Home Blog Page 90

ప్రభాస్ ను బీట్ చేసిన రణ్ వీర్ సింగ్.. దేశంలోనే ఈ టాప్ హీరో పారితోషికం ఎంతంటే..

Ranveer Singh
Ranveer Singh

Ranveer Singh remuneration : పాన్ ఇండియా లెవెల్ లో ప్రస్తుతం అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్న హీరో ఎవరు అని అడిగితే మన అందరికీ వెంటనే గుర్తుకొచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకు పోటీ వచ్చే సూపర్ స్టార్ ఒక్కరు కూడా లేరు. ఆయన ఎంత కోరితే అంత డబ్బులు ఇవ్వడానికి రెడీ , కేవలం డేట్స్ ఇస్తే చాలు అనే రేంజ్ ప్రభాస్ సొంతం. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది, ముఖ్యంగా సినీ రంగం లో ప్రతీ శుక్రవారం మారుతూనే ఉంటాయి. బ్లాక్ బస్టర్ హిట్స్ , పాత్ బ్రేకింగ్ హిట్స్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ ని మించిన హీరో వచ్చేశాడు . అతనే రణవీర్ సింగ్. ‘ధురంధర్’ సిరీస్ కి ముందు ఇతను ఒక సాధారణ మీడియం రేంజ్ హీరో.

కానీ ఈ సిరీస్ తర్వాత ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిపోయాడు. మొదటి భాగం 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే , రెండవ భాగం ఏకంగా 1800 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హీరో రణవీర్ సింగ్ నటనకు జేజేలు కొట్టారు ఆడియన్స్. ఆయనకంటూ ప్రత్యేకంగా జెన్ జీ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్స్ బేస్ పుట్టుకొచ్చింది. అంతే కాకుండా భవిష్యత్తులో చేయబోయే సినిమాలు కూడా చాలా సాలిడ్ గా ఉన్నాయి. తన తదుపరి చిత్రాన్ని ‘ధురంధర్’ ఫేమ్ ఆదిత్య డర్ తోనే ప్లానింగ్ చేస్తున్నాడనే టాక్ కూడా బాలీవుడ్ లో బలంగా నడుస్తోంది. కాబట్టి రెమ్యూనరేషన్ కూడా ఆయన భారీగా పెంచేసాడని టాక్. ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 150 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. కానీ రణవీర్ సింగ్ తన తదుపరి చిత్రానికి ఏకంగా 315 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నాడు.

ఇండియా లో ప్రస్తుతం రణవీర్ సింగ్ రెమ్యూనరేషన్ కి దరిదాపుల్లో వచ్చే హీరో ఎవ్వరూ లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. భవిష్యత్తులో కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసే హీరో ఉండరేమో. కనీసం పాతిక కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ కూడా తీసుకోలేని హీరో స్థాయి నుండి , ఏకంగా 315 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకునే రేంజ్ కి ఎదగడం, అది కూడా ఒకే ఒక్క సిరీస్ తో , ఇలాంటి అదృష్టం చాలా అరుదుగా వస్తుంటాయి, రణవీర్ సింగ్ కి ఈసారి అది కలిసొచ్చింది. కానీ అతను పడిన కష్టానికి ఈ మాత్రం ఎదుగుదల ఉండడం లో తప్పే లేదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

శ్రీకాంత్ ఓదెల ప్యారడైజ్ కోసం నాని ని ఎంచుకొని తప్పు చేశాడా..?

Nani Paradise Movie
Nani Paradise Movie

Nani Paradise movie : తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో పెను ప్రభంజనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా రాని గుర్తింపు నాని చాలా తక్కువ సినిమాలతోనే తెచ్చుకుంటున్నాడు. ఇంతకు ముందు నాని దసరా సినిమాతో మాస్ ఇమేజ్ ను మూట గట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు. ఇక శ్రీకాంత్ ఓదెల సైతం నానిని నెక్స్ట్ లెవెల్లో చూపించడానికి తీవ్రమైన కసరత్తులు చేస్తున్నాడు…

శ్రీకాంత్ ఓదెల సైతం ఈ మూవీలో నాని ని హీరోగా పెట్టుకొని తప్పు చేశానా అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పారడైజ్ సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటిపోతుంది. ఈ క్రమంలో నానీ మీద అంత భారీ మొత్తంలో బడ్జెట్ ని కేటాయించడం చాలా రిస్క్ తో కూడుకున్న పని అని కొంతమంది హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికి నాని మాత్రం తనకు భారీ కలెక్షన్స్ ని కొల్లగొట్టే సత్తా ఉంది అంటూ తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక అందులో భాగంగానే శ్రీకాంత్ ఓదెల మాత్రం నాని ని కాకుండా వేరే హీరో తో ఈ మూవీ చేసి ఉంటే ప్రొడ్యూసర్లు సైతం ఏ భయం లేకుండా తను అనుకున్న బడ్జెట్ పెట్టేవారని ఇప్పుడు నాని వల్ల తను కూడా రిస్క్ లో పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

నిజానికి శ్రీకాంత్ కి మొదటి సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చింది నాని కాబట్టి నాని విషయంలో అలా ఆలోచించడం కరెక్ట్ కాదని అతనితో కొంతమంది చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ప్యారడైజ్ సినిమాను ఏ రేంజ్ సక్సెస్ గా నిలుపుతాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోగలుగుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

సూర్యవంశీ భగభగలకు.. లంకా దహనం ఇలా ముగిసింది..

Vaibhav Suryavanshi
Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi 94 runs : ట్రై సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన అంత గొప్పగా లేదు. అతని మీద భారీ అంచనాలు ఉన్నప్పటికీ.. వాటిని అందుకోవడంలో విఫలమయ్యాడు . అసలే విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాడు. పైగా నిర్లక్ష్యంగా బ్యాటింగ్ చేస్తుండడం అతడిని ఇబ్బంది కలిగిస్తోంది. అలాంటి ఆటగాడిని శ్రీలంక ప్లేయర్లు రెచ్చగొట్టారు. ఇష్టానుసారంగా కామెంట్లు చేశారు. అసలే టీనేజ్ కుర్రోడు.. దీనికి తోడు ఆవేశం ఎక్కువ.. తట్టుకోలేకపోయాడు. మైదానంలోనే దాడికి దిగాడు.

అక్కడితోనే దానిని శ్రీలంక ప్లేయర్లు మర్చిపోయారు. కానీ సూర్యవంశీ మర్చిపోలేదు. మర్చిపోయే వ్యక్తి కూడా కాదు. దూకుడు కొనసాగించాడు. ఫైనల్ మ్యాచ్లో సింహ తాండవం చేశాడు. ఏకంగా 29 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 10 ఫోర్లు.. 8 సిక్సర్లు ఉన్నాయి.. అతడి దూకుడుకు టీమిండియా కేవలం 8.5 ఓవర్ లోనే 132 పరుగులు చేసింది. 94 రన్స్ కొట్టిన అతడు.. సెంచరీకి ఆరు పరుగుల దూరంలో అవుట్ అయ్యాడు.

సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత టీమ్ ఇండియా స్కోర్ మందగించింది. ఆర్య 39.. గైక్వాడ్ 40.. కుమార్ 36.. షడ్గే రెండు పరుగులు చేశారు. కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. 67 పరుగులు చేసి ఆదరగొట్టాడు.. చివర్లో అను కూల్ రాయ్ కేవలం 15 బందులోనే 39 పరుగులు చేశాడు. ఫలితంగా టీం ఇండియా స్కోర్ 377 పరుగులకు చేరుకుంది.

అనంతరం టార్గెట్ మొదలుపెట్టిన శ్రీలంక.. 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. 33 పరుగుల వద్ద రెండో వికెట్ నష్టపోయింది. 75 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో శ్రీలంక ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక ప్లేయర్లు మెరుగ్గా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. సదిరా 52, సాహన్ 38, సాహన్ 62, విజయ్ కాంత్ 39 పరుగులు చేయడంతో.. లంక రేసులకు వచ్చింది. ఒక దశలో 254/7 వద్ద నిలిచింది. గెలుపుకు దగ్గరగా వస్తున్న క్రమంలో.. శ్రీలంక జట్టు ఓత్రికి గురైంది. కేవలం 57 పరుగుల వ్యవధిలో మిగతా మూడు వికెట్లను కోల్పోయింది. దీంతో టీం ఇండియా విజయం ఖాయమైంది. మొత్తంగా 66 పరుగుల తేడాతో టీమిండి అద్భుతమైన విజయం సాధించి.. ట్రోఫీ అందుకుంది.

ఈ సిరీస్ లో టీమిండియా ప్రయాణం పడుతూ లేస్తూ సాగింది. అయితే కెప్టెన్ తిలక్ వర్మ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కింగ్ మేకర్ పాత్ర పోషించాడు. సూర్య వంశీ అవుట్ అయిన తర్వాత మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. శ్రీలంక బౌలర్లు రెచ్చిపోయి బౌలింగ్ చేయడం మొదలు పెట్టారు. అయితే తిలక్ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. బాధ్యతాయుతమైన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడాడు. అతడు చేసిన 67 పరుగులు టీమిండియా ఇన్నింగ్స్ మొత్తానికి వెన్నెముకలాగా నిలిచాయి. అందువల్లే భారత్ ఏకంగా 377 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఈ టోర్నీ టీమ్ ఇండియాకు ఎప్పటికీ గుర్తుంటుంది. ముఖ్యంగా శ్రీలంకకు మరింత గుర్తుంటుంది. ఇకపై సూర్యవంశీ పేరు కచ్చితంగా వారికి మదిలో మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే అతడు నైట్ మేర్ కాదు.. పగటిపూటనే చుక్కలు చూపించే సింహబలుడు.

స్విజర్లాండ్ లో ఇరాన్, అమెరికా చర్చలు.. పాకిస్తాన్ కు గ్యాస్ ట్రబుల్..

Switzerland peace talks, Iran America negotiations

Iran America negotiations : సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఇరాన్, అమెరికా మధ్య చర్చలకు పాకిస్తాన్ ఆతిధ్యం ఇచ్చింది. ఇస్లామాబాద్ లో ఒక హోటల్లో ఈ చర్చలు నిర్వహించింది. ఆ చర్చలు ఎటు కాకుండా పోయాయి. ఆ తర్వాత అనేక రకాల పరిణామాలు జరిగిన తర్వాత అమెరికా.. ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. మళ్లీ అది మొదటికి వచ్చింది. ఈరోజు స్విజర్లాండ్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఎక్కడ దాకా తీసుకెళ్తాయి.. ప్రపంచాన్ని ఏ దిశగా ప్రయాణం సాగించేలా చేస్తాయి అనేది చూడాల్సి ఉంది.

పాకిస్తాన్ ప్రస్తావన ఇటీవలి శాంతి ఒప్పందంలో రాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇరాన్ అధిపతి ఒక మాట కూడా పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. పాకిస్తాన్ ప్రస్తావన రాకపోవడంతో ఆ దేశ నాయకులు నొచ్చుకున్నారు. ఇంత చేస్తే కనీసం మాకు ఆ మాత్రం గుర్తింపు కూడా ఇవ్వరా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా గుర్తించకపోయిన పర్వాలేదు.. ఇరాన్ గుర్తించకపోయిన పర్వాలేదు.. కనీసం భారత్ అయినా తమ కృష్ణుని గుర్తించాలి కదా అంటూ ఆ దేశ పార్లమెంట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఇప్పుడు స్విజర్లాండ్ వేదికగా ఇరాన్, అమెరికా చర్చలు సాగిస్తున్నాయి. ఇవి ఎక్కడిదాకా వెళ్తాయి.. ఎలాంటి టర్న్ తీసుకుంటాయి అనే అంశాలను ప్రపంచ దేశాలు ఆసక్తిగా చేస్తున్నాయి. ఇదే క్రమంలో స్విజర్లాండ్ వేదికగా ఇరాన్, అమెరికా చర్చలు సాగిస్తున్న తీరు పాకిస్తాన్ దేశానికి ఏమాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే పాకిస్తాన్ దేశాన్ని కాదనుకొని.. అక్కడ జరిగిన చర్చలు సక్రమంగా లేవని.. కనీసం పత్రిక స్వేచ్ఛ కూడా లేదని ఇటీవల అమెరికా ఉపాధ్యక్షుడు వాన్స్ ఆరోపించారు. ఖతార్ దేశంలో కూడా ఇలానే ఉందంటూ.. అందువల్లే శాంతి ఒప్పందానికి సంబంధించిన ఏ అంశాన్ని కూడా బయటికి చెప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.

వాన్స్ చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్ పరువును ఘోరంగా తీసాయి. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్విట్జర్లాండ్ వేదికగా శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ గురించి మరోసారి చర్చ మొదలైంది. అసలు ఈ చర్చలు ముందుగా స్విజర్లాండ్ లో జరిగి ఉంటే ఇక్కడదాకా వచ్చేది కాదని.. పాకిస్తాన్ అనవసరంగా వేలు పెట్టిందని.. ఉగ్రవాద దేశం శాంతి చర్చలకు ఆహ్వానం పలకడం ఏంటని చాలామంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు శాంతి చర్చలు స్విజర్లాండ్ వేదికగా జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ లో గ్యాస్ ట్రబుల్ పెరిగిపోయి ఉంటుందని… అక్కడి పరిపాలకులు చస్తూ ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు..

కాగా, ఈ చర్చల్లో కూడా పాకిస్థాన్, ఖతార్ మీడియేటర్ పాత్రకే పరిమితం కావడం విశేషం. ఇటీవల పాకిస్థాన్ మీద జేడీ వాన్స్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.అయినప్పటికీ పాకిస్థాన్ మీడియేటర్ పాత్రను పోషించడం గమనార్హం.

'OG Universe' మొదలైంది.. సంచలనం రేపుతున్న పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్..

Pawan Kalyan OG Universe

Pawan Kalyan OG Universe : పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజీ అనే పేరు తీస్తే ఏ రేంజ్ లో పూనకాలు వస్తాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా వచ్చి 8 నెలలు దాటింది , పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎన్నో విజయాలు సాధించాడు జాతీయ స్థాయిలో గుర్తింపు కూడా పొందాడు. వాటికి కూడా రానటువంటి ఉత్సాహం, అభిమానులకు ఓజీ పేరు తీస్తే వస్తోంది. అభిమానులతో అలాంటి ఎమోషనల్ బాండింగ్ ని ఏర్పాటు చేసుకుంది ఈ చిత్రం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీ అయిపోయాడు, అసలు ‘ఓజీ 2’ ఉంటుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. కానీ అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం కచ్చితంగా ‘ఓజీ 2’ చేయబోతున్నాను అని ఒక ప్రకటన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి రావడంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ లెవెల్ లో హాట్ టాపిక్ అయ్యింది.

ఇక సుజిత్ విదేశాల నుండి తిరిగి రీసెంట్ గానే రావడం , నేడు ఆయన మంగళగిరి లో పవన్ కళ్యాణ్ ని కలవడం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటో ని కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుండి పోస్ట్ చేయగా, అది సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ ఎంతో స్టైలిష్ గా హుడీ వేసుకొని స్టోరీ చర్చల్లో పాల్గొనడం , సుజిత్ ఎంతో ఉత్సాహం తో స్టోరీ ని వివరిస్తున్నట్టు ఫోజులు ఇవ్వడం , వెనుక ‘OG universe’ పేరుతో ఒక పెద్ద పోస్టర్ కనిపించడం , అభిమానులకు రోమాలు నిక్కపొడుచుకునేలా చేసింది. పవన్ కళ్యాణ్ ఎన్నడూ లేని విధంగా ఇంత ఫాస్ట్ గా ఉన్నదేంటి. ఈ సినిమా పట్ల అభిమానులు ఎంత ఉత్సాహంతో ఉన్నారో , పవన్ కళ్యాణ్ కూడా అంతే ఉత్సాహం తో ఉన్నాడని ఆయన స్పీడ్ ని చూస్తేనే అర్థం అవుతోంది, ఇది కదా మేము పవర్ స్టార్ నుండి కోరుకున్నది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

సెప్టెంబర్ 2 న ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఒక కాన్సెప్ట్ వీడియో తో ప్రకటన చేయబోతున్నారని టాక్. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయట. నవంబర్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది అట. ఎక్కువ శాతం జపాన్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారట. అయితే DVV దానయ్య నిర్మాతగా ఈసారి కొనసాగే పరిస్థితులు లేవని నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియా లో చర్చలు జరిగాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదట, కాకపోతే DVV తో పాటు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ కూడా నిర్మాణం లో భాగం కాబోతుంది. వచ్చే ఏడాది దసరా కి ఈ చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

'టాక్సిక్' సరికొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు..

Yash Upcoming Movie
Yash Upcoming Movie

Yash Toxic Release Date: పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రమిది. ఎప్పుడో మార్చి 19 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు, ఆ తర్వాత జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అప్పటికీ కూడా సినిమా ఔట్పుట్ మరింత బెటర్ చేయడం కోసం వాయిదా వేశారు.వరుసగా మేకర్స్ వేస్తున్న ఈ వాయిదాలను చూసి అభిమానులకు సైతం చిరాకు వచ్చేసింది. అసలు ఈ ఏడాది లో ఈ చిత్రం విడుదల ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న విడుదల చేయబోతున్నారట.

సమ్మర్ మొత్తం ముగిసిన తర్వాత, ఎలాంటి పండుగ హాలిడేస్ లేని సమయం లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప, వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ ఆడియన్స్ ని గొప్పగా ఆకట్టుకోలేదు. టీజర్ కి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది కానీ , ట్రైలర్ కి మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ బలంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది . తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కచ్చితంగా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆగస్టు 21 న సాధారణంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడింది. ఒకవేళ ‘ది ప్యారడైజ్’ చిత్రం చెప్పిన తేదికి వచ్చి ఉండుంటే ‘టాక్సిక్’ కి థియేటర్స్ విషయం లో చాలా ఇబ్బంది ఉండేది . ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ స్థానం లోకి మాస్ మహారాజ రవితేజ ‘ఇరుముడి’ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ‘టాక్సిక్’ చిత్రానికి ఇబ్బందే. తెలుగు వెర్షన్ రైట్స్ ని దిల్ రాజు 120 కోట్లకు కొనుగోలు చేశాడని టాక్ , ఎలా రీకవరీ చేయబోతున్నాడో చూడాలి.

ఖర్మ రిటర్న్‌.. పాకిస్తాన్‌లో వరుస పేలుళ్లు..విరుచుకుపడుతున్న డ్రోన్లు..!

Pakistan
Pakistan

Pakistan: ఖర్మ రిటర్న్‌.. ఈ పదం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఒకడికి అన్యాయం చేస్తే.. న్యూటన్‌ థర్డ్‌ లా తరహాలో అంతే వేగంతో అన్యాయం రిటర్న్‌ వస్తుంది. గతంలో పోయిన జన్మలో చేసిన పాపం తగిలింది అనేవాళ్లు. కానీ ఇప్పుడు చేపిన తప్పులకు ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి వస్తోంది. భారత్‌లోని ప్రశాంత నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో పేలుళ్లు జరిపి అమాయకులు ప్రాణాలు బలితీసుకుని, అల్లర్లు, విధ్వంసం, ఆర్థిక నష్టం చేసింది పాకిస్తాన్‌. కానీ ఖర్మ రిటర్న్‌ అయింది. అదే పరిస్థితిని ఇప్పుడు పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌ నుంచి ఎదుర్కొంటోంది. తానే పెంచి పోసించిన టీటీపీ(తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌) పాకిస్తాన్‌లో వరుస దాడులు చేస్తోంది. దీంతో అఫ్ఘానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తమయ్యాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇవి సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అష్గాన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఖైబర్‌ఫఖ్తూంఖ్వాలో వరుస పేలుళ్లు..
టీటీపీ సంస్థ ఖైబర్‌ఫఖ్తూంఖ్వా ప్రాంతంలో వరుస దాడులు, పేలుళ్లు చేస్తోంది. ఇవి సరిహద్దు పోస్టులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య జరిగిన మునుపటి సైనిక చర్యలకు ప్రతీకారంగా చూడవచ్చు. పాకిస్తాన్‌ మునుపు అఫ్ఘానిస్తాన్‌లోని మిలిటెంట్‌ లక్ష్యాలపై దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. దీంతో అఫ్ఘాన్‌ తరఫు ప్రతిస్పందనగా డ్రోన్లు, సరిహద్దు దాడులు వచ్చాయి. టీటీపీ కూడా వీడియోలు విడుదల చేస్తూ తన చర్యలను ప్రచారం చేస్తోంది. టీటీపీ దాడులు,

అంతర్గత భద్రతా సవాళ్లు..
ఖైబర్‌ పఖ్తూంఖ్వాలో టీటీపీ నిరంతర దాడులు పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. వరుస పేలుళ్లు, సైనిక శిబిరాలపై దాడులు, వంతెనలు ధ్వంసం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఇవి స్థానిక ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. టీటీపీ పాకిస్తాన్‌లోని ఒక మిలిటెంట్‌ సంస్థ. దీని మూలాలు పాకిస్తాన్‌లోని తాలిబాన్‌ సంబంధిత గ్రూపుల నుంచి వచ్చాయి. పాకిస్తాన్‌ చాలా కాలం పాటు అఫ్ఘాన్‌ తాలిబాన్‌ను మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ సంస్థలోని కొన్ని వర్గాలు పాకిస్తాన్‌పైనే తిరుగుబాటు చేస్తున్నాయి.

డ్యూరాండ్‌ రేఖ వద్ద సంఘర్షణలు..
ఆఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. ఆఫ్గానిస్తాన్‌ ఈ రేఖను అంగీకరించదు. ఇటీవల ఈ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ సైన్యం పోస్టులపై దాడులు, పోస్టులు ధ్వంసం వంటి చర్యలు నివేదించబడ్డాయి. ఈ దాడులు ప్రాంతీయ నియంత్రణ కోసం, మరియు మునుపటి పాకిస్తాన్‌ చర్యలకు ప్రతీకారంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు ఒకరినొకరు మిలిటెంట్లను ఆశ్రయించడం, సరిహద్దు ఉల్లంఘనలు చేయడం అనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇది సరిహద్దు వద్ద శాశ్వత అశాంతికి దారితీస్తోంది.

పాకిస్తాన్‌ 1990ల నుంచి ఆఫ్గాన్‌ తాలిబాన్‌ను మద్దతు ఇచ్చింది. 2001 తర్వాత కూడా కొన్ని వర్గాలు ఆ సంబంధాలు కొనసాగించాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తాలిబాన్‌ వర్గాలు పాకిస్తాన్‌పై దాడులు చేస్తుండటం చాలా మందికి వ్యంగ్యంగా అనిపిస్తోంది. టీటీపీని ‘‘పాకిస్తాన్‌ సృష్టించినది’’ అనే వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవానికి టీటీపీ 2007లో ఏర్పడిన సంకలన సంస్థ. ఇది పాకిస్తాన్‌ సైన్యం వ్యతిరేకంగా ఏర్పడింది. పాకిస్తాన్‌ గతంలో భారత్‌పై జరిగిన కొన్ని ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు తన సరిహద్దులోనే ఇలాంటి దాడులు ఎదుర్కోవడం ‘‘ఖర్మ రిటర్న్‌’’ అనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

హార్ముజ్‌ దాటిని మూడు భారత నౌకలు.. ఇంధన భద్రతపై భారత్‌ అప్రమత్తం

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: ఇరాన్‌–అమెరికా యుద్ధం ముగిసింది. ఇరు దేశాల మధ్య డీల్‌ కుదిరింది. దీంతో హర్మూజ్‌ తెరుచుకుంది. దీంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. అయితే కొన్ని గంటలకే ఇరాన్‌ మళ్లీ హార్ముజ్‌ మూసివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిలో హార్ముజ్‌ జలసంధిని భారతీయ జెండా ఎగురవేస్తున్న మూడు క్రూడాయిల్‌ ట్యాంకర్లు ఆదివారం సురక్షితంగా దాటాయి. ఈ ట్యాంకర్లు మొత్తం 8.6 లక్షల మెట్రిక్‌ టన్నుల చమురు సరకును తీసుకెళ్తున్నాయి. ఇందులో 94 మంది భారతీయ నావికులు ఉన్నారు.

ట్యాంకర్ల వివరాలు..
హార్ముజ్‌ దాటిన మూడు నౌకల్లో మార్గందేశ్‌ వైభవ్, దేశ్‌ వైభోర్, సన్మార్‌ హెరాల్డ్‌ ఉన్నాయి. హార్ముజ్‌ జలసంధిని దాటి భారతీయ ఓడరేవుల వైపు పయనిస్తున్నాయి. ఈ ట్యాంకర్లు మధ్యప్రాచ్య ప్రాంతం నుంచి భారతదేశానికి చమురు దిగుమతి చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. హార్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం వాటా కలిగిన వ్యూహాత్మక మార్గం కావడంతో ఇక్కడి సురక్ష ఎప్పుడూ సందేహాస్పదంగా ఉంటుంది.

కేంద్ర మంత్రి కీలక ప్రకటన..
కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఈ ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం గురించి వివరించారు. భారతీయ నావికుల సురక్ష, ఇంధన భద్రత విషయంలో అన్ని సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రకటన భారతదేశం తన ఇంధన దిగుమతులను రక్షించడంలో ఎంతో అప్రమత్తంగా ఉందని చెబుతోంది.

ఇంధన భద్రతపై దృష్టి..
హార్ముజ్‌ జలసంధి దాటడం భారతదేశ ఇంధన భద్రతకు సంబంధించిన ముఖ్యమైన అంశం. భారత్‌ తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఈ ప్రాంతంలో ఏదైనా ఉద్రిక్తతలు ఏర్పడితే ఇంధన సరఫరాలు ప్రభావితం కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం నావికుల సురక్షను ముందుగా ఉంచి, అన్ని ఏజెన్సీలతో సమన్వయం చేసుకోవడం ద్వారా దిగుమతులను సురక్షితంగా కొనసాగిస్తోంది. ఈ ఘటన భారతదేశం తన ఇంధన రంగంలో స్వావలంబన వైపు అడుగులు వేస్తున్నా, దిగుమతులపై ఆధారపడటం తప్పనిసరి అని చెబుతోంది. అందుకే అంతర్జాతీయ సముద్ర మార్గాల సురక్షను నిరంతరం పర్యవేక్షించడం, దౌత్యపరమైన చర్యలు తీసుకోవడం అవసరం. భారతీయ నావికుల రక్షణను కాపాడటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడం కూడా ఈ చర్యల్లో భాగం.

హార్ముజ్‌ జలసంధి వంటి మార్గాల్లో భారత ట్యాంకర్ల సురక్షిత ప్రయాణం భవిష్యత్తులో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవడానికి బలమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఇంధన భద్రతను మరింతగా బలపరచడానికి ప్రత్యామ్నాయ మార్గాలు, నిల్వలు పెంచడం, పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి పెంచడం వంటి చర్యలు అవసరం.

విరాట్, బుమ్రా కు చోటిచ్చారు సరే.. మా సిరాజ్ ఏం పాపం చేశాడు..

India vs England ODI Series
India vs England ODI Series

India vs England ODI Series: “అతడికి అలుపు ఉండదు. సొలుపు కూడా ఉండదు. కెప్టెన్ ఏం చెప్తే అదే చేస్తాడు. ఎంతసేప బౌలింగ్ వెయ్యమన్నా సరే వేస్తూనే ఉంటాడు.. గాయపడినా భయపడడు. శరీరాన్ని తీవ్రంగా కష్టపడుతుంటాడు. చెమటలు చిందిస్తూ ఉంటాడు. అతనికి కావాల్సింది జట్టుకు అనుకూలమైన ఫలితం మాత్రమే. కెప్టెన్ ముఖంలో నవ్వు కనిపిస్తే అతడు మరింత రెచ్చిపోతాడు..”మహమ్మద్ సిరాజ్ గురించి టీం ఇండియా మాజీ క్రికెటర్లు తరచూ చేసే వ్యాఖ్యలు ఇవి.. గత ఏడాది ఇదే సమయానికి ఇంగ్లాండ్ సిరీస్లో టీమిండి అదరగొట్టినప్పుడు.. సిరాజ్ గురించి మాజీ ప్లేయర్లు గొప్పగా ప్రస్తావించారు. అతడిని ఆకాశానికి ఎత్తేశారు. అయితే అటువంటి సిరాజ్ ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కు దూరమయ్యాడు.

ఇంగ్లాండ్ సిరీస్ కు సిరాజ్ దూరం కావడం పట్ల అతడి అభిమానులు ఒక రకమైన ఆందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇంగ్లాండ్ మైదానాల మీద సిరాజ్ కు అపారమైన అనుభవం ఉంది. గత ఏడాది జరిగిన టెస్ట్ సిరీస్లో బుమ్రా లేకపోయినప్పటికీ సిరాజ్ భారత బౌలింగ్ భారాన్ని మొత్తం ఒక్కడే మోసాడు. రోజుల తరబడి బౌలింగ్ వేసి ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొత్తాన్ని కుప్ప కూల్చాడు ఒక దశలో ఆకాష్.. ప్రసిద్ వంటి వారు గాయపడినప్పటికీ.. సిరాజ్ మాత్రం అలసిపోకుండా బౌలింగ్ వేశాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ముఖ్యంగా చివరి మ్యాచ్లలో టీమిండియా విజయం సాధించడానికి ప్రధాన కారణం సిరాజ్. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.

అయితే అంతటి సిరాజ్ ను జట్టులోకి తీసుకుపోకపోవడం పట్ల రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కు అతడిని దూరం పెట్టారు. ఐర్లాండ్ సిరీస్ కు కూడా ఎంపిక చేయలేదు. వర్క్ లోడ్ వల్ల అతడికి విశ్రాంతి ఇవ్వాల్సి వచ్చిందని మేనేజ్మెంట్ చెప్పింది. ఇప్పుడు 2027 వన్డే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ అడుగులు వేస్తోంది. అలాంటప్పుడు బుమ్రా కు ఎందుకు అవకాశం ఇచ్చిందనేది అర్థం కావడం లేదు. ఇటీవలి ఐపీఎల్లో బుమ్రా గొప్పగా బౌలింగ్ చేయలేదు. అంతకుముందు టి20 వరల్డ్ కప్ లో కూడా తన స్థాయి ప్రదర్శన చేయలేదు. అలాంటప్పుడు అతనికి అవకాశం ఇచ్చి.. సిరాజ్ ను ఎందుకు దూరం పెట్టారో అర్థం కావడం లేదు.

విరాట్ కోహ్లీకి ఇంగ్లాండ్ టూర్ కు అవకాశం ఇచ్చారు. జట్టులోకి హర్షిత్ కూడా వచ్చేసాడు. అర్ష్ దీప్ సింగ్ ను జట్టులోకి తీసుకున్నారు. బ్రార్ కూడా అవకాశం కల్పించారు. అలాంటప్పుడు సిరాజ్ ను ఎందుకు దూరం పెట్టారు అనేది అర్థం కావడం లేదు. అతడిని ఈ సిరీస్ కు మాత్రమే దూరం చేస్తారా.. లేదా వన్డే వరల్డ్ కప్ లో కూడా ఇలానే వ్యవహరిస్తారా అనేది అర్థం కావడం లేదు.. ఇంగ్లాండ్ టూర్లో టీమ్ ఇండియాకు గిల్ నాయకత్వం వహిస్తాడు. కోహ్లీ.. విరాట్.. రాహుల్.. కిషన్.. సుందర్.. అక్షర్.. నితీష్.. కులదీప్.. బుమ్రా.. ప్రసిద్.. హర్షిత్.. అర్ష్ దీప్.. బ్రార్ ను మేనేజ్మెంట్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసింది. వచ్చే ఏడాది ప్రారంభమయ్యే వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా కు ఇంగ్లాండ్ టూర్ పెద్ద ముఖ్యం కానుంది.

జూలై 14 బర్మింగ్ హమ్, జూలై 16న కార్డీప్, జూలై 19న లార్డ్స్ లో 3 వన్డేలు జరుగుతాయి. తొలి వన్డే మధ్యాహ్నం 3:30 నుంచి.. రెండవ వండే సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల నుంచి.. చివరి వన్డే మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచి ప్రారంభమవుతాయి.

