Home Blog Page 89

మీ జేబులో 500 ఉన్నాయా.. తెలంగాణలో ఈ అడవి మొత్తం తిరిగి రావచ్చు..

Mulugu Jungle Safari

Mulugu Jungle Safari : నేటి కాలంలో మనుషుల జీవితాలు అత్యంత ఒత్తిడి లో కూరుకుపోతున్నాయి. చదువు.. కెరియర్.. ఉద్యోగం.. ఇంకా రకరకాల వాటి చుట్టూ తిరగడం వల్ల మనుషులకు సంతోషం అనేది లేకుండా పోతుంది. ఒత్తిడి వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు శరీరం మీద దాడి చేస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మనుషులకు కాస్త ప్రశాంత వాతావరణం కావాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రశాంత వాతావరణం అనేది ఒకరకంగా కష్టమే. భూముల విలువ పెరిగిపోతోంది. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్స్ మాదిరిగా నగరాలు.. పట్టణాలు మారిపోతున్నాయి. రిలాక్స్ కోసం వెళ్లాలంటే దూరప్రాంతాలకు ప్రయాణం సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు అటువంటి అవకాశాలు లేకుండా ప్రభుత్వం ఒక సౌకర్యం కల్పించింది.

తెలంగాణ రాష్ట్రం నుంచి ఇతర ప్రాంతాలను సందర్శించడానికి ప్రజలు ప్రతి ఏడాది భారీగా వెళ్తుంటారు. ఫలితంగా ప్రభుత్వం భారీగా పర్యాటక ఆదాయాన్ని కోల్పోతోంది. ముఖ్యంగా అడవులను.. ఇతర ప్రాంతాలను సందర్శించేవారు భారీగా పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం అడవుల్లో రకరకాల సదుపాయాలు కల్పించింది. ముఖ్యంగా సఫారీని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పర్యటకులు జంగిల్ సఫారీని ఆస్వాదిస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతాల్లో ములుగు ఒకటి. ఇక్కడ పర్యాటకులకు మరింత ఆహ్లాదాన్ని అందించేందుకు అటవీశాఖ రకరకాల మార్గాలను అన్వేషించింది. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం జంగిల్ సఫారీని అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనిని తాడ్వాయి అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసింది.. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత దట్టమైన అటవీ ప్రాంతం ములుగు నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇక్కడి అభయారణ్యంలో అనేక రకాల జంతువులు ఉంటాయి.

ఈ నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు అధికారులు తాడ్వాయి మండలంలో జంగిల్ సఫారీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏకంగా 22 లక్షల విలువైన రెండు వాహనాలను కొనుగోలు చేశారు.. పర్యాటకుల దగ్గర 500 చొప్పున తీసుకొని.. 36 కిలోమీటర్ల మేర అడవుల్లో తిప్పుతున్నారు. అభయారణ్యంలో ఉన్న అడవులలో అందాలను దగ్గరుండి చూపిస్తున్నారు. ఒక్కో వాహనంలో పదిమంది కూర్చునే అవకాశం ఉంది.

జంగిల్ సఫారీ లో భాగంగా పర్యాటకులు విపరీతమైన ఆనందాన్ని పొందుతున్నారు.. తాడ్వాయి, ఏటూరు నాగారం 163 నేషనల్ హైవే నుంచి 8 కిలోమీటర్లు అడవిలోకి తీసుకెళ్తున్న అధికారులు.. అక్కడి నుంచి అభయారణ్యం మొత్తాన్ని చూపిస్తున్నారు. అడ్డగుట్ట మీద నిర్మించిన పగోడా నుంచి అటవీ అందాలను పర్యాటకులు చూస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.. పస్రా మార్గంలోని పీకాక్ పోర్టును చూసి పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ అడవిని చూసేందుకు ఎత్తైన వాచ్ టవర్ నిర్మించారు. ఈ ప్రాంతంలో నెమళ్లు అరుపులతో సందడి చేస్తున్నాయి. మరో ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్లాక్ బెర్రీ ఐలాండ్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఇది దట్టమైన అడవిలో సహజసిద్ధంగా ఏర్పడిన ఐలాండ్. హైదరాబాదు నుంచి మొదలు పెడితే ఢిల్లీ వరకు ఎంతోమంది పర్యాటకులు ఇక్కడికి వస్తున్నారు. ప్రకృతి ప్రియులు కూడా ఇక్కడ పరిశోధనలు సాగిస్తున్నారు.

నగదే కాదు, బంగారం, వజ్రాలు కూడా.. అయోధ్యలో ఏం జరిగింది..సిట్ ఏం చేస్తోంది..

Ayodhya donation scam

Ayodhya Ram Temple controversy : వందల సంవత్సరాల కల నెరవేరింది. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మితమైంది. బాల రాముడిని ప్రతిష్టించిన తర్వాత అయోధ్యఖ్యాతి మరింత పెరిగిపోయింది. అయోధ్యకు ప్రతిరోజు వేలాదిమంది భక్తులు వెళ్తున్నారు. రాముడిని దర్శించుకుంటున్నారు. మొన్నటి వరకు అయోధ్య కేవలం భక్తుల తాకిడి.. రాముడికి సంబంధించిన పూజలు.. ఇతర వ్యవహారాలకు మాత్రమే పరిమితమయ్యేది. ఇప్పుడు అయోధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అయోధ్యకు సంబంధించిన వార్త ప్రతిరోజు అటు జాతీయ మీడియాలో.. ఇటు ప్రాంతీయ మీడియాలో ప్రధాన భాగం ఆక్రమిస్తుంది.

అయోధ్యలో శ్రీరాముడికి సంబంధించి చాలామంది భక్తులు కానుకలు.. విరాళాలు సమర్పించారు. అయితే ఇందులో హుండీ ఆదాయం దారి తప్పిందని.. దుర్వినియోగమైందని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ముగ్గురు ఉన్నతాధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం రకరకాల కోణాలలో విచారణ నిర్వహిస్తోంది. దర్యాప్తును ముమ్మరం చేసిన నేపథ్యంలో సిట్ అధికారులు కీలక ఆదేశాలను జారీ చేశారు.

సిట్ అధికారులు ఇప్పటికే ఆలయ నిర్వహణను పర్యవేక్షిస్తున్న వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు అయోధ్య విడిచి వెళ్లకూడదని వారికి సూచించారు. అంతేకాదు, బ్యాంకు లావాదేవీలను.. ఇతర వ్యవహారాలను కూడా నిర్వహించవద్దని తేల్చి చెప్పారు. దీంతో ఏదో జరిగిందని.. అందువల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇటువంటి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది

ఇప్పటివరకు కేవలం హుండీ ఆదాయం మాత్రమే పక్కదారి పట్టిందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. స్వామివారికి వచ్చిన కానుకలలో బంగారం.. వజ్రాలు.. వెండి.. వాటికి సంబంధించిన రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేశారని తెలుస్తోంది.. ఉచ్చ నగలను సక్రమంగా నమోదు చేయలేదని.. భద్రపరిచే విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉన్నారని ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు గుర్తించారు.

గత ఏడాది కుంభమేళా జరిగింది. అప్పుడు స్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ నేపథ్యంలో వచ్చిన హుండీ సొమ్ముకు లెక్కా పత్రం లేకుండా పోయింది. ప్రతిరోజు దాదాపు 10 లక్షల మంది నాడు ఆలయాన్ని దర్శించుకున్నారు. గంటల వ్యవధిలోనే నోట్లతో హుండీలు నిండిపోయేవి.. అంతేకాదు వీటిపై సరైన పర్యవేక్షణ కూడా లేకుండా పోయింది. లెక్కలు కూడా నమోదు చేయలేదు. దీనికి తోడు 45 రోజుల సిసి ఫుటేజ్ మాత్రమే అందుబాటులో ఉండడం అధికారులకు సవాల్గా మారింది. ఫుటేజ్ డిలీట్ చేయడం.. తారుమారు చేయడం వంటి సంఘటనలు జరిగిన నేపథ్యంలో.. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇంటి దొంగలను ఏ విధంగా బయట పెడతారో చూడాల్సి ఉంది.

అదృష్టం అంటే ఇతడిదే 500 పెడితే.. మూడు కోట్లు వచ్చాయి..

Lottery
Lottery

Kalyan Chand lottery winner : మనం బాగా అనుకున్నది అన్ని సందర్భాలలో నెరవేరదు. మనం కలలో కూడా ఊహించంది ఒక్కోసారి నెరవేరుతుంది.. పైగా మనల్ని ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఇతడికి కూడా అలాంటిదే ఎదురయింది. ఫలితంగా అతడి రాత మారిపోయింది. అతడి జీవితం ఒక్కసారిగా కీలకమైన మలుపుతీసుకుంది. అంతేకాదు.. అతడిని జాతీయస్థాయిలో నిలబెట్టింది.

అతడి పేరు కళ్యాణ్ చంద్. టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇతడి సొంత ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రా జిల్లా ఫతేపూర్. టాక్సీ డ్రైవర్ గా పని చేసే కళ్యాణ్.. డబ్బు సంపాదించడానికి అనేక రకాలుగా కష్టాలు పడేవాడు. అయితే ఖర్చులకు, అతడి ఆదాయానికి పొంతన కుదిరేది కాదు. ఈ నేపథ్యంలో అతడికి ఒక కిరాయి వచ్చింది. ఒక ప్రయాణికుడు పంజాబ్ రాష్ట్రంలోని బటిండా కు వెళ్లాలని కోరడంతో.. ఒప్పుకున్నాడు కళ్యాణ్. ఆ తర్వాత అతడిని తన వాహనంలో పంజాబ్లోని బటిండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ అతడిని దింపాడు.

స్థానికులు లాటరీ గురించి చర్చించుకుంటూ ఉండగా.. కళ్యాణ్ అక్కడి స్టాల్ లో 500 రూపాయల విలువైన రెండు లాటరీ టికెట్లు కొనుగోలు చేశాడు. జీవితం ఏదైనా టర్న్ తీసుకుంటుందో.. అదృష్టం ఏమైనా తలుపు తడుతుందో అనుకుని.. ఆశావాహ దృక్పథంతో ఆ లాటరీ టికెట్లను అతడు కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోయాడు.

ఇటీవల రతన్ లాటరీ స్టాల్ లో డ్రా తీయడం మొదలుపెట్టారు. అయితే కళ్యాణ్ జీవితం మారిపోయే విషయం స్టాల్ నిర్వాహకులు చెప్పారు. ఎందుకంటే కళ్యాణ్ కొనుగోలు చేసిన టికెట్లు ఒకదానికి మూడు కోట్ల లాటరీ తగిలింది. ఈ విషయాన్ని నిర్వాహకులు ఫోన్ చేసి చెప్పడంతో కళ్యాణ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిన్నటిదాకా అతడు మామూలు టాక్సీ డ్రైవర్.. ఇప్పుడు ఏకంగా కోటీశ్వరుడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు కోట్లకు అధిపతి.. లాటరీలో మూడు కోట్లు రావడంతో కళ్యాణ్ తన ఆనందాన్ని చుట్టుపక్కల వారితో గట్టిగానే పంచుకున్నాడు..

“ఇలాంటి రోజు ఒకటి వస్తుందని అనుకోలేదు. చిన్నప్పటినుంచి పేద కుటుంబంలోనే జీవించాల్సి వస్తోంది. చాలా కోరికలు ఉన్నాయి. గొప్ప గొప్ప ఆశయాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చుకోవాలి. నా వంతుగా జీవితాన్ని ఆస్వాదించాలి. మా వాళ్లకు కూడా మెరుగైన భవితవ్యాన్ని ఇవ్వాలి. అందుకోసం ఈ డబ్బులు ఖర్చు పెడతాను. కొంత భవిష్యత్తు కోసం దాచుకుంటానని” కళ్యాణ్ కన్నీటి పర్యంతమవుతూ చెబుతున్నాడు.

'మా ఇంటి బంగారం' 2 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఈ రేంజ్ గ్రాస్ అసలు ఊహించలేదు..

Maa Inti Bangaram 13 Days Collections
Maa Inti Bangaram 13 Days Collections

Maa Inti Bangaram collections : కొంతకాలం గ్యాప్ తర్వాత సమంత ప్రధాన పాత్ర పోషించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై , మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. మొదటి రోజే దాదాపుగా 50 శాతం కి పైగా రీకవరీ ని సొంతం చేసుకున్న ఈ సినిమా , రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని , లాభాల్లోకి అడుగుపెట్టి క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ కి ఇచ్చిన ఊపుని కొనసాగిస్తూ , ఇప్పుడు సమంత కూడా భారీ వసూళ్లను , లాభాలను రాబట్టడం చూస్తుంటే , టాలీవుడ్ కి మళ్లీ మంచి రోజులు మొదలయ్యాయి అని అనిపిస్తోంది. 2 రోజుల్లో ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత వసూళ్లు వచ్చాయో ఒకేసారి చూద్దాం.

తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు ఈ చిత్రానికి 2 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి , కానీ రెండవ రోజున 3 కోట్ల 27 లక్షలు వచ్చాయి. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా, ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి కదలడం మొదలు పెట్టారు. అందుకే ఈ రేంజ్ లో వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా చూస్తే మొదటి రోజు 6 కోట్ల 16 లక్షల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజున 6 కోట్ల 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా విడుదలకు ముందు 12 కోట్ల రూపాయలకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 80 లక్షల రూపాయిల లాభాలు వచ్చాయి. ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 3 కోట్ల 11 లక్షలు రాగా, ఆంధ్ర ప్రదేశ్ నుండి 2 కోట్ల 51 లక్షలు.

అదే విధంగా తమిళనాడు నుండి 53 లక్షలు రాగా, కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 35 లక్షలు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే కేవలం రెండు రోజుల్లోనే 5 కోట్ల 30 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇది సాధారణమైన విషయం కాడు. ఓవరాల్ గా ఈ చిత్రానికి 2 రోజుల్లో 12 కోట్ల 80 లక్షలు , 26 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ రేంజ్ షేర్ వసూళ్లు రావడం ఈమధ్య కాలం లో చూడలేదు.

ఘీ రోస్ట్..21 ఏళ్ల అమ్మాయి క్రూరం.. దేశాన్నే షేక్ చేసింది..

Amrita Chauhan cas

Amrita Chauhan case : అది ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతం.. అక్కడ రాంకేష్ మీనా అనే యువకుడు యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఒకరోజు అతడు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయి చనిపోయాడు. అతడి మరణాన్ని అందరూ కూడా సహజమే అని అనుకున్నారు. పోలీసులకు మొదట్లో అనుమానం రాలేదు. ఆ తర్వాత ఒక చిన్న విషయంలో పోలీసులకు సందేహం ఏర్పడింది. అది కాస్త ఒక దారుణమని.. దీని వెనక పకడ్బందీ ప్రణాళిక ఉందని తేలింది.

రాంకేష్ వయసు 32 సంవత్సరాలు. ఇతడు ఢిల్లీలోని గాంధీ విహార్ ప్రాంతంలో ఉంటున్నాడు. కొంతకాలంగా యూపీఎస్సీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అతని జీవితంలోకి అమృతా చౌహన్ అనే అమ్మాయి వచ్చింది. ఆమె వయసు 21 సంవత్సరాలు. ఇద్దరి మధ్య దాదాపు 13 సంవత్సరాల వ్యత్యాసం ఉంది. ఇద్దరికీ లంకె కుదిరింది. ఆ తర్వాత రామ్ కేష్ ప్రిపరేషన్ అటకెక్కింది. ఇద్దరి మధ్య యవ్వారం జోరుగా సాగడం మొదలుపెట్టింది. వారిద్దరు ఒక గది తీసుకొని లీవ్ ఇన్ రిలేషన్ మొదలుపెట్టారు.

మొదట్లో వీరిద్దరి మధ్య అంత బాగానే జరిగింది. అమృతకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు రామ్ కేష్ వద్ద ఉన్నాయి. అయితే వాటిని తొలగించాలని పదేపదే కోరింది. దీంతో అతడు వాటిని తొలగించలేదు. గతంలో అమృత సుమిత్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం కొనసాగించింది. అప్పుడు వారిద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు తీశారు.. ఆ తర్వాత అతడి నుంచి దూరంగా వచ్చింది. తనకి దగ్గరైన తర్వాత అమృత గురించి రాంకేష్ ఆరా తీశాడు. ఆమె గురించి వివరాలు తెలిసిన తర్వాత.. సుమిత్ నుంచి ఆ వీడియోలు సేకరించాడు. ఆ వీడియోలు అతని ఫోన్లో ఉండడంతో తొలగించాలని అమృత పదేపదే కోరింది. దానికి రాంకేష్ ఒప్పుకోలేదు.

ఈ నేపథ్యంలో అమృత సుమిత్ కు మళ్లీ టచ్లోకి వెళ్ళింది. జరిగిన విషయం చెప్పింది. ప్రవేట్ వీడియోలను తొలగించడం లేదని.. ఇబ్బంది పెడుతున్నాడని అతడితో వాపోయింది. ఈ క్రమంలోనే అతడిని అంతం చేయాలని ఇద్దరు బలంగా అనుకున్నారు.. పగడ్బందీ ప్రణాళిక రూపొందించారు.. సందీప్ అనే వ్యక్తి సాయం తీసుకున్న సుమిత్.. మాస్కులు ధరించి రాంకేష్ ఉంటున్న ఇంట్లోకి వచ్చారు. అతడి గొంతు నులిమి చంపేశారు..

అమృత ఫోరెన్సిక్ సైన్స్ చదివిన విద్యార్థి కావడంతో.. పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ప్రణాళిక రూపొందించింది. రాంకేష్ మృతదేహంపై నెయ్యి పోసింది. ఆ తర్వాత వైన్ చల్లింది. అనంతరం లిక్కర్ కూడా పోసింది. ఆ తర్వాత గ్యాస్ లీక్ చేసి.. అగ్ని ప్రమాదం జరిగినట్టుగా దృశ్యాన్ని చిత్రీకరించింది.. అయితే మొదట్లో ఇదంతా కూడా ప్రమాదమని పోలీసులు భావించారు. సీసీ కెమెరాలు చూస్తే అందులో ఉన్న దృశ్యాలు పోలీసులకు అనుమానం కలిగించాయి. ఆ తర్వాత వారు లోతుగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. కీలక విషయాలను మొత్తం రాబట్టారు. తదపు 813 పేజీల చార్జిషీట్ కోర్టులో దాఖలు చేశారు. అమృత.. సుమిత్.. సందీప్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు..

అమృత వ్యవహార శైలి నచ్చకపోవడంతో కుటుంబ సభ్యులు గత ఏడాదిగా ఆమెకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇంత దారుణానికి పాల్పడడంతో తల ఎత్తుకోలేకపోతున్నారు. ఆమె జైల్లో ఉన్నప్పటికీ ఇంతవరకు ఒక్కసారి కూడా చూసేందుకు వారు వెళ్లలేదు. మరోవైపు ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం మాత్రమే కాదు.. సహజీవనం చేసేవారిలో వణుకు పుట్టించింది. ఈ దారుణాన్ని ఢిల్లీ పోలీసులు ఘీ రోస్ట్ అని పేర్కొంటున్నారు. ఇటువంటి దారుణాలకు పాల్పడేవారు ఒక పేరుతో ఘోరాలు చేస్తంటారని.. సహజీవనం చేసేవాళ్లకు ఈ ఘటన ఓ గుణపాఠమని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.

గాదె సాయి కృష్ణ కేసు.. కృష్ణలంక ఇన్ స్పెక్టర్ నాగరాజు ఇంటికి భారీగా మహిళలు.. ఏం జరగనుంది..

Gade Sai Krishna Case
Gade Sai Krishna Case

Gade Sai Krishna Case: కనిపించకుండా పోయిన రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ కేసు కు సంబంధించి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ బృందం గత మూడు రోజులుగా కృష్ణలంక.. రాణి వారి తోట.. మార్కాపురం.. వంటి ప్రాంతాలలో పరిశీలన జరుపుతోంది. పోలీసులను.. ఇతర సాక్షులను.. సాయి కృష్ణ స్నేహితులను విచారిస్తోంది. కీలకమైన సిసి ఫుటేజ్ సేకరించింది. సాయి కృష్ణ మాతృమూర్తి వాంగ్మూలాన్ని సేకరించింది.

అంతకుముందు సాయి కృష్ణ మాతృమూర్తి విజయవాడ సిపిని కలిశారు. తమ కుమారుడిని పోలీసులు తీసుకొచ్చిన తీరు.. అతడిని పెట్టిన ఇబ్బందులు.. ఆ తర్వాత అతడు కనిపించకుండా పోవడం.. వాటి విషయాలను పూస గుచ్చినట్టు చెప్పింది. అంతేకాదు సిపికి ఇన్ స్పెక్టర్ నాగరాజు మీద ఫిర్యాదు కూడా చేసింది. ఈ విషయాలను సిపి దర్యాప్తు బృందం అధికారులకు తెలియజేశారు. సిపి చెప్పిన విషయాలను కూడా నోట్ చేసుకున్న దర్యాప్తు బృందం పోలీసులు ఆ దిశగా విచారణ వేగవంతం చేశారు.

ఇప్పటికే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాయి కృష్ణ మాతృమూర్తిని పరామర్శించారు. న్యాయం జరిగే విధంగా చూస్తామని మాట ఇచ్చారు. అంతేకాదు కృష్ణలంక ఇన్ స్పెక్టర్ నాగరాజు ను సస్పెండ్ కూడా చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి నేరుగా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో ఈ కేసు విచారణ అత్యంత వేగవంతంగా సాగుతోంది. ఇప్పటికే మూడు రోజులపాటు అనేక ఆధారాలు సేకరించిన పోలీసులు.. మరి కొద్ది రోజుల్లో కీలక విషయాలను వెల్లడిస్తారని తెలుస్తోంది.

ఇది ఇలా సాగుతుండగానే ఇన్ స్పెక్టర్ నాగరాజు ను అరెస్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి.. నిన్నంతా మీడియాలో ఇదే వార్తలు సంచలనం కలిగించాయి. అయితే నాగరాజును అరెస్ట్ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయనకు ఊహించిన విధంగా ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. హత్య నేరం కింద ఆయన మీద కేసు నమోదు అయిన తర్వాత సామాజిక మాధ్యమాలలో ఆయనను రాబిన్ హుడ్ మాదిరిగా అక్కడ యువత జేజేలు పలుకుతోంది. యువత… మహిళలు అజిత్ సింగ్ నగర్ లో ఉన్న ఆయన ఇంటికి భారీగా వస్తున్నారు. ఆయనను అరెస్ట్ చేయవద్దని నినాదాలు చేస్తున్నారు.

ఇన్ స్పెక్టర్ నాగరాజు కృష్ణలంక లో బాధితులు స్వీకరించిన తర్వాత అక్కడ అమ్మాయిలు.. ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కొంతకాలంగా ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణం కొనసాగుతోంది. నేరాలు చేసిన వారి విషయంలో కఠినంగా ఉన్నారని అక్కసుతో నాగరాజు మీద చర్యలు తీసుకోవద్దని అక్కడి మహిళలు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలలో కూడా నాగరాజును కీర్తిస్తున్నారు. ఇప్పటికీ ఆయనకు అండగా చాలామంది నిలిచారు. అంతేకాదు బలమైన సామాజిక ఉద్యమాన్ని నిర్మిస్తామని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు రకరకాల మలుపులు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ధర్మస్థల వివాదమే కాదు.. ఏకంగా నాలుగు రాష్ట్రాల్లో.. ప్రకాష్ రాజ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్

Prakash Raj
Prakash Raj

Prakash Raj non bailable warrant : ఆమధ్య కర్ణాటక రాష్ట్రంలో ధర్మస్థల వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. అది కాస్త దేశంలోనే సంచలనం కలిగించింది. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ లోకి ప్రకాష్ రాజ్ ప్రవేశించారు. తీవ్రాతీతీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.. అక్కడితోనే ఆగిపోలేదు.. హిందువుల మీద.. హిందూ ధర్మం మీద దారుణంగా మాట్లాడారు. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ధర్మస్థల అంశం మీద ఏదో ఒక విషయాన్ని ప్రకాష్ రాజ్ తెర పైకి తీసుకొచ్చేవారు.

