Homeఎంటర్టైన్మెంట్ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ తో రాజమౌళి మూవీ

ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రభాస్ తో రాజమౌళి మూవీ

 

దర్శక దిగ్గజం రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పనుల్లో బీజీగా ఉన్న సంగతి తెల్సిందే. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్నారు. స్వాతంత్ర ఉద్యమం నేపథ్యంలో ఈ మూవీని జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. కొమురంభీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్నాడు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చే సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాజమౌళి-ప్రభాస్ కలిసి ఓ ప్రొడక్షన్ ప్రారంభించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ప్రభాస్-రాజమౌళి స్థాపించే ప్రొడక్షన్లో సినిమాలను తీయనున్నారని సమాచారం. ఈ పొడక్షన్ వచ్చే తొలి మూవీలో ప్రభాస్ నటించనున్నారని ఈ మేరకు వారిద్దరి మధ్య అవగాహన కుదిరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

 

Read More:
జాను నా కెరీర్‌లోనే స్పెష‌ల్ మూవీ: స‌మంత అక్కినేని

 

రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చిత్రీకరణపైనే ఫోకస్ పెట్టాడు. ఈ మూవీలో రాంచరణ్ సరసన అలియా భట్, జూనియర్ ఎన్టీఆర్ కు జోడి ఓలీవియా మోరీస్ నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే రాంచరణ్-అలియభట్ నడుమ వచ్చే స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా రాంచరణ్-జూనియర్ ఎన్టీఆర్ నడుమ కొన్ని ఇంట్రెస్టింగ్ సన్నివేశాలను పూర్తి చేశారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మాత డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 

Read More:
నామ్ కేలండర్ ఫొటోస్

 

ఇటీవలే బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, శ్రీయ ఈ చిత్ర షూటింగ్ పాల్గొన్నారు. ఈ మూవీ దసరాకు రిలీజ్ అవుతుందని భావించినా ప్రస్తుతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ‘ఆర్ఆర్ఆర్’ మూవీని సంక్రాంతి కానుకగా తీసుకురావడానికి దర్శకుడు సన్నహాలు చేస్తున్నాడు. బహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular