేదేనా..?

Peddi OTT Release
Peddi OTT Release

Peddi Movie: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి… కానీ అంచనాలను ఈ సినిమా అందుకోలేక పోయిందనేది వాస్తవం… సినిమా రిలీజ్ అయి పదిహేను 17 రోజులు అయిపోతున్నప్పటికి ఇప్పటివరకు ఈ సినిమా అయితే 1000 కోట్ల మార్క్ ను దాటలేదు. దాంతోనే ఈ సినిమా కొంతవరకు డీలా పడిపోయిందనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. 350 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 500 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా మరింత కలెక్షన్స్ ని రాబడుతుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

నిజానికైతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ భారీగా తగ్గిపోయాయి. రీసెంట్ గా కొన్ని సన్నివేశాలను కలిపినప్పటికి ఈ సినిమాని చూడడానికి ఎవ్వరు పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు… నిజానికి ఈ సినిమా తేడా కొట్టడానికి అసలు కారణం ఎవరు? తప్పంతా ఎక్కడ జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మేకర్స్ అయితే ఉన్నారు.

నిజానికి దర్శకుడు బుచ్చిబాబు ఈ కథను అనుకున్నప్పుడే దీనిని ఇంకా ఎమోషనల్ గా మార్చాల్సి ఉంది. అలాగే స్టార్ హీరోని పెట్టుకొని అతనికి ఒక కాలు తీసేయడం అనేది కూడా కొంతమంది జీర్ణించుకోలేకపోయారు. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులైతే దాన్ని ఓన్ చేసుకోలేకపోయారు. దానివల్ల క్యారెక్టర్ అనేది తేలిపోయింది.

అందుచేత స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ ఏం చేసిన కూడా ప్రేక్షకుడు దానికి పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోయాడు. మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి నటుడు ఈ సినిమా కోసం తీవ్రంగా కష్టపడి తను అనుకున్నది అనుకున్నట్టుగా పోట్రే చేయగలిగాడు. అయినప్పటికి అది అంత పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు… మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతటి వసూళ్లను రాబడుతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…

హోం శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్!

Pawan Kalyan
Pawan Kalyan

Pawan Kalyan Home Minister: నేనే హోం మంత్రి అయితే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి ఇటీవల తరచూ వస్తున్న మాట ఇది. గతంలో ఓ ఘటన విషయంలో సీరియస్ గా స్పందించారు పవన్ కళ్యాణ్. హోం మంత్రి వంగలపూడి అనితకు కీలక సూచనలు చేశారు. మీరు పట్టించుకోకపోతే హోం శాఖ పరిధిలో కూడా పని చేయాల్సి ఉంటుందని పరోక్ష సంకేతాలు పంపారు. ఇప్పుడు తాజాగా జన సైనికులతో నిర్వహించిన సమావేశంలో సైతం అలానే మాట్లాడారు. అయితే ఆవేదనతో మాట్లాడారు. ఏపీలో కుల భావన పెరిగిపోయిందని.. రాజకీయాల కోసం కులాల ప్రస్తావన తీసుకొచ్చి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు అంటూ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలంటే శాంతిభద్రతలు అదుపులో ఉండాలని.. నేరాలు చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని.. అప్పుడే శాంతి భద్రతల పరిరక్షణ సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.. నేను హోమ్ మినిస్టర్ కాదని.. అదే క్రిమినల్స్ అందరి అదృష్టం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

* మంత్రివర్గ విస్తరణలో..
త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ హోం మంత్రి తీసుకుంటారన్న ప్రచారం నడుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. పవన్ కళ్యాణ్ హోమ్ మంత్రిత్వ శాఖను తీసుకుంటారని అంతా అనుకున్నారు. ఎందుకంటే అన్ని శాఖల పరిధిలో ఉంటుంది హోం శాఖ. ముఖ్యమంత్రి తర్వాత అంత అధికార పరిధి ఉంటుంది. అందుకే ఎక్కువమంది సీనియర్లు ముఖ్యమంత్రి తర్వాత స్థానంగా భావించే హోం మంత్రిత్వ శాఖను ఆశిస్తారు. ఏపీలో మూడు పార్టీల కూటమి, ఆపై సీట్ల సర్దుబాటు తో పాటు అధికారంలోకి వచ్చిన తర్వాత సమన్వయం విషయంలో పవన్ కళ్యాణ్ చాలా పరిణీతితో వ్యవహరించారు. అందుకే ఆయన హోమ్ మంత్రిత్వ శాఖను తీసుకుంటారని అంతా భావించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏరి కోరి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలను తీసుకున్నారు. ఆ శాఖలో తనదైన ముద్ర చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఏపీలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి జరిగింది అనేది ఒక బలమైన ముద్ర ఉంది.

* ఆ శాఖలంటేనే ఇష్టం..
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ హోం శాఖను తీసుకుంటారా? అనేది ఒక చర్చ. అయితే పవన్ ఆ మంత్రిత్వ శాఖను తీసుకుంటే మాత్రం చాలా దూకుడుగా ఉంటారు. ఈ క్రమంలో సంఘ విద్రోహ శక్తుల పట్ల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తారు. కానీ కొన్ని రకాల సమస్యలు తప్పకుండా ఉత్పన్నమవుతాయి. ఎందుకంటే రాజకీయ ప్రేరేపిత ఘటనలు జరుగుతాయి. పవన్ కళ్యాణ్ పై ఉన్న కోపంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు చాలా మంది ప్రయత్నిస్తారు. ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉంటుంది. కానీ పవన్ మాత్రం హోం మంత్రిత్వ శాఖను తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే గ్రామీణాభివృద్ధి, గిరిజనాభివృద్ధి బాధ్యతలను తీసుకున్నారు పవన్. హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనిత ఉన్నారు కానీ సీఎం చంద్రబాబు నిత్య పర్యవేక్షణ ఉంటుంది హోం శాఖ విషయంలో. అందుకే పవన్ హోంమినిస్టర్ పదవి తీసుకునే ఛాన్స్ లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఆస్పత్రిలో ముద్రగడ.. చేతులెత్తేసిన జగన్!

Mudragada Health
Mudragada Health

Mudragada Health: ఏపీ రాజకీయాల్లో ముద్రగడ పద్మనాభానిది ప్రత్యేక స్థానం. ఆయన రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే సుపరిచితులు. అయితే ఆయన చేసిన ఉద్యమం పూర్తి జగన్ మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. 2019లో కాపులు జగన్మోహన్ రెడ్డి వైపు టర్న్ కావడానికి ప్రధాన కారకులు ముద్రగడ. అంత అండగా నిలిచిన ముద్రగడ.. ప్రస్తుతం అనారోగ్య సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఆయన వైద్యానికి ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతటి కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి అండ ఆయనకు లేకుండా పోయిందన్న ఆవేదన ఆయన అనుచరుల్లో వినిపిస్తోంది. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు ముద్రగడ. మళ్లీ ఇప్పుడు అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య ఖర్చులు ఊహించని స్థాయిలో ఉండడంతో.. బిల్లులు భరించలేక రాత్రికి రాత్రి ఆయనకు సమీపంలోని ఓ చిన్న ఆసుపత్రిలో చేర్చడం హాట్ టాపిక్ అవుతోంది.

* కాపు రిజర్వేషన్ ఉద్యమం..
కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న డిమాండ్ తో.. టిడిపి సర్కార్ పై పెద్ద ఉద్యమమే చేశారు ముద్రగడ. నిజంగా కాపులకు న్యాయం జరగాలని ఆయన చేసి ఉంటారు. కానీ అది కాపులకు కంటే జగన్మోహన్ రెడ్డికి మేలు చేసింది. కానీ ముద్రగడను కేవలం అవసరాల కోసమే జగన్మోహన్ రెడ్డి వాడుకున్నారు. 2019 నుంచి 2024 మధ్య ఎటువంటి అవకాశాలు కల్పించలేదు. 2024 ఎన్నికల్లో కుమారుడితో పాటు పార్టీలో చేరిన వారికి కనీసం టికెట్లు కేటాయించలేదు. ఇప్పుడు ఆయన వైద్యానికి కనీస భరోసా ఇవ్వకపోవడం పై ముద్రగడ అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాపు వస్త్రంగా మారారు ముద్రగడ. ఆయనకు ఇష్టం లేకపోయినా కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన వైసీపీ పంచన చేరారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకునే బాధ్యతను ఆయనకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. చివరకు ఆయన అనారోగ్యంతో ఉన్న బలవంతంగా వీడియో బైట్స్ విడుదల చేయించడం వెనుక.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తలు ఉన్నారన్నది బహిరంగ రహస్యం. తాజాగా సాయి కృష్ణ ఉదంతం లో ముద్రగడ పేరుతో ఒక లేఖ బయటకు రావాల్సి ఉంది. ఇంతలోనే ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

* భారీగా వైద్య ఖర్చులు..
హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఆ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య ఖర్చులు భారీగా ఉన్నాయి. దీంతో మరో ఆసుపత్రికి మార్చక తప్పలేదు. ఈ విషయంలో సాయం పొందేందుకు ఆయన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి సాయం అందించేందుకు అటు నుంచి సుముఖత రాలేదని ప్రచారం సాగుతోంది. ఆర్థిక భరోసా రాకపోవడంపై ముద్రగడ అనుచరులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆపద సమయంలో పార్టీ ముద్రగడను ఒంటరి చేయడం తగదు అని గోదావరి జిల్లాల పార్టీ శ్రేణులు, కాపు సామాజిక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై ఎగదోసి.. చలి మంటలు కాచుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ముద్రగడకు బదులు.. కాపు సామాజిక వర్గం నేతలను ఏకతాటి పైకి తీసుకొచ్చే బాధ్యతను తోట త్రిమూర్తులకు జగన్ అప్పగించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఇప్పుడు ముద్రగడ అనారోగ్యానికి గురయ్యారు. ఇక ఆయన అవసరం ఉండదు అని నిర్ధారణకు వచ్చి పక్కన పెట్టేసినట్టు అర్థం అవుతోంది.

సాయి కృష్ణ ఎపిసోడ్.. జగనే కార్నర్!

Sai Krishna Lockup Death
Sai Krishna Lockup Death

Sai Krishna Missing Case: రాష్ట్రంలో చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి. వాటిని ప్రస్తావించి ప్రతిపక్షంగా నిరూపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి పై ఉంది. కేవలం విపక్ష నేత హోదా ఇస్తేనే తాను అసెంబ్లీకి వస్తానని భీష్మించుకు కూర్చున్నారు. ప్రతిపక్షనేత హోదా రాలేదు కాబట్టి నేను పోరాటం చెయ్యను అన్నట్టు ఉంది ఆయన వ్యవహార శైలి. అయితే ఇప్పుడు అనవసరంగా సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం కేసును ప్రస్తావించి రాజకీయం చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. అది ఫలితం ఇవ్వకపోగా వికటించింది. ఎందుకంటే ఆ తల్లి ఆవేదనలో తప్పులేదు. ఆ కుటుంబ బాధలో కూడా తప్పులేదు. ఎంతటి కఠినమైన వారు అయినా పిల్లలు తప్పు చేసినా.. వారు ఇబ్బందులకు గురైన తట్టుకోలేరు. అలాగే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి బాధపడ్డారు. తన కుమారుడు అదృశ్యం తో విలవిలలాడిపోయారు. ఆది నుంచి ఒకటే మాట ఆవిడ నోటి నుంచి వస్తోంది. తన కుమారుడు చనిపోయి ఉంటే చెప్పాలని.. కనీసం బూడిదైనా ఇవ్వాలని ఆమె కోరారు.

* అంబటి ప్రస్తావనతో..
సాయి కృష్ణ అదృశ్యం గురించి తొలుతా ప్రస్తావించింది మాజీ మంత్రి అంబటి రాంబాబు. అయితే బాధ్యత కుటుంబం పై మానవీయకోణం చూపడం కంటే.. సాయి కృష్ణ కాపు జాతికి చెందిన యువకుడిగా మాత్రమే చూపించే ప్రయత్నం చేశారు. తర్వాత నేరుగా జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్న వయసులో తప్పిదాలు సహజం అని.. ఆ నేరాలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి సైతం కాపు అంశాన్ని హైలెట్ చేసేందుకు మాత్రమే ప్రయత్నం చేశారు. ఆ తల్లి ఆవేదన, ఆ కుటుంబ ఆవేదన, అసలేం జరిగింది, సాయి కృష్ణ ఎలాంటి వాడు, ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు.. అనే అంశాలను పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి. ఎంతవరకు ఇది ప్రభుత్వ హత్యగా చిత్రీకరించే ప్రయత్నంలోనే ఆయన ఉన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి అనే కోణంలోనే ఆరోపణలు చేశారు.

* బాధ్యతగా సీఎం చంద్రబాబు..
అయితే చంద్రబాబు రంగంలోకి దిగారు. అప్పటివరకు తీవ్ర ఆవేదనతో రోదించిన ఆ తల్లిని పిలిపించుకుని మాట్లాడారు. కుటుంబ సభ్యులను తన వద్దకు రప్పించుకొని సాయి కృష్ణా ప్రాథమిక స్థాయి నుంచి ఎలా ఉండేవాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు. కేవలం ఆ తల్లి తన కుమారుడి గురించి గొప్పగా చెప్పలేదు. నేర ప్రవృత్తి గురించి కూడా చెప్పుకొచ్చింది. ఒక మాతృమూర్తిగా ఆమె గోడు విన్నారు చంద్రబాబు. వారు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. తమ కుమారుడు బతికి ఉంటే అప్పగించాలని.. చనిపోయి ఉంటే అందుకు కారకులను శిక్షించాలని వారు కోరారు. అందుకు స్పష్టమైన హామీ ఇచ్చారు చంద్రబాబు. ఐపీఎస్ అధికారిని విచారణకు నియమించారు. బాధ్యుడైన సిఐను సస్పెండ్ చేశారు. క్రిమినల్ కేసును నమోదు చేశారు. సీఎం చంద్రబాబు తమ పట్ల చూపిన దయ, చొరవతో అప్పటివరకు ఆగ్రహంగా మాట్లాడిన సాయి కృష్ణ తల్లి తో పాటు కుటుంబ సభ్యులు ఇప్పుడు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

* అడ్డంగా బుక్కైన జగన్..
ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్కయ్యారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా కాకుండా రాజకీయ లబ్ధి కోసమే ఆయన ప్రయత్నించారని స్పష్టమైంది. కాపుల విషయంలో చీలిక తేవాలన్న ఆలోచనకు ఆదిలోనే దెబ్బ పడింది. అటు సాయి కృష్ణ తల్లితోపాటు కుటుంబ సభ్యులు సైతం జగన్మోహన్ రెడ్డి తీరును ఇప్పుడు తప్పు పట్టారు. కనీసం తన కుమారుడి పేరు కూడా తెలియకుండా జగన్మోహన్ రెడ్డి తమ ఇంటికి వచ్చారని బాంబు పేల్చారు. ఇంకోవైపు తమ సామాజిక వర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డబుల్ గేమ్ ను కాపులు గట్టిగానే వ్యతిరేకిస్తున్నారు. అంతకుమించి నేర ప్రవృత్తిని వెనుకేసుకు రావడం పై కూడా విద్యాధికులు, తటస్తులు తప్పుపడుతున్నారు. సాయి కృష్ణ ఎపిసోడ్ లో జగన్మోహన్ రెడ్డికి పొలిటికల్ మైలేజ్ రాలేదు సరి కదా.. దారుణంగా డ్యామేజ్ జరిగింది.

జగన్ నోట 'ఇండియా'.. బిజెపిని వదిలేసినట్టేనా?!

