
హిందూ పుణ్య క్షేత్రాల్లో అన్య మత ప్రచారం పెరుగుతున్న తీరును జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తప్పుపట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ పుష్కర ఘాట్‌లో సామూహికంగా బాప్టిజమ్ ఇవ్వడాన్ని తప్పుబడుతూ జనసేన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. దింతో పవన్ కల్యాణ్‌పై తెలుగు రాష్ట్రాల క్రైస్తవులు మండిపడుతున్నారు. అలాగే నరేంద్ర మోడీ, అమిత్ షాలను పొగడటం, ఈ మధ్య జనసేన విడుదల చేసే కొన్ని పోస్టులకు జై జగన్మాత అనడం లాంటివి చూసి అనేక మంది జనసేన పార్టీని హిందూ సిద్ధాంత పార్టీగా ముద్రవేశారు. అన్యమతంపైనే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తరహాలో పవన్ కల్యాణ్ వెళ్తున్నారని క్రైస్తవ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
మత సంబంధ వ్యాఖ్యలపై వారం రోజుల క్రితం ఆలివర్ రాయ్ విశాఖపట్టణం పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి వెన్నంటే ఉన్న రాజు రవితేజ్ కూడా రాజీనామా చేశారు. ఇలా చెప్పుకుంటే పోతే పవన్ కళ్యాణ్ తీరు క్రైస్తవుల మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఒక ప్రజా ప్రతినిధి స్థానంలో ఉన్నప్పుడు అందరి మనోభావాలను గౌరవించాలి. ఎవరి నమ్మకాలు వాళ్లకుంటాయ్.. మాత మార్పిడి అని జనసేన అంటే కాదు అది రాజ్యాంగం నాకిచ్చిన హక్కు(లౌకిక వాదం) అని అనేక మంది అంటున్నారు.
జనసేనలో ఉన్న అనేకమంది చెప్పే మాట ఏమిటంటే.. జనసేన ఎవరి వ్యక్తిగత కోరికలను తీర్చేపార్టీ కాదు, ఎంత మంది వెళ్లి పోయినాపర్వాలేదు, సత్యం కోసం నిలబడేపార్టీ, ప్రజల తరుపున సమస్యల కోసం పోరాడేపార్టీ…. ఇలా చెప్పుతుంటూ వెళ్తున్నారు. నిజమే పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు వచ్చే సినీఫీల్డ్ ని వదులుకొని, ప్రజలకోసం తాను నమ్మిన, సిద్ధాంతాలు, విధి విధానాలపై గట్టిగా నిలబడ్డాడు కానీ పవన్ ని అభిమానానించే (ఫ్యాన్స్) ఎక్కువమంది మాస్ వాళ్ళే.. అంటే పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళే.. వాళ్లలో ఎక్కువమంది కన్వర్టెడ్ క్రైస్తవులే అనే విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి ప్రజలు, అభిమానుల కోరిక మేరకు పవన్ కళ్యాణ్ ఇకనైనా మత సంబంధమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ.. ఏ సిద్ధాంతాలను నెరవేర్చడానికై రాజకీయాలను ఎంచుకున్నారో.. ఆ మార్గంలోనే నడుస్తూ పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా కృషిచేస్తారని ఆశిద్దాం..!