
విజేత మూవీ తో తెలుగు ఇండస్ట్రీ కి అడుగు పెట్టిన మెగా స్టార్ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ మొదట సినిమాలోనే మంచి పెర్ఫార్మెన్స్ తో ప్రశంసలు అందుకున్నాడు. చాల రోజులు తరవాత ఈ మెగా హీరో మరో సినిమాకి సైన్ చేసాడు. ప్రముఖ డైలాగ్ రైటర్ శ్రీధర్ సీపాన దర్శకత్వంలో గీత గోవిందం,ప్రతిరోజు పండగే వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన జీఏ 2 పిక్చర్స్ సమర్పణలో పీపుల్ మీడియా ఫాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తోంది. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించే ఈ మూవీ మార్చి లో సెట్స్ పైకి వెళ్లనుంది.