Home Blog Page 8638

ఓ తెలుగువాడి గోడు

డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్థాపించిన ఆంధ్ర బ్యాంకు ఇక ఉండదు అనేది వినటానికి, జీర్ణించుకోవటానికి చాలా కష్టంగా వుంది. 1923 లో స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తి లో భాగంగా ఆంధ్ర బ్యాంకు స్థాపించబడింది. గాంధీజీ కి అత్యంత ఆప్తుడైన పట్టాభి గారు గాంధీజీ ఇచ్చిన పిలుపుని అక్షరాలా అమలుచేసే పనిలోనే ఈ బ్యాంకు స్థాపనకు పూనుకున్నారు. స్వాతంత్ర ఉద్యమమంటే కేవలం నిరసన తెలపటమేకాదు దేశ నిర్మాణానికి పాటుపడాలనే పిలుపుతోనే 1910 లో ఆంధ్ర జాతీయ కళాశాల ను స్థాపించటం ఆ తర్వాత కృష్ణ కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ని , దాని తర్వాత ఆంధ్ర బ్యాంకు ని, ఆంధ్ర ఇన్సూరెన్సుకంపెనీ ని, భారత లక్ష్మి బ్యాంకు ని, హిందుస్థాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెనీ ని స్థాపించారు. పట్టాభి గారు దేశ భక్తి ని నిర్మాణాత్మక కార్యకలాపాలకు మళ్లించటం లో ప్రముఖపాత్రని పోషించారు.

అలాగే ఆంధ్ర బ్యాంకు పెట్టిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అప్పుడు మచిలీపట్టణం లో వున్న బ్రిటిష్ వాళ్ళ ఇంపీరియల్ బ్యాంకు ( ప్రస్తుత స్టేట్ బ్యాంకు కి పూర్వ రూపం) బందరు శాఖ తెల్ల దొర అయిన ఏజెంట్ ఈ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరూ రాకుండా ఒత్తిడి తెచ్చాడు. ఆ నేపధ్యం లోనే పట్టాభి గారు మేనేజింగ్ డైరెక్టర్ పదవి చేపట్టటం జరిగింది. ఆ తర్వాత కూడా ఆంధ్ర బ్యాంకు కు ఎన్నో ఇబ్బందులు సృష్టించాడు. అయినా ధైర్యంతో బ్యాంకు ని పట్టాభి గారు ముందుకు తీసుకెళ్లారు. ఇంతటి స్ఫూర్తి తో ప్రారంభించి, నడిపిన పట్టాభి గారు బ్యాంకు 25 సంవత్సరాల రజతోత్సవ సందేశమిస్తూ సంస్థకి ప్రారంభం ఉంటుంది గానీ అంతం ఉండదని సెలవిచ్చారు. కానీ ఇప్పుడాయన మాట తప్పని మన ప్రభుత్వం చెబుతుంది. సంస్థ ప్రారంభం మీ చేతుల్లో వున్నా అంతం మా చేతుల్లో ఉందని చెబుతుంది. పట్టాభి గారు ఈ పరిస్థితి ని ఊహించలేదు కాబట్టే ఆ కొటేషన్ ఇచ్చారు. పట్టాభి గారూ, మీ మాటను నిలబెట్టలేకపోతున్నందుకు మా తెలుగు వాళ్లందరినీ క్షమించమని వేడుకుంటున్నాము. మేము మాట మీద నిలబడే వాళ్ళం కాదు గదా. ఇందిరా గాంధీ పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన మాటకే విలువలేదు. మీరు సందేశమిస్తే నిలబెడతామా? మీ మాట కి విలువివ్వనందుకు, మీ ఆత్మని క్షోభ పెట్టినందుకు మమ్మల్ని క్షమించండి. మేము ప్రతి సమావేశం లోనూ మీ ఫోటో పెట్టి దండ వేయగలుగుతున్నాము గానీ మీ మాటను కాపాడలేకపోతున్నందుకు మమ్మల్ని ఆక్షేపించకండి. మాకంత సామర్ధ్యం లేదని రోజు రోజుకూ నిరూపించుకుంటున్నాము. మాది అసమర్ధుని జీవనయాత్రలాగే వుందండి . ఏమిచేయగలము. మీరు కలలు గన్న రాజకీయ వ్యవస్థ సామాన్యుడి గోడు వినటంలేదండి. స్వాతంత్ర సమరయోధులందరూ కలలుగన్న సమాజం, వ్యవస్థ ఎక్కడో గాడి తప్పింది. అందుకే చివరగా మరొక్కసారి క్షమించమని పాదాలమీద పడి వేడుకుంటున్నాం. అదొక్కటే మేము చేయగలం.

ఇక మన ప్రపంచం లోకి వద్దాం. తెలుగు వాడు పెట్టిన బ్యాంకు , తెలుగు వాళ్ళు స్వంతం చేసుకున్న బ్యాంకు , తెలుగు వాళ్ళ గుండెల్లో అనుభూతిని నింపిన బ్యాంకు ఇంకొద్దిరోజుల్లో కనుమరుగవుతుంది. ప్రాంతీయ అస్తిత్వం కోసం నాలుగు బ్యాంకులను విలీనం చేయటం లేదని చెప్పిన తెలుగింటి కోడలు కు తెలుగు వాళ్ళ అస్తిత్వం గుర్తుకు రాకపోవటం బాధాకరమైన విషయం. ఆ నాలుగు బ్యాంకులు నాలుగు విభిన్న సంస్కృతులకు చిహ్నమని అట్టిపెట్టటాన్ని మనసారా స్వాగతిస్తున్నాము. మనది భిన్నత్వం లో ఏకత్వం కదా. మరి తెలుగు వాళ్ళ భిన్నత్వం గుర్తించదగినంతది కాదా? పాపం పట్టాభి గారు ( ఆయనను ఈ ఊబి లోకి తీసుకు రావద్దని అనుకుంటూనే మరల మరలా లాగుతూనే వున్నాము) మన గ్రామాల్లోని వ్యవసాయదారుల్ని , పట్టణాల్లోని వ్యాపారస్తులను సమ దృష్టి తో చూసి బ్యాంకు లో సేవలు అందించాలని భావించి గ్రామ శాఖలకు ప్రాధాన్యమిచ్చారు. అందుకే తెలుగు ప్రజల్లో అంత అభిమానం గూడు కట్టుకుంది. సరే తెలుగు వాళ్లకు గుర్తింపు అవసరం లేదని , ఆ విషయం ఇప్పటికే బోధపడిందని సరిపెట్టుకుందాం.

మరి హైద్రాబాదు లాంటి పెద్ద మెట్రో నగరానికి ఒక్క ప్రధానకార్యాలయం వున్న బ్యాంకు కూడా అవసరం లేదా? ఇప్పుడు ప్రతిపాదించిన 12 బ్యాంకుల ప్రధానకార్యాలయాలు ఎక్కడున్నాయో తెలుసా? నాలుగు ముంబై లో, రెండు ఢిల్లీ లో, రెండు చెన్నై లో, కలకత్తా , బెంగళూరు , వడోదర , పూణే లలో ఒక్కొక్కటి వున్నాయి. మరి బెంగళూరు తో సమానంగా వున్న హైద్రాబాదు లో ఒక్కటికూడా అవసరం లేదా? ఇందులో మా తెలుగువారి గుర్తింపుని గురించి మాట్లాడటం లేదు. దేశం నాలుగు దిక్కులా ప్రధాన కార్యాలయాలు పెట్టి మధ్య భారతానికి ఒక్క కార్యాలయం కూడా అవసరం లేదా? ఇది జాతీయ దృక్పధం అవుతుందా? కనీసం ఈ కారణంతోనైనా హైద్రాబాదు కి ఓ ప్రధాన కార్యాలయం వున్న జాతీయ బ్యాంకు అవసరం లేదా? గౌరవనీయులైన ఆర్థికమంత్రిగారూ, తెలుగువారి గౌరవము , ఆత్మ గౌరవం సంగతి పక్కన పెట్టినా జాతీయ దృక్పధంతో హైద్రాబాదు మెట్రో నగరానికి ఒక ప్రధాన కార్యాలయం అట్టిపెట్టటానికైనా మా ఆంధ్రా బ్యాంకు కార్యాలయాన్ని హైద్రాబాదు లో ఉంచండి మేడమ్ . ఇవన్నీ కుదరకపోతే ఈ విలీన బ్యాంకు ప్రధాన కార్యాలాయాన్నయినా హైద్రాబాదు లో ఉంచండి మేడం. ఇది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నది కాకపోయినా మాకు ఈ విలీనాన్ని ఆపటం చేతకాకపోతే చావు దప్పి కన్ను లొట్ట పోయినట్టు ఇదైనా చేస్తే కొంతలో కొంత ఉపశమనం మేడం, అదీ అందరికీ ఆమోదయోగ్యమైన కొత్త పేరుతో . ఇది మా చివరి ఆప్షన్ మాత్రమే. నేనీ మాట అన్నందుకు మా మిత్రులందరికీ కోపం వస్తుందని తెలుసు, కానీ నాకున్న అంచనాతో మాట్లాడినందుకు అందరూ నన్ను క్షమిస్తారని భావిస్తూ

భవదీయుడు
ఓ తెలుగు వాడు/ ఓ తెలుగు గోడు

గడ్డం తీసేసి.. స్మైల్.. పవన్ ఇరగదీస్తున్నాడుగా.. మరిన్ని ఫొటోస్ చూడండి

 

రాజకీయాలకు కొంత విరామం ఇచ్చిన జనసేనాని ఇప్పుడు తిరిగి మళ్ళీ వరస సినిమాలతో పవర్ స్టార్ బిజీగా ఉన్న సంగతి అందరికి తెలిసిందే.. అయితే రాజకీయాలలో ఉన్నప్పుడు అయన ఎక్కువశాతం నల్లని గుబురు గడ్డంతో కనిపించేవారు. మరి ఇప్పుడు సినిమాలలోకి వచ్చేసారు కాబట్టి పవన్ కళ్యాణ్ అభిమానులు మరి ముఖ్యంగా ఆయనకు యువత లో ఉన్న క్రేజ్ బట్టి వారి కోరికమేరకు మరియు సినిమాల కొరుకు… అయన ఇప్పుడు గడ్డం తీసేసి మంచి గ్లామరస్ లుక్ లో బ్యూటిఫుల్ స్మైల్ తో ఇరగదీసేస్తున్నారు.. ఇప్పుడు ఈఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం , పవర్ స్టార్ట్ లేటెస్ట్ స్మైలీ ఫొటోస్ మీరు కూడా చూసెయ్యండి.

 

Read More: తెలంగాణ నుండే ప్రపంచాన్ని శాసించే తెలుగు సినిమాలు:పవన్

 

 

 

 

 

‘కింగ్’ ను భయపెడుతున్న కరోనా వైరస్

 

కరోనా వైరస్ ఎఫెక్ట్ ‘కింగ్’ నాగార్జునను భయపెడుతుంది. చైనాలో మొదలైన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాలను భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ కరోనా ఎఫెక్ట్ సినిమా షూటింగ్ పై పడుతోంది. కరోనా వైరస్ భయంతో కింగ్ నాగార్జున తన తాజా చిత్రాన్ని వాయిదా వేసుకున్నాడు.

 

Read More: మహేష్ బాబు లాంచ్ చెయ్యడం వల్లే.. ఇలా జరిగింది

 

యదార్థ సంఘటన ఆధారంగా కొత్త దర్శకుడు అహిషోర్ సోలోమన్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో నాగార్జున ఎన్ఐఏ అధికారి విజయవర్మ పాత్రలో నటిస్తున్నాడు. ప్రధాన పాత్రల్లో దియా మీర్జా, సయామీ ఖేర్ నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇటీవల హైదరాబాద్లో పూర్తి చేసుకొంది. ఈ సినిమాలో కొన్ని సవేశాలను థాయ్ లాండ్ లోకేషన్లలో చిత్రీకరించేందుకు ఇప్పటికే దర్శక, నిర్మాతలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్ లో చేయాలనుకున్న సీన్లను ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.

 

Read More: ‘ఆర్ఆర్ఆర్’ డేట్స్ కు ‘కేజీఎఫ్-2’ విడుదల

 

ఈ మూవీకి వైల్డ్ డాగ్ అనే టైటిల్ ఖారారైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ఫస్టు లుక్, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. ఈ మూవీని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. నాగార్జున ఎన్ఐఏ అధికారిగా నటిస్తుండటంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. థాయిలాండ్ షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడిగా మిగతా లోకేషన్లలో జరిగే షూటింగ్ యథావిధిగా కొనసాగుతుంది.

