
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రాజకీయ ఆశయాలను కొనసాగించడానికి నటన నుండి విశ్రాంతి తీసుకున్నాడు, ఇటీవల జరిగిన ఎన్నికలలో కూడా పోటీ చేశాడు. చాలా కాలం తరువాత పవన్ కళ్యాణ్ టాలీవుడ్ కి మల్లి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే మూడు సినిమాలను సైన్ చేసినట్టు తెలుస్తుంది. వాటిలో ఒకటి బాలీవుడ్ చిత్రం పింక్ మూవీ తెలుగు రీమేక్… హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటించగా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. తాత్కాలికంగా ఈ సినిమాని # పిఎస్‌పికె 26 గా సూచిస్తున్నారు.
More News:బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న హీరో కార్తీ!
పేరులేని ఈ చిత్రం 2020 మే 15 న థియేటర్లలో విడుదల కానున్నట్టు చిత్ర నిర్మాత వెల్లడించారు, ఈ సినిమా టైటిల్ ఉగాది (మార్చి 25,) లో విడుదల కానున్నట్టు తెలిపారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు. పేరులేని ఈ చిత్రాని ఎస్.తమన్ సంగీతం సమకూర్చనున్నారు.
More News: ఆర్ఆర్ఆర్ సినిమాలోకి సూపర్ స్టార్ మహేష్ బాబు..!
ఈ చిత్రంలో నటి నివేదా థామస్ కీలక పాత్ర పోషిస్తుండగా, అనన్య నాగల్లా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పింక్ బాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించడంతో పాటు ప్రేక్షకుల నుండి ప్రశంసలు కూడా అందుకుంది. ఈ సినిమా తమిళంలో నెర్కొండ పార్వైగా రీమేక్ చేస్తున్నారు ఇందులో అజిత్ ప్రధాన పాత్ర పోషించనున్నాడు.