అప్పట్లో ధర్మస్థల వివాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నప్పటికీ.. ప్రకాష్ రాజ్ ఊరుకునేవారు కాదు. దీనికి తోడు ఆ ఆలయంలో పనిచేసిన చిన్నయ్య మరింత వివాదాన్ని కలిగించే విషయాలను చెప్పడంతో ప్రకాష్ రాజ్ ఇంకా ఎక్కువ రెచ్చిపోయేవారు. దీంతో ధర్మస్థల ఆలయ ప్రాశస్త్యం చాలావరకు దెబ్బతిన్నది. దీనికి తోడు కొన్ని మీడియా సంస్థలు కావాలని నెగిటివ్ స్టోరీస్ పబ్లిష్ చేసేవి.

ధర్మస్థల వివాదం మీద ఇప్పుడు ఒక క్లారిటీ రావడంతో.. ప్రకాష్ రాజ్ అసలు రంగు బయటపడుతోంది. దీనికి తోడు చిన్నయ్య కూడా కీలక విషయాలను చెప్పడంతో.. ఈ వ్యవహారం వెనుక పెద్ద వ్యవస్థీకృత ముఠా ఉన్నట్టు అందరికీ అర్థమవుతోంది. దీని వెనక భారీగానే డబ్బులు చేతులు మారాయని సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల ప్రకాష్ రాజ్ బెంగళూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండానే మధ్యలో వదిలి వెళ్ళిపోయారు.

ఇప్పుడిక ప్రకాష్ రాజ్ వ్యవహారం మరో మలుపుతీసుకుంది. ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంటీ నమోదయింది. ఆయన ఏకంగా నాలుగు రాష్ట్రాలలో ఓటర్ గుర్తింపు కార్డులు కలిగి ఉన్నారంటూ కేసు దాఖలయింది. 48వ ఏసీజేఎం కోర్టు శనివారం ప్రకాష్ రాజ్ కు వారెంట్ జారీ చేసింది. ప్రకాష్ రాజ్ పలచోట్ల ఓట్ హక్కు కలిగి ఉన్నారంటూ దిలీప్ కుమార్ అనే లాయర్ 2019లో బెంగళూరు నగరంలో హలసూరు గేటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన బిబి ఎంపీ.. కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ స్పందన లేకపోవడంతో కోర్టులో పిటిషన్ వేశారు. ప్రకాష్ రాజ్ తమిళనాడు.. ఆంధ్ర ప్రదేశ్.. కర్ణాటక.. తెలంగాణ రాష్ట్రాలలో ఓటు హక్కులు కలిగి ఉన్నారని దిలీప్ కుమార్ ఆరోపిస్తున్నారు. అయితే ఈ కేసు విచారణకు ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం విశేషం.

ఒకేసారి మూడు.. సముద్రాల పై భారత్ కు గట్టిపట్టు.. మోడీ ప్లాన్ అదిరిపోయింది గా..

India Naval Modernization
India Naval Modernization

India Naval Modernization: ఆకాశం, నీరు, నిప్పు.. ఈ మూడింటి ఆధారంగానే మనిషి మనుగడ సాగుతూ ఉంటుంది. వీటి మీద పట్టు చిక్కితే మనిషి జీవితం సులభం అవుతుంది. మనిషి అంటే కేవలం ఒకరు మాత్రమే కాదు.. ఈ యావత్ ప్రపంచం. నిప్పు మీద పట్టును కాస్త పక్కన పెడితే.. గగనం.. సంద్రం మీద పట్టు సాధించిన వారే గొప్పగా మనుగడ సాగిస్తూ ఉంటారు.

ఇప్పటివరకు ప్రపంచంలో అమెరికా.. రష్యా.. చైనా.. ఇంకా కొన్ని దేశాలు గగనతలం మీద పట్టు సాధించాయి.. సముద్రంలో కూడా సత్తా చాటాయి. అందువల్లే ఈ దేశాలకు ప్రపంచం మీద పెత్తనం ఎక్కువగా ఉంటుంది. అవి ఏం చెప్తే అదే చేయాలి. ఎలాంటి ఆదేశాలిస్తే వాటిని పాటించాలి.. అయితే ఇప్పుడు భారత్ వాటి సరసన చేరింది. మరి కొద్ది రోజుల్లో అయితే వాటిని మించిపోతుంది. దీనికి ప్రధాన కారణం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాలు.

గడచిన కొంతకాలంగా మన దేశ నౌకాదళ వ్యవస్థలోకి 40 యుద్ధ.. సర్వే నౌకలు.. జలాంతర్గాములు వచ్చాయి. ఇంకా 45 తదుపరి దశలో ఉన్నాయి. అంతేకాదు అత్యాధునిక స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన స్టెల్త్ ఫ్రీగేట్ ఐఎన్ఎస్ దునగిరి, సర్వే నౌక, ఐఎన్ఎస్ సంషోదక్, జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌక ఐఎన్ఎస్ అగ్రయ్ అనే మూడు నౌకలను ప్రధానమంత్రి ప్రారంభించారు. కోల్ కతా లోని శామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు వద్ద జరిగిన కార్యక్రమంలో వీటిని జాతికి అంకితం చేశారు. ఈ మూడు నౌకలు అత్యంత ప్రత్యేకమైనవి. వీటివల్ల మన నౌకాదళం మరింత బలాన్ని పెంచుకుంది.

దునగిరి

ఇది అత్యంత పెద్దది. స్టెల్త్ ఫ్రిగేట్ విభాగంలో ఇది బాహుబలి లాగా ఉంటుంది. శత్రువుల రాడార్లు.. సెన్సార్లకు ఏమాత్రం చిక్కదు. పైగా ఇది అత్యాధునిక టెక్నాలజీతో పనిచేస్తూ ఉంటుంది. మన నౌకా దళంలో ఐఎన్ఎస్ నీలగిరికి ప్రత్యేకమైన పేరు ఉంది. ఈ ప్రాజెక్టు 17 ఏ లో భాగంగానే దీనిని నిర్మించారు. ఇందులో బ్రహ్మోస్ మిస్సైల్స్.. మిడిల్ రేంజ్ మిస్సైల్స్.. మల్టీ ఫంక్షన్ సర్వే లైన్స్.. ట్రాక్ గైడెన్స్ రాడార్.. సోనార్ సెన్సార్లు.. ఎలక్ట్రానిక్ వార్ ఫెయిర్ వ్యవస్థలు ఇందులో ఉంటాయి. ఇది ఏకంగా 149 మీటర్ల పొడవు..6670 టన్నుల బరువు ఉంటుంది. ఇది గంటకు 52 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

సంషోదక్

ఇది హై అండ్ టెక్నాలజీ తో రూపొందించిన హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌక. ఇది పూర్తిగా సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. మహా సముద్రాల లోతును కొలుస్తూ ఉంటుంది. సముద్ర మార్గాలను నిత్యం అన్వేషిస్తూ ఉంటుంది. దీని పొడవు 110 మీటర్లు. బరువు 3400 టన్నులు ఉంటుంది. ఇది గంటకు 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. దీనిని దేశ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. నీటి అడుగున ఇది మ్యాపింగ్ చేస్తూ ఉంటుంది. దూర ప్రాంతాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. అటానమస్ అండర్ వాటర్ వాహకాలు ఇందులో ప్రత్యేకంగా ఉన్నాయి. మనుషులు లేకుండానే దీని ద్వారా సముద్ర అంతర్భాగంలో పరిశోధనలు సులభంగా చేయవచ్చు.

అగ్రయ్

దునగిరి, సంషోదక్ వంటి వాటితో పోల్చి చూస్తే అగ్రయ్ అత్యంత చిన్న నౌక.. ఇది పూర్తిగా జలాంతర్గామి విధ్వంసక యుద్ద నౌక. ఇది శత్రు జలాంతర్గములను గుర్తిస్తూ ఉంటుంది. వాటిని నిత్యం ట్రాక్ చేస్తూ ఉంటుంది. తేలికపాటి టార్పెడో లేదా రాకెట్ల ద్వారా వాటిని ఇది ధ్వంసం చేస్తూ ఉంటుంది. ఇందులో షాలో వాటర్ సోనర్ వ్యవస్థ ఉంటుంది. ఇది అత్యంత కఠినమైన జలాల్లో కూడా పనిచేస్తూ ఉంటుంది.

ఈ రాశుల వారికి ఈరోజు అనుకోకుండా రాజయోగం..

Today 22 June 2026 Horoscope
Today 22 June 2026 Horoscope

Today 22 June 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈ రోజు రాజయోగం పట్టనుంది. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు లాభాల పంట పండే అవకాశం ఉంది. ఉద్యోగులు అధికారుల మద్దతుతో ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు. కొత్త ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. చట్టపరమైన చిక్కుల నుంచి బయటపడతారు. అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో ప్రాజెక్టులన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది.

మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారి జీవితం ఈరోజు సంతోషంగా గడుస్తుంది. కొత్తగా భూమి కొనాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. గతంలో ఉన్న వివాదాల నుంచి బయటపడతారు. ఉద్యోగులు కొత్త అవకాశాలను పొందుతారు. వ్యాపారులకు భారీగా ఆదాయం వస్తుంది. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు అనేక రంగాల్లో ఈరోజు విజయం సాధిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులు ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు ఆదాయ వనరులు పెరుగుతాయి. కొత్తగా బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో తమ పనితీరులో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గౌరవం లభిస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. స్నేహితుల సహకారంతో అప్పుల నుంచి బయటపడతారు. వీరి వ్యాపారం మెరుగ్గా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తయ్యే అవకాశం ఉంటుంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి వారు ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. కొత్తగా మొదలుపెట్టిన పనుల్లో విజయం సాధించి అవకాశం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉద్యోగులు పదోన్నతులు పొందే అవకాశం ఉంది.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగన్న ఫలితాలు ఉంటాయి. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తగా పెట్టుబడులు పెడతారు. పెండింగు పనులను పూర్తి చేస్తారు. ఆగిపోయిన డబ్బు వసూలు అవుతుంది. వ్యాపార కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెడతారు. గతంలో ఉన్న సమస్యల నుంచి బయటపడతారు పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈ రోజు కార్యాలయాల్లో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. అయితే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో కాస్త ఓపికతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు అనుకున్న స్థాయిలో పూర్తవుతాయి. ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈరోజు ఉత్సాహంగా కనిపిస్తారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. ఇలాంటి సమయంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంటికి సంబంధించిన కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. వ్యాపారులు ప్రత్యేక దృష్టితో ముందుకు వెళ్లాలి. ప్రత్యర్థులపై కన్నేసి ఉంచాలి. పాత అప్పుల నుంచి బయటపడతారు. ఉద్యోగులు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. కొత్తగా పెట్టుబడును పెట్టాలని అనుకుంటే ఇదే మంచి సమయం. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దూర ప్రయాణాలు చేయాల్సివస్తే జాగ్రత్తగా ఉండాలి. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి . డబ్బు వ్యవహారాల్లో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడును పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

మాకు ఆంటీలు మాత్రమే కావాలి..

Age Gap Relationships
Age Gap Relationships

Age Gap Relationships: ఏమైంది ఈ నగరానికి.. ఏమిటి ఈ దుమ్ము.. ఈ ధూళి..ఎవరూ నోరు మెదపరేంటి.. ఈ నిర్లక్ష్యానికి పాడాలి చరమగీతం.. సినిమా ప్రారంభంలో ఈ యాడ్ మనం చూసే ఉంటాం. ఇప్పటి యువతరానికి.. మధ్య వయసు ఉన్న వారికి కాస్త అనుకూలంగా మార్చుకుంటే.. దీని అర్థం మారిపోతుంది.. అది ఎలా ఉంటుందంటే..ఏమైంది ఈ యువతరానికి.. మధ్య వయసు వారికి.. ఏమిటి ఈ సంబంధాలు.. ఏమిటి ఈ వ్యవహారాలు.. సరైన ఈడు జోడు కాకుండా.. ఈ ఆంటీల పడుతున్నారు ఎందుకు.. వాళ్లనే ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు.. కొందరు వాళ్లతోనే జీవితాన్ని ఎందుకు గడపాలి అనుకుంటున్నారు.. ఇలా మారిపోతుంది..

ఆమధ్య ఉత్తర ప్రదేశ్ లో 20 సంవత్సరాల అబ్బాయి.. 40 సంవత్సరాలు మహిళ తో రిలేషన్ మొదలుపెట్టాడు. ఆమె భర్త వీరిద్దరి వ్యవహారాన్ని పోలీసులు దాకా తీసుకెళ్లాడు. అయినప్పటికీ ఆ అబ్బాయి ఆమెతోనే ఉంటానని బెట్టు చేశాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో.. ఆమె కూడా అతడి మాయలో ఉండడంతో.. రెండు కుటుంబాల సభ్యులు ఏమి చేయలేకపోయారు. చివరికి వదిలేసారు. వారిద్దరు ఇప్పుడు కలిసి ఉంటున్నారు. 40 ఏళ్ల వ్యక్తి 60 ఏళ్ల మహిళ, 35 ఏళ్ల మహిళ 27 ఏళ్ల వ్యక్తి.. 35 సంవత్సరాల వ్యక్తి 60 సంవత్సరాల మహిళ.. చెప్పుకుంటూ పోతే ఇటీవల కాలంలో ఎన్నో సంఘటనలు జరిగే.. సరైన ఈడు, జోడుతో కనిపించాల్సిన ఈ కాలపు పిల్లలు ఇలా మారిపోవడం నిజంగా ఆందోళన కలిగిస్తోంది. అలాగని ఈ బంధాలు మధ్యలోనే ఆగిపోవడం లేదు. పరిపక్వతతో సాగుతున్నాయి. కొందరైతే కేవలం డబ్బు కోసమే ఆ తరహా వ్యవహారాలకు పాల్పడుతున్నారు. తిరుపతిలో ఓ వ్యక్తి భర్తను కోల్పోయిన ఒక మహిళకు దగ్గరయ్యాడు. ఆమె డబ్బు మొత్తం తీసుకుని.. మోసం చేశాడు.. ఇటువంటి సంఘటనలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

నేటి కాలం అమ్మాయిలు ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకుంటున్నారు. వారికి ఆర్థిక స్వాతంత్రం కూడా అధికంగా ఉంది. అలాంటప్పుడు భర్త సంపాదన మీద లేదా భర్త అజమాయిషీలో ఉండాలని అనుకోవడం లేదు. అటువంటి వారితో నేటితరం అబ్బాయిలు సంసారం సరిగా చేయలేకపోతున్నారు. ప్రతిసారి గొడవలు.. ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో.. ఇలాంటి సంసారం అవసరమా అనుకుంటున్నారు. అందువల్లే వయసులో పెద్ద మహిళలను ఇష్టపడుతున్నారు. వారిలో మెచ్యూరిటీ ఉంటుందని.. ఖర్చులకు అంతగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని.. పైగా పరిపక్వతతో ఆలోచిస్తూ ఉంటారని.. అటువంటి వారితో గొడవలు జరగకపోగా.. మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని అబ్బాయిలు భావిస్తున్నారు. అందువల్ల ఇటువంటి బంధాలకు ఓటేస్తున్నారు. చాలావరకు నేటి కాలంలో ఇటువంటి రిలేషన్లే కొనసాగుతున్నాయి.

అయితే ఈ బంధాలు మొత్తం అన్ని గొప్పగా సాగుతున్నట్టు లేవు. కొన్ని మధ్యలోనే ముగిసిపోతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అబ్బాయిలు పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాలలో డబ్బు కోసం అలవాటు పడి.. నమ్మి వచ్చిన మహిళలను ముంచేస్తున్నారు. లేదా దారుణాలకు పాల్పడుతున్నారు. అయితే ఇటువంటి బంధాలు ప్రారంభంలో బాగుంటాయని.. ఆ తర్వాత మొదటికే మోసం తీసుకొస్తాయని.. అందువల్ల ఇటువంటి వాటిపట్ల ఆకర్షితులు కాకుండా ఉండడమే మంచిదని నేటి యువతకు మానసిక విశ్లేషకులు సూచిస్తున్నారు.

హార్ముజ్‌ జలసంధి.. ఇరాన్‌–అమెరికాకు చెలగాటం.. భారత్ కు ప్రాణ సంకటం!

Hormuz Strait
Hormuz Strait

Hormuz Strait: పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగాయి. హార్ముజ్‌ జలసంధిని మూసేశామని ఇరాన్‌ ప్రకటించగా, అది తెరిచే ఉంటుందని అమెరికా వాదిస్తోంది. ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య జరుగుతున్న మొండి పట్టుదల భారతదేశానికి తీవ్రమైన సవాలుగా మారుతోంది. ఇటీవల కుదిరిన శాంతి ఒప్పందం వల్ల హార్ముజ్‌ ద్వారా స్వేచ్ఛా రవాణా సాధ్యమవుతుందని భారత్‌ భావించింది. కానీ పరిస్థితి మళ్లీ మొదటి దశకు వెళ్లడంతో ఇంధన సరఫరాలు ప్రభావితం కావచ్చనే ఆందోళనలు మొదలయ్యాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలు..
హార్ముజ్‌ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన మార్గం. ప్రపంచంలోని మొత్తం చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలసంధి గుండా ప్రయాణిస్తుంది. ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసేయడం లేదా అందులో అడ్డంకులు కల్పించడం అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే దెబ్బ. మరోవైపు అమెరికా ఈ మార్గం ఎప్పుడూ తెరిచి ఉండాలని ఒత్తిడి చేస్తోంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు నిజమైన ఉద్రిక్తతలకు దారితీస్తోంది.

ఇరాన్‌–అమెరికా వార్‌ ఎఫెక్ట్‌..
భారతదేశం తన చమురు అవసరాల్లో ఎక్కువ భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఆ చమురు ఎక్కువగా హార్ముజ్‌ జలసంధి ద్వారానే వస్తుంది. ఇరాన్‌ ఈ మార్గాన్ని మూసేస్తే లేదా అమెరికా ఇరాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటే, భారత్‌ ఇంధన సరఫరాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల శాంతి ఒప్పందం వల్ల కొంత ఊరట లభించిందని భారత్‌ భావించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మళ్లీ ముందుకు వెళ్లడంతో ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది.

ఇంధన భద్రత, ఆర్థిక ప్రభావాలు..
హార్ముజ్‌ జలసంధి సమస్య భారత్‌కు కేవలం రవాణా సమస్య మాత్రమే కాదు. ఇది దేశ ఇంధన భద్రతనే ప్రశ్నార్థకం చేస్తోంది. చమురు ధరలు పెరిగితే దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరగడం, ద్రవ్యోల్బణం పెరగడం, ఆర్థిక వృద్ధి మందగించడం వంటి పరిణామాలు ఏర్పడతాయి. భారత్‌ ఇప్పటికే ఇంధన దిగుమతులపై భారీగా ఆధారపడి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉద్రిక్తతలు దేశానికి తీవ్రమైన ఆర్థిక భారం కలిగిస్తాయి. మరోవైపు భారత నావికులు, వాణిజ్య నౌకల సురక్ష కూడా ప్రశ్నార్థకం అవుతోంది.

ఈ పరిస్థితి భారతదేశం ఇంధన వనరుల వైవిధ్యీకరణను వేగవంతం చేయాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాలు (ఉదా: రష్యా, అమెరికా నుంచి దిగుమతులు), వ్యూహాత్మక చమురు నిల్వలు పెంచడం, పునరుత్పాదక ఇంధన వనరులపై ఎక్కువ దృష్టి పెట్టడం వంటి చర్యలు అవసరం. అదే సమయంలో దౌత్యపరమైన సమన్వయం ద్వారా హార్ముజ్‌ మార్గం సురక్షితంగా ఉండేలా చూడాలి.

గోపీచంద్ 'భరత వర్ష' మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా..? నిర్మాత పెద్ద సాహసమే చేస్తున్నారుగా..

Gopichand Bharata Varsha Budget
Gopichand Bharata Varsha Budget

Gopichand Bharata Varsha Budget: ఒకప్పుడు యాక్షన్ హీరో గా మాస్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో గా గోపీచంద్ కి ఉన్న పేరు ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లక్ష్యం మూవీ టైం లో ఈయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్ వసూళ్లు స్టార్ హీరోల సినిమాలకు సమానంగా ఉండేవి. విలన్ గా పాపులర్ అయ్యి , ఆ తర్వాత హీరో గా మారి ఈ రేంజ్ కి ఎదగడం అనేది సాధారణమైన విషయం కాదు. కానీ మధ్యలో వచ్చిన కొన్ని ఫ్లాప్స్, జనరేషన్ కి తగ్గట్టుగా తనని తానూ మార్చుకోవడం వల్ల మార్కెట్ ని కోల్పోవాల్సి వచ్చింది. స్టార్ హీరో స్థాయి నుండి కనీస స్థాయి మార్కెట్ లేని హీరో స్థాయికి పడిపోవాల్సి వచ్చింది. ఇది ఆయన అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసే విషయం.

అయితే సరైన సినిమా పడితే గోపీచంద్ కం బ్యాక్ భారీ రేంజ్ లో ఇస్తాడని ఇప్పటికీ నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే ఆయన్ని హీరో గా పెట్టి ఇప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన ‘భరత వర్ష ‘ అనే చిత్రం చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ బయటకి రాగా, ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సినిమా చాలా రిచ్ గా ఉంది , గోపీచంద్ రేంజ్ కి తగ్గ సినిమా లాగా అనిపిస్తోంది , కచ్చితంగా ఈ సినిమా తో ఆయన కం బ్యాక్ ఇస్తాడని అంతా అనుకున్నారు. అయితే ముందుగా ఈ చిత్రాన్ని నిర్మాతలు కేవలం 30 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు. గోపీచంద్ కి అంత మార్కెట్ లేదు , ఆయన మార్కెట్ కి అది మూడింతలు ఎక్కువ, అయినప్పటికీ రిస్క్ చేశారు నిర్మాతలు.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి ఆ బడ్జెట్ కాస్త 70 కోట్ల రూపాయలకు చేరిందని అంటున్నారు. అంటే అనుకున్న దానికంటే రెండింతలు ఎక్కువ బడ్జెట్ ఖర్చు అయ్యింది అన్నమాట. ఇంత బడ్జెట్ అయినప్పటికీ కూడా నిర్మాతలో ఎలాంటి భయం లేదట. ఎందుకంటే సినిమా ఔట్పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని , మరో 20 కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి నిర్మాత సిద్ధంగా ఉన్నాడని అంటున్నారు. మరి గోపీచంద్ డ్రీం ప్రాజెక్ట్ ఎంత వరకు సక్సెస్ అవుతుంది?, ఈ ఏడాది కం బ్యాక్ సినిమాలు ఎక్కువగా ఉన్నాయి , కరుప్పు తో సూర్య , పెద్ది తో రామ్ చరణ్ దిమ్మ తిరిగే రేంజ్ కం బ్యాక్స్ ఇచ్చారు , గోపీచంద్ కూడా అదే రేంజ్ కం బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

అనిల్ రావిపూడి కొత్త మూవీలో వెంకటేష్ కి ఆ డిఫెక్ట్ ఉంటుందా..?

Anil Ravipudi
Anil Ravipudi

Anil Ravipudi Venkatesh movie : సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తీయగలిగే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అనిల్ రావిపూడి ఒకరు… ప్రస్తుతం ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ గానే నిలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఇక పదోవ సినిమాతో కూడా పెను సంచలనాన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు. దానికోసమే వెంకటేష్ – కళ్యాణ్ రామ్ లను హీరోలు పెట్టి ఆయన చేస్తున్న ఒక భారీ మల్టీ స్టారర్ సినిమా విజయాన్ని సాధిస్తుందని అతనితో పాటు తన అభిమానులు కూడా భావిస్తున్నారు… ఇక ఇప్పటికే వెంకటేష్ తో నాలుగు సినిమాలను చేసిన అనిల్ రావిపూడి ఈ సినిమాలో అతన్ని చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో అతనికి ఒక డిఫెక్ట్ అయితే ఉంటుందట. ఆయన నత్తి మాట్లాడుతూ కనిపిస్తారట. దాంతోనే కామెడీని పండిస్తూ ఒక కొత్త వెంకటేష్ ను మనకు చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా అనిల్ రావిపూడి కామెడీని బేస్ చేసుకొని సినిమాలు చేస్తూ ఉంటాడు.