బ్యాంకుల విలీనం లో తెలుగువాళ్ళ అస్తిత్వం గుర్తుకు రాలేదా?

అనుకున్నంతా అయ్యింది. 1980 రెండవ జాతీయకరణ సమయం లో ఆంధ్ర బ్యాంకు ని జాతీయం చేయటం జరిగింది. అప్పుడు కూడా మనకు అన్యాయం జరిగింది. పంజాబీల బ్యాంకు అయిన పంజాబ్ & సింధ్ బ్యాంకు కూడా ఆంధ్ర బ్యాంకు తో పాటు జాతీయం చేయబడింది. ఇందిరా గాంధీ ఆ టైములో పంజాబీలకు హామీ ఇచ్చింది. ఎటువంటి పరిస్థితుల్లో ఆ బ్యాంకు అస్తిత్వానికి దెబ్బతగలకుండా కాపాడతానని చెప్పింది. చెప్పటమే కాకుండా చట్టం లోకూడా ఆ హామీని నెరవేర్చింది. ఎలానంటే ఆ బ్యాంకు చైర్మన్ గా పంజాబీలనే నియమించాలని చట్టం లో రాసుకున్నారు. కానీ ఆంధ్ర బ్యాంకు విషయం కి వచ్చేసరికి ఇక్కడి రాజకీయనాయకులు ఒత్తిడి తేలేదు. ఇందిరా గాంధీ ఎటువంటి హామీని ఇవ్వలేదు. మొత్తం బ్యాంకు చరిత్రలో జాతీయం చేసిన తర్వాత ఇద్దరు తెలుగు వాళ్ళే చైర్మన్లు గా చేసారు. ఒకరు ఐఏఎస్ ఆఫీసర్ వెంకట రత్నం గారు, రెండు బ్యాంకర్ అయినటువంటి ఆర్ ఎస్ రెడ్డి గారు. అంతకుమించి ఇంతవరకు బయటివ్యక్తులే చైర్మన్లుగా వచ్చారు. ఎందుకుచెప్పాల్సి వచ్చిందంటే ఆంధ్ర బ్యాంకు అప్పటికీ ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల ప్రాంతీయ బ్యాంకు గానే వుంది. అయినా దీని ప్రాంతీయ అస్తిత్వానికి గుర్తింపులేదు.

ఇప్పుడు జరిగిన బ్యాంకుల ఏకీకరణ లో కూడా మరలా అన్యాయం జరిగింది. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాలుగు ప్రాంతాల్లో నాలుగు బ్యాంకుల్ని ప్రాంతీయ అస్థిత్వాన్ని గుర్తిస్తూ వాటిని అలాగే కొనసాగిస్తున్నామని చెప్పింది. అవి దక్షిణాదిన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, తూర్పున యూకో బ్యాంకు, ఉత్తరాన పంజాబ్ & సింధ్ బ్యాంకు , పశ్చిమాన బ్యాంకు అఫ్ మహారాష్ట్ర గా ప్రకటించింది. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే దక్షిణాన తమిళుల, తూర్పున బెంగాలీల, ఉత్తరాన పంజాబీల , పశ్చిమాన మహారాష్ట్రుల అస్థిత్వాన్ని గుర్తించారు. కానీ రెండు రాష్ట్రాల్లో విస్తరించిన తెలుగు ప్రజలకు వున్న ఒకేఒక బ్యాంకును కొనసాగించాలనే భావన తెలుగు కోడలైన నిర్మల సీతారామన్ కి తోచలేదు. అదే అవినీతి మరకలు అంటిన ఐఓబీ ని కొనసాగించటానికి మనసొప్పింది. అదేకాదు అలాహాబాద్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు విలీనం లో పెద్దదైన అలాహాబాద్ బ్యాంకు కాకుండా ఇండియన్ బ్యాంకు ని లీడ్ బ్యాంకు గా ప్రకటించింది.

ఇది ప్రాంతీయ దురభిమానం రెచ్చకొట్టటానికి చెబుతుంది కాదు. అంతకుముందే ఎస్ బి ఐ అనుబంధ బ్యాంకుల విలీనం లో హైదరాబాద్ కేంద్రంగా వున్న స్టేట్ బ్యాంకు అఫ్ హైదరాబాద్ ని విలీనం చేశారు. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక బ్యాంకు ఆంధ్ర బ్యాంకు ని కూడా విలీనం చేశారు. ఎందుకు చెప్పాల్సివస్తుందంటే ఆంధ్ర బ్యాంకు జాతీయ బ్యాంకు అయినా ఇప్పటికీ సగం శాఖలు, సిబ్బంది తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళే. అందువలన మిగతా రాష్ట్రాల అస్తిత్వం కాపాడామని చెప్పినప్పుడు తెలుగు వాళ్ళ అస్తిత్వం ఎందుకు గుర్తుకు రాలేదనేదే అంతుచిక్కని ప్రశ్న. అదీ మనకు చెందిన ఆర్ధికమంత్రి వుండి కూడా. దురదృష్టమేమంటే మన రాజకీయనాయకులు ఇటువంటి విషయాలు పట్టించుకోరు. ఒకరినొకరు తిట్టుకోవటానికే వాళ్ళ టైమంతా సరిపోతుంది. మరి మన ప్రయోజనాలు పట్టించుకొనే వాళ్లెవరు?

టీడీపీ, జనసేనలను ఇరకాటంలో పెట్టిన జగన్

 

 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ఏపీకి మూడు రాజధానుల ప్రతిపాదన ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల కంటే ముందు జగన్ కులం ఆయన మతంపై జనసేన పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.. అలాగే ఏపీ ప్రభుత్వ పాఠశాలలో “ఇంగ్లీష్ మీడియం” తప్పనిసరి చేస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు పెద్ద ఎత్తున జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు సీను మారింది. ఇటు టీడీపీ నేతలు అటు జనసేన పార్టీ నేతలు “ఇంగ్లీష్ మీడియం”పై మరియు జగన్ కుల, మత వ్యవహారాలపై యూ టర్న్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది.

 

గతంలో ఏపీ రాజధాని “అమరావతి” నుండి “వినుకొండ”కు మారుస్తున్నారని పెద్ద ఎత్తున దుమారం లేచినప్పుడు సీఎం జగన్ మౌనంగా ఉన్నారు కానీ ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో రాజధానిపై ప్రతిపక్షాలు మాట్లాడక పోయినా.. వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావుతో రాజధాని టాపిక్ తీసుకొచ్చి ఆ తర్వాత 9మంది టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయిన తర్వాత జగన్ ఈ మూడు రాజధానుల విషయం బయట పెట్టారు. అంటే జగన్ కావాలనే ఈ 3రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చారు. అప్పటివరకు “ఇంగ్లీష్ మీడియం”పై, కుల-మత విమర్శలతో బిజీగా ఉన్న టీడీపీ, జనసేన నేతలు సడెన్ గా మారిపోయి చక్కగా వెళ్ళి ధర్నాలో కూర్చుంటున్నారు. ఇది సీఎం జగన్ మైండ్ గేమ్ అనుకోవచ్చా..!?

 

ఇదిలా ఉండగా ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. “ఏపీకి 3రాజధానులు” ప్రతిపాదన టీడీపీ, జనసేన పార్టీలకి తలనొప్పి అని చెప్పొచ్చు. జగన్ సర్కార్ నిర్ణయానికి జై కొడితే, అమరావతి రైతులు, ప్రజలు ఒప్పుకోరు అలాగే ప్రతిపాదనను తిరస్కరిస్తే కర్నూల్, విశాఖ ప్రజలలో నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. ఈ విధంగా “ముందు కెళ్తే గొయ్యి వెనకెళ్తే నుయ్యి” అన్నట్లు ఉంది టీడీపీ, జనసేనల పరిస్థితి. ఎటు నుంచి చూసినా జగన్ మాత్రం సేఫ్ జోన్ లోనే ఉన్నారు. అమరావతి రాజధాని అలాగే ఉంచారు మరియు కర్నూల్, విశాఖ ప్రజల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఏది ఏమైనా జగన్ రాజకీయ వ్యహం బాగుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ తో రాజమౌళి మూవీ

 

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పనుల్లో బీజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఈ మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. కొమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నాడు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజమౌళి-ప్రభాస్ కలిసి ఓ ప్రొడక్షన్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రభాస్-రాజమౌళి స్థాపించే ప్రొడక్షన్లో సినిమాలను తీయనున్నారని సమాచారం. ఈ పొడక్షన్ వచ్చే తొలి మూవీలో ప్రభాస్ నటించనున్నారని ఈ మేరకు వారిద్దరి మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

Read More:
జాను నా కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ: స‌మంత అక్కినేని

 

రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చిత్రీకరణపైనే ఫోకస్ పెట్టాడు. ఈ మూవీలో రాంచరణ్ సరసన అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ కు జోడి ఓలీవియా మోరీస్ నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే రాంచరణ్-అలియభట్ నడుమ వచ్చే స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాంచరణ్-జూనియర్ ఎన్టీఆర్ నడుమ కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను పూర్తి చేశారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 

Read More:
నామ్ కేలండర్ ఫొటోస్

 

ఇటీవలే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రీయ ఈ చిత్ర షూటింగ్ పాల్గొన్నారు. ఈ మూవీ దసరాకు రిలీజ్ అవుతుందని భావించినా ప్రస్తుతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని సంక్రాంతి కానుకగా తీసుకురావడానికి దర్శకుడు సన్నహాలు చేస్తున్నాడు. బహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

అమరావతి – అయోమయంలో బిజెపి

గత నాలుగు రోజులనుండి, ఆంధ్రాలో, అందరూ అమరావతి గురించే మాట్లాడుకుంటున్నారు. బొత్స సత్యనారాయణ గారి ప్రకటనలతో ఈ ప్రహసనం మొదలయింది. ఆయన ముఖ్యంగా రెండు విషయాలు ప్రస్తావించారు. ఒకటి, అమరావతిలో గత ప్రభుత్వం చేసిన అవినీతి, రెండోది ముంపు ప్రాంతంలో అమరావతిని నిర్మించటంవలన జరిగే నష్టం. మొదటి విషయానికి వస్తే, ప్రతి ప్రభుత్వం చేసినట్లుగానే, తెలుగుదేశం తన హయాంలో రాజధానిని అతిగా రాజకీయయం చేసింది. ప్రజలందరికి తెలుసు అక్కడ కాపిటల్ నిర్మాణం పేరుతొ జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని . ఐదేళ్లు ఆ ప్లాన్, ఈ ప్లాన్ అని కాలం వెళ్లబుచ్చారు. ఈ ఐదేళ్లలో రెండు తాత్కాలిక భవనాలు మాములుగా అయ్యే ఖర్చు కన్నా 3 రేట్లు ఎక్కువ వ్యయంతో కడితే, అది వర్షం వస్తే ఉండటానికి వీల్లేకుండా, మీడియా యాక్టీవ్గా ఉన్న ఈరోజుల్లో ప్రజలు అంత అమాయకులు కాదు. చంద్రబాబు నాయుడు గారు తాను ఇప్పటికి ఎందుకు ఓడిపోయానూ అర్ధం కావటల్లేదు అంటారు. ప్రజలందరికి అర్ధం అయినా ఆయనకు మాత్రం అర్ధం కావట్లేదు పాపం.

బీజేపీ విషయానికి వస్తే, తెలుగు దేశం నుండి విడిపోయినాక, ఎన్నికలకు ముందు వరకు టీడీపీ అవినీతి మీద అంతా – ఇంతా రాద్ధాంతం కాదు చేసింది. కాపిటల్ విషయం ఐతేనేమి, పోలవరం విషయంలో కానీ టీడీపీ పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయింది అని గగ్గోలు పెట్టారు. ఎన్నికల తర్వాత టీడీపీ రాజ్యసభ సభ్యులంతా కలసి బీజేపీ లో చేరిన తర్వాత ఆంధ్రాలో బీజేపీ కులాల వారీగా, ప్రాంతాలవారీగా విడిపోయింది. అసలు బీజేపీ సౌత్ ఇండియా లో అన్ని రాష్ట్రాల్లో అన్నీ తప్పులే చేస్తుంది. సరే ఆవిషయాన్ని ఇంకోసారి చర్చిద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ లో సుజనా చౌదరి చేరిన తర్వాత చేరక ముందుగా చెప్పుకోవాలి. ఇప్పుడు బీజేపీలో ఒక వర్గం క్యాపిటల్లో అసలు ఏమీ అవినీతి జరగలేదని , మరొక వర్గం అంతా అవినీతే జరిగిందని వాదిస్తున్నారు. తెలివిగా YSRCP మాత్రం కొన్ని ఫీలర్లు వదిలి, ప్రజలు ఏమనుకుంటున్నారో తమాషా చూస్తుంది. నాకు తెలిసి ఎంత మోడీ ప్రభావం ఉన్నా, ఆంధ్రాలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటే ఒకే మాటతో ఉండాలి, డబ్బులున్న వాళ్ళు నిన్న గాక మొన్న వచ్చిన వాళ్ళు పెత్తనం చేస్తుంటే , ప్రజలు అంత అమాయకులు కాదు.

ఆంధ్రులకు రాజధాని, అందని ద్రాక్ష!

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం జగన్ శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ప్రకటించడంతో ఏపీ రాజధాని మరోసారి చర్చనీయాంశంగా మారింది. అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌, విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ అని జగన్ ప్రకటించారు. ఏపీలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పడం అలాగే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్‌రావు కమిటీ కూడా అమరావతి అంత సురక్షిత ప్రాంతం కాదు అని చెప్పడంతో మూడు రాజధానులు ఏర్పాటు చేయడం వల్ల మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అనేది జగన్ సర్కార్ వాదన. అలాగే ప్రస్తుత ఏపీ రాజధాని అమరావతి, చంద్రబాబు మానస పుత్రిక అని టీడీపీ నేతలు పదే పదే అనడం కూడా జగన్ కి నచ్చకపోవడం, అమరావతితో పాటు మిగిలిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలను కూడా మెప్పించి, టీడీపీ, జనసేనలను ఇరకాటంలో పెట్టాలని జగన్ వ్యూహంగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఏపీకి ప్రస్తుతం మూడు రాజధానులు అని సీఎం జగన్ ప్రకటనతో రాజధాని విషయంలో క్లారిటీ వచ్చినట్లయింది.

నాటి మద్రాసు నుంచి నేటి అమరావతి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో ఎన్నో మార్పులు. మరెన్నో ట్విస్టులు చోటుచేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ పాలకులు రాజధానిని ఒక్కో నగరానికి మార్చుకుంటూ తిరుగుతున్నారు. తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు మద్రాస్, 1953లో ఆంధ్రరాష్ట్రముగా ఏర్పడినప్పుడు కర్నూలు, 1956 తెలంగాణతో కలిసినప్పుడు హైదరాబాద్, 2014 నుంచి అమరావతి, 2019 జగన్ సీఎం అయ్యాక ప్రస్తుతం మూడు రాజధానులు అని ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ కి ఒక స్పష్టమైన రాజధాని లేకుండా పోయింది. పిల్లి తన పిల్లల్ని ఇంటింటికి తిప్పినట్లుగా ఆంధ్ర పాలకులు ఏపీ రాజధానిని పలుచోట్లకు తిప్పుతున్నారు. రాజులు, రాజ్యాలు ఉన్నప్పుడు పాలన సౌలభ్యం కోసం ఇలా తమకు అనుకూలమైన ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పాలించారు. అదేంటోగానీ, స్వాతంత్ర్యానంతరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధాని విషయంలో స్థిరత్వం లేని పరిస్థితి కొనసాగింది. డెబ్బై ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ అదే అయోమయం ఆంధ్రులను వెక్కిరిస్తోంది. ఈ విధంగా ఆంధ్ర ప్రజలకు రాజధాని అందని ద్రాక్షగా మారింది . మరి, సీఎం జగన్ చివరి నిర్ణయం ఇదే అవుతుందా..? లేక రేపు వేరే ఇంకెవరైనా సీఎం అయితే మళ్ళీ మారుస్తారా..? అనేది కాలమే నిర్ణయించాలి.

పవన్ కళ్యాణ్ త్వరలో రాబోయే 5 సినిమాలు.. వివరాలు

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆశయాలను సాధించడానికి ఒకప్పుడు నటన నుండి విశ్రాంతి తీసుకొని రాజకీయాలలోనే ఉండిపోయారు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి మళ్ళీ ఎంట్రీ ఇచ్చేసాడు. ఈ సారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరింత దూకుడుగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఆయన నటించనున్న ఐదు సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి.

 

Read More: మరోసారి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిన్నల్లుడు..!

 

ఈ ఐదు చిత్రాలు పిఎస్‌పికె 26, పిఎస్‌పికె 27, పిఎస్‌పికె 28, పిఎస్‌పికె 29 మరియు పిఎస్‌పికె 30. వీటిలో ప్రతి ఒక్కటి ఫాన్స్ ని చాలా ఆకట్టుకునేవిగా ఉన్నాయి. 2020 మరియు 2022 మధ్య లో ఈ అయిదు చిత్రాలను విడుదలకు పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తే, ప్రతి మూడు నెలలకు ఒక చిత్రం విడుదల అవుతుంది. ప్రస్తుత హీరోలలో మరే ఇతర హీరో ఈ ఘనత సాధించలేదు.

 

పిఎస్‌పికె 26

సూపర్ హిట్ చిత్రం పింక్ బాలీవడ్ లో ఎన్నో ప్రశంసలు అందుకోవడం తో తెలుగు రీమేక్‌లో అమితాబ్ బచ్చన్ పాత్రను పోషించడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనుమతి ఇచ్చారు. తాత్కాలికంగా పిఎస్‌పికె 26 అని పిలువబడే ఈ చిత్రం వేధింపులకు గురైన ముగ్గురు అమ్మాయిల కథను మేరుకు నడుస్తుంది.ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా బోనీ కపూర్ సహకారంతో దిల్ రాజు నిర్మిస్తున్నారు. హిందీ లో నటించిన తావేసీ పన్నూ, కృతి కుల్హారీ మరియు ఆండ్రియా తారియాంగ్ పాత్రలను తెలుగులో నివేదా థామస్, అంజలి మరియు అనన్య నాగల్ల పోషిస్తున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది, మే 15 న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

Read More: పవర్ స్టార్ కి జోడి గా కియారా అద్వాని..?

 

పిఎస్‌పికె 27

పవన్ తన 27 వ ప్రాజెక్ట్ కోసం చిత్రనిర్మాత క్రిష్ జగర్లముడితో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు,ఈ సినిమా ప్రాజెక్టు జనవరి 29 న ఎ.ఎం.రత్నం కార్యాలయంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది,ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి 4 నుండి కిక్‌స్టార్ట్ అవుతుందని తెలిసింది. ఎ.ఎం.రత్నం తన సొంత బ్యానర్ శ్రీ సూర్య మూవీస్ సమర్పణంలో ఈ ప్రాజెక్టును చేయనున్నారు.