మాజీ సీఎం మనవడితో జాన్వీ కపూర్ ప్రేమాయణం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ పోస్ట్..

Janhvi Kapoor
Janhvi Kapoor

Janhvi Kapoor: రీసెంట్ గా విడుదలైన ‘పెద్ది’ చిత్రం తో నేషనల్ లెవెల్లో హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో మనమంతా చూశాము. ఇప్పటి వరకు ఆమె తన కెరీర్ లో చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే , ఈ సినిమా మరో ఎత్తు. ఎందుకంటే అన్ని వివాదాలు ఈ చిత్రం కారణంగా ఆమె మెడకు చుట్టుకున్నాయి. డైరెక్టర్ బుచ్చి బాబు ఆమె క్యారెక్టర్ ని అత్యంత నీచంగా ఈ సినిమాలో చూపించాడని , జాన్వీ కపూర్ మంచి పొటెన్షియల్ ఉన్న నటి అని , ఆమె ఇలాంటి పాత్రల్లో నటించడానికి అసలు ఎప్పుకుందో అర్థం కావడం లేదంటూ , ఆమెని అభిమానించే వాళ్ళు కూడా సోషల్ మీడియా ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే జాన్వీ కపూర్ మాత్రం ఇప్పటి వరకు ఈ వివాదం పై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు.

రెగ్యులర్ గా తన లైఫ్ ని ఎలా లీడ్ చేస్తుందో, ఇప్పుడు కూడా ప్రశాంతం గా తన లైఫ్ ని లీడ్ చేస్తోంది. పైగా ఇప్పుడు ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి పబ్బులకు , పార్టీలకు వెళ్లడం కూడా సోషల్ మీడియా లో సంచలనంగా మారింది. గత కొంతకాలంగా ఆమె మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే మనవడు , శిఖర్ పహారియా తో ప్రేమలో ఉంది. వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేసుకుంటున్నారు. ఈ క్రమం లో జాన్వీ కపూర్ ధరించిన లేటెస్ట్ నైట్ టీ షర్ట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు , ఆ టీ షర్ట్ పై ‘ఒకవేళ నేను తప్పిపోతే దయచేసి నన్ను శిఖర్ వద్దకు తీసుకెళ్లండి’ అని క్యాప్షన్ రాసుంది. ఒకరి పై ఒకరికి విపరీతమైన ప్రేమ ఉండడానికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

అంతే కాదు , త్వరలోనే పెళ్లి కబురు చెప్పాలని , అందుకోసం మేమంతా ఆతృతగా ఎదురు చూస్తున్నాం అంటూ చెప్పుకొచ్చారు నెటిజెన్స్. ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ వెల్లువ లాగా వస్తున్నాయి. కానీ జాన్వీ కపూర్ ఏ సినిమాకు కూడా అధికారికంగా ఇంకా కమిట్మెంట్ ఇవ్వలేదు. మరోపక్క ఈమెకు బాలీవుడ్ లో కూడా అవకాశాలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో జాన్వీ కపూర్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి చేరుకుంటుందని అంటున్నారు నెటిజెన్స్. మరి రాబోయే రోజుల్లో ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

ఐఐటీ జేఈఈ పరీక్ష తప్పాడు.. దేశం గర్వించే గొప్ప ఇస్రో సైంటిస్ట్ అయ్యాడు

IIT JEE Failure
IIT JEE Failure

IIT JEE Failure: కొడుకు నీట్ ర్యాంకు కొట్టాలి. కుమార్తె జేఈఈ మెయిన్స్ లో సత్తా చూపించాలి. వాళ్ళు ఎలా కష్టపడినా పర్వాలేదు.. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న పర్వాలేదు.. అవసరమైతే 24 గంటల పాటు చదవాలి. మార్కులు నూటికి నూరు శాతం రావాలి. మెజారిటీ తల్లిదండ్రుల అభిప్రాయం మొత్తం ఇలానే ఉంటుంది. అభిప్రాయం మాత్రమే కాదు పిల్లల మీద పెంచే ఒత్తిడి ఒక రేంజ్ లో ఉంటుంది. పదిమందిలో చెప్పుకోవడానికి.. తమకంటూ స్టేటస్ మైంటైన్ చేయడానికి.. ఇలా పేరెంట్స్ పిల్లల మీద అకారణమైన ఒత్తిడి తీసుకొస్తూ ఉంటారు. ఈ ఒత్తిడి పిల్లలను చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో పిల్లలు ఆ ఒత్తిడి తట్టుకోలేక.. తల్లిదండ్రుల అంచనాలు నిజం చేయలేక దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతుంటారు.

మనదేశంలో ప్రతి ఏడాది ప్రవేశ పరీక్షలు జరుగుతూనే ఉంటాయి. జాతీయస్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో విద్యార్థులు విపరీతంగా పోటీ పడుతూ ఉంటారు. జాతీయస్థాయి విద్యాసంస్థలు.. వైద్య కళాశాలలో ప్రవేశాలు పొందడం అంత సులభం కాదు. అందువల్లే పోటీ అధికంగా ఉంటుంది. ఆ పోటీని తట్టుకోవాలంటే విద్యార్థులు తీవ్రంగా కష్టపడాల్సి ఉంటుంది. అయితే అను సందర్భాల్లో పడిన కష్టానికి ప్రతిఫలం లభించదు. కొన్ని సందర్భాలలోనే అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎంత కష్టపడినప్పటికీ అనుకున్న స్థాయిలో మార్కులు రాకపోతే విద్యార్థులు డీలా పడిపోతుంటారు. కోరుకున్న ర్యాంకు రాక ఇబ్బంది పడతారు .. అలాంటప్పుడు కూడా పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తుంటారు. అన్ని డబ్బులు పోసి చదివించాం.. నీకు ర్యాంకు రాకపోతే ఎలా అంటూ మరింత ఇబ్బంది పెడుతుంటారు. అటువంటి తల్లిదండ్రులు ఇదిగో ఇలా మారిపోవాలి.. ఇలా మారితే పిల్లలు ఎంతటి ఫలితాలు సాధిస్తారో తర్వాత గాని అర్థం కాదు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ నగరానికి చెందిన సంకేత్ 2021లో జేఈఈ మెయిన్స్ రాసాడు. అప్పుడు రెండు మార్కుల తేడాతో సీట్ కోల్పోయాడు. దీంతో అతడు కుంగిపోలేదు. తల్లిదండ్రులు కూడా అతడి మీద ఒత్తిడి తీసుకురాలేదు. 2022 నుంచి యూట్యూబ్లో పాఠాలు వినడం మొదలుపెట్టాడు. అతడి కష్టం వృధాగా పోలేదు. అంతేకాదు అతడు ఐ సి టి కేరళలో సీట్ సాధించాడు. అందులో అకౌస్టిక్, వైబ్రేషన్ కోర్సులను తీసుకున్నాడు. అందులో అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఫలితంగా ఇస్రో సైంటిస్ట్ గా ఇప్పుడు ఉద్యోగం సాధించాడు.. సంకేత్ మొదట్లో జేఈఈ మెయిన్స్ రాసినప్పుడు రెండు మార్కుల తేడాతో సీట్ కోల్పోయినప్పుడు తల్లిదండ్రులు పెద్దగా అతనిని ఇబ్బంది పెట్టలేదు. ఒత్తిడి తీసుకురాలేదు. మరోసారి ప్రయత్నించు అని కూడా చెప్పలేదు. నీకు నచ్చితే చదువు.. లేకుంటే మానేయి అన్నారు. ఇబ్బందిగా ఉంటే చదువు పక్కన పెట్టి వేరే నీకు నచ్చిన రంగంలో దూసుకుపో అన్నారు. తల్లిదండ్రులు ఆ స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వడంతో అతడు యూట్యూబ్ లోనే పాఠాలు విన్నాడు. ఇప్పుడు ఏకంగా ఇస్రో సైంటిస్టు అయ్యాడు.

ఈ నెల 23న 'పెద్ది' విజయోత్సవ సభ.. ముఖ్య అతిథి ఎవరో తెలిస్తే మెంటలెక్కిపోతారు..

Peddi Success Meet
Peddi Success Meet

Peddi Success Meet: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓవర్సీస్, నార్త్ ఇండియా మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మార్కెట్స్ లో ఫ్లాప్ గా నిల్చింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో అయితే బయ్యర్స్ కి 50 శాతానికి పైగా నష్టాలు వాటిల్లాయి. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ రన్ పై నిర్మాత కూడా అసంతృప్తి వ్యక్తం చేసాడు. అయితే ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాలు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 330 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం ఏకంగా 450 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది అని అంటున్నారు , అందులో ఎలాంటి నిజం లేదని టాక్. ప్రతీ సినిమాకు లాగానే ఈ సినిమాకు కూడా నిర్మాతలు వేసిన ఒక ప్రమోషనల్ పోస్టర్ మాత్రమేనని అంటున్నారు.

ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ సభ కోసం అభిమానులు చాలా రోజుల నుండి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు ఒక గుడ్ న్యూస్. ఈ సినిమాకు సంబంధించిన విజయోత్సవ సభ ని ఈ నెల 23 వ తేదీన హైదరాబాద్ లోని శిల్ప కళా వేదిక లో నిర్వహించబోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బయ్యర్స్ ఈ ఈవెంట్ కి రానున్నారు. వాళ్లకు హీరో రామ్ చరణ్ చేత షీల్డ్స్ ని అందించబోతున్నారు మేకర్స్. అంతే కాకుండా ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి లేదా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లను స్పెషల్ గెస్ట్ గా పిలిచేందుకు సన్నాహాలు చేస్తున్నారట. రీసెంట్ గానే పెద్ది మూవీ కి సంబంధించి , మెగాస్టార్ చిరంజీవి బుచ్చి బాబు తో కలిసి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.

ఇది సినిమా థియేట్రికల్ రన్ కి ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు ఈ విజయోత్సవ సభ కూడా అదే రేంజ్ లో సినిమా థియేట్రికల్ రన్ ని ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొదటి 11 రోజులతో పోలిస్తే , సెకండ్ వీకెండ్ లో వసూళ్లు బాగా తగ్గిపోయాయి. కొత్త సన్నివేశాలను జత చేసినప్పటికీ కూడా ఉపయోగం లేకపోయింది. సినిమా నిడివి ఎక్కువ ఉండడం వల్ల, రిపీట్ ఆడియన్స్ థియేటర్స్ కి రావడానికి ఆలోచిస్తున్నారు. అందుకే చిరంజీవి లేదా పవన్ కళ్యాణ్ లను ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిథి గా పిలిస్తే , సినిమా రన్ కి చాల బూస్ట్ ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు.

దేశ రక్షణ రంగంలో మోడీ పెను సంచలనం

Indian Navy
Indian Navy

Indian Navy: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత దేశ భద్రతకు నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే సైనిక బడ్జెట్‌ భారీగా పెంచింది. ఆత్మనిర్భర్‌ భారత్‌లో భాగంగా సరికొత్త ఆయుధాలు దేశీయంగా తయారుచేస్తోంది. ఉన్న ఆయుధాల సామర్థ్యం పెంచుతోంది. ఈ క్రమంలో తాజాగా నౌకాదళ సామర్థ్యం మరింత బలపడింది. మూడు అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకలను భారత నౌకాదళంలో అధికారికంగా చేర్చారు. జూన్‌ 21న కోల్‌కత్తాలోని శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ ఓడరేవులో వీటిని అధికారికంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జలప్రవేశం చేయించారు. ఈ మూడు నౌకల పేర్లు ఐఎన్‌ఎస్‌ దుణగిరి, ఐఎన్‌ఎస్‌ సంశోధక్, ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌. ఈ మూడు వాహనాలు రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్‌ లక్ష్యానికి మరో మైలురాయిగా నిలుస్తాయి. మార్చి 30న అన్నీ డెలివరీ అయ్యాయి. 75 నుంచి 80 శాతం స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ఈ నౌకలు వేలాది ఉద్యోగాలు సృష్టించాయి. దేశీయ పరిశ్రమలు, ఇంజనీర్ల సృజనాత్మకత, కార్మికుల కృషి వల్ల ఈ విజయం సాధ్యమైందని మోదీ పేర్కొన్నారు.

ఐఎన్‌ఎస్‌ దుణగిరి..
స్టెల్త్‌ గైడెడ్‌ మిసైల్‌ ఫ్రిగేట్నీలగిరి శ్రేణి (ప్రాజెక్టు 17ఏ)లోని ఐదవ ఫ్రిగేట్‌ను గార్డెన్‌ రీచ్‌ షిప్‌ బిల్డింగ్‌ ఇంజనీర్స్‌ (జీఆర్‌ఎస్‌ఈ)లో తయారు చేశారు. దీని పొడవు 149 మీటర్లు, బరువు 6,670 టన్నులు. వేగం 32 నాట్లు వరకు చేరుతుంది. ఎనిమిది బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్షిపణులు, 32 బారక్‌–8 ఎయిర్‌ డిఫెన్స్‌ క్షిపణులు, 76 మిమీ సూపర్‌ రాపిడ్‌ గన్, ఏకే–630 క్లోజ్‌ ఇన్‌ వెపన్‌ సిస్టమ్, టాల్‌ ష్యేనా టార్పెడోలు, ఆర్‌బీయూ–6000 రాకెట్‌ లాంచర్లు వంటి ఆధునిక ఆయుధ వ్యవస్థలతో కలిసి ఉంటుంది. ఎల్‌ఎం–2248 ఎంఎఫ్‌–స్టార్‌ ఏఈఎస్‌ఏ రాడార్, హుమ్సా–ఎన్‌జీ సోనార్, శక్తి ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సూట్‌ వంటి సెన్సార్లు, హెలికాప్టర్‌ ఆపరేషన్‌ సామర్థ్యం దీన్ని బహుముఖ యుద్ధ వేదికగా మార్చాయి. సముద్ర, వాయు, భూమి లక్ష్యాలను ఒకేసారి ఎదుర్కోగలదు.

ఐఎన్‌ఎస్‌ సంశోధక్‌…
హైడ్రోగ్రాఫిక్‌ సర్వే వెసెల్‌ (సాంధయక్‌ శ్రేణి)జీఆర్‌ఎస్‌ఈలో నిర్మించిన ఈ సర్వే నౌక సముద్ర భౌగోళిక అధ్యయనాలు, ఓడరేవులు, లోతైన సముద్ర మార్గాల సర్వేలు చేయడానికి రూపొందించబడింది. పొడవు 110 మీటర్లు, బరువు సుమారు 3,400 టన్నులు. వేగం 18 నాట్లు మించి. డేటా అక్విజిషన్‌ అండ్‌ ప్రాసెసింగ్‌ సిస్టమ్, ఆటోనమస్‌ అండర్‌ వాటర్‌ వెహికల్‌ (ఏయువీ), రిమోట్లీ ఆపరేటెడ్‌ వెహికల్‌(ఆర్వీ), డిజిటల్‌ సైడ్‌ స్కాన్‌ సోనార్, డీజీపీఎస్‌ లాంగ్‌ రేంజ్‌ పొజిషనింగ్‌ వంటి అధునాతన పరికరాలతో అమర్చారు. నావిగేషన్‌ మార్గాల నిర్ణయం, మారిటైమ్‌ డొమైన్‌ అవేర్‌నెస్‌ పెంపుకు, విపత్తు సమయంలో సహాయక చర్యలకు ఉపయోగపడుతుంది. రెండు డీజిల్‌ ఇంజిన్లతో నడుస్తుంది.

ఐఎన్‌ఎస్‌ అగ్రయ్‌..
వాటర్‌ క్రాఫ్ట్‌యాంటీ సబ్‌మెరైన్‌ వార్‌ఫేర్‌ షాలో వాటర్‌ క్రాఫ్ట్‌ (ఏఎస్‌డబ్ల్యూ ఎస్‌డబ్ల్యూ సీ) శ్రేణిలో నాలుగోది. జీఆర్‌ఎస్‌ఈలో తయారైంది. పొడవు 77.6 మీటర్లు. భారత నౌకాదళంలోని అతిపెద్ద వాటర్‌ జెట్‌ ప్రొపల్షన్‌ వాహనాల్లో ఒకటి. లైట్‌ వెయిట్‌ టార్పెడోలు, స్వదేశీ రాకెట్‌ లాంచర్లు, షాలో వాటర్‌ సోనార్‌ వంటి వ్యవస్థలతో తీరప్రాంత జలాల్లో జలాంతర్గాములను గుర్తించి ఎదుర్కోవడానికి రూపొందించారు. మైన్‌ వార్‌ఫేర్, లిటోరల్‌ ఆపరేషన్స్‌కు కూడా సహాయపడుతుంది. 80 శాతం స్వదేశీ కంటెంట్‌తో నిర్మించిన ఈ క్రాఫ్ట్‌ తీర రక్షణను బలపరుస్తుంది.

ఈ మూడు నౌకలు భారత నౌకాదళం ామర్థ్యాన్ని, సముద్ర భద్రతను మరింతగా పెంచుతాయి. అధునాతన సాంకేతికత, స్వదేశీ నిర్మాణం వల్ల దేశం రక్షణ దిగుమతిదారు నుంచి రక్షణ నిర్మాతగా మారుతోందని ఈ కమిషనింగ్‌ స్పష్టం చేస్తుంది.

శ్రీలీల యోగాసనాలపై సోషల్ మీడియాలో ట్రోల్ల్స్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ వీడియో..

Sreeleela Yoga
Sreeleela Yoga

Sreeleela Yoga: సోషల్ మీడియా లో సినీ సెలబ్రిటీలపై ట్రోల్స్ , నెగెటివిటీ ఉండడం సర్వసాధారణమే. అయితే కొంతమంది సెలబ్రిటీలపై అవసరం లేని నెగెటివిటీ ఉంటుంది. వాళ్ళు ఏమి చేసినా ట్రోల్ చేయడానికి కొంతమంది రెడీ అయిపోతుంటారు. అలాంటి నెగెటివిటీ ని ఎదురుకుంటున్న వారిలో ఒకరు శ్రీలీల . హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ సమయం లోనే ఈమె స్టార్ గా మారింది. హిట్స్ పెద్దగా లేకపోయినప్పటికీ కూడా, ఈమెకు సినిమాల్లో ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇలాంటి అదృష్టం బహుశా ఏ హీరోయిన్ కి కూడా ఉండదేమో. కానీ సోషల్ మీడియా లో ఈమె పై నెగెటివిటీ మాత్రం పీక్ రేంజ్ లోనే ఉంటుంది. ఆమెకు డ్యాన్స్ తప్ప అసలు యాక్టింగ్ రాదనీ ఆమె నటించే ప్రతీ సినిమాలోని మైనస్ పాయింట్స్ బయటకు తెస్తే, ఆమె పేరే ముందుకు వస్తుందని , ఇలా ఎన్నో రకాల ట్రోల్స్ వేస్తుంటారు.

నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా , శ్రీలీల ఒక పబ్లిక్ యోగా ఈవెంట్ లో పాల్గొన్నది. అక్కడ ఈమె వేసిన కొన్ని ఆసనాలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ కొంతమంది నెటిజెన్స్ వెక్కిరిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన కొన్ని టాప్ పేజీలు శ్రీలీల పై ట్రోల్స్ వేయడం గమనార్హం. ఈరోజు ఆమె వేసిన యోగాసనాలను వెక్కిస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఒక బాలీవుడ్ పేజీ వేసిన వీడియో కి మిలియన్ల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. శ్రీలీల లాంటి మంచి అమ్మాయి ఇలాంటి నెగెటివిటీ ని ఎదురుకోవడం దురదృష్టం. ఆమె ప్రస్తుతానికి గొప్ప నటి అయ్యుండకపోవచ్చు , కానీ భవిష్యత్తులో నటన పరంగా వేరే లెవెల్ కి వెళ్లొచ్చు కదా , ఇలా నటన పరంగా ట్రోల్స్ ఎదురుకున్న ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు నేడు నేషనల్ అవార్డులను అందుకునే రేంజ్ కి ఎదగలేదా?, దేనికైనా కాలం కలిసి రావాలి అంటూ శ్రీలీల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి శ్రీలీల యోగాసనాలకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. అందులో వాళ్ళు ట్రోల్ చేసేంత స్టఫ్ ఉందా?, కనీసం మీరైనా మీ అభిప్రాయాన్ని కరెక్ట్ గా చెప్పండి అంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇకపోతే శ్రీలీల కి సినిమాల పరంగా ఈ ఏడాది కూడా అసలు కలిసిరాలేదు. ఏడాది ప్రారంభం లో సంక్రాంతి కానుకగా తమిళం లో విడుదలైన ‘పరాశక్తి’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలబడగా, తెలుగు లో ఆమె నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఇంకా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ప్రస్తుతం ఆమె ధనుష్ తో ‘ఓం’ అనే చిత్రం చేస్తుంది , అదే విధంగా బాలీవుడ్ లో మూడు సినిమాలు చేస్తోంది.

అనిల్ రావిపూడి రక్తంతో వీర తిలకం దిద్దిన వెంకటేష్ , కళ్యాణ్ రామ్.. వీడియో వైరల్..

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi: ప్రొమోషన్స్ చేసే విషయం లో ఎవడైనా అనిల్ రావిపూడి తర్వాతే అని పతీ సందర్భంగా నిరూపణ అవుతూనే ఉంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం తో ఆయన ప్రొమోషన్స్ లో సరికొత్త బెంచ్ మార్క్ ని క్రియేట్ చేశాడు. దానిని అందుకోవడం కష్టమని , ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి విడుదలకు ముందు పెద్దగా ప్రొమోషన్స్ చేయలేదు. కానీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో అల్లరి తో ఆ సినిమాపై అభిమానుల్లో , ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఏర్పడేలా చేశాడు . ఇక తాను వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో చేయబోయే మల్టీస్టార్రర్ చిత్రానికి షూటింగ్ మొదలు అవ్వకముందే తన క్రియేటివ్ మైండ్ తో సరికొత్త ఆలోచనలతో ప్రొమోషన్స్ మొదలు పెట్టేశాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ ని ఏ విధంగా ప్రకటించాడో మనమంతా చూశాము .

వైజాగ్ బీచ్ ఇసుక లో జీవీ ప్రకాష్ కుమార్ ని కప్పేసి , అతనితో మ్యూజిక్ సిట్టింగ్స్ వేయడం హిలేరియస్ గా అనిపించింది. సోషల్ మీడియా లో ఈ వీడియో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక నేడు ఈ సినిమా జానర్ ని ఆడియన్స్ కి ఆయన పరిచయం చేసిన విధానం చూస్తే నవ్వు ఆపుకోలేరు. ఆయనకు ఎవరో అభిమానులు కంటెంట్ కింగ్ అని సన్మానం చేసి , కత్తి చేతిలో పెట్టారని, ఈ సినిమాకు అన్ని ఐడియాలు నేనే ఇస్తున్నాను , మీరు కూడా ఎదో ఒకటి ఇవ్వండి అని వెంకటేష్ ని దబాయించడం , అందుకు వెంకటేష్ అనిల్ రావిపూడి చేతిలో కత్తి తీసుకొని , అతని వేలు కోసి , ఆ రక్తం తో అనిల్ రావిపూడి కి వీర తిలకం దిద్దడం , ఆ తర్వాత కళ్యాణ్ రామ్, హీరోయిన్లు కూడా అదే పని చేయడం , చూసేందుకు చాలా ఫన్నీ గా అనిపించింది.

అసలు కామెడీ విషయం లో ఇలాంటి క్రియేటివ్ ఆలోచనలు అనిల్ రావిపూడి కి ఎలా వస్తాయో అర్థం కాదు , అతని లాగా కామెడీ ని పండించే డైరెక్టర్ ప్రస్తుతం ఇండియా లోనే లేదు, వచ్చే సంక్రాంతికి మరో 300 కోట్ల గ్రాసర్ ని కొల్లగొట్టబోతున్నాడు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనిల్ రావిపూడి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమా, ఈ జానర్ లో అనిల్ రావిపూడి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడో చూడాలి. కళ్యాణ్ రామ్ కి కూడా ఈ సినిమా కెరీర్ టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని అంటున్నారు. రేపటి నుండే ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

బంగ్లాదేశ్‌లో మార్మోగిన రామనామం.. విగ్రహ వివాదంతో రోడ్డెక్కిన హిందువులు!

Bangladesh Hindu Protest
Bangladesh Hindu Protest

Bangladesh Hindu Protest: మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌ జైశ్రీరామ్‌ నినాదాలతో హోరెత్తుతోంది. దేశంలోని ఉత్తర ప్రాంతం గైబాంధా జిల్లా పలాష్‌బారి ఉపజిల్లాలో శ్రీశ్రీ రాధా గోవింద ఆలయ కమిటీ 81 అడుగుల ఎత్తైన రాముడి విగ్రహ నిర్మాణం చేపట్టింది. ఇది బంగ్లాదేశ్‌లో అతి పెద్ద రాముడి విగ్రహం. నిర్మాణం దాదాపు 80 శాతం పూర్తయిన దశలో కొన్ని రాడికల్‌ ఇస్లామిస్ట్‌ గ్రూపుల నుంచి బెదిరింపులు వచ్చాయి. ఆలయ అధ్యక్షుడు హరిదాస్‌ చంద్ర దాస్‌ ప్రకారం, నిర్మాణాన్ని ఆపాలని ఒత్తిడి తెచ్చారు. దీంతో విగ్రహ నిర్మాణం తాత్కాలికంగా నిలిచిపోయింది. ఈ సంఘటన హిందూ మైనారిటీ సముదాయంలో ఆందోళన కలిగించింది. వారు ఇది మత స్వేచ్ఛకు ఆటంకం అని భావిస్తున్నారు.

రాముడిని అవమానించేలా ప్రదర్శన..
విగ్రహ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ఒక ప్రదర్శనలో రాముడి చిత్రం అవమానించబడినట్లు ఆరోపణలు వచ్చాయి. స్థానికంగా ఒక సమూహం ఆలయ సమీపంలో నిర్వహించిన కార్యక్రమంలో రాముడి చిత్రం మీద చెప్పు ఉంచినట్లు, విగ్రహాన్ని కూల్చేస్తామని బెదిరించినట్లు నివేదికలు ఉన్నాయి. ఈ ఘటనతో హిందూ సముదాయం ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు ఇది మతపరమైన అవమానం అని, చట్టవిరుద్ధమైన చర్య అని వాదిస్తున్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు మొత్తం జనాభాలో సుమారు 8 శాతం ఉన్నారు. 2024లో జరిగిన రాజకీయ మార్పుల తర్వాత మైనారిటీలపై దాడులు, ఆలయాలపై దాడులు పెరిగినట్లు కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ సంఘటన ఆ ఆందోళనలను మరింత పెంచింది.

రాజధానిలో ర్యాలీలు..
ఈ సంఘటనల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో వేలాది మంది హిందువులు, ముఖ్యంగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చారు. షాహబాగ్‌ ఇంటర్‌సెక్షన్‌ వద్ద టార్చ్‌లతో ర్యాలీలు జరిగాయి. ‘‘జై శ్రీ రామ్‌’’ నినాదాలు ఇచ్చారు. డాకా యూనివర్సిటీ, జగన్నాథ్‌ యూనివర్సిటీ విద్యార్థులు టార్చ్‌ ర్యాలీలు నిర్వహించారు. ఈ నిరసనలు జూన్‌ 19, 2026న తీవ్రమయ్యాయి. ర్యాలీలో ట్రాఫిక్‌ అడ్డుకోవడం, ప్రధాన రోడ్లపై నిరసనలు జరిగాయి. హిందూ మహాజోట్‌ వంటి సంఘాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నట్లు తెలిసింది. నిరసనకారులు రాముడి చిత్రం అవమానించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, విగ్రహ నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వారు 72 గంటల గడువు ఇచ్చి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రకటించారు.

ప్రభుత్వం ముందు డిమాండ్లు..
నిరసనకారులు బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, హిందూ మైనారిటీల హక్కులను రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. మతపరమైన స్థలాలపై బెదిరింపులను అరికట్టాలని, మత స్వేచ్ఛను నిర్ధారించాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ విషయంలో నిర్దిష్ట చర్యలు తీసుకున్నట్లు స్పష్టమైన సమాచారం లేదు. పోలీసు కేసు నమోదు అయినట్లు కొన్ని నివేదికలు ఉన్నాయి. కానీ అరెస్టులు జరగలేదని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో మైనారిటీ హక్కుల రక్షణ ఎంత ముఖ్యమో మళ్లీ చర్చకు తెచ్చింది.

మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులపై వివాదం..
ఈ వివాదం బంగ్లాదేశ్‌లో మత స్వేచ్ఛ మరియు మైనారిటీ హక్కుల సమస్యను స్పష్టంగా బయటపెట్టింది. రాముడి విగ్రహ నిర్మాణం ఒక సాంస్కృతిక, మతపరమైన చిహ్నం. దాన్ని బెదిరింపులతో నిలిపివేయడం మైనారిటీల హక్కులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో, ఇలాంటి నిర్మాణాలు స్థానిక సమాజంలో వ్యతిరేకతను కలిగించవచ్చు. రెండు వైపుల ఆందోళనలు చట్టబద్ధమైన మార్గంలో పరిష్కరించాలి. బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మైనారిటీల రక్షణకు చట్టాలు కలిగి ఉంది. కానీ అమలు బలహీనంగా ఉంటే ఇలాంటి ఉద్రిక్తతలు వస్తాయి. హిందూ సముదాయం తమ హక్కుల కోసం శాంతియుతంగా నిరసనలు చేయడం ప్రజాస్వామ్య సూత్రం. అయితే, ఇది విస్తరించకుండా నిరోధించడం అవసరం.ఈ సంఘటన బంగ్లాదేశ్‌లో మత సామరస్యం ఎంత సున్నితమైనదో చూపిస్తోంది. ప్రభుత్వం వేగంగా, న్యాయబద్ధంగా స్పందించాలి. రెండు సముదాయాల మధ్య సంవాదం ద్వారా పరిష్కారం సాధ్యం. లేకపోతే ఇలాంటి వివాదాలు ప్రాంతీయ స్థిరత్వాన్ని ప్రభావితం చేయవచ్చు.

మత స్వేచ్ఛ అందరికీ ఉండాలి. అది ఏ మతానికైనా సంబంధించినది కావచ్చు. ఈ వివాదం నుంచి బంగ్లాదేశ్‌ ప్రభుత్వం సమాజం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. మైనారిటీల రక్షణ, మత సామరస్యం కోసం బలమైన చర్యలు అవసరం.

ఎన్టీఆర్ తన ఫ్రెండ్స్ ఎవ్వరితో కలవడం లేదా..? కారణమేంటంటే..?

NTR Friends
NTR Friends

NTR Friends: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘డ్రాగన్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే 2000 కోట్లకు పైన కలెక్షన్స్ ను కొల్లగొట్టాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంతకు ముందు వచ్చిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న ఈ సినిమాలు మరో ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేయగలిగే కెపాసిటి ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు కావడం విశేషం… ఇక జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఎందుకంటే తన తోటి హీరోలందరు వరుస సక్సెస్ లను సాధిస్తున్నారు.

భారీ విజయాలను కొల్లగొడుతూ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే వెనకబడిపోవడం అతని అభిమానులను బాధిస్తుంది…జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో తన ఫ్రెండ్స్ ఎవరిని పెద్దగా కలవడం లేదట. ఒకప్పుడు రాజీవ్ కనకాలతో తను చాలా సన్నిహితంగా ఉండేవాడు.

కానీ గత కొద్దిరోజుల నుంచి రాజీవ్ కనకాలతో కూడా పెద్దగా కలవడం లేదట. ఇక ఫామిలీ పనుల్లో బిజీగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ సమయం దొరికిన ప్రతిసారి తన ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇష్టపడుతున్నారట. అంతే తప్ప బయట ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు పబ్బులు అంటూ తిరిగే పరిస్థితి లేదంటూ తను తన సన్నిహితుల దగ్గర చెబుతున్నట్టుగా తెలుస్తుంది.

మొత్తానికైతే జూనియర్ ఎన్టీఆర్ గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక సినిమా షూటింగ్ సమయంలో లొకేషన్ లోనే ఉంటూ బిజీగా గడుపుతున్న ఆయన షూటింగ్ లేని సమయంలో ప్రతిసారి ఫ్యామిలీతోనే స్పెండ్ చేస్తుండటం విశేషం…