
తమిళంలో కార్తీ హీరోగా నటించిన ‘ఖైతి’ సంచలన విజయం సాధించింది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తెలుగులో ఖైదీ గా విడుదల అయ్యి అభిమానులను ఆకట్టుకుంది. అదే సమయంలో వచ్చిన విజయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విజిల్’ను కూడా తట్టుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్లు ఓ నిర్మాణ సంస్థ ప్రకటించింది.రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్, డ్రీమ్ వారియర్స్ సంస్థలు కలిసి నిర్మించనున్నాయి. హిందీ రీమేక్‌గా రానున్న ఈ సినిమా బాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటుందో లేదో చూడాలి మరి…
More News: పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్.. మూవీ టైటిల్, రిలీజ్ డేట్ ఫిక్స్!