 

పిఎస్‌పికె 28

హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో కూడా పవన్ కనిపించనున్నారు, పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ ఇద్దరి కాంబినేషన్ లో గతంలో గబ్బర్ సింగ్ వచ్చింది ఇది అందరికి తెలిసిందే . దీనితో భిమానులు వీరి ఇద్దరి కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నారు, త్వరలో వీరి కాంబినేషన్ లో రాబోయే చిత్రం కమర్షియల్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ పిఎస్‌పికె 28 ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

 

పిఎస్‌పికె 29

మరో ప్రతిభావంతుడైన దర్శకుడు గౌతమ్ టిన్ననురితో కలిసి పవన్ కళ్యాణ్ పనిచేయనున్నారు. రాబోయే ప్రాజెక్ట్ కోసం మజిలి దర్శకుడు గౌతమ్ టిన్ననురి పవన్ సంప్రదించినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించే ఈ చిత్రం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Read More: 19వ శతాబ్దపు మహిళగా సమంతా.. ఫోటో అదుర్స్

 

పిఎస్‌పికె 30

రాజకీయ యాక్షన్-డ్రామా కోసం పవన్ కళ్యాణ్ మరోసారి పూరి జగన్నాధ్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.
సన్నిహితం గా ఉండే వీరు ఇద్దరు తరుచు కలుస్తా ఉంటారు ఐతే ఈ సారి కలిసినప్పుడు పవన్ కు కథను చెప్పాడు , స్టోరీ నచ్చడం తో పవన్ చాలా ఇంట్రెస్ట్ చూపడమే కాకుండా ఓకే చెప్పేసాడు.

రెవిన్యూ బిల్లుపై బీజేపీ సెల్ఫ్ గోల్

బీజేపీ తెలంగాణ రాష్ట్రం లో అధికారం లోకి రావాలని ఉవిళ్ళూరుతుంది. కెసిఆర్ కి తామే ప్రత్యామ్నాయమని ప్రచారం చేసుకుంటుంది. అందులో కొంత వాస్తవమున్న మాట నిజం. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దీపం కునారిల్లుతున్న సమయం లో రాజకీయనాయకులు అందులో కొనసాగటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ కి వలసలు అన్నిచోట్లా కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే తెలంగాణా లో కూడా వలసలపర్వం మొదలయ్యింది. త్వరలో మరికొంతమంది నాయకులు చేరబోతున్నారని వార్తలొస్తున్నాయి. అంతవరకూ బాగానే వుంది. కాంగ్రెస్ కు బదులు బీజేపీ కెసిఆర్ కి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశాలు మెండుగా వున్నాయి. కానీ కెసిఆర్ లాంటి రాజకీయ చాణిక్యుడుని ఓడించాలంటే అదొక్కటే సరిపోదు. సరైన ఎత్తుగడలు తీసుకోకపోతే ప్రతిపక్షం లో కాంగ్రెస్ కి బదులు బీజేపీ ఉంటుంది. అక్కడే నాయకత్వ సమర్ధత తో అవసరముంది.

ఇప్పటికే కెసిఆర్ బీజేపీ ని ఇరకాటం లో పెట్టే పనికి సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తుంది. దానికి కావాల్సిన ప్రచార ఆయుధాలను రెడీ చేసుకుంటున్నాడు. ఉదాహరణకు గత లోక్ సభ లో అమిత్ షా తెలంగాణ విభజన ప్రక్రియపై కాంగ్రెస్ నిర్వాకాన్ని ఎండగట్టిన తీరుపై బీజేపీ ని తెలంగాణ వ్యతిరేకిగా ముద్రవేయటానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే నిధుల విషయం లో కేంద్రం తెలంగాణ పై సీత కన్ను వేసిందని ప్రచారం చేస్తున్నారు. ఇంకా ఇటువంటి ప్రచారాన్ని రాను రానూ ముమ్మరం చేస్తారనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకనే కాంగ్రెస్ ని బలహీనపర్చటం వేరు, బలమైన ప్రాంతీయపార్టీని ఎదుర్కోవటం వేరు. బీజేపీ ఇక్కడే జాగ్రత్తగా అడుగులు వేయకపోతే శాశ్వతంగా ప్రతిపక్షం లో వుండే అవకాశం వుంది.

ఉదాహరణకు కెసిఆర్ నూతన రెవిన్యూ బిల్లును ప్రవేశపెట్టబోతున్నాడు. దానిపై బీజేపీ దాడిని ముమ్మరం చేసింది. అవసరమైతే కోర్టు కైనా వెళ్తామని ప్రకటించింది. ఈ విషయం లో బీజేపీ పప్పులో కాలేస్తుందనిపిస్తుంది. ఎందుకంటే రెవిన్యూ శాఖ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వుంది. అంత అవినీతి శాఖ మరొకటిలేదు. ఈ ప్రజల సెంటిమెంటును రెవిన్యూ శాఖ ప్రక్షాళన ద్వారా కె%

ఏపీకి మూడు రాజధానులు:జగన్

 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా జగన్ మాట్లాడుతూ ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేసే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార వికేంద్రీకరణ విధానం మంచిదన్న జగన్‌ మనం కూడా మారాల్సిన అవసరముందన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తుచేసిన జగన్మోహన్‌రెడ్డి ఏపీలో మూడు కేపిటల్స్‌ పెట్టుకోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ పెట్టుకోవచ్చన్నారు. ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ వస్తాయేమోనన్న సీఎం జగన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు.

 

ఎం.ఎస్ రాజు ‘డర్టీ హరి’ మూవీ లేటెస్ట్ అప్డేట్స్

 

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న “డర్టీ హరి” చిత్ర రీ-రికార్డింగ్ పనులు మొదలయినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు.

 

రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో ‘హరి’ గా హైదెరాబాదీ కుర్రాడు శ్రవణ్ రెడ్డి పరిచయం అవుతుండగా, జాక్వెలిన్, వసుధ పాత్రల్లో హీరోయిన్లుగా సిమ్రత్ కౌర్ మరియు రుహాణి శర్మ కనిపించనున్నారు.

 

ఇప్పటికే విడుదలైన ‘డర్టీ హరి’ ఫస్ట్ లుక్స్ ఈ చిత్రం ఎంత బోల్డ్ గా ఉండబోతుందో చెబుతుండగా, ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసిన పేరున్న ప్రొడ్యూసర్/డైరెక్టర్ కి ఇది కంబ్యాక్ చిత్రం అవ్వడంతో భారీ అంచనాల మొదలయ్యాయి.

 

ఈ సందర్భంగా ఇటీవల జరుగుతున్న రీ-రికార్డింగ్ పనుల్లో భాగంగా తన పాత జ్ఞాపకాల గురించి ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ, 1987 లో తన మొదటి సినిమాకి పని చేసిన కే.వి. మహదేవన్, ఆ తరువాత కలిసి ప్రయాణించిన రాజ్ కోటి, కొత్త తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్, మణిశర్మ, చక్రి, కార్తీక్ రాజు మరియు ఇప్పుడు పని చేస్తున్న మార్క్ కే రాబిన్ లని గుర్తుచేసుకుంటూ తన సుదీర్ఘ ప్రయాణాన్ని నెమరువేసుకున్నారు.

 

అలాగే ఎస్.పి.జె క్రియేషన్స్ పతాకంపై చిత్రాన్ని నిర్మిస్తున్న గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో బోల్డ్నెస్ తో పాటు సున్నితమైన భావోద్వేగభరితమైన సన్నివేశాలు కూడా ఉంటాయని. దర్శకుడు రొమాన్స్ ని చాలా పొయెటిక్ గా చూపిస్తున్నారని అన్నారు. అదే సమయంలో నిర్మాణాంతర కార్యక్రమాలని వేగపరుస్తూ, త్వరలోనే చిత్ర టీజర్ ని మరియు రిలీజ్ డేట్ ని ప్రకటిస్తామని తెలిపారు.

కెసిఆర్ 2.0:సారూ.. గుర్తున్నాయా..మీ ఎన్నికల హామీలు!

 

2018 డిసెంబర్‌‌‌‌ 13న తెలంగాణ ముఖ్యమంత్రిగా కెసిఆర్ గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అంటే ఈ రోజుకి కచ్చితంగా సంవత్సరం అయింది. ఆ ఎలక్షన్లకు ముందు టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో 24 అంశాలపై హామీలు ఇచ్చారు. అప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనాల పెంపు కొన్నికాగా, కొత్తగా మరిన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇవే..

 

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ. రూ.3,016 భృతి ఇస్తామని ఎలక్షన్ల ముందు కేసీఆర్​ ప్రకటించారు. దానిపై ఇప్పటికీ ముందడుగు పడలేదు.

 

లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. గెలిచి అధికారం చేపట్టి ఏడాది అయినా ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు.

 

వేతన సవరణ కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు వీలైనంత త్వరగా వేతన సవరణ చేస్తామని ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్​ చెప్పారు.వేతన సవరణ చేయాల్సిన గడువు దాటి ఏడాదిన్నర అవుతున్నా ఈ విషయం ముందుకు పడటం లేదు. పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు నివేదికను సర్కారుకు అందచేయలేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రకటించలేదు.

 

ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతుబంధు కోసం బడ్జెట్​లో సర్కారు రూ.6,900 కోట్లు కేటాయించింది. అందులో రూ.5,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో 45 లక్షల మంది రైతులకే సాయం అందింది. తమకు సొమ్ము అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధుపై టీఆర్ఎస్​ సర్కారు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు.

 

రాష్ట్రంలో సొంత స్థలం ఉన్న పేదలు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. డబుల్​బెడ్రూం పథకాన్ని కొనసాగిస్తూనే.. ఆర్థిక సాయాన్నీ అమలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు.

 

డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని నాలుగేండ్ల కింద ప్రారంభించారు. 2020 మార్చి నాటికి రెండు లక్షల ఇండ్లను పూర్తిచేసి, పేదలకు అందిస్తామన్నరు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 82 వేల ఇండ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కూడా పూర్తి కాలేదు. చాలా చోట్ల పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి.

 

రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో ప్రకటించింది. వయో పరిమితి తగ్గింపుతో కొత్తగా 7 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతారని అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ అమల్లోకి రాలేదు.

 

‘‘ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది’’.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఈ హామీ కూడా ఉంది కానీ అమలుపై ప్రయత్నాలు జరగలేదు.

 

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు.

 

“కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన సాగిస్తం’ అని కేసీఆర్​ ప్రకటించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం నిర్మాణం పాక్షికంగా పూర్తయింది. మిగిలిన ప్రాజెక్టుల పనిలో జాప్యం.

 

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని టీఆర్ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ టెస్టుల ఆధారంగా ప్రతి వ్యక్తి హెల్త్ వివరాలు రికార్డు చేసి, ఆ వివరాలతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ప్రకటించారు. అమలు కాలేదు.

 

కంటి వెలుగును అద్దాల పంపిణీకే పరిమితం చేశారు. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,54,72,849 మందికి టెస్టులు చేసి.. 9,30,968 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. కానీ ఆపరేషన్లు జరగలేదు.

ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు.

 

కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను నెలకొల్పుతామని టీఆర్ఎస్​ ఎలక్షన్​ మేనిఫెస్టోలో హామీగా ప్రకటించారు. కానీ యూనిట్లను ఏర్పాటు చేయలేదు.

 

‘రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తం.’అని మేనిఫెస్టోలో చేర్చారు.

 

అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ చేయలేదు.

 

 

ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌ అమలు చేస్తామని 2014 ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని సీఎం కేసీఆర్​ పలుమార్లు చెప్పారు. కానీ ఇవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.

స్పష్టత లోపించిన నాయకుడు, పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ ని ఎవరన్నా ఏమాత్రం సున్నితంగా విమర్శించినా వెంటనే ఎక్కువగా రియాక్ట్ అవుతాడు. ఆయన వెంటనే, నేను వేల కోట్లు వదులుకొని వచ్చాను, నాకు ప్రధాన మంత్రి దగ్గర నుంచి అందరు తెలుసు అని మొదలు పెడతాడు. అయ్యా విషయం అది కాదు. మీరు రాజకీయాలలోకి వచ్చిన తర్వాత కొంత స్పష్టత అవసరం. మీ నిజాయతీని ఎవరూ శంకించటం లేదు స్వామి. మీరు ఫుల్ టైం రాజకీయలలో ఉండాలంటే, మిమ్మల్ని నమ్ముకుని లక్షలమంది రోడ్డు మీదకు వచ్చినతర్వాత, నిజాయతీ ఒక్కటే సరిపోదు- నిబద్ధత కూడా కావాలి.

సంస్థాగతంగా పార్టీని పటిష్ట పరిచే పనులు ఎక్కడా ఎవ్వరికి తెలియదు. మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ఇంతవరకు విధాన పరమైన ఒక ప్రకటన ఒక వ్యాసం రూపంలో గాని ఒక పుస్తక రూపంలో గాని ఎక్కడా చూడలేదు . ఇది కూడా మీరు సీక్రెట్ గా చేస్తే అది వేరే విషయం అనుకోండి. ప్రజలకు మీమీద మంచి అభిప్రాయం ఉంది కానీ అది సరిపోదు సారూ. మీరు ప్రజలకి ఒక విశ్వాసం కల్పించాలి, మంచితనం ఒక్కటే సరిపోదు. ఎన్నికలకు ముందు 6 నెల్ల క్రితం ప్రజల్లోకి వచ్చినప్పుడు, వాళ్ళు మీకు బ్రహ్మ రధం పట్టారు. కానీ మీరు 6 నెలల్లో ఎన్నోపిల్లిమొగ్గలు. ఒక రెండు వారాలు ప్రజల్లో ఉంటారు, ప్రజలందరూ మీగురుంచి మంచిగా ఆలోచించటం మొదలు పెట్టగానే మీరు ఒక నెల అంతర్ధానమైపోతారు. సరేలే అని సర్దిపెట్టుకొని ముందుకెళదాం అనుకొంటే అదేతంతు రిపీట్ అవుతూ వచ్చింది.

మీరు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా, జగన్ కి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ప్రజలంతా మనకి ఒక ఆల్టర్నేట్ వచ్చాడు అనుకొన్నారు. మీ మనసులో ఏముందో తెలియదు కానీ, ఎన్నికల చివరి క్షణంలో మీరు జగన్మోహన్ రెడ్డి ని తిడుతూ, టీడీపీ ని ఏమనకుండా ఉంటే ప్రజలు అంత తెలివి లేని వాళ్ళు కాదు. మిమ్మల్ని, మీ అన్నయ్యను నమ్ముకొని ఎంతోమంది అభాసుపాలయ్యారు. అది మీ జన్మ హక్కుఅనుకోవద్దు.
ప్రజలకి ఒక స్పష్టత ఇవ్వండి ఇప్పటికైనా. రెండు చోట్ల పోటీచేసి దారుణంగా ఓడిపోతే ఇంతవరకు మీరు ఆత్మావలోకనం చేసుకున్నట్లే మాకు కనిపించడంలేదు.

మెగాస్టార్ మూవీ కోసం 20కోట్ల సెట్!

 

మెగాస్టార్-కొరటాల శివ కాంబినేషన్లో చిరంజీవి-152వ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే. ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. కోకాపేటలో చిరంజీవి కోసం ప్రత్యేకంగా ఇంటి సెట్ ఏర్పాటు చేసి షూటింగ్ చేశారు. కథలో భాగంగా 20కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా కాలనీ ఏర్పాటు చేస్తున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. చిరంజీవి ఈ మూవీలో ఎండోమ్మెంట్ ఆఫీసర్ గా కన్పించబోతున్నాడు. దీంతో ఓ టెంపుల్ సెట్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

 

కొరటాల శివ సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్లతోపాటు సోషల్ మేసేజ్ ఉంటాయి. చిరంజీవి సినిమాలు కూడా దాదాపు ఇలానే ఉంటాయి. కొరటాల శివ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కురిపించినవే. దీంతో నిర్మాత కూడా ఏమాత్రం ఖర్చుకు వెనుకాకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమాలో అసలు ఖర్చు కంటే సెట్ల కోసం వేసే ఖర్చే ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. సైరా మూవీ అనుకున్నంత విజయం సాధించకపోవడంతో రాంచరణ్ కొంత ఖర్చు తగ్గించే ఆలోచనలో పడ్డాయి. అయితే మెగాస్టార్-కొరటాల కాంబినేషన్ కావడంతోనే ఖర్చుకు రాంచరణ్ ఖర్చుకు వెనుకడం లేదు. ఈ మూవీ ఖర్చు రూ.150కోట్లు దాటేలా కన్పిస్తుంది.

 

ఈ మూవీలో మెగాస్టార్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీలో చిరంజీవి జోడిగా సీనియర్ కథానాయిక త్రిష నటిస్తుంది. అలాగే ఓ ముఖ్య పాత్రలో తెలుగమ్మాయి ఈషా రెబ్బా నటిస్తోంది. ఇటీవలే చిరంజీవి-రెజీనాలపై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ అందించిన బాణీలకు మెగాస్టార్-రెజీనాలు అదిరిపోయే స్పెప్పులు వేసినట్లు సమాచారం. చాలా రోజల తర్వాత చిరంజీవి మూవీకి మణిశర్మ మ్యూజికల్ అందిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూవీలన్నీ మ్యూజికల్ హిట్టయినవే. కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ, మాస్ హీరో చిరంజీవి, మ్యూజికల్ బ్రహ్మ మణిశర్మ, డైనమిక్ నిర్మాత రాంచరణ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్.. మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆశయాలను కొనసాగించడానికి నటన నుండి విశ్రాంతి తీసుకున్నాడు, ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా పోటీ చేశాడు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి మల్లి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేసినట్టు తెలుస్తుంది. వాటిలో ఒకటి బాలీవుడ్ చిత్రం పింక్ మూవీ తెలుగు రీమేక్… హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాని # పిఎస్‌పికె 26 గా సూచిస్తున్నారు.

 

More News:బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న హీరో కార్తీ!

 

పేరులేని ఈ చిత్రం 2020 మే 15 న థియేటర్లలో విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు, ఈ సినిమా టైటిల్ ఉగాది (మార్చి 25,) లో విడుదల కానున్నట్టు తెలిపారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పేరులేని ఈ చిత్రాని ఎస్.తమన్ సంగీతం సమకూర్చనున్నారు.

 

More News: ఆర్ఆర్ఆర్ సినిమాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు..!

 

ఈ చిత్రంలో నటి నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తుండగా, అనన్య నాగల్లా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పింక్ బాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించడంతో పాటు ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తమిళంలో నెర్కొండ పార్వైగా రీమేక్ చేస్తున్నారు ఇందులో అజిత్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు.