Homeఎంటర్టైన్మెంట్Yash Toxic Release Date: 'టాక్సిక్' సరికొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ఈసారి టార్గెట్...

Yash Toxic Release Date: ‘టాక్సిక్’ సరికొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్.. ఈసారి టార్గెట్ మిస్ అవ్వదు..

Yash Toxic Release Date: పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రమిది. ఎప్పుడో మార్చి 19 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు, ఆ తర్వాత జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అప్పటికీ కూడా సినిమా ఔట్పుట్ మరింత బెటర్ చేయడం […]

Yash Toxic Release Date: పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రాల్లో ఒకటి ‘టాక్సిక్’. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యాష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన చిత్రమిది. ఎప్పుడో మార్చి 19 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని , కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు, ఆ తర్వాత జూన్ నెలలో విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేశారు. అప్పటికీ కూడా సినిమా ఔట్పుట్ మరింత బెటర్ చేయడం కోసం వాయిదా వేశారు.వరుసగా మేకర్స్ వేస్తున్న ఈ వాయిదాలను చూసి అభిమానులకు సైతం చిరాకు వచ్చేసింది. అసలు ఈ ఏడాది లో ఈ చిత్రం విడుదల ఉంటుందా అనే సందేహాలు కూడా వ్యక్తం అయ్యాయి. అయితే కాసేపటి క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 26 న విడుదల చేయబోతున్నారట.

సమ్మర్ మొత్తం ముగిసిన తర్వాత, ఎలాంటి పండుగ హాలిడేస్ లేని సమయం లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నిర్మాతలు చాలా పెద్ద రిస్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తే తప్ప, వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. కానీ ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ ఆడియన్స్ ని గొప్పగా ఆకట్టుకోలేదు. టీజర్ కి బ్లాస్టింగ్ రెస్పాన్స్ వచ్చింది కానీ , ట్రైలర్ కి మాత్రం నెగెటివ్ ఫీడ్ బ్యాక్ బలంగా వచ్చింది. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది . తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కచ్చితంగా వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఆగస్టు 21 న సాధారణంగా నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో వాయిదా పడింది. ఒకవేళ ‘ది ప్యారడైజ్’ చిత్రం చెప్పిన తేదికి వచ్చి ఉండుంటే ‘టాక్సిక్’ కి థియేటర్స్ విషయం లో చాలా ఇబ్బంది ఉండేది . ఇప్పుడు ‘ది ప్యారడైజ్’ స్థానం లోకి మాస్ మహారాజ రవితేజ ‘ఇరుముడి’ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు కూడా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా ‘టాక్సిక్’ చిత్రానికి ఇబ్బందే. తెలుగు వెర్షన్ రైట్స్ ని దిల్ రాజు 120 కోట్లకు కొనుగోలు చేశాడని టాక్ , ఎలా రీకవరీ చేయబోతున్నాడో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper