
‘జాను’ మూవీ ఫిబ్రవరి 07 విడుదల
తమిళంలో విడుదలైన సంచలన విజయాన్ని సాధించిన ’96’ మూవీని తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష కలిసి నటించగా.. ఆ పాత్రలను తెలుగులో శర్వానంద్, సమంతలు పోషిస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్‌ని డైరెక్ట్ చేసిన ప్రేమ్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘సవారి’ మూవీ ఫిబ్రవరి 07 విడుదల
సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారి” మూవీ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. సంతోష్ మోత్కూరి, నిషాంక్ రెడ్డి నిర్మాతలు.
‘వరల్డ్ ఫేమస్ లవర్’ మూవీ ఫిబ్రవరి 14 విడుదల
విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రమే ‘వరల్డ్ ఫేమస్ లవర్’. కేఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇందులో ఐశ్వర్య రాజేష్, రాశీ ఖన్నా, ఇజబెల్లె లైట్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ నలుగురిని ప్రేమించే వ్యక్తిగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు.
‘నిశ్శబ్దం’ మూవీ ఫిబ్రవరి 20 విడుదల
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో ‘నిశ్శబ్దం’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో ‘నిశ్శబ్దం’ టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.
‘భీష్మ’ మూవీ ఫిబ్రవరి 21 విడుదల
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్.. రష్మిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ‘భీష్మ’. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈ సినిమాకు నిర్మాతలు. ఫిబ్రవరి 21 న ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అనంత్ నాగ్.. వెన్నెల కిషోర్.. సత్య.. రాజీవ్ కనకాల.. సంపత్ రాజ్.. రఘుబాబు.. బ్రహ్మాజీ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు. మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.