Home Blog Page 8633

ఇక పళ్ళు జివ్వు మనకున్నా ఐస్ క్రీం తినలేం

చలికాలంలో ఐస్ క్రీం ను కొంతమంది తింటుంటారు. ఐస్ క్రీం తిన్నప్పుడు చాలా మందికి పళ్ళు జివ్వు మానడం సహజం. అయితే ఇప్పుడు పళ్ళు జివ్వుమనని వారు కూడా ఐస్ క్రీం తినలేరు. ఐతే దీనికి కారణం చల్లదనం కాదు. పెరిగిన ధరలు. దేశవ్యాప్తంగా పాల ధరలు పెరిగిన దరిమిలా ఐస్ క్రీం ధరలు పెరిగాయి. తాజాగా ఐస్ క్రీం కంపెనీలు ఐస్ క్రీం ధరలను మరింతగా పెంచాయి. ఇవి 8 నుంచి 15 శాతం వరకు పెరిగాయని సమాచారం . ఇన్పుట్ కాస్ట్ పెరిగిన కారణంగా ధరలు పెంచక తప్పడం లేదని సదరు కంపెనీలు చెబుతున్నాయి.

మోడీకి దిమ్మతిరిగే గిఫ్ట్ ఇవ్వనున్న కాంగ్రెస్…!

గత కొంతకాలంగా దేశంలో పౌరసత్వం బిల్లుకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ఇటీవలే ఈ బిల్లుకు చట్టబద్దత లభించింది. బిల్లు ఆమోదం పొందటంతో గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి అమలు చేస్తున్నారు. ఈ చట్టాన్ని మొదటగా కర్ణాటకలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో దీనిని అమలు చేసి ఆ తరువాత మిగతా రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు.

Read More: కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌?

అయితే, చాలా రాష్ట్రాలు దీనికి ఒప్పుకోవడం లేదు. పౌరసత్వ చట్టం వలన మైనారిటీలకు ఇండియాలో ఇబ్బందులు వస్తాయని అంటున్నారు. అసలు ఈ చట్టానికి, మైనారిటీలకు సంబంధం లేదని ఎంత చెప్తున్నా సరే పట్టించుకోవడం లేదు. ప్రతిపక్షాలు మొత్తం కలిసి సిఏఏ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాని మోడీకి ఓ గిఫ్ట్ ను అందించింది. అదేమంటే భారత రాజ్యాంగం. అమెజాన్ లో భారత రాజ్యాంగ ప్రతిని కొనుగోలు చేసింది. ఈ ప్రతిని త్వరలోనే మోడీకి అందుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరు సమానమే అనే విషయం తెలుసుకోవాలని కాంగ్రెస్ పార్టీ మోడీకి చెప్తున్నది. మరి కాంగ్రెస్ ఇచ్చిన గిఫ్ట్ కు మోడీ ఎలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారో చూడాలి.

Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

పేస్ బుక్ సీఈవోకి డిస్కౌంట్ వస్తువులంటే మోజు… కారణం ఇదే

 

పేస్ బుక్ సీఈవో, ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన మార్క్ జకర్బర్గ్ కు షాపింగ్ అంటే ఎంతో ఇష్టం. అదికూడా డిస్కౌంట్ లో ఎక్కడ వస్తువులు దొరుకుతున్నాయో తెలుసుకొని మరి కొంటుంటారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం తాజాగా జకర్బర్గ్ కు సంబంధించిన ఒక ఫోటో వైరల్ గా మారింది. దానిలో ఆయన తన భార్య ప్రిసిలతో పాటు షాపింగ్ చేస్తూ కనిపిస్తున్నారు. ఒక టీవీని వారు పరీక్షగా చూస్తున్నారు. దీనిపై భారీ డిస్కౌంట్ వుంది. ఈ ఘటన అమెరికా లోని కాస్టాకో మాల్ లో చోటుచేసుకుంది. కాగా జకర్బర్గ్ ఆస్తి విలువ మన కరెన్సీ లో రూ. 5. 71 లక్షల కోట్లు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ మనం పిల్లలకు అన్నీ కొని ఇవ్వకూడదని, వారికి భాద్యతలు అప్పజెప్పాలని అన్నారు. అందుకే తన పిల్లలను ఆఫీస్ కి తీసుకువెళ్తానని చెప్పారు. కాగా జకర్బర్గ్ పోస్ట్ చేసిన ఒక వీడియోలో అతని కుమార్తె ఇంటి పనులు చేస్తూ కనిపిస్తున్నారు.

కేటీఆర్‌ కి అద్భుతమైన బహుమానం సిద్ధంచేసిన కేసీఆర్‌?

2020 పుర ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డ్ తో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.. అలాగే గతంలో హుజూర్ ‌నగర్‌లో బంపర్‌ విక్టరీ. ఈ విధంగా ఎన్నికల రణక్షేత్రంలో ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న తారక రాముడికి పట్టాభిషేకమే తరువాయా? వేదిక ఏదైనా, బాధ్యత ఏదైనా తిరుగులేకుండా, ఎదురేలేకుండా సత్తా చాటుతున్న యువ నాయకుడికి గురుబాధ్యతలకు వేళయ్యిందా? కేసీఆర్ తర్వాత కేటీఆరేనంటూ కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న డిమాండ్‌కు, ఆచరణరూపం ఇచ్చే టైమైందా? మున్సిపల్‌ విజయాన్ని తనకు మరోసారి కానుకగా ఇచ్చిన తనయుడు తారక రాముడికి, తండ్రి బహుమానం సిద్దం చేశారా? పుర ఎన్నికల జోష్‌ తర్వాత, అసలేం జరగబోతోంది?

Read More:
సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

2018, డిసెంబర్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా, కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. అలాగే ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారక రామారావు. టీఆర్ఎస్‌లో కేసీఆర్‌ తర్వాత కేటీఆరే కీలక నాయకుడన్నది, తెలంగాణ భవన్‌లో అత్యధికుల మాట. కేసీఆర్‌ తర్వాత సీఎం ఎవరన్న ప్రశ్న వచ్చిన ప్రతిసారీ మరో మాట తడుముకోకుండా, కేటీఆర్‌ పేరే మారుమోగుతోంది. 2020 కేటీఆర్‌కు అత్యంత కీలకమైన సంవత్సరంగా, పార్టీలో పెను మార్పుల సంవత్సరంగా పార్టీలో చర్చ జరిగింది. ఈ కొత్తేడాదిలో మున్సిపల్ ఎన్నికల బాధ్యతలను విజయవంతంగా నిర్వహించి, కేసీఆర్‌కు కానుక ఇచ్చారు కేటీఆర్. ఇఫ్పుడు కేటీఆర్‌కు సైతం కేసీఆర్‌ బహుమానం సిద్దం చేశారన్న చర్చ ఊపందుకుంది. మరి తనయుడికి తండ్రి ఇచ్చే బహుమానం కోసం కొన్ని రోజులు వేచిచూడాలి..

Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..

సారూ.. అప్పుడు గెలిచారు.. హామీలు మరిచారు..ఇప్పుడైనా జర దెఖో..

తెలంగాణ ప్రజలు 2018 ఎన్నికలలో కెసిఆర్ ని రెండొవ సారి అధికార పీఠాన్ని ఎక్కించారు. ఆ తర్వాత హుజుర్ నగర్ ఉపఎన్నికల్లో తెరాసకి ఘనవిజయం అందించారు. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలో కూడా.. తెరాసదే హవా… ఇలా ప్రతిసారి కెసిఆర్ కి తెలంగాణ ప్రజలు విజయాన్ని ఇస్తున్నారు. కానీ కెసిఆర్ ప్రజలను ఒకింత చిన్న చూపు చూస్తున్నట్లు తెలుస్తుంది.

2018 ఎన్నికలకు ముందు టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో 24 అంశాలపై హామీలు ఇచ్చారు. అప్పటికే అమల్లో ఉన్న పథకాల్లో ప్రయోజనాల పెంపు కొన్నికాగా, కొత్తగా మరిన్ని ప్రకటించారు. ఆ వివరాలు ఇవే..

Read More: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డు

రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు రూ. రూ.3,016 భృతి ఇస్తామని ఎలక్షన్ల ముందు కేసీఆర్​ ప్రకటించారు. దానిపై ఇప్పటికీ ముందడుగు పడలేదు.

లక్ష రూపాయల వరకు రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. గెలిచి అధికారం చేపట్టి ఏడాది అయినా ఇప్పటివరకు దానిపై స్పష్టత ఇవ్వలేదు.

వేతన సవరణ కోసం రాష్ట్రంలోని ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఉద్యోగులకు వీలైనంత త్వరగా వేతన సవరణ చేస్తామని ఎలక్షన్ల సమయంలో సీఎం కేసీఆర్​ చెప్పారు.వేతన సవరణ చేయాల్సిన గడువు దాటి ఏడాదిన్నర అవుతున్నా ఈ విషయం ముందుకు పడటం లేదు. పీఆర్సీ కమిటీ ఇప్పటివరకు నివేదికను సర్కారుకు అందచేయలేదు. కనీసం మధ్యంతర భృతి (ఐఆర్) అయినా ప్రకటించలేదు.

ఈ ఏడాది ఖరీఫ్‌లో రైతుబంధు కోసం బడ్జెట్​లో సర్కారు రూ.6,900 కోట్లు కేటాయించింది. అందులో రూ.5,500 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. దీంతో 45 లక్షల మంది రైతులకే సాయం అందింది. తమకు సొమ్ము అందకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతుబంధుపై టీఆర్ఎస్​ సర్కారు ఇచ్చిన హామీ పూర్తి స్థాయిలో నెరవేరలేదు.

రాష్ట్రంలో సొంత స్థలం ఉన్న పేదలు డబుల్​ బెడ్రూం ఇండ్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేస్తామని ఎలక్షన్ల ముందు సీఎం కేసీఆర్​ ప్రకటించారు. డబుల్​బెడ్రూం పథకాన్ని కొనసాగిస్తూనే.. ఆర్థిక సాయాన్నీ అమలు చేస్తామని చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కసరత్తు జరగలేదు.

Read More: అత్యుత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ స్థానం ఎంతో తెలుసా..?

డబుల్​ బెడ్రూం ఇండ్ల పథకాన్ని నాలుగేండ్ల కింద ప్రారంభించారు. 2020 మార్చి నాటికి రెండు లక్షల ఇండ్లను పూర్తిచేసి, పేదలకు అందిస్తామన్నరు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 82 వేల ఇండ్లను మంజూరు చేశారు. కానీ ఇప్పటివరకు 40 వేల ఇండ్లు కూడా పూర్తి కాలేదు. చాలా చోట్ల పనులు పిల్లర్ల దశలోనే ఆగిపోయాయి.

రాష్ట్రంలో వృద్ధాప్య పెన్షన్‌ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తామని టీఆర్ఎస్​ మేనిఫెస్టోలో ప్రకటించింది. వయో పరిమితి తగ్గింపుతో కొత్తగా 7 లక్షల మంది వరకు లబ్ధిదారులు పెరుగుతారని అంచనా వేశారు. ఈ ఏడాది ఆగస్టు నుంచే వాళ్లకు పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ అమల్లోకి రాలేదు.

‘‘ఎస్సీ, ఎస్టీల సమగ్రాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుంది’’.. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఈ హామీ కూడా ఉంది కానీ అమలుపై ప్రయత్నాలు జరగలేదు.

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్ మెంట్ ఏజ్ ను 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచుతామన్న హామీ అమలు కాలేదు.

“కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు పాలమూరు–రంగారెడ్డి, కాళేశ్వరం, సీతారామ, డిండి వంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన సాగిస్తం’ అని కేసీఆర్​ ప్రకటించారు. ఈ నాలుగు ప్రాజెక్టుల్లో కాళేశ్వరం నిర్మాణం పాక్షికంగా పూర్తయింది. మిగిలిన ప్రాజెక్టుల పనిలో జాప్యం.

రాష్ట్రవ్యాప్తంగా హెల్త్ క్యాంపులు పెట్టి ప్రతి వ్యక్తికి ఆరోగ్య పరీక్షలు చేయిస్తామని టీఆర్ఎస్​ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఆ టెస్టుల ఆధారంగా ప్రతి వ్యక్తి హెల్త్ వివరాలు రికార్డు చేసి, ఆ వివరాలతో రాష్ట్ర హెల్త్ ప్రొఫైల్ రూపొందిస్తామని ప్రకటించారు. అమలు కాలేదు.

Read More:
తెలంగాణలో మున్సిపల్ ఫలితాలు..కొనసాగుతున్న కారు హవా..

కంటి వెలుగును అద్దాల పంపిణీకే పరిమితం చేశారు. పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 1,54,72,849 మందికి టెస్టులు చేసి.. 9,30,968 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించారు. కానీ ఆపరేషన్లు జరగలేదు.

ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నేటికీ నెరవేరలేదు.

కల్తీ లేని ఆహార పదార్థాలను ప్రజలకు అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్‌‌ ప్రాసెసింగ్‌‌ యూనిట్లను నెలకొల్పుతామని టీఆర్ఎస్​ ఎలక్షన్​ మేనిఫెస్టోలో హామీగా ప్రకటించారు. కానీ యూనిట్లను ఏర్పాటు చేయలేదు.

‘రెడ్డి, వైశ్య కార్పొరేషన్లతోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తం.’అని మేనిఫెస్టోలో చేర్చారు.

అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతామని మేనిఫెస్టోలో చెప్పారు. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నమూ చేయలేదు.

ఎస్సీ వర్గీకరణ, చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌‌ అమలు చేస్తామని 2014 ఎన్నికల్లోనే టీఆర్ఎస్‌‌ హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక దానిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్తామని సీఎం కేసీఆర్​ పలుమార్లు చెప్పారు. కానీ ఇవేవీ ఇప్పటికీ అమల్లోకి రాలేదు.

Read More: మున్సిపల్ ఎన్నికల్లో తెరాస జాతీయ స్థాయి రికార్డు

ఉగాదికి ఇళ్ల పట్టాలు.. మరో అద్భుతమైన పథకానికి శ్రీకారం చుట్టిన జగన్

2020 ఉగాది నాటికి అర్హులు ఎంతమంది ఉన్నా అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందేనని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీపై క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, అధికారులు హాజరయ్యారు.

‘అమ్మఒడి’ తర్వాత ప్రభుత్వం చేపడుతున్న మరో అతి పెద్ద కార్యక్రమం అని సీఎం పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం కూడా ఈ స్థాయిలో ఇళ్ల పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రజాసాధికార సర్వే అన్నది ప్రమాణం కాకూడదని.. వాలంటీర్లు క్షేత్రస్థాయిలో గుర్తించిన అంశాలు ప్రామాణికం కావాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తిస్తున్న స్థలాలు ఆవాస యోగ్యంగా ఉండాలన్న ప్రాథమిక విషయాన్ని మరిచిపోకూడదని అధికారులకు సీఎం సూచించారు.

మోడీ అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లీ వెళ్లిన అలీ

ప్రముఖ హాస్యనటుడు ఆలీ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు. గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన అలీ. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రచార కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్నారు. వైసీపీ లో చేరిన క్రమంలో అయన తన స్నేహితుడు, జనసేనాని పవన్ కళ్యాణ్ ని కూడా పక్కన పెట్టారు.. కొన్ని సందర్భాలలో ఆయనను తీవ్రంగా విమర్శించారు కూడా. ఎన్నికలు అయిపోయాయి. ఆ ఎన్నికల సమయంలో ఆలీ తో పాటు పలువురు సినీ నటులు వైసీపీ తరఫున నిలిచి ప్రచారం చేశారు.

Read More:
వైఎస్ఆర్ తరహాలో జగన్ రచ్చబండ.. షెడ్యూల్ విడదల

ఎన్నికల సమయంలో తనకు అండగా నిలిచిన సినీ నటులకు జగన్ పదవులు పందేరం చేస్తారని అందరూ భావించారు. కొంతవరకూ అది నిజం అయింది కూడా. అందులో భాగంగా కమెడియన్ పృద్వీ కి ఎస్వీబీసీ చైర్మన్ పదవి కూడా దక్కింది. అయితే, ఆలీకి కూడా ఏదైనా పదవి వస్తుందని అనుకున్నారు. కానీ, అలా జరగలేదు. దాంతో కొంత కాలంగా ఆలీ వైసీపీ పై అసంతృప్తి తో ఉన్నారనీ, అయన పార్టీ మారే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ, ఆలీ మాత్రం ఎక్కడా ఈ విషయంలో పెదవి విప్పలేదు. ఆలీ విషయంలో వెలువడిన కథనాలన్నీ కల్పితాలుగా భావించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆలీ అకస్మాత్తుగా ఢిల్లీ బీజేపీ ఆఫీసు వద్ద ప్రత్యక్షం అవడంతో మళ్ళీ అయన పార్టీ మారుతున్నారన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, తన ఢిల్లీ పర్యటన విషయంపై ఆలీ వివరణ ఇచ్చారని తెలుస్తోంది.

ఢిల్లీలో మీడియా తో ఆలీ మాట్లాడుతూ.. తాను వ్యక్తిగతమైన పనిమీద ఢిల్లీ వచ్చానని చెప్పుకొచ్చారట. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలో భారత్‌కు రాబోతున్నారని.. ఆయన ప్రధాని మోదీని కలవాలని భావిస్తున్నారని చెప్పారట ఆలీ. ఈ పని కోసం ప్రధాన మంత్రి అపాయింట్‌మెంట్ కోసం ఢిల్లి వెళ్లినట్లు చెప్పుకొచ్చారని తెలుస్తోంది. తాను కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కలిసి అపాయింట్‌మెంట్ గురించి చర్చించానని.. ఆయన సైతం సానుకూలంగా స్పందించారని ఢిల్లీ లో మీడియా వర్గాలతో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. దీంతో అయన బీజేపీలో చేరడం కోసమే ఢిల్లీ వచ్చారన్న వార్తలు ఊపందుకున్నాయి..

Read More: కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు

కరోనా వైరస్.. సోకితే ఈ లక్షణాలు.. సోకకుండా ఈ జాగ్రత్తలు

చైనాలో పుట్టిన కరోనా వైరస్ రక్కసి ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ వల్ల చైనాలో మృతుల సంఖ్య 25 మందికి చేరింది. మరో 830 మందికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. వైరస్ వ్యాప్తి చెందడంతో ఎక్కడి ప్రజలు అక్కడే ఉంచేందుకు చైనా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.

మృతుల్లో 24 మంది మధ్య హుబీకి చెందిన వారని చైనా అధికారులు తెలిపారు. మరొకరు హెబీలో చనిపోయారని చెప్పారు. హెబీ బీజింగ్ సరిహద్దులో ఉండటంతో.. రాజధాని ప్రాంతంలో వైరస్ వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు ఇతర ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 177 మంది పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించారు.

<

Latest News: చైనా ల్యాబ్ లో తయారైన వైరస్.. దేనికోసం చేశారు.. బయటపడుతున్న నిజాలు..

భారత్ లోకి ప్రవేశం…?

ఈ వైరస్ భారత్‌లోకి సైతం ప్రవేశించే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ సోకితే తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీని ప్రభావంతో ఇప్పటికే చైనాలో 9 మంది మరణించారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అనారోగ్యకరంగా ఉన్న విదేశీలయులను పరీక్షించాకే బయటికి అనుమతిస్తున్నారు. అయితే, వైరస్ దరి చేరకుండా ఉండాలంటే.. నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

కరోనా వైరస్ సోకితే ఈ లక్షణాలు ఉంటాయి…

కరోనా వైరస్ సోకితే జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఛాతిలో నొప్పి, వాంతులు తీవ్రంగా ఉంటాయి. ఈ లక్షణాలు తీవ్రమైన న్యుమోనియోకు దారి తీసి ఊపిరాడక మనిషి మరణించే ప్రమాదమూ ఉంటుంది. ఈ లక్షణాలకు చికిత్స చేయడం తప్ప ప్రస్తుతం ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. ఇప్పటివరకూ జపాన్, థాయ్‌లాండ్, అమెరికాలోనూ వైరస్ బారిన పడ్డవారిని గుర్తించారు. ఈ నేపథ్యంలో చైనాతో పాటు ఇతర దేశాలకు వెళ్లే ప్రయాణికులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

కరోనా వైరస్ సోకకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి.

విదేశీ ప్రయాణాలు చేసేవారు తమ సహ ప్రయాణికులతో జాగ్రత్తగా ఉండాలి. జలుబు, గొంతులో గరగర, జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి.. ఎవరికైనా జలుబు చేసినట్టుగా అనిపిస్తే వారిని ముట్టుకోకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే ప్రమాదం ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత ఈ వైరస్ జంతువుల నుంచి మనుషులకు సోకినట్లుగా భావిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నాణ్యత గల మాస్క్‌లను వాడడం మంచిది.

Latest News: హైదరాబాద్‌లో కరోనా వైరస్ కలవరం.. ఫీవర్ ఆస్పత్రికి మరింత మంది

ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. అపరిశుభ్ర చేతులతో ముక్కు, నోరు తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేసేవారు తరచూ సబ్బుతో చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండడం మంచిది. అంతేకాక, ప్రజా బాహుళ్యం ఎక్కువగా ఉన్న చోట్ల అనవసరంగా ఏ వస్తువులను పడితే వాటిని తాకకూడదు.

కరోనా వైరస్ జంతువుల నుంచే మనుషులకు వ్యాప్తి చెందినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. కాబట్టి, చైనా సహా వైరస్ ప్రభావిత దేశాలకు వెళ్లేవారు జంతువులకు దూరంగా ఉండడం మంచిది. విదేశాలకు వెళ్లినప్పుడు మాంసాహారం తినే వాళ్లు కొన్నాళ్లపాటు దానికి దూరంగా ఉండడం మేలు.

చైనాలోని ఉహాన్‌లో ఓ సముద్ర మార్కెట్ సమీపం కేంద్రంగా ఈ వైరస్ వ్యాపించినట్లుగా నిపుణులు గుర్తించారు. వైరస్ కారణంగా ఉహాన్‌లో ఇద్దరు మృతిచెందడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తొలుత వీరి బ్లడ్ నమూనాలను బ్రిటన్‌కు పంపారు. లండన్‌లో వీటిని పరిశీలించి, పరిశోధన జరిపి, ఇది కరోనా వైరస్‌గా గుర్తించారు. కరోనా అంటే లాటిన్ భాషలో కిరీటం అని అర్థం వస్తుంది. పరిశోధనలో భాగంగా ఈ వైరస్‌ను మైక్రోస్కోపులో చూసినప్పుడు కిరీటం ఆకృతిలో కనిపించిందని, అందుకే దీనికి ఈ పేరు పెట్టినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు రాశాయి.

Read More: కరోనా:ల్యాబ్ లో తయారు చేసిన వైరస్.. షాకింగ్ విషయాలు!

రాజ్యాంగంలో లేని రాజధానిపై ఇంత రాద్ధాంతమా..!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీ సమావేశాలలో చివరిరోజు ప్రసంగం అనేక ప్రశ్నలకు తెరలేపింది. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై శాసనమండలిలో జరిగిన పరిణామాలు దుర దృష్టకరమన్నారు. తప్పు అని తెలిసినా విచక్షణాధికారాలతో నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించే ఇలాంటి వ్యవస్థ మనకు అవసరమా అనేది ప్రజలు, మేధావులు ఆలోచించాలన్నారు. శాసనసభలో గురువారం శాసనమండలి, విచక్షణాధికారాలు, చట్ట ఉల్లంఘన నిబంధనల అతిక్రమణ ప్రజా ప్రయోజనాలపై ముఖ్యమంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు.

భారత రాజ్యాంగంలో రాజధాని అనే పదమేలేదని స్పష్టం చేశారు. గత 8 నెలలుగా అనేక ప్రజోపయోగమైన చట్టాలను, సవరణ బిల్లులను ప్రవేశపెట్టామని తెలిపారు. ఆర్టీసీ విలీనం మొదలుకుని ఆంగ్ల మాధ్యమం వరకు దేశంలోనే మరెక్కడాలేని సంస్కరణలు తీసుకు వచ్చామన్నారు. సమాజంలో అణగారిన వర్గాలపై మనసుపెట్టి పనిచేస్తున్నామని, తాము పాలకులం కాదు సేవకులమనే భావనతోనే ఉన్నామన్నారు. చట్టాలను కాపాడుకునేందుకు చెక్స్ అండ్ బ్యాలెనె్సస్ అవసరమని, అయితే శాసన మండలిలో జరిగిన పరిణామాలు మాత్రం దురదృష్టకరమన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ముచేస్తూ చట్టసభలను అపహాస్యం చేశారని విమర్శించారు. చైర్మన్ నిష్పాక్షికంగా సభను నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తనకు సంబంధంలేని మండలి గ్యాలరీలోకి రావటం, ఆయన కనుసన్నల్లోనే చైర్మన్ నిబంధనలను ఉల్లంఘించి అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపటం దారుణమన్నారు. ఏదైనా బిల్లు మండలికి వస్తే చర్చించాలి, ఆమోదించాలి లేదా తిరస్కరించాలని, సభ్యుల అభిప్రాయాలను సూచిస్తూ సవరణలు పంపాల్సి ఉందన్నారు. ఇవేమీ లెక్కచేయకుండా విచక్షణాధికారం పేరుతో ప్రజలకు న్యాయం చేయకుండా ఉండేందుకు శాసనమండలిని వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీన్ని మనం ఆమోదిస్తే ప్రజాస్వామ్యానికి విలువ ఉండదన్నారు. ఓ వైపు ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులకు సంబంధించి రూల్స్ సక్రమంగా ఉన్నాయని, దీనిపై చర్చించ వచ్చని అన్ని పార్టీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరినప్పటికీ చివరిక్షణంలో ఒత్తిళ్లకు తలొగ్గి తన తప్పును తాను అంగీకరిస్తూనే రాజ్యాంగ విరుద్ధంగా చైర్మన్ వ్యవహరించారని ఆరోపించారు. తప్పును ఒప్పుకుని తెలిసి కూడా విచక్షణాధికారంతో చేస్తామనటం సమంజసం కాదన్నారు. ఏ బిల్లుకైనా సవరణలు విధానపరంగా అది ప్రవేశపెట్టిన 12 గంటల లోపే ఇవ్వాలన్నారు. సెలక్ట్ కమిటీకి ఇవ్వాలనే ఆలోచన ముందుగా చేయాలన్నారు. శాసనమండలిలో ప్రభుత్వపరంగా వచ్చే బిల్లులకు తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రైవేట్ బిల్లులను తరువాత మాత్రమే ప్రవేశపెట్టాలనే నిబంధన ఉందన్నారు. సెలక్ట్ కమిటీ వేయాలనే ప్రతిపాదన రూల్ పరంగా లేదని చెప్పారు. ఈ విషయంలో నిబంధనలు లేవని తెలిసినా తన విచక్షణాధికారంతో తప్పు చేస్తున్నట్లు చైర్మన్ స్వయంగా ప్రకటించారని వివరించారు. ప్రజా స్వామ్యంలో ఇది ఎంత వరకు సమ్మతమో ప్రజలే తేల్చాలన్నారు. శాసనమండలి చట్ట ప్రకారం నడుస్తోందా? పార్టీ, వ్యక్తుల కనుసన్నల్లో నిర్వహిస్తున్నారా అనే విషయాలు ఈ సందర్భంగా దీన్ని బట్టి ఆలోచించాలన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ ఇష్టా ఇష్టాలను తుంగలో తొక్కారన్నారు. ప్రాంతీయ అసమానతలు చోటు చేసుకోకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధికి, పాలనా వికేంద్రీకరణకు నిర్దేశించిన బిల్లులను చట్టం కాకుండా నిరోధించే సభగా మండలి మారిందన్నారు.

హత్య చేయటం నేరమని తెలిసి కూడా చేస్తాననటం నేరం కాదా అని ప్రశ్నించారు. అందరి అభిప్రాయంతో దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలనే భావనతో ఉన్నట్లు చెప్పారు. 2019 ఏప్రిల్‌లో 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 సీట్లు గెలుచుకుని శాసనసభలో 86 శాతం మెజారిటీ సాధించామని, ప్రజామోదంతో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.

శాసనసమండళ్లు దేశంలోని 22 రాష్ట్రాల్లో ఎక్కడాలేవని, కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే ఉన్నాయన్నారు. పేద రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మండలి నిర్వహణకు రోజుకు కోటి రూపాయల ఖర్చవుతుందని, ఏడాదిలో 60 రోజులు అంటే రూ. 60 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. మేధావులకు నేరుగా అవకాశం కల్పించి ప్రభుత్వానికి సూచనలిచ్చేందుకు మాత్రమే ఈ సభలు ఏర్పాటయ్యాయని, అయితే శాసన సభలోనే ఉన్నత చదువులు చదివిన వైద్యులు, ప్రొఫెసర్లు, న్యాయవాదులు, పోస్టుగ్రాడ్యుయేట్లు ఉన్నారన్నారు. చివరకు యాక్టర్లు, జర్నలిస్టులు కూడా సభల్లో ప్రవేశిస్తున్నారని అలాంటప్పుడు మండలి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలకు మంచి చేసే ఆలోచన లేకపోగా ఎలా ఆపాలి, ఎలా జాప్యం చేయాలనే దురుద్దేశంతో హాని కలుగజేసే ఇలాంటి సభలు ఎంత వరకు అవసరమో ఆలోచించాలన్నారు. ప్రజాభిప్రాయం, చట్టసభల నిబంధనలకు వ్యతిరేకంగా, చట్టం, రూల్స్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్న మండలిని కొనసాగించటం అవివేకమవుతుందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదం లేదని చెప్తూ సీటు గవర్నెన్స్ ఉంటుందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, చట్టాలు చేసే అధికారాన్ని ప్రజలు తమకు అప్పగించారని స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అధికారం కల్పించారన్నారు. పాలనా వికేంద్రీకరణ ఇందులో భాగమన్నారు.

తమిళనాడులో దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఊటీ నుంచి పాలించారని గుర్తు చేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు హుదూద్ తుపాను సమయంలో పది రోజులు విశాఖలోనే ఉన్నారని అక్కడి నుంచే అన్ని వ్యవహారాలు నడిపారన్నారు. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పాలన నిర్వహించే అధికారం ఉందన్నారు. ఇందుకు ఏ చట్టం, బిల్లు అవసరం లేదని చెప్తూ ఓ తీర్మానం చేస్తే సరిపోతుందని వివరించారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైనా నిర్వహించ వచ్చని, ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడైనా చట్టాలు చేసుకునే వీలుందన్నారు. ప్రజలకు మంచిచేసే పనులను అడుగడుగునా అడ్డుకుంటూ రాజకీయ దురుద్దేశాలకు వేదికగా మారి రాజకీయ అజెండాతో నడుస్తున్న ఇలాంటి సభలకు ఇక ముగింపు పలకక పోతే నష్టపోతామని, దీనిపై ఆలోచన చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులను కోరారు.

2020 అంటే ఏమిటో తెలిస్తే షాక్ అవుతారు

2020 సంవత్సరం లోకి ప్రవేశించాం. 2020 లో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయని చాలామంది అంటున్నారు. మరి ఆ నిజాలు తెలుసుకొంటే షాక్ అవుతారు. బాలీవుడ్ బిగ్ బి 19కి 20కి ఎంతో తేడాలేదు అని విష్ చేశారు. ఇది ఎంతో గమ్మత్తుగా వుంది. అయితే ఇప్పుడు ఇంతకన్నా ఎంతో ఆసక్తి కరమైన విశేషం 2020 లో దాగిఉందని ఇంగ్లీష్ నిఘంటువు చెపుతోంది. నూతన సంవత్సరం సందర్భం గా చాలా మంది 2020 కి అర్ధం ఏమిటని వెదుకుతున్నారు. మరి నిఘంటువు ఏమి చెప్పిందనుకుంటున్నారు? 2020కి నిఘంటువు ప్రత్యేకమైన అర్ధాన్ని ఇచ్చింది. దీని అర్ధం క్లియర్ విజన్ అట. అంటే స్పష్టమైన ద్రుష్టి అని భావం. కంటి ద్రుష్టి 20/20 ఉంటే చూపు స్పష్టంగా ఉందని చెబుతుంటారు. అంటే విజన్ కరెక్ట్ గా ఉందని అర్ధం. ఇటువంటి ద్రుష్టి కలిగిన వారు 20 అడుగుల దూరంలో గల వస్తువును స్పష్టంగా చూడగలుగుతారు. అంటే ఈ 2020 మనకి జీవితం లో అన్నింటిపైన స్పష్టమైన అవగాహన కల్పిస్తుందని అనుకుందాం

తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

తాజాగా జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లు శాసనసభలో నెగ్గింది. అయితే ఆ బిల్లు శాసన మండలిలో మాత్రం నెగ్గలేకపోయింది. కారణం మండలిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండి.. వైసీపీకి తక్కువ బలం ఉండటమే. అంతేకాకుండా మండలి చైర్మన్‌గా ఉన్న ఎంఏ షరీఫ్ కూడా టీడీపీకి చెందిన వ్యక్తి కావడం కూడా కారణం. ప్రస్తుతం ఏపీ శాసనమండలిలో అధికార వైసీపీకి తగినంత మెజారిటీ లేదు. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం అధిక బలం ఉంది. దాంతో బిల్లు పాస్ కాకుండా టీడీపీ సభ్యులు అడ్డుకున్నారు. బిల్లును సెలక్షన్ కమిటీకి పంపాలని చైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఏపీ సీఎం జగన్.. ఏపీ శాసనమండలిని రద్దు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే బిల్లు పాసవ్వడం సులభం.

కాగా.. టీడీపీ మాత్రం ఇంత తొందరగా మండలిని రద్దు చేయడం అంత తేలికైన వ్యవహారం కాదని అంటుంది. మండలిని రద్దు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తుంది. అయితే గతంలో మండలిని రద్దు చేసిన ఘనత టీడీపీకి ఉంది. 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వానికి శాసనసభలో అధిక బలం ఉంది. కానీ మండలిలో మాత్రం కాంగ్రెస్‌దే హవా. కాంగ్రెస్‌కు మండలిలో ఉన్న బలంతో.. టీడీపీ పెట్టిన బిల్లులకు అడ్డు తగిలేది. దాంతో ఎన్టీఆర్ మండలిని రద్దు చేశారు.

Read More:జగన్ స్కెచ్ లో.. చంద్రబాబుకి తాత్కాలిక విజయం

అయితే 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మళ్లీ మండలిని పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. దాంతో 2007న మళ్లీ శాసనమండలి ఏర్పాటు చేస్తూ వైఎస్ ఉత్తర్వులిచ్చారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే.. అప్పట్లో 1985లో మండలిని రద్దు చేసిన టీడీపీ ఇప్పుడు రద్దును వ్యతిరేకిస్తుంది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మండలిని ప్రవేశపెడితే.. ఆయన కొడుకు వైఎస్ జగన్ మండలిని రద్దు చేయాలని చూస్తున్నాడు. దీన్ని మొత్తంగా పరిశీలిస్తే.. అప్పుడు రద్దు చేసిన వాళ్లు ఇప్పుడు రద్దు చేయోద్దంటున్నారు… ఇప్పుడు రద్దు చేస్తామంటున్న వాళ్లు అప్పుడు ప్రవేశపెట్టారు.

Read More:
పోలవరం నిర్మాణం గతి తప్పిందా!

ఆంధ్ర రాజధాని రచ్చ రెండు ఆధిపత్య కులాలమధ్య రగడ

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకూ కుల సమీకరణాలుగా మారుతున్నాయి. దానికి ప్రస్తుత రాజధాని వ్యవహారం కీలకంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్ విభజన అయినదగ్గర్నుంచి ఈ కుల రాజకీయాలు ఊపందుకున్నాయి. జనాభాతో సంబంధంలేకుండా ఆంధ్ర రాజకీయాలు కేవలం రెండు కులాల ఆధిపత్యంలోనే నడుస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గం రాజధాని విజయవాడ దగ్గరలోనే వుండాలని కోరుకున్నారు. వాళ్ళ కోరిక ఇప్పటిది కాదు. మద్రాసు నుండి ఆంధ్ర విడిపోయినప్పటినుండి వాళ్ళకది నెరవేరని కోరికలాగా మిగిలిపోయింది. అప్పుడు రాయలసీమ వాళ్ళ పట్టుదలతో అది కర్నూలుకి తరలిపోయింది. ఆ తర్వాత వుమ్మడి రాష్ట్రం ఏర్పాటయినా మధ్యలో మధ్యలో ఈ టాపిక్ లేవనెత్తుతూనే వున్నారు. ప్రత్యేక రాష్టం ఏర్పడినా న్యాయంగా దక్కాల్సిన రాజధాని దక్కలేదనే బాధ వ్యక్తంచేస్తూనే వున్నారు. తిరిగి 2014 లో ఆ అవకాశం వచ్చినప్పుడు ఎలాగైనా ఈసారి సాధించాలనే పట్టుదల ఎక్కువైంది.

కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణ న్ కమిటీ అందుకు సుముఖత వ్యక్తంచేయకపోవటంతో వారి కి పెద్ద షాక్ తగిలింది. దానికనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబు నాయుడు కూడా అదే ఆలోచనలో ఉండటంతో కాగల కార్యం గంధర్వులు నెరవేర్చినట్లయ్యింది. నారాయణ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ ద్వారా ఏమి కావాలనుకుంటున్నారో దాన్నే చెప్పించి రాజధానిని అమరావతిలో ఏర్పాటుచేశారు. అందుకు కావాల్సిన భూమిని రైతులకు నచ్చచెప్పి ఇప్పించారు. అందుకు రాజధాని ఏర్పడితే అభివృద్ధిచేసి ఇచ్చే వాళ్ళ ప్లాట్లకు విపరీతమైన డిమాండ్ వుంటుందనే ఆశ కల్పించటంలో సక్సెస్ అయ్యారు. రెండోది ఆ ప్రాంతంలో పలుకుబడి కలిగిన రైతుల్లో ఎక్కువమంది వాళ్ళ సామజిక వర్గానికే చెందినవాళ్లు కావటంవలన పని కొంతమేర సులువయ్యింది. అవసరమైన చోట బెదిరింపులకు కూడా దిగారు. పచ్చని అరటితోటలను రాత్రికి రాత్రే ధ్వంసం చేయటం ఇందులో భాగమే. అదేసమయంలో రెడ్డి , కాపు సామజిక వర్గం ఎక్కువగా వున్న తాడేపల్లి, ఉండవల్లి గ్రామాల్లో ఎక్కువమంది రైతులు భూమి ఇవ్వలేదు. ఇచ్చినవాళ్లు ప్రభుత్వం చెప్పిన అధిక రాబడి ని దృష్టిలో ఉంచుకొని ఇవ్వటం జరిగింది.

అయితే రెడ్డి సామాజిక వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయారు. అమరావతి దగ్గర రాజధాని అనేది వాళ్ళ దృష్టిలో వాళ్ళ రాజకీయ అధిపత్యానికి ఎదురుదెబ్బ తగిలినట్లుగా భావించారు. అయినా ఏమీ చేయలేని పరిస్థితి. అందుకనే మొదట్నుంచీ వాళ్ళ పత్రికలో , ఛానల్ లో రాజధాని నిర్ణయం పై సన్నాయి నొక్కులు నొక్కుతూనే వున్నారు. ముఖ్యంగా ప్రచార సాధనాలన్నీ వారి వైరి సామాజికవర్గం కింద ఉండటంతో ఏమీచేయలేక అదనుకోసం ఎదురుచూస్తున్నారు. అదేసమయంలో దీన్ని ఎన్నికల్లో ఓ ప్రచారాస్త్రంగా వ్యూహాత్మకంగానే వాడలేదు. కానీ ఎన్నికల తదనంతరం వాళ్ళ వ్యూహాలకు పదునుపెట్టారు. రాజధాని ప్రకటించకముందే ఆ సామాజికవర్గం వేల ఎకరాల భూముల్ని కైవసం చేసుకోవటం మంచి ఎలిబీగా ఉపయోగపడింది. మొదట్నుంచీ మనసులోదాగివున్న వ్యతిరేకతను అమలు చేయటానికి చక చకా పావులు కదిపారు. చంద్రబాబు నాయుడు ప్రయోగించిన అస్త్రాన్నే జగన్ మోహన్ రెడ్డి ప్రయోగించాడు. అవకతవకల పై మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించాడు. నిపుణుల పేరుతో రెండు కమిటీలను ఏర్పాటుచేశాడు. ఇప్పుడు ఇంకో హై పవర్ కమిటీని నియమించాడు. చంద్రబాబు నాయుడు, జగన్ మోహన రెడ్డి వాళ్ళ సామాజికవర్గ ఒత్తిడితో తీసుకునే నిర్ణయాలకు కమిటీ సిఫార్సులను ప్రయోగించారు. కాబట్టి ఇద్దరూ ఆ తానులో ముక్కలేనని నిరూపించారు.

ఈ కుల జాడ్యం ఈ రెండు పార్టీలకే పరిమితం కాలేదు. మిగతా పార్టీల్లో వున్న నాయకులకూ అంటింది. సుజనా చౌదరి, పురందేశ్వరి బీజేపీ లో వున్నా ఈ విషయంలో సామాజికవర్గ ఆకాంక్షలమేరకే పనిచేస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ను తెలివిగా సెంటిమెంటుతో పడగొట్టారు. ఒకటి తను గుంటూరు వాడు కావటం, రెండు ప్రధానమంత్రి శంఖుస్థాపన చేయటం లాంటి సెంటిమెంటుతో కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినా వీళ్ళ స్టాండ్ కే మద్దతిచ్చాడు. ఇక చికెన్ నారాయణ కూడా పైకి ఎన్నిచెప్పినా సామాజికవర్గ ప్రయోజనాలకు పరోక్షంగా తోడ్పడుతుంటుంటాడు. ఇది అదివరకు కూడా ఎన్నో సంఘటనల్లో నిరూపనయ్యింది. అలాంటిదే స్వతంత్ర మేధావులు, విశ్లేషకులు కూడా చేస్తున్నపని. ఇదీ ఆంధ్ర రొచ్చు రాజకీయాల కధ.

అయితే ఈ నేపధ్యాన్ని పక్కనపెట్టి అసలు విషయాన్ని పరిశీలిద్దాం. అమరావతి రాజధానిగా అసెంబ్లీ ఆమోదించి, ప్రధానమంత్రి శంఖుస్థాపన చేసి, పనులు మొదలుపెట్టినతర్వాత ఇప్పుడు ఆ నిర్ణయాన్ని తిరగదోడాలనుకోవటం బుద్ధిమాలిన పని. పరిపాలనా కేంద్రం ఇక్కడేవుంచి మిగతా నిర్ణయాలను సమీక్షించుకోవచ్చు. ముఖ్యంగా కొత్త మహానగరాన్ని నిర్మించాలనుకోవటం అనుభమున్న చంద్రబాబు నాయుడు చేయాల్సిన పనికాదు. ఇప్పటికే ఆ లక్షణాలున్న విశాఖను అభివృద్దిచేస్తే మహానగరంగా రూపొందే అవకాశాలు మెండుగా వున్నాయి. ఈ విషయంలో ఇంత రచ్చ చేసుకునే బదులు పరిపాలనా కేంద్రాన్ని ఇక్కడేవుంచి మిగతా విషయాల్లో ఉదాహరణకు ఐటీ లాంటి పరిశ్రమలు విశాఖలో కేంద్రీకరిస్తే ఆ నగరం మహా నగరంగా రూపొందుతుందికదా. అనవసర రాద్ధాంతం చేసేబదులు విశాఖ మౌలిక సౌకర్యాల అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తే సరిపోయివుండేది కదా. గోటితో పొయ్యేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకోవటమంటే ఇదే.

జగన్ స్కెచ్ లో.. చంద్రబాబుకి తాత్కాలిక విజయం

శాసన మండలిలో వీకేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు వంటి బిల్లులు వీగిపోతాయని జగన్ కి ముందే తెలుసు…జగన్ వ్యూహంలోనికి చంద్రబాబు నెమ్మదిగా చిక్కుకుంటున్నాడు.. తన వేళ్లతో తన కళ్లు పొడుచుకోనే సమయం చంద్రబాబుకు మరెంతో దూరంలో లేదనేది నమ్మలేని నిజం. తాజాగా ఈ బిల్లు ను మంత్రి మండలిలో వీగకుండా నిలువరించగలిగే సత్తా అధికార పక్షానికి ఉన్నప్పటికీ కూడా ఆ పని చేయకుండా ఎంతో ఆలోచనకు పదును పెట్టింది.వీగిపోయిన బిల్లు ఆనందం చంద్రబాబు అండ్ కో కు తాత్కాలిక హర్షాన్ని తెచ్చిపెట్టినట్లే.

ఎందుకంటే మూడు చోట్ల రాజధాని ఏర్పాటు విషయ ప్రచారం ఫలితంగా ఆ మిగతా రెండు చోట్లా విశాఖ,కర్నూల్ లో టీడీపీ పరిస్థితి డైలమాలో పడ్డట్లే. రాజధానిలో భారీ భూ అక్రమాలు జరిగినట్లు దానికి విచారణ కమిటీ వేయనున్నట్లు ఇప్పటికే అధికార వైసీపీ ప్రకటించింది. అమరావతి తప్ప మరెక్కడా రాజధాని వద్దన్న బాబు నిర్ణయం వెనుక భారీ భూపందేరమే కారణమన్న విషయాన్ని ఇప్పటికే యావత్ దేశవ్యాపితంగా చర్చలు కు వైసీపీ పునాదులు వేసేసింది..

Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్?

మూడు రాజధానులు మేము స్వాగతిస్తే టీడీపీ అడ్డు పుల్ల వేస్తోందన్న ప్రచారానికి మరింత ఊపు తెచ్చేవిదంగా వైసీపీ శ్రేణులు సిద్ధపడిపోయారు…ఎంతో వ్యూహ చతురత కలిగిన బాబుకు ఇవన్నీ తెలిసినా కూడా ఓ వైపు అమరావతి నామం జపించక తప్పదు…ఆయన వద్ద సంధించడానికి బాణాలున్నా సరే వాటికి పదును తక్కువైనది…అంతిమంగా జగన్ పన్నిన వ్యూహంలో చంద్రబాబు చిక్కుకున్నారని అందరి అభిప్రాయం..కేవలం తాత్కాలిక విజయం బాబు సొంతమైతే శాశ్వత విజయానికి జగన్ తెర వెనుక నుంచి బాటలు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నాడు… అందుకే ఓడినట్లే ఆడుతూ ఆటలో మజా చూపిస్తున్నాడు.

సగం మంది పట్టణ ప్రజలకు నిరుద్యోగమే భూతం!

 

నేడు దేశంలో అత్యధికంగా ప్రజలను కలచి వేస్తున్నది నిరుద్యోగ సమస్య. ముఖ్యంగా పట్టణ ప్రజలలో సగం మంది ఈ సమస్యతో కలవరం చెందుతున్నారు. ఇటీవల కాలంలో దేశం మరెన్నడు ఇంత తీవ్రమైన నిరుద్యోగ సమస్యను ఎదుర్కొనలేదు. అయితే వీరిలో 69 శాతం మంది దేశం సరైన దిశలోనే పయనిస్తున్నదని భావిస్తుండడం కొంత ఉపశమనం కలిగిస్తుంది.

భారతీయులకు ఆందోళన కలిగిస్తున్న ఇతర అంశాల్లో ఆర్థిక, రాజకీయ అవినీతి, నేరాలు, హింస, పేదరికం, సామాజిక అసమానతలు, వాతావరణ మార్పులు తదితర అంశాలున్నట్టు తాజాగా జరిపిన ఓ సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాలేమిటన్నదానిపై ప్రముఖ పరిశోధనా (రిసెర్చ్) సంస్థ ఇప్సోస్ ఈ సర్వే నిర్వహించింది.

ప్రపంచ దేశాల ప్రజల్లో 61 శాతం మంది తమ దేశం సరైన దిశలోనే పయనిస్తున్నదని అభిప్రాయపడుతున్నారని, దీనితో పోలిస్తే భారత్‌లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నదని, పట్టణప్రాంతాల్లోని 69 శాతం మంది భారతీయులు దేశం సరైన దిశలోనే పయనిస్తున్నట్టు భావిస్తున్నారని ఈ సర్వేలో వెల్లడయింది. నిరుద్యోగ సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తున్నదని పట్టణప్రాంతాల్లోని దాదాపు 46 శాతం మంది భారతీయులు ఈ సర్వేలో వెల్లడించారు.

ఈ అభిప్రాయాన్ని వ్యక్తంచేసినవారి సంఖ్య ఇంతకుముందు (అక్టోబర్‌లో) నిర్వహించిన సర్వేతో పోలిస్తే నవంబర్‌లో నిర్వహించిన సర్వేలో 3 శాతం పెరిగింది. ముఖ్యంగా పేదరికం, సామాజిక అసమానతలే ప్రపంచ దేశాల ప్రజలను ఎక్కువగా కలవరపెడుతున్నాయి.

వీటి తర్వాత నిరుద్యోగం, నేరాలు, హింస, ఆర్థిక, రాజకీయ అవినీతి, ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన సమస్యలపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని ఈ సర్వే వెల్లడించింది. ఇప్సోస్ తన ఆన్‌లైన్ ప్యానల్ సిస్టమ్ ద్వారా ప్రపంచంలోని 28 దేశాల్లో నెలవారీగా ఈ సర్వే నిర్వహిస్తున్నది.

అమరావతిలో వందల ఎకరాల భూములు కొన్నపేదలపై సిఐడి కేసులు

ప్రభుత్వ విడుదల చేసే నిత్యావరస వస్తువుల కొనుగోలు, లోన్ సబ్సిడీ పొందడానికి పేదలకు ఇచ్చే కార్డు ఈ తెల్ల రేషన్‌ కార్డు అని అందరికి తెలుసు.. అయితే అమరావతిలో భూములు కొనుగోలు వ్యవహారంపై సిఐడి కేసు నమోదు చేసింది.

Read More:తండ్రి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఎన్టీఆర్ బాటలో జగన్

ల్యాండ్‌ పూలింగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేప్టటింది. తెల్ల రేషన్‌ కార్డు కలిగిన 796 మందిపై కేసు నమోదు చేసింది. ఎకరానికి 3 కోట్ల రూపాయిల చొప్పున 300 కోట్ల రూపాయిలతో భూములు కొనుగోలు చేసినట్లు సిఐడి గుర్తించింది. తెల్లకార్డులు కలిగిన వారితో భూములు కొనుగోలు చేయించిన వారిపై ఆరా తీస్తోంది. విచారణ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసింది. మొత్తం 129 ఎకరాలు కొనుగోలు చేసిన 131 మంది తెల్లరేషన్‌ కార్డు హోల్డర్లు. పెద్ద కాకానిలో 43 మంది తెల్లకార్డు హోల్డర్లు 40 ఎకరాలు కొన్నారు. తాడికొండలో 188 మంది 180 ఎకరాలు, తుళ్లూరులో 238 మంది 243 ఎకరాలు, మంగళగిరిలో 148 మంది 133 ఎకరాలు, తాడేపల్లిలో 49 మంది 24 ఎకరాలు కొన్నారని సిఐడి గుర్తించింది.

Read More: అమరావతి భూ కుంభకోణంపై నిజాన్ని నిగ్గు తేల్చాలి

సంక్రాంత్రి తర్వాతనే రాజధాని మార్పుపై ప్రకటన!

రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంపై మార్చే విషయంలో అందరూ ఎదురు చూస్తున్నట్లు శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం నిర్దుష్టమైన నిర్ణయం తీసుకోలేదు. ఈ విషయమై చెలరేగిన ఆందోళనలు, అసంతృప్తి సద్దుమణిగే వరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావిస్తున్నట్లు తెలిసింది. ప్రజలకు నచ్చచెప్పే రాజధాని మార్పుపై అడుగులు వేద్దామని సహచారం మంత్రులకు ఆయన స్పష్టమైన సంకేతం ఇచ్చిన్నట్లు చెబుతున్నారు.

ఈ విషయమై అరగంటకు పైగా సహచర మంత్రులకు ముఖ్యమంత్రి వివరణ ఇచ్చిన్నట్లు తెలిసింది. ప్రస్తుథానికి రాజధాని విషయంలో మరో అధ్యయన కమిటీ నివేదిక బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూప్‌ (బీసీజీ) నివేదిక రావలసి ఉన్నందున ప్రస్తుతానికి నిర్ణయాన్ని వాయిదా వేశారు. జీఎన్‌ రావు కమిటీ నివేదిక, బీసీజీ నివేదికలు రెండింటినీ క్రోడీకరించి అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు.

ఎన్ని వేల కోట్లు పెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేమని ముఖ్యమంత్రి మంత్రులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. లక్ష కోట్లలో పదిశాతం విశాఖలో ఖర్చుపెట్టినా హైదరాబాద్‌ స్థాయిలో రాజధాని అభివృద్ధి అవుతుందని సీఎం వివరించారు. రాజధాని తరలింపుపై తొందరపాటు లేదని సీఎం జగన్‌ స్పష్టం చేసిన్నట్లు తెలిసింది.

రాజధాని మార్పు ఖాయమే అయినా మార్చే ముందు కొత్త రంగం సిద్ధం చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఈలోగా రాజధాని ఏర్పాటులో గతంలో టిడిపి పాలకులపై తమకు దీర్ఘకాలికంగా చేస్తున్న ఆరోపణలపై చర్యలను ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఇన్నాళ్లూ తాము చేస్తున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై మంత్రివర్గం ఉపసంఘం ఇచ్చిన నివేదికను పరిశీలించిన మంత్రివర్గం ఉన్నత స్థాయిలో విచారణకు రంగం సిద్ధం చేస్తున్నది.

ఏసీబీ, విజిలెన్స్‌, నిపుణుల సహకారంతో మంత్రివర్గ ఉపసంఘం ఈ నివేదిక సిద్దం చేసింది. చంద్రబాబు పాలనలో సాగునీటి ప్రాజెక్టులు, రాజధాని పనులు, ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిపై నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తున్నది.

రాజధానిలో రేగిన నిరసనలు ఎంతో కాలం కొనసాగలేవని ప్రభుత్వం అంచనా వేసింది. అన్ని కోణాల్లోనూ ఆలోచించిన తర్వాతే తాము నిర్ణయం తీసుకున్నామని చెప్పడంతో పాటు, న్యాయపరంగా చిక్కులు ఎదురుకాకుండా జాగ్రత్త పడేందుకు మరికొంత సమయం తీసుకోవాలని సీఎం జగన్ భావిస్తున్నట్లు తెలిసింది.

పరిస్థితి కుదట పడిన తర్వాత, సంక్రాంతి తర్వాత రెండు రోజుల పాటు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏపీ రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

బాలకృష్ణతో రోజా సెల్ఫీ..ఫ్రేమ్ లో చంద్రబాబు కూడా..!

శాసనమండలి గ్యాలరీలో సినీ హీరో, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, సినీ నటి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా శాసన మండలి గ్యాలరీలో బుధవారం సందడి చేశారు.

సభ వాయిదా పడిన సమయంలో చంద్రబాబు గ్యాలరిలోనే వేచి ఉన్నారు. చంద్రబాబుతో పాటు టీడీపీ, వైసీపీ ఎమ్మెల్యేలు

యాదృచ్చికంగా ఒకే గ్యాలరీలో ఉన్నారు.

బాలకృష్ణతో రోజా సెల్ఫీ దిగి సందడి చేశారు. రోజా సెల్ఫీ తీసుకున్నప్పుడు ఫ్రేమ్ లోకి బాలకృష్ణ మాత్రమే కాకుండా చంద్రబాబుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. శాసన మండలిలో పాలనా వీకేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఎ రద్దు బిల్లు చర్చకు వచ్చిన నేపథ్యంలో వారంతా గ్యాలరీలో కూర్చున్నారు.

Read More: అమరావతిలో తెల్లరేషన్‌ కార్డు ఉండి వందల ఎకరాల భూములు కొన్నవారిపై సిఐడి విచారణ

బిల్లుల పరిస్థితి ఏమవుతుందనే ఉత్సుకత కొద్దీ అందరూ శాసన మండలి గ్యాలరీలో కూర్చున్నారు. బిల్లుపై వాడివేడి చర్చలతో పాటు వాగ్వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో మండలి పలుమార్లు వాయిదా పడింది.

ఆ బిల్లులు శాసనసభలో ఆమోదం పొందాయి. అయితే, శాసన మండలిలో వైసీపికి సరిపోను సంఖ్యా బలం లేదు. టీడీపీ సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దీంతో బిల్లులను అడ్డుకోవడానికి టీడీపీ అన్ని విధాలా ప్రయత్నించింది. చివరకు టీడీపీ తన పంతాన్ని నెగ్గించుకుంది.