Y S Jagan Mohan Reddy
Y S Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వింత వైఖరి. ఆయన ప్రజల మధ్యకు రారు. అసెంబ్లీకి వెళ్ళరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ పోరాటం చేస్తోందని మాత్రం ప్రకటనలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది కనుక.. ఇక తనదే అన్నట్టు ఆయన వ్యవహార శైలి ఉంది. వారాంతపు ప్రెస్ మీట్ లు పెడుతున్న జగన్మోహన్ రెడ్డి.. ఇప్పుడు ఇంగ్లీషులో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. హలో ఇండియా అంటూ ప్రారంభిస్తున్నారు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమివైపు అడుగులు వేస్తున్నారా అనే అనుమానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రస్థాయిలో చంద్రబాబు సర్కార్ పై విరుచుకుపడుతున్న ఆయన.. జాతీయస్థాయిలో అంశాలపై మాత్రం స్పందించనని చెబుతున్నారు. అయితే ఒక వైపు బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ పై మాట్లాడాలని ఉంది. కానీ మాట్లాడలేకపోతున్నారు. ఇండియా కూటమి ఏపీ పాలనపై పట్టించుకోవడం లేదు. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి.

* కాంగ్రెస్ గూటికి..
కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి కొనసాగుతూ వచ్చింది. అయితే బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఒప్పుకోలేదు. కానీ ఒక్కో ప్రాంతీయ పార్టీని కబళిస్తూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. దీంతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఆశ్రయం కోసం అవన్నీ ఎదురుచూస్తున్నాయి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే అంత ఎత్తుకు ఎగిరేవారు మమతా బెనర్జీ. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ పార్టీ శరణు కోరారు. తన సొంత ఇమేజ్తో అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ పరిస్థితి అలా ఉంటే.. కాంగ్రెస్ ఇచ్చిన స్వేచ్ఛతో వైయస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆయన అకాల మృతితో వచ్చిన సానుభూతితో అధికారంలోకి రాగలిగారు జగన్మోహన్ రెడ్డి. తప్పకుండా జగన్ సైతం కాంగ్రెస్ గూటికి వెళ్లాల్సిందే. కానీ కేసుల భయంతో బిజెపితో పరోక్ష స్నేహం కొనసాగిస్తూ వస్తున్నారు. అందుకే తటస్థ వైఖరి అంటూ మాట్లాడుతున్నారు. ఏపీ గురించి ఇండియాకుటమి అస్సలు పట్టించుకోవడం మానేసింది.

* దూరం పెడుతున్న బిజెపి..
మరోవైపు భారతీయ జనతా పార్టీ సైతం తన రూటు మార్చింది.. ఒకవైపు బాబుతో స్నేహం చేసి మరోవైపు జగన్తో పరోక్ష స్నేహం కొనసాగిస్తే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ పార్టీకి తెలుసు. అందుకే ఒక పద్ధతి ప్రకారం అడుగులు వేయడం ప్రారంభించింది. జగన్మోహన్ రెడ్డిని దూరం పెడుతూ వస్తోంది. అలాగని నేరుగా ఇండియా కూటమికి వెళ్లే పరిస్థితి జగన్ వద్ద లేదు. అందుకే జాతీయ బిజెపిపై మాట్లాడను అంటున్నారు జగన్.. ఇప్పుడు హలో ఇండియా అని వ్యాఖ్యానించడం ద్వారా ఇండియా కూటమిలోని మిగతా పార్టీలు వచ్చి తనకు సహకరించాలి అన్నట్టు ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ ట్వీట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.

ఏపీలో ఆ జిల్లాలకు అలెర్ట్!

AP Heavy Rain Aler
AP Heavy Rain Aler

AP Heavy Rain Alert: ఏపీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. శనివారం భారీ వర్షాలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజాము వరకు వర్షాలు కొనసాగాయి. ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు పడ్డాయి. తూర్పు విదర్భ, దక్షిణ చత్తీస్గడ్ మీదుగా ఏపీ తీర ప్రాంతం వరకు ఒక ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో రాబోయే కొన్ని గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉంది. విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు చేస్తోంది. ఆదివారం సైతం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. అందుకే జిల్లాల వారీగా అలర్ట్ జారీ చేస్తోంది.
* పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
* కాకినాడ తో పాటు తూర్పుగోదావరి జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. ఇక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది.
* మరోవైపు రాయలసీమకు సైతం భారీ వర్ష సూచన ఉంది. ఆదివారం బలమైన ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడవచ్చు. వర్షంతో పాటు పిడుగులు పడే సూచన కూడా ఉంది.
* మరోవైపు బాపట్ల, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా పిడుగులు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. మచిలీపట్నం, ఏలూరు, నరసాపురం, దివిసీమ, గుడివాడ, భీమడోలు ప్రాంతాలకు సైతం పిడుగుల హెచ్చరికలు ఉన్నాయి. వర్షం ప్రారంభమైన తర్వాత రైతులు, రైతు కూలీలు ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తోంది.
* విశాఖ జిల్లాలో భారీ వర్షం కురిసింది శనివారం మధ్యాహ్నం. ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడిన జనం ఉపశమనం పొందారు. విశాఖ నగరంలో రాత్రి ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు విస్తారంగా వర్షాలు పడ్డాయి. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పూర్ణ మార్కెట్లో దారులన్నీ మునిగాయి. జైలు రోడ్డు పరిసరాల్లో అత్యధికంగా 59 మిల్లీమీటర్లు, ప్రభుత్వ ఐ హాస్పిటల్ ప్రాంతంలో 53.7 మిల్లీమీటర్లు, ఆర్కే బీచ్ పరిసరాల్లో 47.8 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

హర్మన్ సేన మరోసారి పోరాడాలి.. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ గుర్తుకు తెచ్చుకోవాలి..

India Women vs South Africa Women
India Women vs South Africa Women

India Women vs South Africa Women: టి20 వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు దూసుకుపోతోంది. వరుస విజయాలతో ఆకట్టుకుంటున్నది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టుపై విజయం సాధించింది. అదే ఊపులో నెదర్లాండ్ పై కూడా బ్రహ్మాండమైన గెలుపును దక్కించుకుంది. ఫలితంగా రెండు విజయాలతో పటిష్ట స్థితిలో ఉంది. టీమిండియా ఈ వరల్డ్ కప్ లో సెమీఫైనల్ వెళ్లాలంటే.. కప్ మీద ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే సౌత్ ఆఫ్రికా గండాన్ని దాటాలి.

సౌత్ ఆఫ్రికా తో టీమ్ ఇండియా నేడు కీలకమైన మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ హోరాహోరిగా సాగే అవకాశం ఉంది. రెండు జట్లలో కూడా అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు. బౌలింగ్.. బ్యాటింగ్ తో అదరగొట్టే సత్తా వీరి సొంతం. ఈ నేపథ్యంలో రెండు జట్లు కూడా గెలుపు కోసం తీవ్రంగా పోరాడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్తాన్ చెట్టును రెండు వికెట్ల తేడాతో ఓడించి సత్తా చూపించింది.. దక్షిణాఫ్రికా జట్టులో కెప్టెన్ లారా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదరగొడితే.. టీమిండియా కు ఇబ్బంది తప్పదు.

ఈ మ్యాచ్ మాన్ చెస్టర్ వేదికగా జరుగుతుంది. స్పిన్ బౌలర్లకు ఈ పిచ్ అనుకూలంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో దీప్తి శర్మ.. మిగతా స్పిన్నర్లు గనుక సత్తా చూపిస్తే భారత్ మ్యాచ్ లో అనుకూల ఫలితం సాధించే అవకాశం ఉంది.. అయితే ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత ప్లేయర్లు సమిష్టిగా ఆడుతున్నారు. ఫలితంగా సానుకూల ఫలితాలు వస్తున్నాయి. కేవలం ఒక ప్లేయర్ మీదనే.. ఒక్క బౌలర్ మీదనే జట్టు ఆధారపడడం లేదు. దక్షిణాఫ్రికా జట్టుతో మ్యాచ్ అనగానే టీమ్ ఇండియాకు ఒత్తిడి సహజంగానే ఉంటుంది. దానిని టీమిండియా ప్లేయర్లు అధిగమించాలి.

అన్నింటికటే ముఖ్యంగా ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ మ్యాచ్ మాదిరిగా ఆడాలి. అందరూ విజయమే లక్ష్యంగా ఆడితే టీమిండియాకు తిరుగుండదని మాజీ ప్లేయర్లు పేర్కొంటున్నారు.. చూడాలి మరి హర్మన్ సేన ఏం చేస్తుందో. మందాన, జెమీమా, షఫాలీ వర్మ వంటివారు మెరుగైన ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరుగుండదు. ఒకవేళ ముందుగా బ్యాటింగ్ గనక చేస్తే టీమిండియా భారీగా పరుగులు చేయాల్సి ఉంటుంది. బౌలింగ్ లోనూ సత్తా చూపించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో అరుంధతి రెడ్డికి విశ్రాంతి వచ్చే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఆర్కే కొత్త పలుకు.. నరేంద్ర మోడీని తిట్టలేడు.. అలాగని ఊరుకోలేడు.. పాపం వేమూరి రాధాకృష్ణ..

RK Kotha Paluku
RK Kotha Paluku

RK Kotha Paluku: వేమూరి రాధాకృష్ణ ప్రస్తుతం మంచి దూకుడు మీద కనిపిస్తున్నారు. గతంలో కొత్త పలుకు రాస్తున్నప్పుడు మధ్యలో గ్యాప్ ఇచ్చేవారు. ఎందుకు ఇచ్చారు అంటే ఇవ్వలేదు వచ్చింది అనేవారు. ఇప్పుడు గ్యాప్ ఇవ్వడం లేదు. ఆయన పెన్ను చకచగా రాసుకుంటూ పోతోంది.. ఆంధ్రజ్యోతిలో ప్రతి ఆదివారం సంపాదకీయం లో ఒకటి బై మూడు వంతు ఆయన రాసిన రాతలు ప్రింట్ అవుతూనే ఉన్నాయి. వాటి ద్వారా కొత్త కొత్త విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

రాధాకృష్ణ చెయ్యి తిరిగిన జర్నలిస్టు. రాష్ట్ర అంశాలు మాత్రమే కాకుండా.. జాతీయ అంశాల మీద కూడా పట్టు ఉంటుంది. అను సందర్భాల్లో ఆయన జర్నలిస్టు కాకపోవచ్చు గాని.. కొన్ని సందర్భాలలో మాత్రం తనను తాను జర్నలిస్టుగా ఆయన ప్రూవ్ చేసుకుంటారు. తాజాగా ఆదివారం ప్రచురితమైన కొత్త పలుకులో రాధాకృష్ణ పూర్తిస్థాయి జర్నలిస్టుగా మారిపోయారు. అవును.. చదువుతుంటే ఆశ్చర్యం అనిపించినప్పటికీ.. ఇది నిజం. రాధాకృష్ణ జర్నలిస్టుగా మారిపోయి వాస్తవాలను రాశారు. కాకపోతే ఇందులో కూడా ఒక రకమైన సంశయం ఉంది.

ప్రాంతీయ పార్టీలను బిజెపి మింగేస్తుందని.. మోడీషా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చేస్తున్నారని.. దీనివల్ల రాజకీయాలలో విలువలు లేకుండా పోతున్నాయని రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆవేదన చెందారు. కొన్ని సందర్భాలలో బాధపడ్డారు. ఒక జర్నలిస్ట్ గా ఆయన ఇలాంటి భావాలను వ్యక్తికరించాల్సిందే. సమాజంలో జరుగుతున్న పరిణామాలను బయటపెట్టాల్సిందే. కానీ.. ఇక్కడే ఆయన టెంపో మిస్ అయింది. ఆయన అగ్రెసివ్నెస్ తగ్గిపోయింది..

నరేంద్ర మోడీ చేస్తున్న రాజసూయ యాగాన్ని ఒకవైపు రాధాకృష్ణ మెచ్చుకున్నారు. మరోవైపు ప్రాంతీయ పార్టీలలో జరుగుతున్న పరిణామాలను, ఆయా పార్టీల నాయకుల లోపాలను.. అవ లక్షణాలను బయటపెట్టారు రాధాకృష్ణ. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ నరేంద్ర మోడీని ఎందుకు విమర్శించలేదు.. భయమేసిందా.. ఏమైనా చేస్తారని అనిపించిందా.. ది గ్రేట్ జర్నలిస్ట్ రాధాకృష్ణకు ఇంత భయం ఎందుకు.. ప్రాంతీయ పార్టీలు తప్పు చేశాయి.. గతంలో పిరాయింపులకు పాల్పడి రాజ్యాంగాన్ని అవమానించాయి.. కానీ ఇదే తప్పును నరేంద్ర మోడీ ఎందుకు చేస్తున్నారు.. ఆయనకు చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది.. ఇలా అవసరాల కోసం అడ్డగోలుగా పిరాయింపులకు పాల్పడితే.. బిజెపి ప్రజాస్వామ్యం గురించి ఎలా గొప్పగా చెబుతుంది.. రేపట్నాడు తనకే ఇటువంటి పరిస్థితి ఏదైతే ఏం చేస్తుంది.. పాపం ఈ ప్రశ్నలు రాధాకృష్ణ వేలకపోయాడు. గట్టిగా అడగాలనుకున్నాడు.. గట్టిగా రాద్దామనుకున్నాడు.. కానీ నిశ్శబ్దంగా.. ముగించాడు.

పాకిస్తాన్ ఉగ్ర గుట్టును.. డ్రోన్లతో ఆఫ్ఘనిస్తాన్ రట్టు చేసింది..

Pakistan Terrorism Links
Pakistan Terrorism Links

Pakistan Terrorism Links: కొంతకాలంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. పాకిస్తాన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్ మీద దారుణంగా విరుచుకుపడుతోంది. ఆఫ్ఘనిస్తాన్లోని కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం తీవ్రంగా చోటుచేసుకుంటున్నది. ముఖ్యంగా చిన్నారులు.. వృద్ధులు ఎక్కువగా చనిపోతున్నారు.

పాకిస్తాన్ పదే పదే దాడి చేయడం.. అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆఫ్గనిస్తాన్ కూడా గట్టిగా సమాధానం చెబుతోంది. ఇటీవల పాకిస్తాన్ సైన్యం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రాంతాలలో దాడులు జరిపింది. రాత్రిపూట వైమానిక దాడులు కూడా చేసింది. వైమానిక దాడులు చేస్తే భారీగా ఖర్చు అవుతుందని భావించిన ఆఫ్గనిస్తాన్.. ఈసారి ఏకంగా సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీంతో పాకిస్తాన్ కు దిమ్మ తిరిగిపోయింది.

పాకిస్థాన్లో కీలకమైన కైబర్ పంక్తుక్వా, బలూచిస్తాన్ ప్రాంతాలలో ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది. డ్రోన్లతో పాకిస్తాన్ దేశానికి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని ఆఫ్గనిస్తాన్ దాడులు చేసింది.. ఐసిస్, లస్కరే తోయిబా వంటి సంస్థలకు చెందిన ఉగ్రవాదుల శిబిరాలు ఆఫ్ఘనిస్తాన్ దాడుల్లో నేలమట్టమైనట్టు తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్ దాడులకు ఇక్కడి నుంచే ప్రణాళికలు జరుగుతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాద గ్రూప్లతో కలిసి ఆఫ్గనిస్తాన్ దేశం మీద దాడులు చేస్తున్నదని తెలుస్తోంది.

ఇన్నాళ్లపాటు పాకిస్తాన్ ఈ విషయాన్ని చాలా రహస్యంగా ఉంచింది.. ఆఫ్ఘనిస్తాన్ డ్రోన్స్ తో దాడులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.. దీనిని అంతర్జాతీయ సమాజం ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆధారాలతో సహా ఉంచింది. దీంతో పాకిస్తాన్ దేశానికి మరోసారి అంతర్జాతీయంగా తలవంపులు ఎదురయ్యాయి. ఇప్పటివరకు ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తూ ఉంటుంది. అదేవిధంగా బుకాయింపులకు దిగుతూ ఉంటుంది. కానీ, ఆఫ్ఘనిస్తాన్ చేసిన డ్రోన్ దాడులతో.. పాకిస్తాన్ ఉగ్రముఖ చిత్రం మరోసారి బయటపడింది. మరి దీనిపై అంతర్జాతీయ సమాజం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

శివసేనలో మరో చీలిక.. ఉద్ధవ్‌ వర్గానికి షిండే భయం!

Shiv Sena Split
Shiv Sena Split

Shiv Sena Split: బెంగాల్‌లో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ను ఓటర్లు ఇంటికి పంపించారు. బీజేపీకి పట్టం కట్టారు. దీంతో 15 ఏళ్లు అప్రతిహతంగా బెంగాల్‌ను పాలించిన టీఎంసీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఎంపీలందరూ పార్టీకి రాజీనామా చేసి కొత్త గ్రూపుగా ఏర్పడటం ప్రాంతీయ పార్టీల్లో అంతర్గత అసంతృప్తి ఎంత తీవ్రంగా ఉందో చెబుతోంది. ఇప్పుడు అదే ధోరణి మహారాష్ట్రలో శివసేనలో కొనసాగుతోంది. ఉద్ధవ్‌ థాక్రే నేతృత్వంలోని శివసేన (యుబీటీ) నుంచి కొంతమంది నేతలు ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

షిండే గ్రూపులోకి వలసలు..
కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్‌ జాదవ్‌ ప్రకటన ప్రకారం, ఉద్ధవ్‌ థాక్రే శివసేనకు చెందిన 6 మంది ఎంపీలు, 14 మందికి పైగా ఎమ్మెల్యేలు షిండే గ్రూపులో చేరాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇది రెండేళ్ల క్రితం జరిగిన శివసేన విభజన తర్వాత కొనసాగుతున్న అధికార పోరాటానికి మరో రూపం. షిండే వైపు నుంచి వచ్చిన ఈ ప్రకటన ఉద్ధవ్‌ థాక్రే నేతల్లో ఆందోళన కలిగించడం సహజం.

ఉద్ధవ్‌ థాక్రే రక్షణ చర్యలు..
ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్ధవ్‌ థాక్రే తన పార్టీ నేతలను కట్టడి చేసేందుకు త్వరగా చర్యలు తీసుకుంటున్నారు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలతో వ్యక్తిగతంగా మంతనాలు జరుపుతూ, పార్టీలో ఐక్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ వీడకుండా ఉండేలా రాజకీయంగా, వ్యక్తిగతంగా ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అవసరం లేదన్న షిండే గ్రూపు..
మరోవైపు షిండే నేతృత్వంలోని శివసేన మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది. ‘‘ఇప్పటి వరకు ఎవరినీ చేర్చుకోలేదు. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని స్పష్టం చేసింది. ఇది రాజకీయంగా బాధ్యతాయుతమైన స్థితిని చూపించడానికి ఉద్దేశించినట్లు కనిపిస్తోంది.

రాజకీయ సమతుల్యతపై ప్రభావం..
ఈ పరిస్థితి మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన విభజన ఇంకా ముగియలేదని, రెండు వర్గాల మధ్య పోరాటం కొనసాగుతోందని స్పష్టం చేస్తోంది. షిండే గ్రూపు నిరాకరించినా, ఉద్ధవ్‌ థాక్రే వైపు నుంచి వచ్చే భయం నిజమైనది. ఎందుకంటే ఒక్క ప్రకటనతోనే పార్టీ నేతల్లో అనిశ్చితి పెరుగుతుంది. ఉద్ధవ్‌ థాక్రేకు ఇది పెద్ద సవాల్‌. పార్టీలో ఐక్యత కోల్పోతే విపక్షంగా ఉన్న వారి స్థానం మరింత బలహీనపడవచ్చు. మరోవైపు షిండే–బీజేపీ కూటమికి ఇది అదనపు బలం కలిగించే అవకాశం ఉంది. బెంగాల్‌లో టీఎంసీ ఎంపీల సామూహిక రాజీనామా ఒక ట్రెండ్‌ను చూపిస్తోంది.

ప్రాంతీయ పార్టీల్లో నాయకత్వం వ్యతిరేకత, అధికార ఆకర్షణ, వ్యక్తిగత లాభాలు లాంటి కారణాలు నేతలను మార్చేస్తున్నాయి. మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంమీద, ఈ ఘటనలు మహారాష్ట్రలో రాబోయే ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారుతున్నాయో చెబుతున్నాయి. ఉద్ధవ్‌ థాక్రే ఎంత త్వరగా తన నేతలను కట్టడి చేస్తారనేది ఇప్పుడు కీలకం.

ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని విజయాలు.. వ్యాపారులకు డబ్బే డబ్బు..

Today 21 June 2026 Horoscope
Today 21 June 2026 Horoscope

Today 21 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై పూర్వ పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వరకు ఈరోజు ఊహించని విజయాలు ఉంటాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతులకు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధికంగా లాభాలు ఉంటాయి. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. అనుకోకుండా శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి సంబంధించి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు కొత్త వ్యక్తులను కలుస్తారు. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం కరణీయంగా పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామి సలహాతో వ్యాపారులు కొత్త పెట్టుబడును పెడతారు. ఇవి భవిష్యత్తులో అధిక లాభాలను తీసుకొచ్చే అవకాశాలుంటాయి.. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి విద్యార్థులు ఈ రోజు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులకు గతంలో కంటే ఇప్పుడు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉండడంతో పోటీ పరీక్షల్లో రాణిస్తారు

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఏదైనా వస్తువు కొనుగోలు చేసే సమయంలో ఆలోచించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు చేసే ప్రయత్నాలు అన్నింటిలో విజయం సాధిస్తారు. గతంలో కంటే ఇప్పుడు పని భారం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. సోదరుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోవడంతో పూర్వీకులు ఆస్తికి సంబంధించి శుభవార్తను వింటారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మీ రాశి వారు ఈ రోజు మానసికంగా సంతృప్తిగా ఉంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. దీంతో సంతోషంగా ఉండగలుగుతారు. వ్యాపారులు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు పని భారం పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఇదే మంచి సమయం. గతంలో ఆగిపోయిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే వ్యాపారులు పెద్దలను సంప్రదించడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారికి ఈ రోజు సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. గతంలో కోల్పోయిన డబ్బులు ఇప్పుడు తిరిగి పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దీంతో అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : నిరుద్యోగుల నుంచి కొంత సమాచారం అందుతుంది. ముఖ్యమైన పనులను ఈరోజు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారులు లాభాలు పొందుతారు. అయితే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం కాదు. ఉద్యోగులు కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తోటి వారి సహకారం తీసుకుంటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. కొన్ని పనులు పూర్తి కావడానికి ఎటువంటి నిర్లక్ష్యంగా ఉండకూడదు. కష్టంగా ఉండే పనులను ఈరోజు ఇష్టంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఏర్పడతాయి.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలి. పూర్వీకుల ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.

లేటు వయసులో జ్యోతి ఘాటు అందాలు

Jyothi Rai bold look
Jyothi Rai bold look

౩వ పెళ్లి ప్లానింగ్ పై అమీర్ ఖాన్ హాట్ కామెంట్స్.. మండిపడుతున్న ఫ్యాన్స్..

Aamir Khan Third Marriage
Aamir Khan Third Marriage

Aamir Khan Third Marriage: ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మూడవ పెళ్ళికి అన్ని విధాలుగా సిద్ధమైనట్టు బాలీవుడ్ వర్గాల్లో ఒక చర్చ జోరుగా సాగుతోంది. గత కొంతకాలం గా ఆయన గౌరీ స్ప్రాట్ అనే అమ్మాయితో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు. ఈ పెళ్లి గురించి రీసెంట్ గా అమీర్ ఖాన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆయన మాట్లాడుతూ ‘మా పెళ్లి చాలా సాధారణంగానే ఉంటుంది. మీరు ఊహించుకుంటున్నట్టు హంగులు ఆర్భాటలు ఏమి లేవు. మేము రిజిస్టర్ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. ఇరు కుటుంబాలకు సంబంధించిన ఆత్యంత ఆప్త మిత్రులు , సన్నిహితుల సమక్షం లో మేమిద్దరం సింపుల్ గా వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం’ అంటూ అమీర్ ఖాన్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా లో తీవ్ర స్థాయి విమర్శలు వస్తున్నాయి.

కొడుకులకు , కూతుర్లకు పెళ్లిళ్లు చేసి , వాళ్ళ మనవళ్లతో ఆదుకోవాల్సిన వయస్సులో పెళ్లేంటి?, అమీర్ ఖాన్ కి పిచ్చి పరాకాష్ట కి చేరింది అంటూ ఆయన పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. అభిమానులు కూడా ఈ విషయం లో అమీర్ ఖాన్ ని వెనకేసుకొని రాలేకపోతున్నారు. ఇకపోతే జులై 5 న వీళ్లిద్దరి పెళ్లి జరగబోతున్నట్టు బాలీవుడ్ మీడియా లో ప్రచారం జరిగింది. ఇందులో నిజమెంత అని మీడియా అమీర్ ఖాన్ ని అడగ్గా, అది నిజమేంనని ఆయన స్పందించారు. ప్రస్తుతం ఆయన అమెరికా లో ఉన్నాడట, ఇండియా కి తిరిగి వచ్చిన వెంటనే ఈ వివాహం చేసుకోనున్నట్లు తెలిపారు అమీర్ ఖాన్.

తన 60 వ పుట్టిన రోజు సందర్భంగా అమీర్ ఖాన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి ఈ విషయాలన్నీ వెల్లడించారు. సుమారుగా ఆమెతో ఏడాదిన్నర నుండి డేటింగ్ లో ఉన్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈమెని మీడియా కి పరిచయం చేస్తూ , తనకు మొదటి నుండి ఈమె ఎంతో మద్దతు ఇస్తూ అన్ని విషయాల్లో తోడుండని చెప్పుకొచ్చారు అమీర్ ఖాన్. ఇకపొత్ రీసెంట్ గానే అమీర్ ఖాన్ తన ఇద్దరు మాజీ భార్యలతో కలిసి , కారులో ప్రయాణించడం ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ కారులో తన కాబోయే భార్య సంధ్య కూడా ఉండడం గమనార్హం.