కాబట్టి ఈ సినిమాలో కూడా భారీ కామెడీ ఉండబోతుందట. దానికి తోడుగా యాక్షన్ సన్నివేశాలను కూడా పెద్ద ఎత్తున తెరకెక్కించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే వెంకటేష్ ఇప్పటివరకు నత్తితో తడబడుతూ మాట్లాడే క్యారెక్టర్ లో అయితే కనిపించలేదు.

కాబట్టి ఇది కచ్చితంగా కొత్తగా ఉంటుందని తన సన్నిహిత వర్గాల నుంచి కూడా కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటివరకు ఎవ్వరికి సాధ్యం కానీ రీతిలో వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి మరోసారి కమర్షియల్ సినిమాలకు పెద్దపీట వేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది.

మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో గొప్ప విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక అనిల్ రావిపూడి ఈ సంవత్సరం ఇప్పటికే చిరంజీవి తో ‘మన శంకర్ వరప్రసాద్’ అనే మూవీ చేసి 400 కోట్ల కలెక్షన్స్ ను కొల్లగొట్టాడు. ఇక రాబోయే సినిమాతో అంతకు మించిన వసూళ్లను రాబట్టాలనే ప్రయత్నం చేస్తున్నాడు…

అమెరికా వద్దన్నా రష్యానే.. భారత్ చేసిన పని తెలుసా?

India Russian Oil Imports
India Russian Oil Imports

India Russia oil imports : పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌ రష్యా ఆయిల్‌పై ఆధారపడటం పెరిగింది. క్రూడాయిల్‌ దిగుమతులు జూన్‌ నెలలో రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. ఈ నెలలో రష్యా నుంచి వచ్చే ఆయిల్‌ వాటా దేశ మొత్తం క్రూడాయిల్‌ దిగుమతుల్లో 53.5 శాతం వరకు పెరిగింది. పశ్చిమాసియాలో ఏర్పడిన సరఫరా అంతరాయాల నేపథ్యంలో భారత్‌ రష్యా నుంచి భారీగా కొనుగోలు చేస్తోంది.

దిగుమతి వివరాలు ఇలా..
గత నెలలో సగటున రోజుకు 19.1 లక్షల బ్యారెళ్ల చొప్పున రష్యా నుంచి క్రూడాయిల్‌ దిగుమతి చేసుకున్న భారత్, ఈ నెలలో 19వ తేదీ వరకు రోజుకు 26.6 లక్షల బ్యారెళ్ల స్థాయికి చేరింది. ఇది గత నెలతో పోలిస్తే సుమారు 39 శాతం పెరుగుదల. ఈ నెల మొత్తం మీద రష్యా నుంచి 23.5 లక్షల బ్యారెళ్లు (2.35 మిలియన్‌ బ్యారెల్స్‌ పర్‌ డే) దిగుమతి అయ్యే అవకాశం ఉందని అంచనా. ఇది ఇప్పటి వరకు నెలవారీగా అత్యధికం. ఇంతకు ముందు అత్యధికం 2023 మే నెలలో 22 లక్షల బ్యారెళ్లు.

అగ్రస్థానంలో రష్యా..
ప్రస్తుతం భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న దేశం రష్యానే. జూన్‌ నెలలో రష్యా వాటా 53.5 శాతం వరకు ఎగబాకింది. ఇది భారత్‌ ఎనర్జీ దిగుమతి వ్యూహంలో రష్యా ప్రాధాన్యతను మరింత బలపరుస్తోంది. రష్యా నుంచి వచ్చే ఆయిల్‌ను రిలయన్స్, నయారా వంటి ప్రధాన రిఫైనరీలు ప్రాసెస్‌ చేస్తున్నాయి.

ఇతర దేశాల నుంచి సరఫరా..
భారత్‌ యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి రోజుకు 6.3 లక్షల బ్యారెళ్లు, సౌదీ అరేబియా నుంచి రోజుకు 3.84 లక్షల బ్యారెళ్లు, వెనెజువెలా నుంచి రోజుకు 2.52 లక్షల బ్యారెళ్లు క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటోంది. ఈ మూడు దేశాల నుంచి మొత్తం సరఫరా 12.66 లక్షల బ్యారెళ్లు మాత్రమే ఉండగా, రష్యా సరఫరా దాదాపు రెండు రెట్లు ఎక్కువగా ఉంది. ఇరాక్, సౌదీ వంటి సంప్రదాయ సరఫరాదారుల వాటా గత కొన్ని నెలల్లో తగ్గుముఖం పట్టింది.

ఇంత భారీ దిగుమతి ఎందుకు..
పశ్చిమాసియాలో ఏర్పడిన ఉద్రిక్తతలు, సరఫరా మార్గాల్లో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో భారత్‌ రష్యా నుంచి భారీగా ఆయిల్‌ కొనుగోలు చేస్తోంది. రష్యా ఆయిల్‌కు లభిస్తున్న డిస్కౌంట్‌ ధరలు, నమ్మకమైన సరఫరా భారత్‌కు ఆకర్షణీయంగా మారాయి. ఈ భారీ దిగుమతులు దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరలను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతున్నాయి. భారత్‌ మొత్తం క్రూడాయిల్‌ అవసరాల్లో 80 శాతంపైగా దిగుమతి చేసుకుంటుంది. అలాంటి పరిస్థితిలో రష్యా నుంచి వచ్చే సరఫరా ఎనర్జీ భద్రతకు బలమైన ఆధారంగా నిలుస్తోంది. రిఫైనరీలకు తక్కువ ధరకు ముడిసరుకు లభించడం వల్ల లాభాలు పెరగడం, దేశ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

మొత్తంమీద  జూన్‌ నెలలో రష్యా ఆయిల్‌ దిగుమతులు భారత్‌ యొక్క ఎనర్జీ వ్యూహంలో కీలక మార్పును సూచిస్తున్నాయి. రష్యా ఇప్పుడు భారత్‌కు అతిపెద్ద నమ్మకమైన చమురు భాగస్వామిగా మారింది.

పాకిస్తాన్ బౌలర్ మీదికి బ్యాట్ లేపిన పొలార్డ్.. క్షణంలో బతికిపోయాడు.. వైరల్ వీడియో

Pollard vs Asif Mohammad

Pollard vs Asif Mohammad : పాకిస్తాన్ ప్లేయర్లకు క్రికెట్ ఎలా ఆడాలో తెలియదు. కనీసం వారికి జెంటిల్మెన్ లాగా బిహేవ్ చేయాలని సోయి కూడా ఉండదు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఉంటారు. చివరికి విమర్శలు ఎదుర్కొంటారు. ఇలా అనేక పర్యాయాలు జరిగినప్పటికీ పాకిస్తాన్ ఆటగాళ్లకు బుద్ధి రాదు. తాజాగా జరిగిన ఓ సంఘటన పాకిస్తాన్ ప్లేయర్ల లేకితనాన్నిమరోసారి బట్టబయలు చేస్తోంది.

అమెరికా వేదికగా మేజర్ లీగ్ క్రికెట్ జరుగుతోంది. ఈ టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టుకు సిస్టర్ ఫ్రాంచైజీగా ముంబై ఇండియన్స్ న్యూయార్క్ ఉంది. న్యూయార్క్ జట్టుకు పోలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఆదివారం నాడు వాషింగ్టన్ ఫ్రీడం జట్టుతో న్యూయార్క్ జట్టు ఆడింది. ఈ మ్యాచ్లో న్యూయార్క్ తరఫున పోలార్డ్ 100* సెంచరీ చేశాడు. 56 బంతుల్లో 11 ఫోర్లు.. నాలుగు సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. ఈ విండీస్ ఆటగాడు 2022లోనే ఐపిఎల్ కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఇప్పటికీ అతడు తన దూకుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. అంతేకాదు తాజా సెంచరీ తో టి20 క్రికెట్ చరిత్రలో హైయెస్ట్ రన్స్ కొట్టిన గేల్ 14,562 రికార్డును బద్దలు కొట్టాడు.

పోలార్డ్ 2014లో ఐపీఎల్ జరుగుతున్నప్పుడు స్టార్క్ మీదకు బ్యాట్ విసిరేసాడు. అప్పట్లో ఆ సంఘటన సంచలనగా నిలిచింది. అటువంటి దృశ్యమే మళ్ళీ రిపీట్ అయింది. ఆదివారం నాటి మ్యాచ్లో పోలార్డ్ 21 పరుగులు చేశాడు. అతడికి పాకిస్తాన్ మూలాలు ఉన్న అమెరికా బౌలర్ ఆసిఫ్ మహమ్మద్ బౌలింగ్ వేసాడు. అతని వేసిన బంతిని పోలార్డ్ డిఫెన్స్ ఆడాడు. బాల్ అందుకున్న ఆసిఫ్.. కోపంతో పోలార్డు వైపు విసిరేసే విధంగా చూశాడు. దీనికి పోలార్డ్ వెంటనే రెస్పాండ్ అయ్యాడు. కోపంతో బ్యాట్ లేపాడు. చివరికి తనను తాను నియంత్రించుకొని వెనక్కి తగ్గాడు.. లేకపోతే పాకిస్తాన్ బౌలర్ ఒళ్ళు హూనమయ్యేది.

ఈ మ్యాచ్లో వాషింగ్టన్ ఫ్రీడం జట్టు కొట్టుడుకు రికార్డులు మొత్తం బద్దలయ్యాయి. ఓవెన్ కేవలం ఓవెన్ 68 బంతుల్లోనే 155 పరుగులు చేశాడు. దీంతో వాషింగ్టన్ జట్టు 245/5 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్లో ఎంఐ జట్టు అంతగా ఆకట్టుకోలేకపోయింది. పోలార్డ్ సెంచరీ చేసినప్పటికీ విజయం సాధించలేక. 215/6 వద్ద ఆగిపోయింది. మొత్తంగా 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

నా దృష్టిలో టాలీవుడ్ టాప్ డ్యాన్సర్ అతనే అంటూ అక్కినేని అఖిల్ షాకింగ్ కామెంట్స్..

Akhil Akkineni
Akhil Akkineni

Akhil Shocking Comments: సినీ ఇండస్ట్రీ లో అక్కినేని నాగార్జున , మెగాస్టార్ చిరంజీవి కి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం ఎలాంటిదో దశాబ్దం నుండి మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకే తరానికి చెందిన బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయినప్పటికీ, వీళ్ళ మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు ఉండేవి కాదు, కమర్షియల్ గా రికార్డ్స్ పరంగా పోటీ ఉన్నప్పటికీ కూడా అన్నదమ్ములు లాగానే ఉంటూ వచ్చారు , నేటి తరం సూపర్ స్టార్స్ కి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆ కుటుంబం నుండి ఈ తరానికి చెందిన వాళ్ళు కూడా ఇంతే అన్యోయంగా ఉన్నారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ నాగార్జున కొడుకు అఖిల్ మధ్య ఉన్న స్నేహాన్ని చూసి , ఇరువురి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. రామ్ చరణ్ అఖిల్ ని తన చిన్న తమ్ముడు లాగా భావిస్తుంటాడు. అఖిల్ కి కూడా అదే సోదర భావం ఉంది.

రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘లెనిన్’ చిత్రం జులై 10 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా అఖిల్ ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలుపెట్టాడు. అందులో భాగంగా యాంకర్ సుమతో కలిసి ఒక కుకింగ్ ఇంటర్వ్యూ లో ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో భాగ్యశ్రీ భొర్సే కూడా పాల్గొన్నది. అఖిల్ ని సుమ ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ దృష్టిలో టాలీవుడ్ లో ది బెస్ట్ డ్యాన్సర్ ఎవరు?’ అని అడగ్గా, అందుకు అఖిల్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా రామ్ చరణ్ పేరు ని చెప్తాడు. టాలీవుడ్ లో ఎంతో మంది డ్యాన్సర్లు ఉండగా, రామ్ చరణ్ పేరే ప్రత్యేకించి చెప్పడానికి కారణం, అతని మీద ఉన్న లవ్ అని సోషల్ మీడియా లో అంటున్నారు నెటిజెన్స్. అంతే కాకుండా సుమ మరో ప్రశ్న అడుగుతూ ‘మీకు రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం కదా’ అని అంటుంది.

అందుకు అఖిల్ సమాధానం చెప్తూ ‘ఇష్టం కాదు..లవ్’ అని బదులిచ్చాడు. వీళ్లిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ని చూసి రామ్ చరణ్ ఫ్యాన్స్ అఖిల్ ని ట్యాగ్ చేస్తూ ‘లెనిన్ చిత్రం ఇక మీది కాదు , నాది ‘ అని బదులిస్తున్నారు. ఇక లెనిన్ విషయానికి ఈ చిత్రాన్ని ముందుగా మే 1 న విడుదల చెయ్యాలని అనుకున్నారు , ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల జూన్ 25 కి వాయిదా వేశారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా బ్యాలన్స్ ఉండడం తో ఇప్పుడు జులై 10 కి వాయిదా వేశారు. అఖిల్ కెరీర్ లో కచ్చితంగా ఈ చిత్రం ఒక ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని , ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదని అంటున్నారు, చూడాలి మరి ఎంత వరకు నిజం అవుతుంది అనేది.

17వ రోజున పుంజుకున్న 'పెద్ది' వసూళ్లు.. ఎంత గ్రాస్ వచ్చిందో చూస్తే నోరెళ్లబెడుతారు..

Peddi OTT Release
Peddi OTT Release

Peddi box office collection : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పెద్ది’ బాక్స్ ఆఫీస్ వద్ద ఇప్పటికీ డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తూనే ఉంది. 11 రోజుల తర్వాత కొంత డ్రాప్స్ ని సొంతం చేసుకున్నప్పటికీ , 2 వ వీకెండ్ మొదలయ్యే లోపు కాస్త వసూళ్లు ఊపందుకున్నాయి. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే , ఈ చిత్రానికి 3 వ శనివారం, అనగా 17 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. నైజాం , ఉత్తరాంధ్ర మరియు నెల్లూరు జిల్లాలు బాగా పికప్ అయ్యాయి. అందుకే ఇంత షేర్ వచ్చిందని అంటున్నారు. ఇకపోతే ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా నమోదైన వసూళ్లు ఎంతో ఒకసారి చూద్దాం. ముందుగా బ్రేక్ ఈవెన్ అవ్వని ప్రాంతాల గురించి మాట్లాడుకుందాం.

తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ మరియు నెల్లూరు ప్రాంతాల్లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం ఇక దాదాపుగా అసాధ్యమే. నిర్మాతలు రిటర్న్ జీఎస్టీ ఇచ్చిన రీకవర్ అవ్వలేని సెంటర్స్ ఇవి. 17 రోజుల్లో సీడెడ్ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 20 కోట్ల 54 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. విడుదలకు ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 24 కోట్ల రూపాయలకు జరిగింది. అంటే దాదాపుగా 3 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లింది అన్నమాట. ఇక నెల్లూరు విషయానికి వస్తే విడుదలకు ముందు 6 కోట్ల 30 లక్షల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 17 రోజుల్లో 5 కోట్ల 70 లక్షలు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక లో 17 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా , ఇప్పటి వరకు కేవలం 15 కోట్ల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది.

అదే విధంగా ఓవర్సీస్ లో 34 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరగ్గా, 17 రోజుల్లో 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చింది. ఇక హిందీ వెర్షన్ లో అయితే పాతిక కోట్ల రూపాయలకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఇప్పటి వరకు కేవలం 12 కోట్లు మాత్రమే వచ్చింది. అంటే 50 శాతం కి పైగా నష్టాలు అన్నమాట. ఇక తమిళనాడు + కేరళ కలిపి 7 కోట్ల రూపాయిల బిజినెస్ జరిగితే , ఇప్పటి వరకు 2 కోట్లు మాత్రమే వచ్చింది. ఈ ప్రాంతాల్లో నష్టాలు భారీగా వాటిల్లాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ లాభాలు వచ్చాయి. ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో ఈ చిత్రానికి 146 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు 223 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వరల్డ్ వైడ్ గా 336 కోట్ల రూపాయిల గ్రాస్, 198 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.